Posted on

Dry arbi sabji recipe in Telugu – డ్రై ఆర్బీ సబ్జి / డ్రై చేమగడ్డ సబ్జి రెసిపీ

నోరూరించే వంటలలో చేమగడ్డ సబ్జి కూడా ఒకటి. దూర ప్రయాణాలప్పుడు కూడా దీనిని తయారు చేసి ప్యాక్ చేసి తీసుకెళ్లవచ్చు, ఎందుకంటే అంత తేలికగా పాచిపోవు, చాలా సమయం వరకు తాజాగా ఉంటుంది. మీరు దీనిని భోజనంలో గాని లేదా అల్పాహారంగా గాని చేసుకోవచ్చు. మరి తయారు చేసే విధానాన్ని చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 2 టీ స్పూన్
  • ఇంగువ – 1/4 టీ స్పూన్
  • ఆవాలు – 1 టీ స్పూన్
  • తురిమిన అల్లం – 2 టీ స్పూన్
  • వినిగర్ – 1 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1 టీ స్పూన్
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • మాంగో పౌడర్ – 2 టీ స్పూన్

తయారీ విధానం

  • ముందుగా చేమగడ్డలను బాగా ఉడికించి తోలు తీయాలి.
  • లాంగ్ స్లైసెస్ గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె, 1/4 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ తురిమిన అల్లం వేసి 3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఇపుడు అందులో 1 టీ స్పూన్ వినిగర్ వేసి కలుపుకోవాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు పొడి వేసి 2 నిమిషాల పాటు సన్నని మంటలో ఫ్రై చేయాలి.
  • ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ మాంగో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇంకొన్ని నీళ్లు పోసి 3 నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తరువాత కత్తిరించిన కొన్ని కొత్తిమీరను వేసి బాగా కలపాలి.
  • ముందుగా ఉడికించి ఉంచుకున్న చేమగడ్డలను కూడా అందులో వేసి బాగా కలుపుకుంటే వేడి వేడి రుచికరమైన ‘డ్రై చేమగడ్డ సబ్జి’ రెడీ!