Posted on

Vegetable fried rice recipe in Telugu – వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

డిన్నర్‌కి హోటల్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం ఆర్డర్ చేసే డిష్ ‘ఫ్రైడ్ రైస్’. అది ఎంతో కష్టమైన డిష్ మరియు ఇంట్లో చేసుకోడం కుదరదని చాలా మంది అభిప్రాయం. కానీ నిజానికి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో డిన్నర్ పార్టీ సమయంలో ఎంతమందికైనా తొందరగా చేయగల డిషస్ లో ఇది కూడా ఒకటి. మరి ‘వెజ్ ఫ్రైడ్ రైస్’ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నెయ్యి – 3 స్పూన్
  • వెల్లుల్లి ముక్కలు – 6
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • పచ్చి బఠానీలు – 1/2 కప్పు
  • తరిగిన ఎల్లో కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన బీన్స్ – 1/2 కప్పు
  • తరిగిన రెడ్ కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన గ్రీన్ కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన క్యారట్  – 1/2 కప్పు
  • ఉప్పు
  • అన్నం
  • బ్లాక్ పెప్పర్ పౌడర్ – 1 స్పూన్
  • సొయా సాస్ – 1 స్పూన్

తయారీ విధానం

  • ముందుగా ఒక ప్యాన్ లో 3 స్పూన్ల నెయ్యి వేసికొని, నెయ్యి బాగా కరిగిన తరువాత 6 వెల్లుల్లి ముక్కలను, 1 తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1/2 కప్పు తరిగిన ఎల్లో కాప్సికం, 1/2 కప్పు తరిగిన బీన్స్, 1/2 కప్పు తరిగిన రెడ్ కాప్సికం, 1/2 కప్పు తరిగిన గ్రీన్ కాప్సికం, 1/2 కప్పు తరిగిన క్యారట్ వేసుకొని 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతూ 2 నిముషాలు ఫ్రై చేయాలి.
  • మూత వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి.
  • ఆ తరువాత ఉడికించిన బియ్యం అనగా అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సొయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  • అవసరమైతే కావల్సినంత ఉప్పుని కూడా చేర్చుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేస్తే ఎంతో రుచికరమైన ‘వెజ్ ఫ్రైడ్ రైస్’ తయారు!