Posted on

Telugu tips to get rid of body heat – సహజంగా బాడీ హీట్ ను తగ్గించేందుకు గృహ నివారణలు

శరీరం వేడిగా ఉండటం వలన మీకు అసౌకర్యం కలగచ్చు. ఇది వ్యాధి కాదు, కానీ రాబోయే వ్యాధికి ఒక సూచన లాంటిది. మీరు చాలా శ్రమ కరమైన పనులు చేసినప్పుడు మీ శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావచ్చు. మీకు జ్వరం వచ్చినప్పుడు, లేదా ఏదైనా మాత్రలు వాడినప్పుడు ఈ అదనపు వేడి పుటొచ్చు. శరీరంలోని రసాయనాల అసమతుల్యత మరియు అసాధారణ జీవక్రియ వలన కూడా అకస్మాత్తుగా మరియు అవాంఛనీయ వేడి పుడుతుంది. కొన్ని సార్లు ఇది గుండె మంట, చర్మంపై దద్దుర్లు మరియు నల్లటి మచ్చలకు దారితీస్తాయి. వేడిని క్రింద చెప్పిన రెమెడీల ద్వారా తొలగించండి.

నివారణలు

పళ్ళు

ఎక్కువ పళ్ళను తినాలి. వీటిలో విటమిన్లు మరియు మినరల్లు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ లక్షణాల వలన ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ప్రతి రోజూ వట్టి కడుపుతో లేదా భోజనం చేసిన తరువాత పళ్ళను తినండి.

ఎండలో తిరగవద్దు

ఒక వేళ మీకు బయట పనులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు నీళ్లు ఎక్కువగా త్రాగాలి. సూర్య కాంతులు మీ శరీరంలో వేడిని అనవసరంగా పెంచి మీకు చిరాకు పుట్టించవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్‌ను వాడండి. ఇది మీ చర్మపు రంగును కూడా సంరక్షిస్తుంది.

చక్కెర మరియు ఉప్పు

ఒక స్పూన్ చక్కెర మరియు ఒక స్పూన్ ఉప్పుని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని త్రాగండి. ఇది మీకు వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

దానిమ్మ మరియు బాదాం ఫల రసం

మీరు బాదాం లేదా దానిమ్మ ఫల రసాన్ని త్రాగండి. రోజూ ఉదయం దీనిని త్రాగటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనవసరమైన వేడిని తొలగించి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

కొబ్బరి నీళ్లు మరియు పుచ్చకాయ

పుచ్చకాయలో శరీరం లోని వేడిని తగ్గించేందుకు కావలసిన విటమిన్లు ఉన్నాయి. కొబ్బరి నీల్లు కూడా శరీరంలోని వేడిని తగ్గించగలదు. వీటితో పాటు మీరు తరచుగా నీల్లను త్రాగటం చాలా మంచిది.

అత్తిపండు

అత్తిపండు మరియు పచ్చి అత్తిపండులో వేడిని తగ్గించే విటమిన్ బి2, పొటాషియం మరియు విటమిన్ ఏ ఉన్నాయి. రోజుకు కనీసం రెండు అత్తి పండ్లను తినడం వలన తప్పకుండా మీ శరీర వేడి క్రమంగా తగ్గి మీకు ఉపశమనాన్ని ఇస్తుంది.

యాలకులు (కార్డమమ్)

మీ శరీరం యొక్క వేడిని తగ్గించేందుకు యాలకులను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో చాలా వైద్య గుణాలు ఉన్నందున పురాతన కాలం నుండి శరీరం యొక్క వేడిని తగ్గించేందుకు మరియు అనేక వ్యాధులను తొలగించేందుకు ఉపయోగిస్తారు.

ఆప్రికోట్(నేరేడు పండు)

మీకు దాహం వేసినప్పుడు నీటికి బదులుగా నేరేడు పండు రసాన్ని త్రాగండి. ఇది మీ శరీర వేడిని తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం దీనిని త్రాగటం అలవాటు చేసుకోండి.

కర్బూజ(మస్క్ మెలోన్)

బాడీ హీట్‌ను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వేసవి కాలంలో మరియు ఎక్కువగా బయట పనులు ఉన్నవారు మీ రోజూ డైట్ లో ఈ కర్బూజను చేర్చుకోవడం ఉత్తమం.

రెడ్ రాడిష్(ఎర్ర ముల్లంగి)

ఎర్రముల్లంగిలో నీటి సారం ఎక్కువగా ఉండటంతో పాటు ఇందులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నందున ఇది మీ శరీరం యొక్క వేడిని సహజంగా తగ్గిస్తుంది. ఇందులో వ్యాధినిరోధ లక్షణాలు కూడా ఉన్నాయి . ఇది హీట్ స్ట్రెస్ తో పోరాడుతుంది.

మెంతులు

వేడిని తగ్గించడంలో అత్యంత ప్రాచుర్యం పొందినది మెంతులు. వీటిని వట్టిగా తినవచ్చు లేదు రోజూ ఆహారాలలో చేర్చుకోండి.

అరటి దూట

శరీరంలో వేడిని తగ్గించడానికి అరటి దూట బాగా ఉపయోగపడుతుంది. అరటి దూట కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి కూడా సహకరిస్తుంది.

రాగి గంజి

శరీరంలోని వేడిని హరించి, శరీరానికి పోషకాలను అందించేందుకు రాగి గంజిని తీసుకొండి. కొన్ని నీళ్ళు మరిగించి దాంట్లో చల్లని నీటిలో కలిపిన రాగుల పిండిని వేసి వుడికించి గంజి తయారు చేయండి. చల్లారిన తరువాత ఇందులో సరిపడ ఉప్పు, మజ్జిగ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

పెసర పప్పు

పెసరపప్పును రాత్రే గంజి చేసి ఉదయం నిద్రలేవగానే, వట్టి కడుపుతో త్రాగడం వలన శరీరంలోని వేడి ఇట్టే మాయం అవుతుంది. దీనిని మీ రోజూ ఆహారాలలో కూడా చేర్చుకోవచ్చు.

శరీరం యొక్క వేడిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు

 • శరీర వేడిని తగ్గించేందుకు ఒక ముఖ్యమైన చిట్కా నూనెలో వేపిన మరియు కారమైన ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి. వీటికి బదులుగా వేడిని తగ్గించే దోసకాయలు, ఆకు పచ్చని కూరగాయలను తీసుకోండి. పెరుగు మరియు పుచ్చకాయ రసాన్ని తరచుగా త్రాగండి.
 • తులసి విత్తనాలను కొన్ని నిమిషాలు నీటిలో నానపెట్టి పాలలో లేదా రోజ్ వాటర్ లో కలుపుకొని త్రాగండి.
 • జీవక్రియను పెంచేటువంటి ఆహారాలను తినండి, దీనివలన శరీరం యొక్క వేడి సంతులనం అవుతుంది. ఉదాహరణకు జీలకర్ర, కొత్తిమీర, సోంపు విత్తనాలు మరియు గులాబీ నీరు. మీ శరీరం యొక్క ఉపశమనానికి పెప్పర్మిట్(పుదీనా) మరియు చమోమిలే(చామంతి) టీ త్రాగండి.
 • మూలికల నూనె లేదా కొబ్బరి నూనెలను ఉపయోగించి శరీరాన్ని మసాజ్ చేయండి. ఇది మీ రక్త ప్రసరణను అధికరించి వేడిని తగ్గిస్తుంది.
 • మీరు రోజూ తినే ఆహారాలలో చక్కెరను ఉపయోగించటం తగ్గించి వాటికి బదులుగా తేనె మరియు మొలాసిస్లను ఉపయోగించండి.
 • పెరుగు ఒక సహజ శీతల కరణ ఏజెంట్, ప్రతి రోజూ భోజనం తరువాత కొద్దిగా పెరుగును నీటిలో కలుపుకొని త్రాగండి.
 • చల్లని వాతావరణంలో గార్డెనింగ్, స్విమ్మింగ్ లాంటి పనులు చేయటం వలన మీ శరీరం చల్లబడుతుంది.
 • కాటన్ మరియు లెనిన్ లాంటి దుస్తులను వేసుకోవటం వలన మీ చర్మానికి కావాల్సిన గాలి ప్రవాహాన్ని అందిస్తుంది.
 • ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను, ఎక్కువగా ఉప్పు మరియు నూనె ఉండే పదార్థాలను నివారించండి.
 • పాలు, పసుపు పొడి మరియు బాదాం పొడిని కలుపుకొని త్రాగటం వేడిని తగ్గించేందుకు ఒక ఆయుర్వేద వైద్య విధానం.
 • సూర్య నమస్కారం, ప్రాణాయామ మరియు త్రికోణాశనం లాంటి యోగాలను చేయటం వలన మీ శరీరం ప్రాకృతికంగా చల్లబడుతుంది. వీటితో పాటు ధ్యానం చేయటం వలన మీ మనసు కూడా శాంత పడుతుంది.
 • లేత కొబ్బరి నీళ్లు శరీర వేడిని తగ్గించేందుకు చాలా తోడ్పడుతుంది.
 • ఆముదం నూనెని తలపై రాసి స్నానం చేయండి. లేదా మీ పాదాలలో రాసుకోండి.
 • ఆముదం నూనెకు బదులుగా నువ్వుల నూనెని కూడా ఉపయోగించవచ్చు.
 • రోజూ రాత్రి పడుకునే ముందు అరటి పళ్ళను తినండి. ఇది శరీర వేడిని తగ్గించి మలబద్ధకం నుండి నివారణ ఇస్తుంది.