Posted on

Foot blisters tips in Telugu – పాదాల పై బ్లిస్టర్స్ ని క్యూర్ చేసేందుకు హోం రెమెడీస్

బ్లిస్టర్స్ అంటే ఏమిటి?

బ్లిస్టర్స్ శరీరంపై ఒక చిన్న బొబ్బలా ఏర్పడుతుంది. వీటిని పొక్కు అని కూడా అంటారు. ఈ బుడగల యొక్క పరిమాణం మారుతూ ఉంటాయి మరియు వివిధ కారణాల వలన సంభవిస్తాయి. స్కిన్ బర్న్, ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేదా దోమ కాటు వలన సంభవించవచ్చు. ఏర్పడిన స్థానాన్ని బట్టి, పొక్కు రోజువారీ పనులకు ఆటంకం కలిగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పాదాలలో పొక్కును కలిగి ఉంటే నడవటానికి, వ్యాయామం, లేదా దీర్ఘకాలం పాటు నిలబడటానికి కష్టంగా ఉంటుంది.

బొబ్బలు సాధారణంగా పాదాలమీద అభివృద్ధి చెందుతాయి. వీటి వలన కలిగే అసౌకర్యం నుండి ఉపశమనం పొందేందుకు అనేక గృహ చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలు ఉపశమనం కలిగించి పునరావృతమయ్యే బొబ్బల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పాదాలపై బొబ్బలు రావటానికి కారణాలు

మీ పాదాలపై బొబ్బలు ఉన్నట్లయితే అందుకు ప్రధాన కారణం ఘర్షణ కావచ్చు. ఎక్కువ సమయం నడవటం లేదా నిలబడటం వలన హీల్స్, అరికాలు మరియు కాలి వేలపై ఒత్తిడి పెరుగుతుంది. వీటి కారణంగా బ్లిస్టర్స్ ఏర్పడతాయి.

అయితే, దీర్ఘకాలం నడిచిన లేదా నిలబడి వున్న ప్రతి ఒక్కరికి బొబ్బలు ఏర్పడవు. అనేక సందర్భాల్లో, ఈ ద్రవంతో నిండిన పొక్కులు సరిగ్గా ఫిట్ అవ్వని బూట్లు వలన ఏర్పడుతుంది. చాలా లూస్ గా లేదా చాలా టైట్ గా ఉండే షూస్ వేసుకోవటం వలన ఘర్షణకు దారితీస్తుంది మరియు దాని ఫలితంగా చర్మంపై పొక్కు ఏర్పడుతుంది.

అధిక తేమ లేదా చెమట బ్లిస్టర్స్ ఏర్పడటానికి కారణం కావచ్చు. స్వెట్ ఫోర్స్ మూసుకుపోయినప్పుడు చిన్న బొబ్బలు ఏర్పడతాయి. చలి కాలంలో ఇది సాధారణంగా అధికంగా ఏర్పడుతుంది.

సన్ బర్న్ వలన కూడా ఇవి ఏర్పడవచ్చు. పాదాలపై బొబ్బలు ఏర్పడటానికి ఇతర కారణాలు

 • ఫ్రాస్ట్-బైట్
 • అలెర్జీ ప్రతిచర్య
 • రసాయన ఎక్స్పోజర్ (కాస్మెటిక్స్ లేదా డిటర్జెంట్లు)
 • ఫంగల్ ఇన్ఫెక్షన్లు
 • చికెన్ పాక్స్
 • బాక్టీరియా సంక్రమణ
 • హెర్పెస్
 • డైసిడ్రిటిక్ తామర

డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?

ఘర్షణ వల్ల కలిగే పొక్కు సాధారణంగా కొన్ని రోజుల్లో గృహ చికిత్సలతో పరిష్కరించబడుతుంది.

దురదృష్టవశాత్తు, కొన్ని బొబ్బలు గృహ చికిత్సలకు స్పందించవు. కాలక్రమేణా మరింత తీవ్రం అవుతాయి. పొక్కు తీవ్ర నొప్పికి కారణమైతే లేదా వాటి వలన నడవడానికి ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యుడిని చూడండి. బ్లిస్టర్స్ తో పాటు జ్వరం, వికారం లేదా చలి వంటి సంకేతాలు ఉన్నట్లయితే ఇది సంక్రమణంకు ఒక సంకేతం కనుక డాక్టర్ను సంప్రదించాలి.

మీ వైద్యుడు ఒక శుభ్రమైన సూదిని ఉపయోగించి పొక్కును శుభ్రం చేస్తారు. సంక్రమణ వలన కలిగినట్లయితే కారణాన్ని తెలుసుకునేందుకు వారు ద్రవం యొక్క నమూనాను పరిశీలించవచ్చు.

బొబ్బలను నివారించేందుకు మరియు క్యూర్ చేసేందుకు కొన్ని గృహ నివారణలు

ఒక డియోడ్రన్ట్ ఉపయోగించండి

మీ బూట్లు లేదా చెప్పులను ధరించే ముందు, మీ పాదాలపై డియోడ్రన్ట్ ని రాయండి ఎందుకంటే ఇది మీ పాదాలను తేమగా ఉంచుతుంది. ఇది చాలా ప్రయోజనకరమైన గృహ చికిత్స, ఇది బొబ్బలు బారిన పడకుండా మీ కాళ్లను కాపాడుతుంది.

బ్యాండేజ్ ని ఉపయోగించండి

పొక్కు ఏర్పడిన చోటుపై బ్యాండేజ్ ని ఉపయోగించవచ్చు. ఇది ఘర్షణను తగ్గిస్తుంది. ఘర్షణ వలన బొబ్బలు మరింత తీవ్రమవుతాయి. కనుక బ్యాండేజ్ వేసినట్లయితే ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి మురికి మరియు ఘర్షణకు పొక్కు గురవకుండా సురక్షితంగా ఉంచుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక పాన్ లో వేడి నీటిలో మూడు గ్రీన్ టీ బాగ్స్ వేసి, కొంత బేకింగ్ సోడాను కలిపి ఆపై నీరు చల్లబడిన తర్వాత బొబ్బలు ఏర్పడిన పదాలను కొంత సేపు ఈ నీటిలో ఉంచండి. ఇలా క్రమంగా చేస్తుండటం వలన కొన్ని రోజుల్లో బ్లిస్టర్స్ క్యూర్ అవుతాయి. ఇది చాలా ప్రయోజనకరమైన గృహ చికిత్స మరియు ఎలాంటి దుష్ప్రభావాలను కలిగి ఉండదు.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కనుక ఇది బ్లిస్టర్స్ ఉబ్బకుండా ఉండేందుకు మరియు ఇన్ఫెక్షన్ కలగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఒక పెద్ద వెస్సల్ లోని నీటిలో అర కప్పు వినిగర్ ని కలిపి కాళ్లను కొద్ది సేపు అందులో నానపెట్టండి. ఆ తరువాత పూర్తిగా తడి లేకుండా మెత్తని టవల్ తో తుడవండి. ఇలా క్రమంగా చేయటం వలన బ్లిస్టర్స్ నయమవుతాయి.

విటమిన్ ఇ

విటమిన్ ఇ ఆయింట్మెంట్ లేదా క్రీములను బొబ్బలపై రాయండి లేదా విటమిన్ ఇ గుళిక యొక్క చుక్కలను నేరుగా పొక్కుపై రాయండి. ఇది వెంటనే ఉపశమనం ఇస్తుంది మరియు మార్కెట్లో సులభంగా లభిస్తుంది.

కాస్టర్ ఆయిల్

ఇది చాలా సమర్థవంతమైన గృహ చికిత్స. రాత్రి పడుకునే ముందు కాస్టర్ ఆయిల్ని మీ చేతులపై మరియు పాదాలపై రాయండి. ఇది మీ చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు బొబ్బలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈ ఆయిల్ ని దరఖాస్తు చేయటం వలన ఇదివరకే ఉన్న బొబ్బలు సులభంగా ఎండిపోతాయి. మంచి ఫలితాల కోసం, కాస్టర్ ఆయిల్ మరియు ఆపిల్ సీడర్ వినిగర్ల మిశ్రమంను ఉపయోగించండి.

విచ్ హాజెల్

ఒక పతిని విచ్ హాజెల్ ద్రవంలో ముంచి బ్లిస్టర్స్ పై రాయండి. ఇది మీ బొబ్బలను బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది మరియు బొబ్బలు ఎండిపోయేలా చేస్తుంది. అంతే కాదు ఇది దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

కలబంద

కలబంద లో శోథనిరోధక లక్షణాలు ఉన్నాయి. కలబంద జెల్ ని డైరెక్ట్ గా పొక్కుపై రాయండి. ఇది రెడ్నస్ ని తగ్గించి నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

బ్లిస్టర్స్ ని తెరిచి ఉంచండి

మీరు స్వచ్ఛమైన వాతావరణంలో ఉన్నట్లయితే బొబ్బల్ని తెరిచి ఉంచాలని వైద్యులు సూచించారు. ఇది మీ బొబ్బలు త్వరగా ఎండిపోవుటకు సహాయపడుతుంది.

ఇంట్లోనే పొక్కును శుభ్రపరచేందుకు పాటించాల్సిన చర్యలు

 • మొదట వెచ్చని నీరు మరియు యాంటీ బాక్టీరియల్ సబ్బుతో మీ చేతులను కడగాలి.
 • పత్తిని ఉపయోగించి ఒక శుభ్రమైన సూదిని రబ్బింగ్ ఆల్కహాల్ తో శుభ్రపరచండి.
 • తరువాత యాంటీ సెప్టిక్ తో పొక్కును శుభ్రపరచండి.
 • సూదితో పొక్కు లో ఒక చిన్న పంక్చర్ చేయండి.
 • పొక్కు నుండి ద్రవం పూర్తిగా తొలగించండి.
 • ఆ తరువాత పొక్కు పై యాంటీ బాక్టీరియల్ ఆయింట్మెంట్ లేదా క్రీమ్ ను వర్తించండి.
 • ఇప్పడు బ్లిస్టర్ ఉన్న చోటుపై ఒక శుభ్రమైన బ్యాండేజ్ ని వేయండి.
 • ప్రతిరోజూ బ్లిస్టర్ ని శుభ్రపరచి యాంటీ బాక్టీరియల్ ఆయింట్మెంట్ ని రాయండి. బ్లిస్టర్ పూర్తిగా పొడిబారే వరకు బ్యాండేజ్ వేసి ఉంచండి.