Posted on

Low back pain tips in Telugu – తుంటి నొప్పికి కారణాలు, లక్షణాలు మరియు నివారణ పద్ధతులు

తుంటి అనగా తొడ వెనుక భాగపు నరం. మానవ శరీరంలో గల నరాలలో ఇదే పొడవైనది. తుంటి నొప్పి అంటే మన లోయర్ బ్యాక్ నుండి కాళ్ల చివరి వరకు ఉండే నరంలో కలిగే నొప్పి. దీన్ని సియాటికా అని కూడా అంటారు. తుంటి నొప్పి మరియు వెన్నెముకలో నొప్పి కలిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏ పనీ చేయలేకపోతాము. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నొప్పులకు కారణాలు మరియు గృహ నివారణ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చూద్దాం.

తుంటి నొప్పికి కారణాలు ఏమిటి? (Telugu reasons for sciatica)

వెన్నెముకలో ఒక హెర్నియేటెడ్ డిస్క్ వలన వెన్నెముక మరియు కాళ్ల యొక్క నరాలలో ఏర్పడే నొప్పిని తుంటి నొప్పి అని అంటారు. ఈ నొప్పి లోయర్ బ్యాక్ నుండి ప్రారంభించి కాళ్ల చివరివరకు వ్యాపిస్తుంది. సాధారణంగా హెర్నియేటెడ్ డిస్క్ యొక్క స్థానాన్ని బట్టి ఏదైనా ఒక వైపు కళ్లలో మాత్రమే ఈ నొప్పి ఏర్పడుతుంది. వెన్నెముకలోని ఈ డిస్కులో క్రాక్ ఏర్పడినట్లయితే తుంటి నరాలపై ఒత్తిడిని పెంచి నొప్పిని ఇంకా తీవ్రం చేస్తుంది.

డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి?

క్రింద లక్షణాలలో ఏవైనా అభివృద్ధి చెందినట్లయితే, వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించాలి:

  • మీ కాళ్ల మధ్య లేదా మీ పిరుదుల చుట్టూ తిమ్మిరి
  • పిత్తాశయం లేదా ప్రేగు నియంత్రణ లేకపోవటం
  • రెండు కాళ్లలోనూ నొప్పి మరియు జలదరింపు
  • కాళ్లలో బలహీనత
  • తీవ్ర వెన్నునొప్పి.

ఈ లక్షణాలు రెండు వారాల పాటు కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి.

సియాటికా వైద్య చికిత్సలు (Telugu treatments for sciatica)

సియాటికా నొప్పితో బాధపడుతున్న చాలా మంది గృహ నివారణ పద్దతులను అనుసరించడం ద్వారా కొన్ని వారాలలో గుణమవుతారు. ఒకవేళ మీ నొప్పి చాలా రోజులు మైల్డ్ గా మరియు మీ రోజువారీ కార్యకలాపాలను చేసేందుకు ఇబ్బంది కలిగించేలా ఉన్నట్లయితే, మీ డాక్టర్ మొదట బేసిక్ పరిష్కారాలను ప్రయత్నించమని సూచించవచ్చు.

ఫిసికల్ థెరపీ

థెరపిస్ట్ మీ కోసం లోయర్ బ్యాక్ స్ట్రెచింగ్ మరియు వ్యాయామాలను నేర్పించి సియాటికా అనగా తొడ వెనుక భాగపు నరములపై ఒత్తిడిని తొలగించేటువంటి భంగిమలను సూచిస్తారు.

లిమిటెడ్ బెడ్ రెస్ట్

కొంతకాలం అనగా మూడు రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవటం వలన కొంత ఉపశమనం పొందుతారు. కానీ ఆ తరువాత మీ నార్మల్ కార్యకలాపాలను అనుసరించవచ్చు. మీరు విశ్రాంతి తీసుకొనే రోజులలో ఫ్లాట్ మరియు ఫిర్మ్ బెడ్ ని ఉపయోగించాలి.

హాట్ మరియు కోల్డ్ ప్యాక్స్

రోజుకు కొన్నిసార్లు ఈ ప్యాక్స్ ని అప్‌లై చేయాలి. మొదట్లో కొన్ని రోజులు కోల్డ్ ప్యాక్స్ మరియు కొన్ని రోజులు హాట్ ప్యాక్స్.

ఆల్టర్నేటివ్ థెరపీ

యోగా, మసాజ్, బయో ఫీడ్ బ్యాక్ మరియు అక్కుపంచర్ వంటి ఆల్టర్నేటివ్‌ థెరపీలు తుంటి నొప్పిని తగ్గించటంలో సహాయపడతాయని చాలా మంది నమ్మకం.

మందులు

మీ వైద్యుడు మొదట ఓవర్-ది-కౌంటర్ పెయిన్ రిలీవర్స్ ని ఇవ్వవచ్చు. ఒకవేళ ఇవి పనిచేయకపోతే, బలమైన కండరాల రిలాక్సన్ట్స్ లేదా యాంటీ-ఇన్ఫ్లమ్మెటరీలను సూచిస్తారు. ఈ మంధులను మీ వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మన ఇష్టానుసారం తీసుకోకూడదు.

సర్జరీ

అన్ని ప్రయత్నాలూ విఫలమయినప్పుడు, చివరిగా 5% నుండి 10% వ్యక్తులకు సర్జరీ చేయటమే చివరి దారి. మీకు 3 నెలల పాటు తుంటి నొప్పి ఉన్నట్లయితే, కొన్ని సింప్టమ్స్ గురించి మీ వైద్యుడితో సంప్రదించి శస్త్ర చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది.

అరుదైన సందర్భాల్లో, సియాటికా సమస్య క్వాడా ఎక్వినా సిండ్రోమ్కు దారితీస్తుంది. క్వాడా ఎక్వినా సిండ్రోమ్ అంటే – మీ ప్రేగులు మరియు పిత్తాశయం నియంత్రణ కోల్పోతారు. ఈ పరిస్థితి ఏర్పడితే తప్పకుండా శస్త్ర చికిత్స చేయాల్సిందే.

తుంటి నొప్పి మరియు లోయర్ బ్యాక్ పెయిన్ నివారణ పద్ధతులు(Telugu tips for sciatica)

వెన్నునొప్పిని తగ్గించడానికి చాలా ప్రభావితమైన గృహ నివారణలు క్రింద చెప్పబడ్డాయి. ఈ చికిత్సలను అనుసరించడం చాలా సులభం మరియు ప్రభావితంగా నొప్పిని నయం చేస్తాయి.

వెల్లుల్లి పాలు

వెల్లుల్లి వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన హెర్బ్, ఇవి మంట మరియు నొప్పిని కూడా తగ్గించగలదు. ఒక కప్పు పాలు మరియు నీటిలో కొన్ని వెల్లుల్లి ముక్కలను వేసి బాగా ఉడికించండి. చల్లారిన తరువాత త్రాగండి.

అల్లం

సూతింగ్ మరియు అనెస్థిటిక్ లక్షణాల వలన సియాటికా సమస్యను తగ్గించడంలో అల్లం నూనె ఒక కీలక పాత్ర వహిస్తుంది. ఈ నూనెని ఏదైనా ఇతర మసాజ్ ఆయిల్తో కలుపుకొని నొప్పిగా ఉన్న ప్రాంతంపై రాయండి. ప్రతి రోజూ కొంత అల్లం టీని కూడా తీసుకోవచ్చు.

వైట్ విల్లో బార్క్

వెన్ను నొప్పి మరియు తుంటి నొప్పిని తగ్గించటానికి తయారుచేసే అనేక పెయిన్ కిల్లర్స్ లో వైట్ విల్లో బార్క్ ని ప్రధానంగా ఉపయోగిస్తారు. కనుక కొన్ని వైట్ విల్లో బార్క్స్ తో టీ తయారు చేసుకొని రెగ్యులర్గా త్రాగండి.

హీల్స్ ధరించకండి

మీకు కొంత కాలంగా వెన్ను నొప్పి ఉన్నట్లయితే, మీరు వాడే హీల్స్ చెప్పులను ఉపయోగించటం ఆపండి. హీల్స్ మీ లోయర్ స్పైన్ పై ఒత్తిడి పెంచి నొప్పిని ఇంకా తీవ్రం చేస్తుంది. కనుక హీల్స్ బదులుగా ఫ్లాట్ చెప్పులను ధరించండి.

గుర్రపు ముల్లంగి

గుర్రపు ముల్లంగిలో తుంటి నొప్పిని మరియు వెన్ను నొప్పిని తగ్గించే నాచురల్ హీలింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. కనుక మీ రోజూ ఆహారంలో గుర్రపుముల్లంగీలను చేర్చుకోండి లేదా గుర్రపుముల్లంగీలను బాగా రుబ్బి నొప్పిగా ఉన్న చోటుపై రాయండి.

చమోమిలే రసం

చమోమిలే, వాటి యొక్క ఔషధ లక్షణాల వలన ప్రసిద్ధి చెందిన పురాతన మూలిక. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని తుంటి నొప్పిని తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ చమోమిలే హెర్బ్ కలపాలి. 15 నిమిషాల తరువాత వడగట్టి కొద్దిగా తేనె కలుపుకొని రోజుకు 3 సార్లు త్రాగండి.

కలబంద

కలబందలో పాలిసాచరైడ్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు నొప్పిని నిరోధించడంలో సహాయపడతాయి కనుక వీటిని తుంటి నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. వీటిలో సూతింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. తాజా కలబంద రసంను త్రాగవచ్చు లేదా నొప్పిగా ఉన్న చోటుపై రాయండి.

ఎల్డెర్బెర్రీస్ రసం

ఒక కప్పు వేడి నీటిలో ఒకటి టీస్పూన్ ఆర్గానిక్ ఎల్డెర్బెర్రీస్ ని కలిపి తీసుకోవటం వలన తొంటి నొప్పి సహజంగా తగ్గిపోతుంది. ఈ టీ రోజుకు కనీసం 2 నుండి 3 సార్లు త్రాగాలి.

పెప్పర్మిట్ నూనె

ఈ నూనెని నొప్పి నివారిణిగా ఉపయోగిస్తారు. పెప్పర్మిట్ యొక్క అనాల్జేసిక్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు సియాటికా అనగా తొడ వెనుక భాగపు నరాలకు సంబంధించిన నొప్పిని వేగంగా తగ్గిస్తుంది. పెప్పర్మిట్ నూనెని ఏదైనా ఒక మసాజ్ నూనెతో కలిపి ప్రభావిత ప్రాంతాల్లో రాయండి. వేగవంతమైన ఫలితాల కోసం రోజుకు 1-2 సార్లు వర్తించండి.

సెలెరీ రసం

తుంటి నొప్పిని తగ్గించేందుకు సెలెరీ జ్యూస్ని చిన్న కప్పులో రోజుకు రెండుసార్లు త్రాగండి. ఇందులో అద్భుతమైన నొప్పి నివారణ లక్షణాలు ఉన్నాయి. జ్యూస్ తయారు చేయడానికి, కొన్ని తాజా సెలెరీలను ముక్కలుగా కట్ చేసి తగినంత నీరు జోడించి బాగా రుబ్బి త్రాగండి. కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు.

ఐస్ మరియు హీట్ ట్రీట్మెంట్

ఐస్ మరియు హీట్ ట్రీట్మెంట్ తో తుంటి నొప్పి మరియు లోయర్ బ్యాక్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఇది తుంటిని పూర్తిగా గుణపరచలేకపోయినప్పటికీ నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ట్రీట్మెంట్ ని రిపీట్ చేస్తుండటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.

మసాజ్

పిరిఫార్మ్ కండరాలు బిగుసుకుపోవడం వలన ఒత్తిడి పెరిగి తుంటి నరాలలో నొప్పి పుడుతుంది. కనుక పిరిఫార్మ్ కండరాలపై మృదువుగా మర్దన చేయటం వలన నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. కానీ హెర్నియేటెడ్ డిస్క్ పై ఎల్లాంటి ఒత్తిడిని కలిగించకుండా మసాజ్ చేయాలి. ఒక మంచి నిపుణులను సంప్రదించి సరైన మార్గంలో మసాజ్ చేయడాన్ని తెలుసుకోండి.

వ్యాయామాలు మరియు యోగా

సరైన వ్యాయామాలను చేయటం వలన బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ మరియు సియాటికా నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు బలమైన లేదా భరువైన వ్యాయామాలను చేయకూడదు, ఎందుకంటే అది మీ హెర్నియేటెడ్ డిస్క్ పై ఒత్తిడిని పెంచుతుంది. తక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి వ్యాయామాలను చేయండి. రోజుకు 20 నిమిషాలు వాకింగ్ చేయటం, స్విమ్మింగ్ మరియు ఏరోబిక్స్ వంటివి. వీటి వలన బిగుసుకుపోయిన నరాలు ఉపశమనం పొందుతాయి. అలాగే వెన్ను నొప్పి తగ్గడానికి తగిన యోగాలను ప్రయత్నించండి. యోగా చేసే ముందు తగిన ట్రైనింగ్ తీసుకోండి.

పసుపు మరియు నిమ్మరసం

ఈ చికిత్సను మన భారత దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది నరాల నొప్పి, ఎముకల ఫ్రాక్చర్ మరియు కండరాల నొప్పులకు కూడా ఉపయోగిస్తారు. కొంత పసుపు మరియు నిమ్మరసాన్ని కలిపి తుంటి నొప్పి పుట్టిన ప్రాంతంలో ముద్దగా రాసి ఒక కాటన్ వస్త్రంతో చుట్టండి. ఈ పేస్ట్ పూర్తిగా ఆరే వరకు కట్టును విప్పకండి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేయండి.

మెంతులు

కొన్ని మెంతులను నీటిలో నానపెట్టి, మృదువుగా పేస్ట్ లా రుబ్బండి. ఈ పేస్ట్ ని కాస్త వేడి చేసి నొప్పి పుట్టిన చోట ముద్దగా రాయండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి.

వాలెరియన్ రూట్

ఇది నరాలను రిలాక్స్ చేసి నొప్పిని తగ్గిస్తుంది. ఒక స్పూన్ ఎండిన వాలెరియన్ రూట్ ని వేడి నీటిలో వేసి ఉడికించి వడగట్టి త్రాగండి. రోజుకు 2-3 సార్లు ఒక వారం పాటు త్రాగితే మంచి ఫలితాలను పొందుతారు.