Posted on

Telugu remedies for blisters- నాలుకపై బొబ్బలను(బ్లిస్టర్స్) తొలగించేందుకు ప్రాకృతిక నివారణలు

బొబ్బలు విటమిన్ల లోపం వళ్ళ ఏర్పడే ఒక ఆరోగ్య పరిస్థితి. కొన్నిసార్లు అనుకోకుండా మనం నాలుకను కొరికినప్పుడు కూడా రావచ్చు. నాలుక మంట వలన, ఆహార అలర్జీలు, నోటి పుండు మరియు వైరల్ సంక్రమణ వలన కూడా బ్లిస్టర్స్ రావచ్చు. విటమిన్ సి లోపం వలన కూడా కావచ్చు. కొంత మందికి ప్రస్తుతం వేరే ఆరోగ్య సమస్యల కోసం తీసుకుంటున్న మందుల వలన కూడా రావచ్చు.

బొబ్బలు చాలా రకాలు, కొన్ని చర్మం రంగులలో, కొన్ని పసుపు మరియు ఎరుపు రంగులలో ఉంటాయి. ఇది ఆహారాలను భుజించేటప్పుడు చాలా చిరాకును పుట్టిస్తుంది. వీటిని గుణపరిచేటందుకు కొన్ని సహజ విధానాలను చూద్దాం.

నాలుక మీద బొబ్బలు నయం చేయటం ఎలా?

ఇది చాలా నొప్పిని కలిగించే ఒక సంక్రమణ. మీ నోటిలో బ్లిస్టర్స్ ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడటానికి కూడా వీలు కాదు. ఇది పిల్లలకు లేదా పెద్దలకు పెదాలపై, నోటి లోపల భాగాలలో లేదా నాలుక పైన రావచ్చు. ఇవి బాగా నొప్పిగా ఉండేందువలన సరిగ్గా తినడానికి కూడా వీలు కాదు. వీటిని నివారించేందుకు కొన్ని గృహ నివారణ పద్ధతులను చూద్దాం. ఇవి తప్పకుండా మీ నొప్పిని మరియు బ్లిస్టర్స్ ను తొలగిస్తుంది.

గృహ నివారణలు

బేకింగ్ సోడా

ఇది చాలా సాధారణమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం. ఒక కప్పు వెచ్చని నీళ్లలో ఒక చెంచా బేకింగ్ సోడాను కలుపుకొని నోట్లో 3 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని సార్లు చేసినట్లయితే బొబ్బలు తగ్గిపోతాయి.

కలబంద

కలబంద గురించి మీరు వినే ఉంటారు, ఇది చాలా ఉపయోగకరమైన చెట్టు. దీనిని బ్లిస్టర్స్ ను తొలగించేందుకు కూడా వాడవచ్చు. ఇందులోని జెల్‌ను నోటి బొబ్బలపై రాసి 5 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి.

మంచు గెడ్డ (ఐస్)

ఇది చర్మాన్ని మొద్దుబారేలా చేయటంవలన నొప్పిని తగ్గిస్తుంది. మంచు గెడల్ని మీ నోటి బొబ్బల పై మెల్లగా రుద్దండి . ఇది మీకు వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

పసుపు

ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు నోట్లో లేదా పెదాలపై ఉన్న కురుపులను తగ్గించేందుకు తోడ్పడుతుంది. వెంటనే ఉపశమనాన్ని పొందేందుకు ఒక టీస్పూన్ తేనెలో పసుపును కలిపి కురుపులపై రాసి 3 నిమిషాల తరువాత కడగండి. ఇలా రోజుకు మూడు సార్లు చేయటంవలన తొందరగా ప్రభావం చూపిస్తుంది.

ఉప్పు

ఉప్పుని ఉపయోగించటం వలన బొబ్బలవల్ల కలిగే మంటను మరియు నొప్పిని తగ్గిస్తుంది. ఒక కప్పు వెచ్చని నీళ్లలో ఒక చెంచా ఉప్పుని కలిపి కనీసం 30 సెకండ్లు పుక్కిలించాలి. ఆ తరువాత ఉప్పుని బొబ్బలపై రాసి ఒక నిమిషం ఉంచి వెచ్చని నీటితో కడగండి. బొబ్బలు తగ్గేవరకూ ఇలా రోజుకు 45 సార్లు చేయండి.

హైడ్రోజన్ పెరాక్సైడ్

ఇందులో యాంటీ-బాక్టీరియల్  మరియు క్రిమిసంహారక లక్షణాలు ఉన్నందున ఇది సంక్రమణాలను తగ్గిస్తుంది.3% హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను మాత్రమే వాడాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు నీటిని సమంగా కలిపి ఒక పత్తిని ఈ ద్రవంలో తడిపి బ్లిస్టర్స్ పై రాయాలి. రెండు నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు కొన్ని సార్లు చేయండి.

గమనిక : హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని తక్కువ మోతాదులలో వాడాలి. ఎక్కువ వాడకూడదు.

తులసి

తులసిలో యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇంఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నందున ఇది మంటను మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి ఆకులను బాగా కడిగి, కొన్నింటిని బాగా నమిలి తినాలి. ఇలా 3 లేదా 4 రోజులు తినటం వలన బొబ్బలు తగ్గిపోతాయి.

తేయాకు చెట్టు నూనె

ఇందులోని యాంటీ సెప్టిక్ మరియు యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు బ్లిస్టర్స్ ను తొలగిస్తాయి. ఒక కప్ నీళ్లలో కొన్ని చుక్కల తేయాకు చెట్టు నూనెని వేసుకొని రోజుకు రెండు సార్లు మౌత్ వాష్ లాగా వాడండి.

కొత్తిమీర/ధనియాలు

ఇందులోని యాంటీ-ఇంఫ్లమేషన్ మరియు యాంటీ సెప్టిక్ గుణాల వలన మంటను మరియు నొప్పిని తగ్గించి బ్లిస్టర్స్ ను చాలా సమర్థవంతంగా నివారిస్తుంది.

ఒక కప్పు నీటిలో ధనియాలు లేదా కొత్తిమీరను వేసి బాగా ఉడకబెట్టండి. ఈ నీటితో నోటిని బాగా కడగండి. ఇలా రోజుకు 3-4 సార్లు చేయటం వలన బొబ్బలు తొలగిపోతాయి.

విటమిన్ బి

విటమిన్ బి లోపం వలన కూడా ఈ బ్లిస్టర్స్ రావచ్చు. విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినటం వలన ఇవి తొలగిపోతాయి.

పాలు, పెరుగు, చీస్ మరియు తృణధాన్యాలు, గుడ్లు, సాల్మన్ చేప, ఓట్స్, ఊక, అవకాడొలు, అరటి పండ్లు, టర్కీ( సీమ కోడి) మరియు కాలేయం, వీటన్నిటి లో విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు విటమిన్ బి మందులను కూడా తీసుకోవచ్చు.

బొబ్బలు ఉన్నప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు

 • మీ పళ్ళతో బ్లిస్టర్స్ ను గోక వద్దు. ఇది మంటను పెంచుతుంది. ఇందువలన వీటిని నివారించేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
 • ఎక్కువ నీరు త్రాగటం చాలా అవసరం. నీరు త్రాగటం వలన బొబ్బలు ఎక్కువ కాకుండా ఉంటుంది. నాలుక తడిగా ఉండటం వలన నొప్పి తగ్గుతుంది.
 • చల్లని నీళ్లలో ఉప్పుని కలుపి నోరును పుక్కిలించండి. ఇది నోటిని శుభ్రం చేసి బాక్టీరియాలను తొలగిస్తుంది. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేయటం వలన గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.  అంతే కాదు ఇది మీ నోటిని తాజాగా ఉంచుతుంది.
 • తరచూ పళ్ళను తోమి బాక్టీరియాలను తొలగించండి.
 • మీ నోట్లో బ్లిస్టర్స్ ఉన్నప్పుడు చల్లని పదార్థాలను తినండి. ఉదాహరణకు చల్లని నీళ్ళు, చల్లని పాలు, ఐస్ క్రీమ్స్, ఫల రసాలు లాంటివి. ఇది మీ నాలుకను తడిగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
 • కాఫీ, టీ లాంటి వేడి మరియు కార మైన పదార్థాలను తినకండి. ఇవి నొప్పిని పెంచుతుంది.
 • మీరు ఏదైనా మౌత్ వాష్లను వాడుతునట్లయితే, సంక్రమణం వ్యాపించకుండా ఉండేందుకు కొద్ది రోజులు వాడడం మానండి. వీటికి బదులుగా తేయాకు నూనెని వాడండి.
 • మీరు రోజు తినే ఆహారంలో అల్లం మరియు వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోండి. రోజూ తినడం వలన ఇది బ్లిస్టర్స్ ఎక్కువ కాకుండా ఆపుతుంది.
 • ఎక్కువ కారం ఉండే పదార్థాలను మరియు ఎక్కువ ఆసిడ్స్ ఉండే పదార్థాలను తీసుకోవద్దు. ఎక్కువ తీపును కూడా తినవద్దు.
 • మెత్తగా ఉండే ఆహార పదార్థాలను తినండి. ఎందుకంటే ఇవి నమలటానికి సులువుగా ఉంటాయి.
 • మీకు తరచూ ఈ బ్లిస్టర్స్ వస్తున్నట్లయితే, సోడియం లరిల్ సల్ఫేట్(SLS ) ఉండే పేస్టులను వాడవద్దు.

బ్లిస్టర్స్ తగ్గటానికి మరియు రాకుండా ఉండేందుకు కొన్ని ముందు జాగ్రత్తలు

 • రోజుకు రెండు సార్లు పళ్ళు తోమండి.
 • విటమిన్స్ మరియు పోషక ఆహారాలను తినండి.
 • పెప్సీ, కోక్ లాంటి అసిడిటీ కలిగించే పానీయాలు త్రాగకుండా నివారించండి.

మీ బ్లిస్టర్స్ రెండు వారాలకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించి కారణాలను తెలుసుకొని తగిన మందులను వాడండి.