Posted on

Foods for regular periods in Telugu – నెలసరికి ఈ పదార్థాలు ‘సరి’..

నెలసరి సమయంలో స్త్రీలకు చాలా ఇబ్బందికరంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది. ఆ సమయంలో నీరసంగా మరియు బలహీనంగా ఉంటారు. అంతే కాదు ఏమీ తినాలని తోచదు లేదా ఏమీ చేయడానికి తోచదు. కొందరిలో వికారం మరియు తిమ్మిరి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇది మీ ఆరోగ్యం మరియు మీ శరీరానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. అలాగే ఋతు స్రావం సరైన సమయానికి రాకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇర్రెగులర్ పీరియడ్స్ కి కారణాలు ఏమైనా వాటిని సరి చేయడానికి మన ఆహారంలో మార్పులు తప్పకుండా చేసుకోవాలి. అలాగే పీరియడ్స్ సమయంలో కూడా సరైన ఆహారాలను తీసుకోవటం వలన మంచి శక్తిని పొందుతారు మరియు అవయవాల యొక్క మృదువైన కార్యాచరణకు సహాయపడుతుంది.

ఈ ఆర్టికల్లో పీరియడ్స్ సమయంలో మరియు ఇర్రెగులర్ పీరియడ్స్ ని సరిచేసేందుకు ఉత్తమ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

నెలసరులు / ఋతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు

చాలా ఉపయోగకరంగా ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను ఋతుస్రావం సమయంలో మీ డైట్ లో చేర్చుకోండి. పండ్లు, తృణధాన్యాలు, ఆకు పచ్చని కూరగాయలను జోడించండి. శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి నారింజ, క్యారట్లు, రేగు పండ్లను కూడా చేర్చుకోండి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లు తినడానికి నెలసరుల సమయం ఖచ్చితమైనది. డార్క్ చాక్లెట్లు మీ మానసిక స్థితిని నియంత్రించే విధంగా పనిచేసే సెరోటోనిన్అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

విటమిన్ ఆధారిత ఆహారాలు

విటమిన్లు లేని ఆహారాలతో రాజీపడకండి. వాస్తవానికి ప్రతి స్త్రీ వారి పీరియడ్స్ సమయంలో విటమిన్లు మరియు ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, బెర్రీలు, ద్రాక్షాల నుండి విటమిన్ సి ను పొందండి, ఇవి రీప్రొడ్కటివ్ సిస్టమ్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. గుడ్లు మరియు అవోకాడోల నుండి విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ PMS సిండ్రోమ్ నుండి ఉపశమనం అందిస్తుంది. బంగాళదుంపలలో లభించే విటమిన్ బి6 ని కూడా తీసుకోండి.

ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్

పీరియడ్స్ సమయంలో అనేక మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలలో ఒకటి కడుపులో తిమ్మిరి. ఈ తిమ్మిరికి కారణం హార్మోన్ల యొక్క హెచ్చుతగ్గులు. అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ ని తీసుకోవడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోండి, వీటిలో అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వీటిలో గర్భాశయ కండరాలను రిలాక్స్ చేసేందుకు సహాయపడే లినోలెనిక్ఆసిడ్ కూడా ఉంటుంది.

ఐరన్ రిచ్ ఫుడ్

ఋతు స్రావం సమయంలో రక్తం కోల్పోవడం ఒక సాధారణ విషయం కనుక మహిళలు తగినంత ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోవాలి. అంతేకాదు ఐరన్ ఎక్కువగా తీసుకోవటం వలన మీ రక్తహీనత (అనీమియా) లక్షణాలతో కూడా పోరాడవచ్చు. బలహీనతని తగ్గించడానికి కూడా ఐరన్ సహాయపడుతుంది. కనుక ఎండిన బీన్స్, ఆకు కూరలు మరియు మొలాసిస్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోండి.

నీళ్ళు

మీరు నీళ్ళు పుష్కలంగా తాగాల్సిన సమయం ఇది. నీరు శరీరంలోని అన్ని టాక్సిన్స్ ని తొలగిస్తుంది. శరీరాన్ని తాజాగా మరియు ఆక్టివ్ గా ఉంచుతుంది. ఋతుస్రావం సమయంలో నీటి వినియోగంతో చాలా సాధారణమైన అనుభూతి చెందుతారు. కనుక నీటిని ఎక్కువగా త్రాగండి.

చేప

సాల్మోన్ మరియు ట్యూనా వంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు క్రామ్ప్స్ రాకుండా ఉండేందుకు సహాయ పడుతుంది.

అరటి పండు

అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఋతుస్రావం సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో బి6 మరియు ఇతర రకాల విటమిన్లు ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. పీరియడ్స్ రోజులలో డయేరియా వంటి సమస్యలను తొలగిస్తుంది.

రాస్ బెర్రీస్

ఇందులో ఫైబర్ మరియు ఫైటో-కెమికల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో తిమ్మిరి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.

పీరియడ్స్ సమయంలో నివారించాల్సిన ఆహారాలు

కెఫిన్

పీరియడ్స్ సమయంలో మీరు నివారించాల్సిన ఆహారాల్లో ప్రధానమైనది కెఫిన్. కెఫిన్ వల్ల రక్తనాళాలు బిగుతుగా తయారవుతాయి. పీరియడ్స్ సమయంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేషన్ కు కూడా గురి అవుతుంది. ఇవి నొప్పిని కలిగించే ఆమ్లాలను కడుపులో ఎక్కువగా సెక్రీట్ అయ్యేలా చేస్తాయి. దీని వలన తలనొప్పి మరియు భయాందోళన పెరుగుతాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో కాఫీ, కెఫిన్ తో తయారుచేసిన డ్రింక్స్ మరియు చాక్లెట్స్ వంటివి నివారించాలి. కాఫీకి బదులుగా ఒక కప్పు టీ ప్రయత్నించండి.

అధికంగా షుగర్ తో తయారుచేసిన ఆహారాలు

పీరియడ్స్ సమయంలో పంచదారతో తయారుచేసిన క్యాండీ బార్స్, సోడా లేదా కన్ఫెక్షనరీస్ తీసుకోకూడదు. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. దీని వలన మీ చికాకు పెరిగి మిమల్ని నీరసంగా చేస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్

డబ్బాల్లో నిల్వ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను మీ రుతుక్రమ సమయంలో నివారించాలి. ఎందుకంటే ఈ ఆహారాల్లో అధిక సోడియం ఉంటుంది. ఇది మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్ వంటి ఫుడ్స్ లో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. లేదంటే, మొటిమలు, కడుపుబ్బరం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. మాంసాన్ని తినాలని మీకు అనిపిస్తే, ఫిష్ లేదా స్కిన్ లెస్ చికెన్ వంటి లీనర్ మీట్స్ ని ప్రయత్నించవచ్చు.

ఆల్కహాల్

నెలసరి సమయంలో ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. కొద్ది మొత్తంలో తీసుకుంటే ఇబ్బంది లేదనుకుంటే మీ అభిప్రాయం తప్పు. పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ ని తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత ఎక్కువవుతాయి.

డైరీ ప్రాడక్ట్స్

పాలు, వెన్న, జున్ను వంటి వాటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. ఇది మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అయితే, వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. వీటిలో ఉండే అరకిడోనిక్యాసిడ్ నెలసరి నొప్పులను పెంచుతుంది. వీటికి బదులుగా మజ్జిగను తీసుకుంటే నెలసరి నొప్పులు తగ్గుతుంది.

ఫ్యాటీ ఫుడ్స్

బర్గర్స్, చిప్స్, ఫ్రైస్ వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటిని తీసుకుంటే నెలసరి నొప్పులు అధికమవుతాయి. తద్వారా, మీకు చికాకు ఎక్కువవుతుంది. వీటి వలన డీహైడ్రేషన్ సమస్య కూడా ఎదురవుతుంది.

రిఫైన్డ్ గ్రైన్స్

బ్రెడ్, పిజ్జా, సెరల్స్, టోర్టిల్లా వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటి వలన బ్లోటింగ్ తో పాటు మలబద్దకం సమస్య తలెత్తుతుంది. వీటికి బదులు తృణధాన్యాలను తీసుకోవడం మేలు.

స్పైసీ ఫుడ్స్

నెలసరి సమయంలో స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన హాట్ ఫ్లాషెస్ సమస్య ఎదురవుతుంది. కొన్ని సార్లు నెలసరి వాయిదా పడటం జరుగుతుంది. అలాగే చర్మంపై మొటిమలతో పాటు రాషస్ కూడా వస్తాయి. స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన స్టమక్ లైనింగ్ తో పాటు ఇంటస్టైన్స్ దెబ్బతింటాయి. అందువలన, ఎసిడిటీతో పాటు నెలసరి సమస్యలు మరింత తీవ్రం అవుతాయి.

ఇర్రెగులర్ పీరియడ్స్ ని నియంత్రించడానికి సారైన ఆహారాలు

బెల్లం

బెల్లం యొక్క వార్మింగ్ ఎఫెక్ట్ ఋతుస్రావం నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని నువ్వుల విత్తనాలను వేయించి బెల్లంతో పాటు రుబ్బి ఒక స్పూన్ పొడిని ప్రతిరోజూ తీసుకోండి.

సోంపు/సోపు

రాత్రి పడుకునే ముందు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఫెన్నెల్ విత్తనాల నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి త్రాగండి. మంచి ఫలితాలను పొందే వరకు ప్రతి రోజు త్రాగండి.

కలబంద

కలబంద కూడా మీ పీరియడ్స్ ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ కలబంద జ్యూస్ త్రాగండి. లేదా కలబంద యొక్క జెల్ లో ఒక స్పూన్ తేనె కలుపుకొని ప్రతి రోజు అల్పాహారం తినడానికి ముందు తీసుకోండి. ఫలితాలను పొందే వరకు లేదా రెండు నెలల పాటు ఈ నివారణను అనుసరించండి. గమనిక : మీ ఋతుస్రావం సమయంలో ఈ చికిత్సను అనుసరించకూడదు.

ముల్లంగి విత్తనాలు

కొన్ని ముల్లంగి గింజలలో కొంత నీటిని జోడించి రుబ్బండి. ఈ పేస్ట్ ని మజ్జిగలో కలుపుకొని క్రమ పద్ధతిలో త్రాగండి. మీరు సానుకూల ఫలితాలను చూడాలనుకుంటే, ఈ రసాన్ని ప్రతి రోజూ త్రాగండి.

పసుపు

పసుపులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు ఉన్నాయి. ఇది మీ ఋతుచక్రాన్ని నియంత్రించడంతో పాటు ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. ఒక క్వార్టర్ టీస్పూన్ పసుపు, కొద్దిగా తేనె, బెల్లం మరియు పాలను కలుపుకొని ప్రతిరోజు తాగండి.

విటమిన్ సి

ఋతుచక్రాన్ని నియంత్రించేందుకు ఆపిల్, బెర్రీస్, నారింజ మరియు టమోటాల వంటి విటమిన్ సి అధికంగా ఉండే పళ్ళు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి.

బొప్పాయి

పండని బొప్పాయిని తినటం వలన మీ ఇర్రెగులర్ పీరియడ్స్ ని నయం చేస్తుంది. ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ ఒక గ్లాస్ బొప్పాయి రసంని తీసుకోడానికి ప్రయత్నించండి. ఇది మీ ఋతుస్రావం ని సులభంగా నియంత్రిస్తుంది.

బాదం

నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు శరీరానికి కావల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ మరియు ప్రోటీనులు హార్మోనులను బ్యాలెన్స్ చేసి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహాయం చేస్తుంది.

గుడ్డు

బాగా ఉడికించిన గుడ్డులో అధిక శాతంలో ప్రోటీనులు, క్యాల్షియం మరియు విటమిన్స్ ఉంటాయి. గుడ్డులో ఉండే అధిక ప్రోటీనులు రుతు క్రమ సమస్యలను నివారించడానికి బాగా సహాయపడతాయి.

పుదీనా

సగం టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ పుదీనా పౌడర్ ని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోండి.

బ్రొకోలీ

రుతుక్రమాన్ని క్రమబద్ధం చేయడంలో ఈ గ్రీన్ వెజిటేబుల్ చాలా పవర్ ఫుల్. సరైన రుతుక్రమాన్ని మెయింటైన్ చేయడానికి ఈ బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఆపిల్ సీడర్ వినిగర్

1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని ప్రతిరోజూ ఒక కప్పు నీటిలో కలుపుకొని భోజనం చేసే ముందు తాగండి.

నువ్వుల గింజలు

మీ ఇర్రేగులర్ పీరియడ్స్ ని సరిచేయడానికి ఒక మంచి మార్గం నువ్వుల గింజలను తినటం. మరింత పోషకాలను చేర్చడానికి తేనెతో కలుపుకొని సెసమి గింజలు మరియు జీలకర్ర విత్తనాలను తీసుకోవచ్చు.

పండ్లు మరియు కూరగాయలు

శరీరంలో పోషకాలు మరియు ప్రోటీన్ల స్థాయి తక్కువగా ఉండటం వలనే ఇర్రేగులర్ పీరియడ్స్ సమస్య ఏర్పడుతుంది. న్యూట్రిషన్ స్థాయులు పెంచడానికి తాజా పండ్ల రసాలను త్రాగండి. పండ్లతోపాటు కూరగాయలను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. ద్రాక్షలు, ఫిగ్ మరియు క్యారట్ జ్యూస్ లను రోజు తీసుకోండి.

టీ మరియు మూలికలు

మీరు టీ తయారు చేసుకొనేటప్పుడు దాల్చిన చెక్క, అల్లం, కొత్తిమీర వంటి మూలికలను ఉపయోగించండి. మీ ఆహారాలలో కూడా వీటిని చేర్చుకోండి.

పార్స్లీ

మీ నెలసరుల సమస్యను సరిదిద్దడానికి పార్స్లీ ఒక సులభమైన పరిష్కారం. ఇర్రెగులర్ పీరియడ్స్ ని సరిచేయడానికి ప్రతి రోజూ ఒక గ్లాస్ పార్స్లీ రసాన్ని త్రాగండి.

కాకరకాయ

మీకు కాకరకాయ వేర్లు దొరికినట్లయితే, వాటిని ఐదు నుండి పది నిమిషాలు నీటిలో ఉడికించి, వెచ్చగా అయిన తరువాత వడగట్టి త్రాగండి. లేదా కాకరకాయ జ్యూస్ ని 2 నుండి 3 వారాల పాటు రోజుకు రెండుసార్లు త్రాగండి.

మర్రి చెట్టు వేర్లు

మర్రి చెట్టు వేర్లను పది నిమిషాలు నీటిలో ఉడికించి రెండు టేబుల్ స్పూన్ ఆవు పాలను జోడించండి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ నీటిని త్రాగండి.

అత్తి చెట్టు వేర్లు

అత్తి చెట్టు వేర్లను పది నిమిషాలు నీటిలో ఉడికించి వడగట్టి త్రాగండి.

కొత్తిమీర

కొత్తిమీరను కొన్ని నిమిషాలు నీటిలో ఉడికించి వడగట్టి త్రాగండి. ఇర్రెగులర్ పీరియడ్స్ ని నియంత్రించేందుకు ప్రతి రోజూ మూడు సార్లు త్రాగండి.

చెరకు రసం

చెరకు రసం కూడా మీ నెలసరులను నియంత్రిస్తుంది. ఇది ఋతుస్రావం తొందరగా రావటానికి కూడా ఉపయోగపడుతుంది.

రెడ్ గ్రేప్ (ఎర్రని ద్రాక్ష)

సహజ పద్దతుల ద్వారా రుతుక్రమ సమస్యలను నివారించుకోగలిగే ఒక మంచి ఆహారం ద్రాక్ష. ప్రతి రోజూ ఎర్రని లేదా పచ్చని ద్రాక్ష రసం త్రాగడం చాలా ఆరోగ్యకరం.

టోఫు

పన్నీర్ కు ప్రత్యామ్నాయ ఆహారం టోఫు. ఇది ఆరోగ్యకరమే కాకుండా లోఫ్యాట్ కలిగి ఉంటుంది. టోఫు క్యాల్షియం రిచ్ ఫుడ్. ఇది పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేస్తుంది.