Posted on

Telugu tips to treat skin hives – చర్మం పై దద్దుర్లు (హైవ్స్) దురద తగ్గటానికి ఇంటి చిట్కాలు

ఏదైనా అలర్జీ వలన చర్మం పై ఏర్పడే ఎరుపు గడ్డలను దద్దుర్లు అని అంటారు. అవి కొందరిలో చిన్నగా మరి కొందరిలో పెద్దగా వ్యాపిస్తాయి. అవి దురదగా ఉంటాయి.

చర్మ దద్దుర్లకు కారణాలు ఏమిటి?

ఇవి హిస్టామిన్ రసాయనం వలన కలుగుతాయి. రక్త కణాల ద్వారా హిస్టామిన్ అనే రసాయనం డిశ్చార్జ్ అవుతుంది. ఈ రసాయనం రక్త నాళాల నుండి చర్మం లోతుల్లోకి లీక్ అవుతుంది. వీటి వలన దద్దుర్లు ఏర్పడతాయి. మందులు వాడటం, ఒత్తిడి, వైరల్ ఇన్‌ఫెక్షన్, జలుబు, సూర్య కాంతులు మరియు వేడి వలన ఈ దద్దుర్లు రావచ్చు. దుమ్ము, దుమ్ము పురుగులు, పుప్పొడి, డాండ్రఫ్, షెల్ఫిష్ మరియు ఇతర ఆహారాల వలన కూడా రావచ్చు.

దద్దుర్లకు ఉత్తమ చికిత్స ఏమిటి?

ఈ అలర్జీ నుండి ఉపశమనం పొందేందుకు యాంటీ-హిస్టామిన్ మందులను వాడండి. మీకు మత్తును కలిగించని మందులను ఎంపిక చేసుకోండి. మందులు వాటి పనిని అవి చేస్తాయి, వాటితో పాటు కొన్ని గృహ నివారణలు కూడా పాటించడం వలన ఎక్కువ ఉపశమనాన్ని పొందుతారు.

దద్దుర్లను తొలగించేందుకు గృహ నివారణ పద్ధతులు

చల్లని నీటితో స్నానం

చాలా అరుదుగా జలుబు వలన దద్దుర్లు వస్తాయి. అలాంటప్పుడు చల్లని నీటితో స్నానం చేయండి. దీని వలన రక్త నాళాలు కృశించిపోయి చర్మం లోనికి హిస్టామిన్ రసాయనం డిశ్చార్జ్ కాకుండా ఆగిపోతుంది. లేదా ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని ఐస్ క్యూబ్స్ ని నింపి దురద చర్మంపై ఉంచండి. బాధించే దద్దుర్ల నుండి ఉపశమనం పొందటానికి ఈ పద్ధతిని రోజుకు అనేక సార్లు ప్రయత్నించండి.

ఆస్ట్రిజెంట్స్

రక్త నాళాల నుండి హిస్టామిన్ ఉత్పత్తిని ఆపడానికి కాలమైన్ లోషన్లేదా విచ్ హాజెల్లాంటివి వాడండి. పెప్టో-బిస్మోల్లేదా మిల్క్ అఫ్ మెగ్నీషియలాంటి లోషన్‌లను కూడా వాడవచ్చు.

బేకింగ్ సోడా

రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలుపుకొని ఒక ముద్దలా చేసుకోండి. దీనిని దద్దుర్లపై రాయటం వలన దురద తగ్గుతుంది.

వినిగర్

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ లో ఒక టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లను కలుపుకొని దద్దుర్లపై రాయండి. ఇది మీ దురదను తగ్గిస్తుంది.

బ్రౌన్ షుగర్ మరియు అల్లం

1/4 కప్పు బ్రౌన్ షుగర్, ఒక టేబుల్ స్పూన్ అల్లం మరియు 3/4 కప్పు వినిగర్‌ను బాగా కలిపి కొన్ని నిమిషాలపాటు బాగా ఉడికించాలి. ఈ నీటిని వడగట్టి వెచ్చగా అయిన తరువాత దద్దుర్లపై అద్దాలి. ఇలా రోజుకు అనేక సార్లు చేయండి.

ఫిష్ ఆయిల్

1000 మిల్లీగ్రాముల ఫిష్ ఆయిల్‌ క్యాప్సూల్స్ ను రోజుకు మూడు సార్లు తీసుకోవచ్చు. ఇందులోని ఫాటీఆసిడ్స్ కు యాంటీ-ఇన్ఫమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మంటను తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది. చల్లని నీటిలో ఉండే చేపలు, ఉదాహరణకు బ్లూ ఫిష్,సాల్మన్ మరియు అల్బ కోర్ ట్యూనా లాంటి చేపలను తినండి.

ఒత్తిడిని తగ్గించుట

కొన్ని సార్లు ఒత్తిడి వలన కూడా దద్దుర్లు రావచ్చు. కాబట్టి యోగా, ధ్యానం మరియు వ్యాయామాలను ఆచరించండి.

తులసి

తులసి ఒక ప్రాకృతిక యాంటీ-హిస్టామిన్’. దద్దుర్లను తొలగించేందుకు ఇది ఒక ప్రముఖమైన నివారిణి. ఇది దురద మరియు మంటల నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. కొన్ని తులసి ఆకులను ఒక జార్ వేడి నీళ్లలో వేసి మూసి పెట్టాలి. ఈ నీళ్లు చల్లబడిన తరువాత దద్దుర్లపై రాయండి. లేదా కొన్ని తులసి ఆకులను బాగా దంచి వాటిని దద్దుర్లపై రాయండి. కొద్ది సేపు తరువాత వెచ్చని నీటితో కడగండి.

పుదీనా

పుదీనా చల్లని ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది దద్దుర్ల వలన కలిగే దురదను తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇది దురద మరియు అసౌకర్యమైన మంటను నివారించడానికి చాలా ప్రభావితమైన పదార్థము. ఇందులో యాంటీ-ఇన్ఫమేటరీ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.

ఒక కప్పు నీటిలో పుదీనా ఆకులను వేసి బాగా ఉడికించండి. ఈ నీటిని వడగట్టి, చల్లబడిన తరువాత ఫ్రిజ్లో కొన్ని గంటలు ఉంచండి. ఈ చల్లని నీటిని మీ చర్మం పై రాయండి. ఇలా రోజుకు అనేక సార్లు రాయటం వలన ఉపసమనం పొందుతారు.

దీనిని చర్మం పై రాయటమే కాకుండా త్రాగడం వలన కూడా దురద మరియు మంట తగ్గుతుంది. ఒక కప్పు నీళ్లలో ఒక చెంచా పుదీనా ఆకులను, ఒక చెంచా చెక్కరని వేసి బాగా ఉడికించండి. ఈ నీటిని వడగట్టి చల్లబడిన తరువాత త్రాగండి. ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి.

పసుపు

వండటానికే కాదు చర్మం మెరుగు పరచటానికి మరియు దద్దుర్ల చికిత్సకు కూడా పసుపు ఉపయోగ పడుతుంది. ఇందులోని యాంటీ-ఇన్ఫమేటరీ గుణాలు శరీరం లోని కార్టికోస్టెరాయిడ్స్ని ఉత్తేజ పరుస్తుంది. ఇందులో యాంటీ-హిస్టామిన్ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. రోజుకు రెండు సార్లు వెచ్చని పాలు లేదా నీళ్లలో ఒక చెంచా పసుపును కలుపుకొని తాగండి. వంట వండేటప్పుడు మామూలు కన్నా కొద్దిగా ఎక్కువ పసుపును వాడండి.

దురదగొండి(నెట్టల్)

ఇది వంకరటింకర ఆకులు కలిగిన ఒక మూలిక చెట్టు. మూలికా శాస్త్రజ్ఞులు దద్దుర్లను తొలగించటానికి దీనిని సిఫార్సు చేస్తారు. ఇందులో యాంటీ-హిస్టామిన్, యాంటీ-ఇన్ఫమేటరీ మరియు రక్తస్రావ నివారిణి లక్షణాలు ఉన్నాయి. ఇది వాపు, మంట మరియు దురదను తొలగించటానికి వాడుతారు.

ఒక టేబుల్ స్పూన్ ఎండిన దురదగొండి ఆకులను ఒక కప్పు వెచ్చని నీళ్లలో కలిపి 10-15 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత ఆ నీటిని వడగట్టి కొద్దిగా తేనెని కలుపుకొని త్రాగండి. రోజుకు 2-3 సార్లు త్రాగటం వలన ఉపయోగకరంగా ఉంటుంది.

లేకపోతే 300-మిల్లీగ్రాముల నెట్టల్ క్యాప్సూల్స్ ను రోజూ తీసుకోవచ్చు. ఈ క్యాప్సూల్స్ ను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించుట మంచిది.

వోట్మీల్

ఇందులో యాంటీ-ఇర్రిటేటింగ్, యాంటీ-ఇన్ఫమేటరీ మరియు సూతింగ్ లక్షణాలు ఉన్నందున ఇది దురదను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఒక కప్పు బేకింగ్ సోడాని రెండు కప్పుల పొడిచేసి ఓట్‌మీల్ తో కలుపుకోవాలి. స్నానం చేసే వెచ్చని నీటిలో దీనిని బాగా కలపి 15 నిమిషాల పాటు ఈ నీటిలో ఉండండి. ఇలా రోజుకు రెండు సార్లు మీ దద్దుర్లు తగ్గేంత వరకు చేయండి.

లేదా 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని 2 కప్పుల ఓట్ మీల్ పొడితో కలిపి ఒక ముద్దలా చేసి చర్మం పై రాయండి. 15-20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజూ చేయాలి.

కలబంద(అలో వెరా)

ఇది కూడా పుదీనా లాగే చర్మాన్ని చల్లబరచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ-ఇన్ఫమేటరీ  మరియు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు చర్మంపై ఎరుపుని, మంటని మరియు దురదని తగ్గిస్తుంది. వీటిని తినటం వలన రోగనిరోధక శక్తిని పెంచి, తాప జనక(ఇన్ఫమేటరీ) టాక్సిన్లను తొలగించేందుకు సహాయ పడుతుంది.

అలో వెరా జెల్‌ను చర్మంపై రాసి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు అనేక సార్లు రెండు వారాల పాటు రాయండి. లేదా, కలబంద రసాన్ని రోజూ తాగండి.

గమనిక: ఈ చిట్కాని చిన్న పిల్లలు మరియు పాలు ఇచ్చే ఆడవాళ్ళు అనుసరించకూడదు.

గులాబీ నీరు

రోజ్ వాటర్ తరచుగా చర్మ దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగించబడే ఉత్తమ ఔషధం. దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్‌ని చర్మంపై రాసి, 15-20 నిముషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనెలో ఉండే పోషక పదార్థాలు చర్మ సమస్యలని పోగొట్టడంలో ప్రభావితమైనది. కొంచం ఆలివ్ ఆయిల్‌ని పత్తితో దద్దుర్లపై రాయండి. 20 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.

మజ్జిగ

అలర్జీల వలన ఏర్పడే చర్మ సమస్యలకు మజ్జిగ ఒక చక్కటి పరిష్కారం. మజ్జిగను దద్దుర్లపై రాసి 10-15 నిముషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడగండి.