Posted on

Unwanted hair removal tips in Telugu – ఆంతరంగిక భాగాలలో అవాంఛిత రోమాలను తొలగించటం ఎలా?

అనవసరమైన వెంట్రుకలను తొలగించేందుకు వివిధ కారణాలు ఉంటాయి, కొందరు శుభ్రంగా ఉండేందుకు, మరి కొందరు మతపరమైన ధ్యేయం కోసం ఇంకా ఇతర కారణాలు ఉండచ్చు. ఇది చాలా సున్నితమైన విషయం, చాలా మంది దీని గురించిన సలహాలు అడిగేందుకు సిగ్గుపడతారు. ఈ వ్యాసంలో ఆంతరంగ భాగాలలోని అనవసరమైన జుట్టులను తొలగించేందుకు ఉత్తమ పద్ధతులు వివరించబడి ఉన్నాయి.

అంతర్గత భాగాలలో వెంట్రుకలను తొలగించటం అంత సులువైన విషయం కాదు. ఆ భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి, చిన్న పొరపాటు కూడా చాలా హాని కలిగిస్తుంది. ఈ చోటులలోని వెంట్రుకలు చాలా మందమైనది మరియు గరుకుగా ఉంటాయి, కావున చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్రింద చెప్పిన విధానాలలో మీ సౌలభ్యం స్థాయికి మరియు చర్మం యొక్క సున్నితత్వానికి సరిపోయే ఒక విధానాన్ని ఎంపిక చేసుకోండి.

క్షవరం

ఎన్నో కొత్త విధానాలు ప్రముఖమవుతున్నప్పటికీ క్షవరం చేయటం చాలా సాధారణమైన పద్ధతి. మామూలుగా క్షవరంకు భద్రతా రేజర్‌లను వాడుతారు, కానీ దీని కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక ఎలక్ట్రిక్ రేజర్ ను వాడటం ఉత్తమం.

ప్రయోజనాలు

 • చౌక: భద్రతా రేజర్లు చాలా చౌకగా లభిస్తాయి. ఎలక్ట్రిక్ రేజర్ ని ఒక్కసారి కొనుగోలు చేస్తే చాలు.
 • త్వరిత: రేజర్‌లను ఉపయోగించి క్షవరం చేయటం ఇతర పద్ధతులతో పోలిస్తే వేగవంతమైనది.
 • సులువు: ఉపయోగించడానికి అనుకూలమైన.
 • నొప్పి కలిగించదు: మీరు జాగ్రత్తగా క్షవరం చేసినట్లయితే ఈ పద్ధతి నొప్పి లేకుండా ఉంటుంది.

లోపాలు

 • పునరావృత్తం: జుట్టు వెంటనే వేగంగా పెరుగుతుంది, అందువలన మీరు తరచూ క్షవరం చేస్తూ ఉండాలి.
 • దురద: షేవింగ్ చేసిన వెంటనే మీ చర్మం దురదగా మరియు అసౌకర్యంగా అవుతుంది.
 • గాటులు: నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే గాటులు ఏర్పడవచ్చు.
 • దద్దుర్లు: సున్నితమైన చర్మం ఉన్న వారికి ఈ పద్దతి సరిపడకపోవచ్చు, ఎందుకంటే వీరి చర్మంపై దద్దుర్లు రావచ్చు లేదా చర్మం ఎర్రగా కావచ్చు.

వాక్సింగ్

ఇది అవాంఛిత జుట్టులను తొలగించే మరొక ప్రముఖ పద్ధతి. అందుబాటులో ఉన్న మూడు రకాల వ్యాక్సింగ్లు, బికిని వాక్స్, బ్రెజిలియన్ వాక్స్ మరియు హాలీవుడ్ వాక్స్.

బికిని వాక్స్ బికినీ లైన్ వెంట్రుకలను తొలగిస్తుంది కానీ యోని వెంట్రుకలను తొలగించదు. ఇందువలన చాలా మంది స్త్రీలు బ్రెజిలియన్ వాక్స్ ను ఎంచుకుంటారు.

1980వ శతాబ్దం నుండి ఈ వాక్స్ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది ‘ల్యాండింగ్ స్ట్రిప్’ అని పిలువబడే ఒక చిన్న భాగాన్ని విడిచిపెట్టి మిగిలిన ఆంతరంగిక భాగాలలోని రోములను పూర్తిగా తొలగిస్తుంది.

హాలీవుడ్ వాక్స్ కూడా బ్రెజిలియన్ వాక్స్ వలె ఉంటుంది, కానీ ఇది ల్యాండింగ్ స్ట్రిప్ చోటులోని రోమాలను కూడా తొలగిస్తుంది.

ప్రయోజనాలు

 • ఇది జుట్టు యొక్క అన్ని తంతువులనూ తొలగిస్తుంది.
 • 20-40 రోజుల వరకు కొత్త జుట్టు రాకుండా ఉంటుంది.
 • జుట్టు యొక్క కొత్త తంతువులు మృదువుగా ఉంటాయి .
 • క్షౌరముకన్నా చౌకైనది కాకపోవచ్చు కానీ లేజర్ లేదా ఎలెక్ట్రోలిసిస్ పద్ధతులకన్నా చౌక.

లోపాలు

 • ఉపయోగించిన తక్షణమే నొప్పిని కలిగిస్తుంది.
 • సున్నితమైన చర్మానికి హానికరమైనది.
 • రోమాలు ¼ అంగుళం పెరిగిన తరువాతే ఈ ప్రక్రియను మల్లి చేయవచ్చు.
 • దురద మరియు వాపు కలిగే అవకాశాలు ఉన్నాయి, దీని వలన ఇన్ఫెక్షన్ రావచ్చు.
 • జననేంద్రియ ప్రాంతం మృదువుగా ఉన్నందున సులభంగా హాని కలగవచ్చు.
 • గజ్జి, తామర లేదా సోరియాసిస్లతో బాధపడేవారు ఈ పద్దతిని అనుసరించకూడదు. వాక్సింగ్ ఈ పరిస్థితులను పెంచుతుంది.
 • డయాబెటిస్స్ ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు, గర్భ నియంత్రణ మాత్రలు ఉపయోగించే వారు లేదా ఇతర ఔషధాలు తరచుగా వాడే వారు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది.

డిపిలేటరీ క్రీమ్లు

మీ బికినీ లైన్ వెంట్రుకలను తొలగించేందుకు మరొక మార్గం డిపిలేటరీ క్రీమ్లు. మీరు మీ భద్రత కోసం మంచి నాణ్యమైన క్రీమును ఎంచుకోవాలి. మీ చర్మం సున్నితమైనది అయితే తక్కువ రసాయనాలు కలిగిన క్రీమును ఉపయోగించండి. కొనే ముందు మరియు ఉపయోగించే ముందు ఆదేశాలు మరియు హెచ్చరికలను చదవండి.

ప్రయోజనాలు

 • ఈ విధానం నొప్పి లేకుండా ఉంటుంది.
 • అనుసరించేందుకు అనుకూలమైనది మరియు త్వరగా ఫలితాన్ని ఇస్తుంది.
 • ఖర్చు తక్కువ.

లోపాలు

 • మీ చర్మంపై ఘాటైన వాసన రావచ్చు.
 • దురద, దద్దుర్లు మరియు మంటని పుట్టించ వచ్చు.
 • సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు ఉపయోగించటం మంచిది కాదు.
 • ఇందులో అధిక రసాయనాలు ఉన్నందున మీ చర్మానికి హాని కలిగించవచ్చు. కావున దీర్ఘకాలం ఉపయోగించకూడదు.

లేజర్ చికిత్స

లేజర్ చికిత్స ఒకే సారి మీ సమస్యను తొలగిస్తుంది. వాక్సింగ్ లేదా షేవింగ్‌ను తరచుగా చేయకూడదని అనుకొంటున్నట్లయితే ఈ చికిత్స మీకు ఉపయోగపడుతుంది. లేజర్ చికిత్స మీ జుట్టు మూలంను పతనం చేస్తుంది, అందుచేత మీరు నిరంతర ఖర్చుల గురించి మరియు ప్రతి 4 నుండి 6 వారాలకు ఒకసారి మీ వ్యక్తిగత భాగాలను సరి చేయటం గురించి చింతించ వద్దు.

ప్రయోజనాలు

 • ఇది శాశ్వత చికిత్స.
 • వాక్సింగ్ తో పోల్చుకుంటే తక్కువ ఖరీదైనది.
 • చర్మంపై ఎలాంటి హానీ కలగదు.
 • ముదురు మరియు గరుకు జుట్టుకు ఉత్తమమైన పద్దతి.

లోపాలు

 • ఇది అత్యంత ఖరీదైన పద్ధతి. కానీ ఇది ఒక్కసారి మాత్రమే అయ్యే ఖర్చు.
 • ఈ చికిత్స చేసుకున్న తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
 • ఈ చికిత్స చాలా సమయం పడుతుంది.
 • ఉత్తమ ఫలితం పొందేందుకు ఎక్కువ సెషన్స్ అవసరం కావచ్చు.

గృహ నివారణలు

ఇంట్లో తయారు చేసిన వాక్స్లను ఉపయోగించినప్పటికీ, మీ రోమాలు పూర్తిగా తొలగిపోయే వరకూ మీరు క్షవరం చేయాలి. మీరు ఏదైనా ఒక పద్దతిని అనుసరించే ముందు ఆ పదార్థం వలన ఏదైనా అలర్జీ ఏర్పడుతోందా అని పరిశీలించి ఉపయోగించండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది మీ ఆంతరంగిక శరీర భాగాలలోని రోమాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపి తక్కువ మంట మీద బాగా ఉడికించాలి. నీళ్లు చల్లబడిన తరువాత మీరు రాత్రి పడుకునే ముందు ఒక పత్తితో ఈ నీటిని వ్యక్తిగత భాగాలపై రాయండి. ఉదయం చల్ల నీటితో కడిగి ఆల్కహాల్ లేని మాయిశ్చరైజర్ని రాయండి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు ఒక నెల పాటు చేసినట్లయితే మీరు కచ్చితమైన ఫలితాలను పొందుతారు.

శనగ పిండి

అనవసరమైన రోమాలను తొలగించేందుకు ఇది చాలా పురాతన మరియు అత్యంత ప్రభావితమైన సహజ నివారిణి. దీనిని పిల్లలు, పెద్దలు మరియు సున్నితమైన చర్మం ఉన్న వారు కూడా వాడవచ్చు. శనగ పిండిని రెండు రక్కలుగా వాడవచ్చు.

 1. కొద్దిగా శనగ పిండిలో చిటికె పసుపు, కొద్దిగా పాలు కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఆంతరంగిక భాగాలపై రాసి క్షవరం చేయండి. ఇది జుట్టును మృదువుగా తొలగించేందుకు మరియు తిరిగి పెరగకుండా నివారించేందుకు సహాయపడుతుంది.
 2. మీరు రోమాలను క్షవరం చేసిన తరువాత, శనగ పిండిలో నీరు మరియు చిటిక ఉప్పును కలపి చర్మంపై రాయండి. ఇది మీ జుట్టు పెరుగుదలను తగ్గించడానికి సహాయ పడుతుంది. ఇది నెమ్మదిగా పని చేస్తుంది, కానీ ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

గుడ్డు

కోడి గుడ్డు యొక్క తెల్లసొనలో మొక్కజొన్న పిండి మరియు ఒక చిటికెడు చక్కెరను వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక జిడ్డు పదార్థంలా తయారు అవుతుంది. దీనిని వాడటం వలన మీ చర్మంపై రోమాలను, మలినాలను మరియు చనిపోయిన చర్మ కణాలను కూడా తొలగిస్తుంది. ఈ పేస్ట్‌ను చర్మ రోమాలపై రాసి మృదువుగా తీసివేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.

తెల్ల మిరియాలు మరియు కర్పూరం

తెల్ల మిరియాలను పొడిచేసి కొద్దిగా కర్పూరం కలపండి. ఇందులో కొద్దిగా బాదాం నూనెని కలిపి బంక ముద్దలా చేసుకోవాలి. దీనిని చర్మంపై రాసి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.  

గమనిక: ఇది సున్నితమైన చర్మం కల వారు ఉపయోగించవద్దు, ఎందుకంటే ఈ రెండు పదార్థాలు చర్మంపై మంటను పుట్టిస్తుంది.

అరటి పండు మరియు వోట్మీల్

అరటి పండు మీ చర్మాన్ని మృదువుగా చేసి జుట్టులేని చర్మాన్ని ఇస్తుంది. కొన్ని అరటి పండ్లను బాగా చూర్ణం చేసి కొద్దిగా వోట్మీల్ని కలిపి చర్మంపై రాయండి. ఆరిపోయిన తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇది ఆంతరంగిక భాగాలకే కాదు మీ ముఖం, కాళ్లు లేదా చేతులలోని అనవసరమైన వెంట్రుకలను తొలగించేందుకు కూడా ఉపయోగించవచ్చు.

పటిక పొడి మరియు గులాబి నీళ్లు

ఇది సున్నితమైన చర్మానికి మంచి ఫలితాలు ఇస్తుంది. పటికను పొడి చేసుకొని రోజ్ వాటర్లో కలుపుకొని ఒక పత్తితో ఆంతరంగిక భాగాలపై రాయండి. ఇది అనవసరమైన రోములను వెంటనే తొలగిస్తుంది. మీ చర్మం చాలా సున్నితమైనది అయితే రాసిన 10 నిమిషాల తరువాత కడగండి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేందుకు కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనెని రాయండి.

తులసి మరియు ఉల్లిపాయలు  

అనవసరమైన వెంట్రుకలను తొలగించేందుకు ఇది చాలా పురాతన పద్దతి. ఉల్లిపాయ పొరలను ఒలిచి తులసి ఆకులతో పాటు బాగా దంచాలి. ఒక చిక్కని ముద్దలా చేసుకొని చర్మంపై రాసి 15-20 నిమిషాల తరువాత కడగండి. తులసి ఆకులు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.

తనకా మరియు కుసుంభా పువ్వు  

మయన్మార్ లో తనకా అనే వృక్షం యొక్క బెరడును చాలా మంది చర్మాన్ని అందంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు. ఇది అనవసరమైన రోమాలను తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీనిని కాస్మెటిక్స్ లో కూడా ఉపయోగిస్తారు. తనకా పొడిని కుసుంభా పువ్వు పేస్ట్ తో బాగా కలిపి చర్మంపై రాయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగండి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా టీ

‘ఆండ్రోజన్స్’ అని పిలువబడే హార్మోన్ ఉత్పత్తి ఫలితంగా అధికమైన జుట్టు పెరుగుతుంది. ఈ పరిస్థితిని ‘హర్సిటిజం’(‘అతి రోమత్వము’) అని అంటారు. ఇటువంటి అనవసరమైన అధిక రోమాలను తొలగించేందుకు పుదీనా టీ ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను ఒక బౌల్ నీటిలో వేసి ఉడికించండి. బాగా ఉడికిన తరువాత వడగట్టి రోజుకు రెండు సార్లు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు త్రాగండి.

చక్కెర వాక్స్

ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక టీ స్పూన్ తేనె మరియు కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొద్దిగా నీటిని కలిపి వేడి చేయండి. ఈ మిశ్రమం వెచ్చగా ఉన్నప్పుడే మీ ఆంతరంగిక భాగాలపై రాయండి. ఇది మీ రోమాలను మృదువుగా చేస్తుంది. ఆ తరువాత ఒక వాక్స్ స్ట్రిప్ తో రోమాలను తొలగించండి.

కలబంద వాక్స్

కలబంద మరియు తేనెని కలిపి కొద్దిగా వేడి చేయండి. వెచ్చగా అయిన తరువాత మీ రోమాలపై రాసి ఒక వాక్స్ స్ట్రిప్ తో రోమాలను తొలగించండి. ఇది చాలా సులభమైన మరియు ఆరోగ్యకరమైన వాక్స్.

నిమ్మరసం మరియు తేనె

నిమ్మరసం మరియు తేనెని కలిపి వేడి చేసి ఈ మిశ్రమాన్ని వాక్స్ లా ఉపయోగించండి. మీరు మొదటి సారి రోమాలను తొలగించిన తరువాత ఈ మిశ్రమాన్ని వాడినట్లైతే ప్రభావితంగా పని చేస్తుంది.

తేనె మరియు వోట్మీల్

ఈ మిశ్రమం కూడా ఒక మంచి ఎంపిక. తేనె మరియు వోట్మీల్ ను కలిపి వెచ్చగా చేసి వాక్స్ లా ఉపయోగించి మీ చర్మ రోమాలను తొలగించండి.

బంగాళదుంప మరియు కాయ ధాన్యాలు

ఆయుర్వేదం ప్రకారం, బంగాళదుంపలు సహజంగా చర్మాన్ని బ్లీచ్ చేస్తాయి. బంగాళదుంపతో కాయ ధాన్యాలను కలిపి ఉపయోగిస్తే అనవసరమైన మీ రోమాలను తొలగించగలదు. కాయ ధాన్యాలను రాత్రంతా నీటిలో నానపెట్టండి. ఉదయం దీనిని రుబ్బి ఒక పేస్ట్ లా చేసుకోండి. ఒక బంగాళదుంప చర్మాన్ని ఒలిచి చూర్ణం చేసి కాయ ధాన్యాల పేస్ట్ లో వేసి ఒక టేబుల్ స్పూన్ తేనెని, 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి 20 నిమిషాల తరువాత శుభ్రం చేయండి. ఇది మీ అనవసరమైన రోమాలను తొలగిస్తుంది. దీనిని ఉపయోగించిన 7 రోజులకు మరోసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పచ్చని బొప్పాయి పండు

పచ్చని బొప్పాయి పండులో ఉన్న పాపైన్ యొక్క ప్రత్యేక ఎంజైమ్ రోమాల యొక్క ఫోలికల్స్ను తొలగిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. ఇది సున్నితమైన చర్మం ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఒక పచ్చని బొప్పాయి పండును బాగా చూర్ణం చేసి అందులో పసుపు వేర్లను తురిమి బాగా కలుపుకోవాలి. దీనిని మీ ఆంతరంగిక భాగాలపై ఉన్న రోమాలపై రాసి మృదువుగా మర్దన చేయండి. 20 నిమిషాలు ఉంచి నీళ్లతో కడగండి. ఇలా చేసిన 2 రోజుల తరువాత మల్లి చేయండి.

పసుపు

ఇది మీ రోమాలను తొలగించటమే కాదు మీ చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం యొక్క మంటను తగ్గించి బాక్టీరియాలతో పోరాడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ శనగ పిండిని బాగా కలిపి ఇందులో కొద్దిగా నువ్వుల నూనెని పోసి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను మీ చర్మంపై రాసి 30 నిమిషాల తరువాత కొద్ది సేపు రుద్ది వెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి ఒక సారి చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ఇప్పుడు మీ ఆంతరంగిక భాగాల నుండి అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మీకు తెలుసు. మీరు ఎంచుకునే పద్ధతి మీ వ్యక్తిగత అవసరాలు మరియు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. మీరు పూర్తి గోప్యత కోరుకుంటే, క్రీములు లేదా క్షవరం పద్దతులను అనుసరించటం ఉత్తమ ఎంపిక. మీ పద్ధతి మరింత ప్రభావితంగా ఉండాలని మీరు కోరుకుంటే, వాక్సింగ్ కోసం ఒక సెలూన్‌కు వెళ్ళవచ్చు. లేదా ఇంట్లో వాక్స్ తయారు చేసుకొని ఉపయోగించవచ్చు. చివరగా, మరింత శాశ్వత పరిష్కారం కోసం తక్కువ బాధాకరమైన లేజర్ చికిత్సను ఎంచుకోవచ్చు.