Posted on

Telugu tips to make breasts grow and bigger – వక్షోజాల పరిమాణం పెరగాలంటే…

ఆకర్షణీయమైన స్తన సంపద  పొందాలనే కోరిక పురాతన కాలం నుండి ప్రారంభమైంది. ఆధునిక యుగంలో కూడా ప్రజలు, పెద్ద పరిమాణం మరియు నిండుగా ఉన్న రొమ్ములను  కలిగిన స్త్రీలకు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారు.

నేడు చాల మంది మహిళలు చాలా చిన్న రొమ్ములు కలిగి ఉన్నప్పటికీ  బాహ్య సౌందర్యాన్ని గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది.  అందువల్ల రొమ్ములు త్వరగా పెద్ద పరిమణంలోనికి  వృద్ధి చెందే మార్గాలను పరిశోధించారు.

రొమ్ముల పరిమాణం వివిధ కారణాల మీద ఆధారపడి ఉంటుంది. టీనేజ్ అమ్మాయిల రొమ్ములు కాస్త చిన్న పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఈ దశలో వారి శరీరం పూర్తిగా పరిపక్వం చెంది ఉండదు. కాబట్టి వారి రొమ్ము పరిమాణంలో మరింత అభివృద్ధి అవసరం. 30 ఏళ్ల వయస్సు దాటిన స్త్రీలు సరియైన స్తన పరిమాణంను ఆశ్వాదించగలరు.

రొమ్ము పరిమాణం ప్రతీ మహిళకి భిన్నంగా ఉంటుంది.  ఇది పలు కారకాలపై ఆధారపడి ఉంటుంది. వయస్సు , జన్యువులు మరియు హార్మోన్ల ప్రభావం అనేవి చిన్న లేదా పెద్ద స్తనాలను పొందడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎవరైతే అటువంటి చిన్న రొమ్ములని కలిగి ఉన్నారో లేదా వదులుగా ఉన్న రొమ్ములని కలిగి ఉన్నారో,  వాళ్ళందరి కోసం ఇక్కడ  అద్భుతమైన వివిధ మార్గాలను పొందుపరచడం జరిగింది.

రొమ్ములు పెద్దగా మరియు వేగంగా పెరుగుదలకు చిట్కాలు (Chest growth tips in Telugu)

పోషక పానీయం

మీరు రోజువారీగా పాలు మరియు బొప్పాయి రసం త్రాగితే రొమ్ములు వేగంగా పెద్దగా కావడానికి అవకాశాలు సాధ్యమవుతాయి. ఈ రెండు పదార్ధాలలో విటమిన్లు మరియు పోషక పదార్ధాలు మీ రొమ్ములు సైజుని  త్వరితంగా పెంచడానికి సహాయపడతాయి. మీకు రసం త్రాగటం ఇష్టంలేకుంటే తాజా బొప్పాయి తినడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

వ్యాయామం

కొన్ని ఛాతి మరియు చేతులకు సంబందించిన వ్యాయామాలు అనేవి మీ రొమ్ములను పెద్ద పరిమాణంలోకి పంపు చేయడానికి చాలా అవసరం. మీ రొమ్ములకు ఒత్తిడిని కలిగించే కొన్ని చేతి వ్యాయామాలను చేయడం ద్వారా అది మీ స్తన సంపద అభివృద్ధికి సహాయపడుతుంది.

సహజ సిద్ద మూలికలు

ప్రకృతిలో లభించే కొన్ని మూలికలు మీ రొమ్ములను అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించేందుకు సమర్థవంతంగా పనిచేస్తాయి. మీ రొమ్ములను విస్తరించడానికి కావాల్సిన కొన్నిహార్మోన్లు బయట దొరుకుతాయి. కానీ అవి కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. బదులుగా మీరు సహజ సిద్దమైన మూలికలు ఉపయోగించడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. .

ప్రోటీన్లు

ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు ఎంతో అవసరమని మనందరికీ తెలుసు. అందువల్ల శరీర నిర్మాణ వ్యవస్థకు మంచి మొత్తంలో గుడ్డు, మాంసము వంటి పోషకాలు  అవసరమవుతాయి. అదేవిధంగా రొమ్ములు  కూడా స్త్రీల కండరాలలో ఒక ప్రత్యేకమైన రకం. కాబట్టి పుష్టికరమైన రొమ్ములు పొందడానికి మీరు తగినంత ప్రోటీన్లను తీసుకోవాలి.

రొమ్ము క్రీములు

మార్కెట్ లో రొమ్ముల పరిమాణంను పెంచడానికి అనువుగా ఉండే వివిధ బ్రాండ్ల క్రీములు అందుబాటులో ఉన్నాయి.  మీరు మీ చర్మానికి సరిపడే క్రీములని ఎంచుకోవచ్చు. అవి మీ రొమ్ములని నిండుగా చేయటమే  కాకుండా వదులుగా ఉన్నవాటిని బిగుతుగా కూడా మారుస్తాయి.  కానీ ఈ క్రీములని ఎంచుకునే ముందు వినియోగదారుల మంచి అభిప్రాయాలు కలిగిన నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవడం మాత్రం తప్పనిసరి.

రొమ్ముల  పెరుగుదలలో సహనం

మీరు శస్త్రచికిత్స చేయించుకుంటే తప్ప మీ రొమ్ములు ఒక్క రోజులో పెద్దవిగా మరియు నిండుగా మారిపోవు.  ఒక స్త్రీ తన యవ్వనానికి చేరుకుంటున్నప్పుడు ఛాతికి రెండువైపులా స్తనాలు చాల కొంచెం కొంచెంగా అభివృద్ధికి చెందుతూ వస్తాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి జరిగే ఈ ప్రక్రియ కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువలన, రొమ్ము పెరుగుదలకు చిట్కాలు వర్తింపజేసిన తర్వాత ఫలితాన్ని పొందడానికి మహిళలకు సహనం ఉండటం చాలా అవసరం.

రొమ్ములను మర్ధనా చేయడం

ఆకర్షణీయమైన స్తన సౌందర్యాన్ని పొందడానికి ఉన్న సమర్థవంతమైన మార్గాలలో ఇది ఒకటి. మీరు ఒక ఖచ్చితమైన నూనెతో మీ రొమ్మును ఒక క్రమంలో మసాజ్ చేయగలిగితే, నిండుగా కనిపించే పెద్ద స్తనాలను పొందడం చాలా సులభం అవుతుంది. ప్రతి రోజూ నిద్రపోయే ముందు మీరు తప్పనిసరిగా దీన్ని చేయాలి. తద్వారా  కణజాలాలు సమృద్దిగా అభివృద్ధి చెంది  రొమ్ము పరిమాణం పెంచడంలో సహాయం చేస్తుంది.

మెంతులు

రొమ్ము పరిమాణం పెంచడంలో బాగా పనిచేసే సహజ మూలికల్లో ఇది  ఒకటి. ఇందుకోసం మీరు ఈ సహజ సిద్ద వనరు నుండి రసం సేకరించి రొమ్ము మీద మర్దనా చేయాల్సి ఉంటుంది. మీరు దీన్ని క్రమంగా చేయగలిగితే ఫలితంగా ఎంతో ఆకర్షణీయమైన స్తన పరిమాణంను చూడవచ్చు. ఇది ఒక సహజ మూలిక అయినందున మీరు ఎటువంటి దుష్ప్రభావాలను పొందరు.

మార్ష్ మాలో వేరు

మీరు నేరుగా మార్ష్ మాలో వేరుని పొందగలిగితే రొమ్ము పెరుగుదలకు ఒక అద్భుతమైన పరిష్కారం పొందినట్లే. కాని నేరుగా వేరు రూపంలో పొందడం అంత సులభం కాదు. కాబట్టి మీరు మార్కెట్లో మార్ష్ మాలో వేర్లుని పొందవచ్చు. ఇది  మీ రొమ్ము పరిమాణం మీద నిరూపిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు ఈ మూలిక ఉపయోంచిన తర్వాత మీ రొమ్ములు బిగుతుగా మారడం నేరుగా గమనిస్తారు.

అవిసె గింజలు

రొమ్ముల వృద్దికి ప్రభావ వంతంగా పని చేసే బాగా తెలిసిన మరో సహజ మూలిక అవిసె గింజలు. సరైన పరిమాణంలో అవిసె గింజలను ఉపయోగించిన తర్వాత మీరు సులభంగా మీ రొమ్ముల పరిమాణంలో కొన్ని మార్పులను పొందవచ్చు.

రొమ్ముల పరిమాణం పెంచడానికి మార్గాలు

స్తన విస్తరణకు సిరమ్

నేడు సౌందర్య పరిశ్రమ  ఎన్నో నూతన వైవిధ్య భరిత మార్గాలను ప్రవేశపెడుతోంది. రొమ్ముల అభివృద్దికి మరియు విస్తరించడానికి  ఎన్నో సిరమ్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో చిన్న రొమ్ములు కలిగిన స్త్రీలు కోరుకున్న ఫలితాన్ని ఎంతో త్వరగా పొందుతారు.

పెద్ద రొమ్ముల కోసం పుష్ అప్స్

మీ భర్త  అలాగే మీ కుటుంబంలోని ఇతర పురుష వ్యక్తులు  రోజూ పుష్ అప్స్ చేస్తూ వాళ్ళ ఛాతి విస్తరించడం మరియు బలమైన కండరాలు పొందడం మీరు చూస్తూ ఉంటారు.  అలాగే మహిళల విషయంలో కూడా విశాలమైన మరియు ఆకర్షనీయమైన రొమ్ములు పొందాలనుకునే వారికి పుష్ అప్స్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు  మీరు కుడా పుష్ అప్స్ ప్రారంబించి సహజ మార్గంలో పెద్ద రొమ్ములు  పొందడానికి మీ వంతు ప్రయత్నంతో ముందుకు సాగిపొండి.

బ్రా యొక్క ఎంపిక

మీరు చిన్న రొమ్ములను కలిగి ఉన్నప్పటికీ తగిన బ్రా ను  ఎంచుకున్నట్లయితే అది మీ స్తనముల పరిమాణం పెద్దగా కనిపించేలా సహాయం చేస్తుంది. ఎట్టి పరిస్థితి లోనూ వదులుగా లేదా పెద్దగా  ఉన్న బ్రా ను ఎంచుకోవడం చేయకండి. మీ రొమ్ముల పరిమాణం కంటే కాస్త చిన్న పరిమాణ బ్రా ఎంచుకోవడం వలన అది మీ రొమ్ములను క్రింది నుండి అదిమి పట్టుకుని ముందు వైపునుండి చూసేందుకు పెద్దగా కనిపించేలా చేస్తుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు

మీరు సాధారణంగా రెండు రకాల కొవ్వులు మనకి లభిస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఆరోగ్యకర కొవ్వులు మరొకటి సంతృప్తక కొవ్వులు. మనం ఆరోగ్యకర కొవ్వులని అనుసరించాల్సి ఉంటుంది. స్త్రీ  యొక్క రొమ్ము  కొవ్వు కణజాలంతో తయారైంది. పెరుగు, జున్ను, గింజలు , ఆలివ్ నూనె వంటి పదార్ధాలలో కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. మీరు ఈ కొవ్వులు తినగలిగితే రొమ్ము పరిమాణం పెంచడం సులభం అవుతుంది.