Posted on

Aloo tikki / Potato patty recipe in Telugu – ఆలూ టిక్కీ రెసిపీ

ఉత్తర భారత దేశం మరియు బంగ్లాదేశ్ లో ఎంతో ప్రసిద్ధమైన చాట్ ఆలూ టిక్కీ. కొన్ని చోట్లలో దీనిని ఆలూ ప్యాటీస్ అని కూడా అంటారు. టిక్కీ అంటే కట్లెట్ అని అర్థం. మాములుగా దీనిపై ఉల్లిపాయలు చల్లి చోలే (బఠాణి కరీ) తో సర్వ్ చేస్తారు. మరి ఎంతో రుచికరమైన ఈ చాట్ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు: 

  • బంగాళదుంపలు – 3
  • బ్రెడ్ స్లైసులు – 3
  • గరం మసాలా – 1 టేబుల్స్ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • జీరా పౌడర్ – 1/2 టేబుల్ స్పూన్
  • తరిగిన పచ్చి మిర్చి – 1
  • పసుపు పొడి – 2 చిటికెలు
  • నూనె
  • కొత్తిమీర

తయారీ విధానం:

  • ముందుగా బ్రెడ్ యొక్క కార్నర్స్ ని తీసేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తరువాత 3 బంగాళదుంపలను ప్రెషర్ కుక్ చేసి తోలు తీసి బాగా మ్యాష్ చేసుకొని అందులో తయారుగా ఉంచుకున్న బ్రెడ్ ముక్కలను కూడా వేసుకొని బాగా చూర్ణం చేసుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 తరిగిన పచ్చి మిర్చి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 చిటికెల పసుపు పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 తరిగిన ఉల్లిపాయలు, కొన్ని కొత్తిమీరలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న రౌండ్స్ గా చేసి కట్లెట్ షేప్ లో సిద్దంచేసుకోవాలి.
  • ఆ తరువాత పెనుము పై కొద్దిగా ఆయిల్ పోసుకొని కట్లెట్స్ ని రెండు వైపులా గోల్డెన్‌ బ్రౌన్ రంగు వచ్చే వరకు రోష్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ‘ఆలూ టిక్కీలు’ రెడీ!