Posted on

Egg & potato curry recipe in Telugu – గుడ్డు మరియు బంగాళదుంపల కరీ రెసిపీ

సంవత్సరం పొడవునా సులువుగా లభించే రెండు ఫేమస్ ఇంగ్రిడియంట్స్ బంగాళదుంపలు మరియు గుడ్లు. ఈ రెండు పదార్థాలతో వండే గ్రేవీలు ఎంత రుచికరంగా ఉంటాయో అంతే ఆరోగ్యకరం కూడా. మరి ఈ రెండింటినీ ఉపయోగించి చపాతీ, పూరి, రోటి లేదా పరోటాకు సైడ్ డిష్ లేదా వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని తినేందుకు ఎంతో రుచికరమైన కరీని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె
  • గుడ్లు
  • ఉప్పు
  • ఆవాలు
  • తరిగిన ఉల్లిపాయలు
  • గరం మసాలా
  • పసుపు పొడి
  • రెడ్ చిల్లీ పౌడర్
  • ధనియాల పొడి
  • తరిగిన టమోటాలు
  • ఉడికించిన బంగాళదుంపలు
  • అల్లం వెలుల్లి పేస్ట్

తయారీ విధానం

  • ముందుగా స్టవ్ పై ఫ్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెలుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
  • అందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 కప్పు తరిగిన టమోటాలు వేసి టమోటాలు బాగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.
  • పై మిశ్రమం బాగా ఉడుకుతున్న సమయంలో ఉడికించి కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత అందులో 3 గుడ్లను కొట్చి వేసుకోవాలి.
  • మిశ్రమాన్ని ఏ మాత్రం కలపకుండా మూత పెట్టి సన్నని మంటలో గుడ్లు బాగా ఉడికే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన ‘గుడ్డు మరియు బంగాళదుంపల’ కరీ రెడీ!