Posted on

Gravy arbi sabji in Telugu – గ్రేవీ ఆర్బీ సబ్జి / గ్రేవీ చేమగడ్డ సబ్జి రెసిపీ

విటమిన్ ఎ అధికంగా ఉండే చేమగడ్డలు మీ కండరాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తోడ్పడుతుంది. చేమగడ్డలతో తయారు చేసే ‘గ్రేవీ ఆర్బీ సబ్జి’ ఒక ఫేమస్ కాశ్మీరీ రెసిపీ. అధిక కారంతో పాటు పెరుగును కూడా జోడించి దీనికంటు ఒక ప్రత్యేక రుచితో ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్స్ చేస్తుంది. పూర్తి న్యూట్రిషన్స్ తో కూడిన రుచికరమైన ఈ గ్రేవీ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • చేమగడ్డలు
  • నూనె – 2 టీ స్పూన్
  • ఆవాలు
  • అల్లం వెలుల్లి పేస్ట్
  • పచ్చి మిర్చులు – 1
  • రెడ్ చిల్లీ పౌడర్ – 2 టీ స్పూన్లు
  • ఉల్లిపాయల పేస్ట్ – 1 కప్పు
  • టొమాటోలు – 2
  • జీరా పొడి – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1 చిటికె
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • మాంగో పౌడర్ – 2 టీ స్పూన్లు
  • పెరుగు – 1 కప్పు
  • కసూరి మేతి

తయారీ విధానం

  • ముందుగా చేమగడ్డలను బాగా ఉడికించి తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు నూనె రాయకుండా ఫ్యాన్ లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ల నూనె, ఆవాలు, అల్లం వెలుల్లి పేస్ట్, 1 తరిగిన పచ్చి మిర్చులు వేసి 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 కప్పు ఉల్లిపాయల పేస్ట్ వేసి 10 నిమిషాలు వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 2 తరిగిన టొమాటోలు వేసి 2 నిమిషాలు వేయించాలి.
  • టమోటాలు బాగా కుక్ అయిన తరువాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 చిటికె పసుపు పొడి, 1 టీ స్పూన్ మాంగో పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి వేసి 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాలు వేయించాలి.
  • ఆ తరువాత 1 కప్పు పెరుగు వేసి 3 నిమిషాలు కుక్ చేయాలి.
  • ఈ మిశ్రమం బాగా ఉడికాక ఇంకొన్ని నీళ్లు పోసి ఉడికించి కసూరి మేతి ని చల్లి, 1 నిమిషం పాటు ఉడికించి, ఫ్రై చేసి ఉంచుకున్న చేమగడ్డలను కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
  • 2 నిమిషాల తరువాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి 1 నిమిషం తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ‘గ్రేవీ చేమగడ్డ సబ్జి’ తయారు!