
ప్రతి ఒక్కరికి సులువుగా లభించే బంగాళదుంపలు మరియు గుడ్లను ఉపయోగించి ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. వీటితో తయారు చేసే గ్రేవీ రుచితోపాటు పూర్తి న్యూట్రిషన్ ని కూడా అందిస్తుంది. చపాతీ, పూరి, రోటి లేదా పరోటాకు సైడ్ డిష్ కొరకు ఎంతో రుచికరమైన ‘ఆలూ ఎగ్ కరీని’ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు
- నూనె
- గుడ్లు – 3
- ఉప్పు
- జీరా – 1 టీ స్పూన్
- తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
- గరం మసాలా – 1 టీ స్పూన్
- పసుపు పొడి – 2 చిటికెలు
- రెడ్ చిల్లీ పౌడర్ – 1 టీ స్పూన్
- ధనియాల పొడి – 1 టీ స్పూన్
- తరిగిన టమోటాలు – 1 కప్పు
- బంగాళదుంపలు
- అల్లం మరియు వెల్లుల్లి
- మిరపకాయ – 1
- కొత్తిమీర
తయారీ విధానం
- ముందుగా 3 గుడ్లను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ పై ఫ్యాన్ ని ఉంచి 4 టీ స్పూన్ల నూనె, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
- ఆ తరువాత అందులో కొద్దిగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలపాటు దోరగా వేయించుకోవాలి.
- అందులో 2 చిటికెల పసుపు పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి.
- తరువాత 1 కప్పు తరిగిన టమోటాలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
- టమోటాలు బాగా కుక్ అయ్యాక అందులో 100 మిల్లీ లీటర్ల నీళ్లు పోసి బాగా ఉడికించాలి.
- ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా వేసి బాగా కలుపుకోవాలి.
- పై మిశ్రమం బాగా ఉడుకుతున్న సమయంలో కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
- మరోసారి 100 మిల్లీ లీటర్ల నీటిని పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉరికించాలి.
- ఆ తరువాత అందులో 1 తరిగిన మిరపకాయలు, కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేడుకొని బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
- మరోసారి తగినన్ని నీళ్లు (50 మిల్లి లీటర్లు) పోసి 2 నిమిషాలు వేయించి, మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచికరమైన ‘ఆలూ ఎగ్ కరీ’ రెడీ!