Posted on

Overnight solution for scars in Telugu – ఒకే రాత్రిలో పింపుల్స్ స్కార్స్ ను తొలగించటం ఎలా? – ఒకే రాత్రిలో మొటిమల మచ్చలకు పరిష్కారం

మీకు మొటిమలను ఎలా నయం చేయాలో తెలిసి ఉండవచ్చు, కానీ వాటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుండి తప్పించుకోలేరు. మన చర్మం మీద చెమట, సీబం (శ్లేష పటలము, క్షయము కలిసిన మిశ్రమము) మరియు దుమ్ము పదార్థాల వలన ఇది సంభవించవచ్చు. మొటిమలను వదిలించుకోవటం చాలా సులభం, కానీ వాటివలన చర్మంపై కలిగిన నల్ల మచ్చలను తొలగించటం చాలా కష్టం మరియు చాలా సమయం పడుతుంది. కొన్ని సాధారణ పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ సమస్య సులభంగా పరిష్కరించవచ్చు. కొన్ని చికిత్సలు మరియు విధానాలు క్రింద వివరించబడ్డాయి.

మొటిమల మచ్చలను తొలగించటానికి హోమ్ రెమెడీలు

దోసకాయ

దోసకాయలలో మన చర్మానికి చాలా ఉపయోగకరమైన అనేక విటమిన్లు మరియు మెగ్నీషియాలు ఉంటాయి. ఇది మొటిమల మచ్చలను తొలగించడానికి ఒక అద్భుతమైన సహజ పదార్థం. మచ్చల్నే కాదు వాపు మరియు హీల్స్ ని కూడా తొలగిస్తుంది మరియు చర్మాన్ని ఊరట పరుస్తుంది.

 • దోసకాయ ముక్కలను మీ చర్మం యొక్క ప్రభావిత ప్రాంతాలపై 30 నిమిషాలు ఉంచండి.
 • తరువాత చల్లని నీటితో కడగండి.
 • మీ మచ్చలు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ రెమెడీని రోజూ రిపీట్ చేయండి.
 • ముక్కలకు బదులుగా దోసకాయను బాగా రుబ్బి మీ చర్మంపై పూయవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. కనుక ఇది ఒకే రాత్రిలో మొటిమలను తొలగిస్తుంది. దీనిని మొటిమల వలన కలిగే మచ్చలను నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు.

 • వెల్లుల్లిపై ఉన్న చర్మాన్ని తొలగించాలి.
 • వాటిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
 • కొద్ది సేపు మచ్చలపై వీటిని రుద్దండి.
 • 15 నిమిషాల తరువాత కడగండి.

టమోటాలు

టమోటాలో విటమిన్ ఎ కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చనిపోయిన చర్మ కణాలను సరి చేసి, ఆరోగ్యవంతమైన పెరుగుదలను ప్రోత్సహించగలదు.

 • పూర్తిగా పండిన, ఎరుపు రంగులో ఉండే టమోటాను తీసుకోండి.
 • చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు లేదా బాగా రుబ్బి పేస్ట్ చేసుకోవచ్చు.
 • దీనిని మీ చర్మపు మచ్చలపై రుద్ది 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచిన తరువాత నీటితో కడగండి.
 • ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.

టీ ట్రీ నూనె

టీ ట్రీ ఆయిల్లో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమలు, ఇన్ఫ్లమేషన్ మరియు మొటిమల యొక్క మచ్చలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది మొటిమల కారణంగా చర్మంపై ఏర్పడే రెడ్నెస్ ని కూడా తగ్గిస్తుంది.

 • అరచేతిలో మీ రెగ్యులర్ ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ తీసుకోండి.
 • అందులో కొన్ని చుక్కల టీ ట్రీ నూనెని చేర్చుకోండి.
 • దీనిని మీ చర్మంపై పూర్తిగా రాసి మసాజ్ చేయండి.
 • 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

ఆపిల్ సీడర్ వినిగర్

మొటిమలు మరియు మచ్చలతో సహా పలు ఇతర చర్మ సమస్యలను తొలగించేందుకు వినిగర్ ఒక ప్రముఖ నివారిణి. మొటిమలకు ప్రధాన కారణం అయిన రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

 • కొద్దిగా నీటిని తీసుకొని కొన్ని చుక్కల ఆపిల్ సీడర్ వినిగర్‌ని కలుపుకోండి.
 • ఈ మిశ్రమంలో శుభ్రమైన పత్తిని ఉపయోగించి మీ చర్మంపై మొటిమలు అలాగే మచ్చలు ఉన్న ప్రాంతాలపై రాయండి.
 • కొన్ని గంటల తర్వాత కడగండి లేదా అలాగే వదిలేయవచ్చు.

పసుపు

మొటిమల యొక్క నల్లని మచ్చలను తొలగించటానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది. కలబంద మరియు పసుపు మిశ్రమాన్ని ఉపయోగించి మొటిమలను తొలగించవచ్చు.

 • పాలు, పసుపు పొడి మరియు నిమ్మరసంను కలుపుకొని మందపాటి పేస్ట్ తయారు చేసుకోండి.
 • మొటిమల వలన ఏర్పడిన నల్లని మచ్చలపై దీనిని రాయండి.
 • పూర్తిగా ఆరే వరకు ఉంచండి.
 • తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
 • అవసరమైతే ఈ చికిత్సను రిపీట్ చేయండి.

పై చెప్పిన మిశ్రమంకు బదులుగా ఆలివ్ నూనె మరియు పసుపు పొడిని కలుపుకుని ఉపయోగించవచ్చు. ఇది కూడా మొటిమల మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో ఎక్సఫోలియేషణ్ లక్షణాలు ఉన్నాయి. దీనిని రెగ్యులర్గా ఉపయోగించటం వలన నల్లని మచ్చలను తొలగించవచ్చు.

 • బేకింగ్ సోడాలో కొంచెం నీటిని కలుపుకోండి. నీటికి బదులుగా రోజ్ వాటర్‌ని కూడా ఉపయోగించవచ్చు.
 • ఈ పేస్ట్‌ని మచ్చల మీద రాసి రాత్రంతా అలాగే వదిలేయండి.
 • ఉదయం శుభ్రంగా కడగండి.
 • ఇది మచ్చలను తొలగించటం మాత్రమే కాదు, మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసంలో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆసిడ్ (AHA) ఉండటం వలన న్యాచురల్ బ్లీచింగా పనిచేస్తుంది. ఇది చర్మంపై మచ్చలను మరియు పాచెస్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని స్వచ్ఛంగా మరియు శుభ్రంగా చేస్తుంది.

 • ఒక గిన్నెలో తాజా నిమ్మరసంను తీసుకోండి.
 • మీ చర్మం చాలా సున్నితంగా ఉన్నట్లయితే కొద్దిగా నీటిని కలుపుకోండి.
 • ఒక పత్తితో ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాయండి.
 • ఆరే వరకు అలాగే ఉంచండి.
 • ఆ తరువాత చల్లని నీటితో కడగండి.
 • తరువాత సున్నితమైన మాయిశ్చరైజర్‌ని రాయండి.
 • స్వచ్చమైన చర్మం పొందడానికి వారానికి రెండు సార్లు ఈ ప్రక్రియను చేయండి.

నిమ్మరసం మచ్చలను తొలగించటమే కాదు, చర్మాన్ని పొడిగా చేస్తుంది. కనుక మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం మర్చిపోకండి.

నీరు

మీ చర్మానికి ఒక క్లెన్సింగ్ ఏజెంట్. ఇది అన్ని రకాల అంటువ్యాధుల నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది మరియు చర్మపు మలినాలను తొలగిస్తుంది. దీర్ఘకాలం మీ చర్మాన్ని క్లియర్‌గా ఉంచడానికి ప్రతి రోజు కనీసం 3 లేదా 4 లీటర్ల నీరు త్రాగటం ప్రారంభించండి.

గంధం

ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు మచ్చలను సహజంగా తొలగించటానికి సహాయపడుతుంది.

 • గంధం మరియు గులాబీ నీటితో ఒక కూర్పుని తయారు చేసుకోండి.
 • మొటిమ మచ్చలపై ఈ కూర్పుని రాయండి.
 • 1 గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

బంగాళదుంప

ముదురు మచ్చలు మరియు పాచెస్ తొలగించటానికి బంగాళదుంప ఒక ఉత్తమ పరిష్కారం. ఒకే రాత్రిలో మచ్చలను వదిలించుకోవడానికి క్రింద చెప్పిన విధంగా చేయండి.

 • తాజా బంగాళదుంపను సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి.
 • మీ ముఖం యొక్క ప్రభావిత చర్మంపై వాటిని ఉంచండి.
 • కొన్ని నిమిషాలు అలాగే ఉంచి వెచ్చని నీటితో కడగండి.
 • బంగాళదుంప రసాన్ని తేనెలో కలుపుకొని కూడా ఉపయోగించవచ్చు.

ఇది మొటిమ మరియు డార్క్ సర్కిల్స్ ను (కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలను) కూడా తొలగిస్తుంది.

కలబంద

ఆలీ వెరాలో పాలిసాకరైడ్లు, ఎంజైములు మరియు పోషకాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నల్లని మొటిమల మచ్చలను సహజంగా మరియు సులభంగా వదిలించుకోవటానికి సహాయపడుతుంది.

 • తాజా కలబంద ఆకును ఎంచుకోండి.
 • ఆకు నుండి కలబంద జెల్‌ను తీయండి.
 • మీ చేతితో మొటిమ గుర్తులు లేదా మొటిమల ప్రదేశంలో జెల్‌ను మసాజ్ చేయండి.
 • సహజంగా మొటిమ మచ్చలను తొలగించటానికి రోజుకు రెండుసార్లు రాయండి.

తేనె

మొటిమలు, మొటిమల వలన కలిగే రెడ్ నెస్ మరియు ముదురు మచ్చలను నయం చేయడానికి ఇది అధిక నాణ్యమైన గృహ చికిత్స. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది అనేక చర్మ సమస్యలకు ఒక సహజ హీలర్గా పనిచేస్తుంది.

 • నిద్ర పోయే ముందు మచ్చల మీద తేనెని రాయండి.
 • రాత్రంతా చర్మంపై వదిలేయండి.
 • ఉదయం శుభ్రమైన నీటితో కడగండి.
 • అవసరమైతే ఈ ప్రక్రియను రిపీట్ చేయండి.

తులసి మరియు వేప ఫేస్ ప్యాక్

 • 3 తులసి ఆకులు, 2 పుదీనా ఆకులు, 2 వేప ఆకులు, 1 నిమ్మకాయ మరియు 1 టీ స్పూన్ పసుపును తీసుకోండి.
 • ముందుగా నిమ్మకాయ నుంచి రసాన్ని తీయండి.
 • అన్ని ఆకులనూ కలిపి బాగా రుబ్బుకోవాలి.
 • తరువాత పసుపు, నిమ్మరసం మరియు ఆకుల పేస్ట్ ను బాగా కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
 • ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తులసి, వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన డార్క్ స్పాట్స్ మరియు స్కిన్‌ డ్యామేజ్ ని తొలగిస్తుంది. పుదీనా ఆకులు చల్లని అనుభూతిని ఇస్తాయి మరియు రెడ్ నెస్ ని తొలగిస్తాయి. నిమ్మరసం న్యాచురల్ బ్లీచింగ్ లా పనిచేస్తుంది మరియు మచ్చలను నివారిస్తుంది. పసుపులో యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది.

బాదాం

బాదాంను నీరు లేదా పాలలో 12 గంటలు నానబెట్టాలి. నానిన బాదాం తోలును తీసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయండి.

ముల్లంగి విత్తనాలు

ముల్లంగి విత్తనాలను పేస్ట్ చేసి క్రమం తప్పకుండా ముఖానికి రాస్తే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెంతాకులు

మెంతి ఆకులను రుబ్బి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి. బాగా ఆరిన తరువాత ముఖాన్ని కడగండి. మొటిమలని తొలగించడానికి ఇదే పద్దతిని కొన్ని రోజులపాటు పాటించాలి. ఇది మీ చర్మాన్ని మృదువు గా చేస్తుంది.