Posted on

Aloo ka bartha / Aloo ka bharta recipe in Telugu – ఆలూ కా భర్తా రెసిపీ

చపాతీ లేదా పూరికి ఎన్నో రకాల సైడ్ డిషెస్ ని తయారు చేసుకోవచ్చు. అందులోను బంగాళదుంపలతో చేసే సైడ్ డిషెస్ నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధం.

బంగాళదుంపలు వర్షం పొడుగునా అందుబాటులో ఉంటాయి కనుక వాటితో ఎన్నో రకాల వంటలను ఏ సీజన్‌లోనైనా తయారు చేసుకోవచ్చు. మరి వాటితో ఎంతో సులువైన, రుచికరమైన ‘ఆలూ కా భర్తా’ సైడ్ డిష్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 3
  • నూనె – 2 టేబుల్ స్పూన్
  • ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
  • జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 1/2 టేబుల్ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • ఎండు మిరపకాయలు – 1
  • తరిగిన వెల్లుల్లి ముక్కలు – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – 1/2 కప్పు

తయారీ విధానం

  • ముందుగా మూడు బంగాళదుంపలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకొని తోలు తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి.
  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసి 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 ఎండు మిరపకాయ, 1/2 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి.
  • తరిగిన కొత్తిమీర కూడ వేసి కలుపుకోవాలి.
  • అన్ని పదార్థాలనూ దోరగా వేయించిన తరువాత మ్యాష్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ కా భర్తా రెడీ!