Posted on

Crispy fish fingers recipe in Telugu – ఫిష్ ఫింగర్స్ రెసిపీ

ఫిష్ ఫింగర్స్ ఒక అమెరికన్-కెనెడియన్ వంటకం. ఇది ఒక అద్భుతమైన అపటైసర్. లోపల ఎంతో మెత్తగా పై భాగంలో ఎంతో క్రిస్పీ గా ఉండే ఈ స్టార్టర్ ని పిల్లలు ఎంతో ఇష్టపడతారు. రుచితో కూడిన ఆరోగ్యకరమైన వంటని ఎవరైనా ఎందుకు వద్దంటారు! మరి ఈ సులభమైన రుచికరమైన స్టార్టర్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం.

ముందుగా కావలసిన పదార్థాలు

  • శుభ్రం చేసిన చేపలు
  • గుడ్లు – 2
  • కార్న్ ఫ్లార్ – 1 కప్పు
  • బ్రెడ్ క్రంబ్స్ – 1 కప్పు
  • డ్రై కార్న్ ఫ్లేక్స్ – 1 కప్పు
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత
  • కార్న్ ఫ్లేక్స్ మిక్శ్చర్ – 1 కప్పు

తయారీ విధానం

  • ముందుగా చేపలను బాగా శుభ్రం చేసి నిలువుగా చిన్న ముక్కలుగా కోసి ఫ్రీజర్ లో 15 నిమిషాలు ఉంచాలి.
  • కార్న్ ఫ్లేక్స్ మిక్శ్చర్ ని మిక్సీ లో వేసి పొడి చేసుకొని ఒక కప్పులో సిద్ధంగా ఉంచుకోవాలి.
  • అలాగే గుడ్లను కూడా కొట్టి బాగా కలిపి ఒక కప్పులో సిద్ధంగా ఉంచుకోవాలి.
  • 15 నిమిషాల తరువాత స్టవ్ పై ప్యాన్ లో డీప్ ఫ్రై కి తగినంత నూనెని పోసుకోవాలి.
  • నూనె వేడిగా అయిన తరువాత కట్ చేసుకున్న ఫిష్ ముక్కలను ముందుగా గుడ్డులో ముంచి, తరువాత కార్న్ ఫ్లార్ లో ముంచి, ఆ తరువాత బ్రెడ్ క్రంబ్స్, ఆ తరువాత డ్రై కార్న్ ఫ్లేక్స్ మిక్శ్చర్ లో ముంచి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • అలా అన్ని స్లైసెస్ ని కూడా ఫ్రై చేసుకున్న తరువాత వాటిపై నిలువుగా తరిగిన ఉల్లిపాయలు మరియు నిమ్మరసంను చల్లుకుంటే ఎంతో రుచికరమైన ‘ఫిష్ ఫింగర్స్’ రెడీ!