Posted on

Postpartum weight loss tips in Telugu – ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గటం ఎలా?

ప్రసవానంతరం బరువు తగ్గటం కష్టమైన విషయమే కానీ అసాధ్యం కాదు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, శిశువు పుట్టిన తరువాత శరీరం యొక్క ఆకారాన్ని మల్లీ పొందేందుకు కొన్ని నెలలు పడుతుంది, ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఒకే నెలలో బరువు తగ్గాలని ఎక్కువ ఒత్తిడిని కలిగించే పనులను, వ్యాయామాలను చేయకూడదు. శరీరానికి ఎక్కువ ఒత్తిడిని కలిగించటం వలన మీకే కాదు మీ శిశువు యొక్క ఆరోగ్యానికి కూడా హాని కలగచ్చు.

ప్రసవానంతరం బరువు తగ్గటం అనేది ఒక క్లిష్టమైన విషయం. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ శరీరానికి కావలసిన పోషక ఆహారాలను అందిస్తూ బరువు తగ్గించాలి. సాధారణంగా బరువు తగ్గడానికి పాటించే డైట్లను లేదా భారీ వ్యాయామాలను మీరు చేయకూడదు. సరైన పోషక ఆహారాలను తీసుకుంటూ సరైన వ్యాయామాలను చేస్తూ మీ ఆరోగ్యాన్ని మరియు మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

మీరు మీ ఇంట్లోనే కొన్ని ఆహార పద్ధతులు మరియు కొన్ని సులువైన వ్యాయామాలను చేస్తూ బరువును తగ్గించవచ్చు. వీటి గురించి వివరంగా ఈ వ్యాసం లో చూద్దాం.

ప్రసవానంతరం బరువు తగ్గటానికి సరైన ఆహారం తీసుకోండి

ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం, బాలింతలకు సరైన పోషక ఆహారం అవసరం. కావున, అన్ని పోషకాలనూ సమతుల్య మోతాదులలో తీసుకోవాలి. మీ వైద్యులు మిమ్మల్ని కొన్ని విటమిన్ మరియు మినరల్స్ మందులను కూడా వాడమని సూచించవచ్చు. దీని వలన మీ శరీరానికి ఎటువంటి పోషణ లోపాలు కలగకుండా ఆరోగ్యంగా ఉంటారు. తల్లి పాలు ఇచ్చే బాలింతలు రోజుకు కనీసం 2,200 కేలరీల ఆహారం తీసుకోవాలి. తల్లి పాలను ఇవ్వని బాలింతలు 1,800 కేలరీల ఆహారంకన్నా ఎక్కువ తీసుకోకూడదు.

ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి

మీరు రోజూ తినే ఆహారంలో కావల్సినంత ప్రోటీన్స్ ఉండటం చాలా అవసరం. చేపలు, గుడ్లు, పప్పులు మరియు బీన్స్ లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. చల్ల నీటిలో ఉండే చేపలు టునా, సాల్మన్ మరియు సార్డినల్ లో DHA మరియు ఒమేగా 3 ఫాటీ యాసిడ్ ఉంటాయి. ఇవి శిశువు యొక్క మెదడు కణాలను మరియు నాడి వ్యవస్థను పోషిస్తుంది. గుడ్లు, బీన్స్ మరియు పప్పులలో కావల్సినంత ప్రోటీన్స్ ఉంటాయి మరియు ఇది మీ ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియమును అందిస్తుంది.

విటమిన్లు మరియు ఖనిజాలపై దృష్టి పెట్టండి

మీకు ఇంతవరకూ ఇష్టం లేకపోయినా కాయకూరలను మరియు పళ్ళను తినాలి. మీరు తల్లి పాలు ఇవ్వటం వలన మీ శరీరంలోని అన్ని విటమిన్లను మరియు మినరల్స్ ను కోల్పోతారు. కావున వీటిని తిరిగి పొందేందుకు ఆకుకూరలు, క్యారట్లు, బ్రొకళ్లి, బీన్స్, స్క్వాష్ వంటి కాయకూరలు మరియు బాదాం, వాల్నట్ మరియు ఎండు ద్రాక్షలను రోజూ తినండి. స్ట్రాబెర్రీస్, నారింజ, ఆపిల్, జామ, దోసకాయ మరియు ద్రాక్ష వంటి పండ్లను కూడా మీ ఆహారంలో చేర్చుకోవాలి.

ఆహారాన్ని చిన్న మోతాదులలో తినండి

బరువు తగ్గటానికి ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించాలి. ప్రసవానంతరం బాలింతలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఒకే సారి మొత్తం ఆహారాన్ని తినడంకన్నా,రోజుకు 5 లేదా 6 సార్లు తక్కువ మోతాదులలో తినండి. మీరు ఎప్పటికీ ఆకలితో లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ భోజనాలకు మధ్యలో ఆకలిగా అనిపిస్తే తాజా పళ్ళను లేదా బాదాం లాంటి డ్రై ఫ్రూప్ట్స్ తినండి.

ఎక్కువ నీటిని త్రాగండి

చాలా మంది బాలింతలు డీహైడ్రేషన్ సమస్యతో బాధపడతారు. శరీరంలో ద్రవం సంతులనంగా లేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. కావున ఎక్కువ నీటిని త్రాగాలి, ఇది మీ శరీరం యొక్క జీవక్రియను అధికరిస్తుంది. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీళ్లు త్రాగ కూడదు, భోజనానికి కొన్ని నిమిషాల ముందు లేదా తరువాత త్రాగాలి.

శిశువుకు తల్లి పాలు ఇవ్వండి

మీరు తల్లి పాలు ఇవ్వటం వలన సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే పాలు ఇవ్వటం వలన మీ శరీరంలోని అదనపు కేలరీలు కరుగుతాయి. పాల యొక్క ఉత్పత్తిని బట్టి, రోజుకు 500 కేలరీల వరకు కరుగుతుంది. చమోమిలే, మెంతులు మరియు సోంపు వంటి ఆహార పదార్థాలు ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడతాయి. వీటిని మీ రోజూ ఆహారాలలో చేర్చుకోవటం వలన ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతుంది. దీని ఫలితంగా ఎక్కువ కేలరీలను కరిగించవచ్చు.

వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయండి

పాలు ఇవ్వటం, సరైన ఆహారాలను తీసుకోవటం వలన కొవ్వు తగ్గుతుంది. కానీ ఇది ఒక భాగం మాత్రమే. వీటితో పాటు మీరు సరైన వ్యాయామాలను కూడా చేయాలి. ఇది మీ అదనపు కేలరీలను కరిగిస్తుంది. అంతే కాదు ఒత్తిడి నుండి కూడా ఉపశమనాన్నీ ఇస్తుంది. నిపుణులు చెప్పినదాని బట్టి వారానికి 150 నిమిషాలైనా వ్యాయామాలను చేయాలి. తక్కువ బరువులను ఉపయోగించి లేదా వట్టి చేతులతో వ్యాయామాలు చేయండి. ఏరోబిక్స్ లాంటివి కూడా చేయవచ్చు. కానీ ఇవి చేసేటప్పుడు మీ శరీరానికి ఎక్కువ శ్రమ కలగకుండా చూసుకోండి.

వ్యాయామాలను చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఎందుకంటే ఒకవేళ మీకు సిజేరియన్ ఆపరేషన్ చేసి ఉంటే, మీరు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది మరియు కొన్ని వ్యాయామాలను మీరు నివారించవలసి ఉంటుంది.

యోగా

బాలింతలు తమ బరువును తగ్గించేందుకు ఇది అత్యంత ప్రభావితమైన ఒక మార్గం. యోగా చేయటం వలన మీ శరీరంపై ఒత్తిడి పెరగకుండానే కేలరీలు కరుగుతాయి. అయినప్పటికీ యోగాలో ఏ ఆసనాలను మీరు చేయాలో ఏవి చేయకూడదో మీ వైద్యుడిని సంప్రదించి కనుక్కోవాలి.

మంచి నిద్ర అవసరం

పై చెప్పిన విషయాలన్నిటినీ పాటించినప్పటికీ సరైన నిద్ర లేకపోతే మీ బరువు తగ్గడం చాలా కష్టం. అప్పుడే పుట్టిన శిశువును చూసుకుంటూ సరైన నిద్రను పొందటం బాలింతలకు కష్టమైనా విషయమే. కాని నిద్ర లేక పోతే శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి, దీని వలన బరువు పెరుగుతుంది.

పడుకునే 3 గంటల ముందే మీరు భోజనం చేయాలి, పాలు లేదా ఏదైనా పానీయాలను త్రాగాలనుకుంటే వాటిని 1.5 గంటల ముందే త్రాగాలి. తిన్న వెంటనే పడుకోవటం మంచిది కాదు.

కొవ్వును కరిగించే పానీయాలను మీ రోజూ డైట్లో చేర్చుకోండి

కొవ్వును తగ్గించే పానీయాలను రోజూ త్రాగటం వలన బాలింతల బరువు తొందరగా తగ్గుతుంది. ఈ పానీయాలను ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇవి శరీరంలో జీవక్రియను అధికరించి అదనపు బరువును తొలగించేందుకు తోడ్పడుతుంది.

1/2 స్పూన్ అల్లం యొక్క రసం, 1/2 స్పూన్ పైపర్ డస్ట్ మరియు ఒక స్పూన్ తేనెని ఒక గ్లాస్ వెచ్చని నీటిలో కలుపుకొని రోజుకు రెండు సార్లు త్రాగండి, ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు. ఈ పానీయం మీ బరువును తగ్గించటమే కాదు మీకు ఎక్కువ బలాన్ని కూడా ఇస్తుంది.

ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ మరియు అవిసె గింజలు

ప్రసవానంతరం బరువు తగ్గేందుకు మీరు కొన్ని సులభమైన పద్ధతులకోసం చూసి ఉంటారు. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వాడటం మరియు మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవటం వలన సులభంగా బరువు తగ్గవచ్చు. ఫిష్ ఆయిల్ లోని ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు మీరు వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ కేలరీలను కరిగించేందుకు తోడ్పడుతుంది.