Posted on

Tan removal scrubs in Telugu – హోంమేడ్ సన్ టాన్ రిమూవల్ స్క్రబ్స్

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొను సమస్య చర్మంపై ఏర్పడే టాన్(Tan). ఎండలో ఎక్కువగా తిరిగి పని చేయవలసిన వాళ్ళు స్కార్ఫ్ కట్టుకోవటం, ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులను ధరించటం లాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సన్ రేస్ నుండి తప్పించుకోలేరు. ఎంతోకొంత చర్మం టాన్ అవుతూనే ఉంటుంది. అంతే కాదు డిహైడ్రాషన్ సమస్య కూడా ఎదురవుతుంది. శరీరంలోని మాయిశ్చర్ స్థాయి తగ్గటం వలన చర్మం కూడా పొడిగా నల్లగా అవుతుంది.

మార్కెట్లో సన్ టాన్ ను తొలగించేందుకు ఎన్నో రసాయనాలతో కూడిన ఇన్స్టంట్ టాన్ రిమూవర్స్(Instant tan removers) లభిస్తున్నాయి. ఇవి ఉపయోగించిన వెంటనే మీ చర్మం తెల్లగా మెరుస్తునట్లు కనిపిస్తుంది. కానీ వీటి వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే వాటిని చాలా పవర్ఫుల్ కెమికల్స్ తో తయారు చేస్తారు. వాటిలోని స్టెరాయిడ్స్ మీ చర్మాన్ని చాలా తొందరగా డామేజ్ చేస్తాయి. కనుక మన చర్మంపై ఏర్పడే టాన్ ను తొలగించేందుకు ఉత్తమమైన మార్గం ఇంట్లో మన వంట గదిలో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి పాక్స్ లేదా స్క్రబ్స్ ను తయారు చేసుకోవటం.

ఇంట్లోనే మనం చేసుకునే పాక్స్ మరియు స్క్రబ్స్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు ఇవి చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. ఎండలోకి వెళ్ళేటప్పుడు మీరు ఇదివరకే తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైనా ఉంటే వాటిని మానకూడదు. వాటితో పాటు మేము చెప్పబోయే ప్యాక్స్ మరియు స్క్రబ్స్ ని కూడా ఉపయోగించండి. సన్ టాన్(Sun tan)ని తొలగించేందుకు కొన్ని ఫేస్ టాన్ రిమూవల్ స్క్రబ్స్(Face tan removal scrubs) ని ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎలా అని ఈ ఆర్టికల్లో చూద్దాం.

ఫేస్ రిమూవల్ స్క్రబ్స్ (Tan removal scrubs in Telugu)

పసుపు మరియు శనగ పిండి

రెండు టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ ఆరంజ్ పీల్ మరియు ఒక చిటిగా పసుపుని ఒక బౌల్ లో వేసి బాగా కలుపుకోండి. ఇందులో కొంత నీటిని జోడించి ఒక పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై రాసి బాగా మసాజ్ చేయండి. ఇందులోని ఆరంజ్ పీల్ గ్రాన్యూల్స్ స్క్రబ్ లా పనిచేస్తుంది. ముఖంపై రాసిన ఈ పేస్ట్ ఆరిన తరువాత నీటిని చల్లి మరోసారి స్క్రబ్ చేస్తూ కడగండి.

టమోటా మరియు పెరుగు

టమోటో ఒక ప్రభావితమైన టాన్ రిమూవర్(Tan remover). పెరుగు చర్మాన్ని లైటెన్ చేస్తుంది. ఈ రెండింటి యొక్క మిశ్రమం మన చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల టమోటా, కొంత పెరుగు మరియు ఒక స్పూన్ నిమ్మరసం బాగా కలిపి ముఖంపై రాయండి. బాగా ఆరిన తరువాత నీటితో కడగండి. టమోటా జ్యూస్ ని రాసినప్పుడు మొదట్లో కొద్దిగా ఇచింగ్ సెన్సేషన్ కలగచ్చు. కానీ ఆరిన తరువాత తగ్గిపోతుంది. ఈ ప్యాక్ మీ చర్మంపై ఉన్న కఠినమైన టాన్ ను కూడా తొలగిస్తుంది.

మజ్జిగ మరియు ఓట్స్

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో ఓట్స్ ని రెడీగా ఉంచుకుంటారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఓట్స్ ని మజ్జిగలో కలుపుకొని మీ చర్మంపై రాయటం వలన టాన్ ను తొలగిస్తుంది. ఓట్స్ ని రవ లాగా రుబ్బుకొని మజ్జిగలో కలుపుకొని చర్మంపై రాసి 15 లేదా 20 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. ఓట్స్ నలుపును తొలగిస్తుంది మరియు మజ్జిగ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

పొటాటో ఫేస్ ప్యాక్ మరియు స్క్రబ్బర్

బంగాళదుంపను బాగా తురిమి మీ చర్మంపై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. లేదా బంగాళదుంపను రుబ్బి ఒక పల్ప్ లాగా చేసుకొని కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ముఖంపై రాసి 35-40 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. పొటాటో ఉపయోగించటం వలన మీ చర్మంలోని తేడాని వెంటనే గమనించవచ్చు.

మిల్క్ క్రీమ్ మరియు కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు చర్మంపై నలుపు మరియు మొటిమలను తొలగిస్తుంది. వీటిని తరచూ గర్భిణి స్త్రీలు శిశువు యొక్క చర్మపు రంగు కోసం తీసుకుంటారు. మిల్క్ క్రీమ్లో కొంత కుంకుమ పువ్వును రాత్రంతా నానపెట్టాలి. ఉదయం కుంకుమ పువ్వు మృదువుగా అయిన తరువాత ఆ క్రీములో బాగా కలిపి ముఖంపై రాయండి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగి తేడాను చూడండి.

కార్న్ మీల్

ఓట్ మీల్ లానే కార్న్ మీల్ కూడా చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని లైటెన్ చేస్తుంది. మీకు జిడ్డు చర్మం మరియు టాన్ సమస్య ఉన్నట్లయితే కార్న్ మీల్ ఒక అద్భుతమైన రెమిడీ. రెండు స్పూన్ల కార్న్ మీల్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగును బాగా కలిపి ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత నీటితో తడి చేసి స్క్రబ్ చేస్తూ కడగండి. ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేయటం వలన అనవసరమైన చర్మ కణాలు తొలగిపోతాయి. ఆ తరువాత కొంత వెచ్చని నీటితో శుభ్రంగా కడగండి. వారానికి రెండు సార్లు ఈ రెమెడీ ని ఉపయోగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

నిమ్మరసం, చక్కెర మరియు రోజ్ వాటర్

ఒక స్పూన్ చక్కెర, సగం నిమ్మపండు యొక్క జ్యూస్ మరియు ఒక స్పూన్ రోజ్ వాటర్‌ని బాగా కలుపుకొని ముఖంపై రాసి స్క్రబ్ చేయండి. 10-15 నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తరువాత నీటితో శుభ్రం చేయండి. చక్కెర డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది, నిమ్మరసం టాన్ ను నుతొలగిస్తుంది మరియు రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా చేసి గ్లో ని అందిస్తుంది.

గంధపు చెక్క ప్యాక్

గంధంలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి, ఇది మీ చర్మానికి అదనపు గ్లో ని అందిస్తుంది. ఒక బౌల్లో రెండు స్పూన్ల పాలు, అర స్పూన్ గంధపు పొడి మరియు ఒక చిటిక పసుపుని వేసి బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 15-20 నిమిషాల తరువాత నీటితో కడగండి.

చక్కెర మరియు గ్లిసరిన్

ఒక స్పూన్ చక్కెర మరియు ఒక స్పూన్ గ్లిసరిన్ ని కలుపుకోండి. ఈ మిశ్రమం చాలా గట్టిగా ఉన్నట్లయితే కొంత రోజ్ వాటర్ జోడించవచ్చు. ఈ పేస్ట్‌తో ముఖంపై మృదువుగా స్క్రబ్ చేయండి. 10-15 నిమిషాలు స్క్రబ్ చేయటం వలన డెడ్ సెల్స్ మరియు టాన్ తొలగిపోయి చర్మంలో గ్లో వస్తుంది. ఆ తరువాత నీటితో కడగండి.

దోసకాయ, రోజ్ వాటర్ మరియు నిమ్మరసం

సన్ టాన్(Sun tan)ని  తొలగించేందుకు ఇది ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్. నిమ్మరసంలోని విటమిన్ సి మరియు సిట్రిక్ ఆసిడ్ చర్మాన్ని బ్లీచ్ చేసి స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. ఈ రసాన్ని దోసకాయ మరియు రోజ్ వాటర్‌తో కలిపి వాడటం వలన టాన్ తొలగిపోతుంది మరియు చర్మం చాలా మృదువుగా గ్లో అవుతుంది. ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ దోసకాయ గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని ముఖంపై రాసి 10 నిమిషాల తరువాత నీటితో కడగండి.

బొప్పాయి మరియు తేనె

బొప్పాయి పండులోని పపైన్ అనే ఎంజైమ్ టాన్ ని తొలగించడానికి సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మొయిశ్చరైస్ చేస్తుంది. అర కప్పు పండిన బొప్పాయి పండును ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి గుజ్జులాగా చేసుకోవాలి. దీన్ని మీ ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఎరుపు పప్పు, కలబంద మరియు టమోటా

కలబంద చర్మాన్ని సూత్ చేసి టాన్ ని తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఎరుపు పప్పులను 20 నిమిషాలు నీటిలో నానబెట్టి ఒక గట్టి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్లో కొంత కలబంద జెల్ మరియు ఒక టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్ కలుపుకొని ముఖం మరియు మెడపై రాయండి. 20 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఫుల్లర్స్ ఎర్త్ మరియు కలబంద

ఇర్రిటేషన్ మరియు దద్దుర్లు వంటి సమస్యలను ఫుల్లర్స్ ఎర్త్ తొలగించి ఉపశమనాన్ని ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఫుల్లర్స్ ఎర్త్ మరియు ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ని కలుపుకొని అవసరమైతే కొంత రోజ్ వాటర్‌ని జోడించి ఒక పేస్ట్‌ని తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఆరెంజ్ పీల్ మరియు మిల్క్ స్క్రబ్

బాగా ఎండిన ఆరెంజ్ తొక్కను పౌడర్ చేసి కొద్దిగా పాలు మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని టాన్ ఉన్న చర్మంపై రాసి పూర్తిగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్క స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది, పాలు మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

బేకింగ్ సోడా మరియు వాటర్ స్క్రబ్

ఆయిల్ స్కిన్ కలవారు మైల్డ్ స్క్రబ్ ను ఉపయోగించాలి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీటిని మిక్స్ చేసి ముఖంపై అప్‌లై చేసి ఆరిన తరువాత నీటితో కడగండి. దీన్ని రెగ్యులర్గా వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

గమనిక

నిమ్మరసంతో కూడిన ప్యాక్స్ ను ఉపయోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ ప్యాక్స్ లేదా స్క్రబ్ ను వాడిన వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళవలసిన అవసరం ఉన్నట్లయితే తప్పకుండా SPF వున్న సన్ స్క్రీన్ లోషన్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే నిమ్మరసం యొక్క అసిడిక్ నేచర్ మీ చర్మాన్ని చాలా సెన్సిటివ్‌గా చేస్తుంది. వాటిని వాడిన వెంటనే సూర్య కిరణాలు చర్మంపై పడితే UV రేస్ వలన మీ చర్మం మరింత డామేజ్ అవుతుంది. కనుక వీలైనంత వరకు లెమన్ ప్యాక్స్ ని రాత్రి పడుకునే ముందు ఉపయోగించండి లేదా సన్ స్క్రీన్ ని ఉపయోగించండి.