Posted on

జుట్టు రాలే సమస్య కు చిట్కాలు – Hair fall control tips

జుట్టు రాలడం అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. దీని పట్ల ఎంతోమంది  నిరాశగా ఉన్నారు.  దువ్వెన ఉపయోగించిన ప్రతీసారీ జుట్టు చాలా మొత్తంలో రాలిపోతూ ఉంటుంది. ఇది నిజంగా ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ ధోరణి పురుషుల్లో బట్టతల రావడానికి ముందస్తు చిహ్నంగా చెప్పవచ్చు. నేడు ఈ సమస్య ఒక ప్రత్యేక వయస్సు వారికి మాత్రమే పరిమితమైనది కాదు. వయస్సుతో నిమిత్తం లేకుండా 15 సం. నుండి 50 సం . వరకు ప్రతి ఒక్కరూ చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా ఎదుర్కొంటున్న సమస్యగా మారింది.  మీరు తల స్నానం చేసి వచ్చాక రాలిన మీ జుట్టు స్నానపు గదిలోని నీటి గ్రిల్ చుట్టూ చేరి నీరు అక్కడ స్థంభించిపోవడం చూస్తుంటారు. అదే సమయంలో మీ జుట్టుని ఆరబెట్టడానికి ఉపయోగించే తువ్వాలు మీద ఎంతో జుట్టు రాలి మీకు కనిపిస్తుంది.

జుట్టు రాలటాన్ని నిరోధించడానికి చిట్కాలు

  • మీ జుట్టు విషయంలో మీరు మరింత సాధు స్వభావాన్ని కలిగి ఉండాలి. జుట్టుని ఎంతో సున్నితంగా చూసుకోవాలి. జుట్టు తడిగా ఉండేటప్పుడు దువ్వెన ఉపయోగించడం మానుకోవాలి.
  • మీ జుట్టుకి సరైన పోషకాలు అందించడానికి మీ జుట్టు పైభాగ చర్మం మీద రోజువారీగా  కొంతసేపు మృదువుగా మసాజ్ చేయడం మంచిది.  పైభాగ చర్మం మర్దన చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరచబడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కనిపించేటట్లు సహకరిస్తుంది.
  • మీ జుట్టుని స్టైలిష్ గా కనిపించేందుకు దాన్ని బిగుతుగా పట్టి ఉంచేలా చేసే విధానాలకు స్వస్తి చెప్పాలి. ఇది మీ జట్టులోని ప్రతి వెంట్రుక మీద ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా జుట్టు కుదుళ్ళు పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.
  • ప్రస్తుత  ప్రజలు తమ జుట్టు స్టైలిష్ గా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  మీరు బాగా కనిపించడానికి  మరియు  సరికొత్తగా మిమ్మల్ని చూపించకోవడానికి ఒక మంచి హెయిర్ స్టైల్ పొందడం అనేది ఎంతో అవసరంగా మారింది. కాబట్టి మీరు ఇంటికి తిరిగి రాగానే మీ జుట్టు నుండి కాస్మొటిక్స్ మరియు వివిధ రకాల జెల్స్ ని తొలగించి నూనె మర్దన ద్వారా తప్పని సరిగా సరైన పోషణలు సమకూర్చాలి. సాధ్యమైనంత వరకు మీ జుట్టుకు తక్కువ ఉష్ణ చికిత్స అందించడం మంచిది.
  • వాతావరణం బయట చాలా చల్లగా ఉన్నప్పటికీ కూడా వేడి నీటితో జుట్టుని తడపకూడదు. జుట్టు రాలిపోవడానికి ఇది మరొక కారణం అవ్వొచ్చు. వేడి నీటి వలన మీ జుట్టు త్వరగా పొడిబారిపోయే అవకాశం ఉంది. తద్వారా మీ జుట్టు కుదుళ్ళు పగిలిపోయి జుట్టు రాలే సమస్యకు దారితీస్తుంది.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకొనుటకు గృహ చిట్కాలు

కొబ్బరి పాలు

కొబ్బరి గుజ్జు నుండి సహజంగా సేకరించిన పాలు జుట్టు రాలే సమస్యను నియంత్రించడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. కొబ్బరి పాలు జుట్టుకి పోషణ అందించడంలో సహాయపడుతుంది. కొబ్బరి గుజ్జుని ముక్కలుగా కోసి బాగా మిక్సీ పట్టండి. ఆ ధ్రవాన్ని ఒక మెత్తటి వస్త్రంలో వేసి బాగా పిండి దాని నుండి కొబ్బరి పాలని సేకరించండి. ఇప్పుడు ఆ కొబ్బరి పాలని కుదుళ్ళకి పట్టించి బాగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు.

వేప చికిత్స

వేప మొక్క మీ చర్మానికే కాదు జుట్టుకి కూడా మంచిగా పనిచేస్తుంది. ఇది క్రిమినాశకరం మరియు వైరస్ అలాగే బ్యాక్టీరియా ప్రభావాలను నిర్మూలిస్తుంది. కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని వాటిని మంచి నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. తీసుకున్న నీటికి సగం అయ్యేంత వరకు మరగపెట్టాలి అలా నీరు పచ్చ రంగు లోకి మారుతుంది. ఇప్పుడు ఆ నీటిని చల్లార్చి మాడుకి బాగా పట్టించి మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఉసిరి

నిస్తేజంగా మరియు బలిహీనంగా ఉండే జుట్టుకు చికిత్స చేయటానికి మహిళలు దశాబ్దాలుగా ఉసిరిని ఉపయోగిస్తున్నారు. ఎండబెట్టిన ఉసిరిని తీసుకుని వాటిని కొబ్బరి నూనెలో మరగబెట్టాలి. ముదురు నల్ల రంగులోకి మారేంత వరకూ దానిని మరగనివ్వాలి. అప్పుడు దానిని చల్లార్చి జుట్టు కుదుళ్ళ నుండి చిగుర్ల వరకు పూర్తిగా పట్టించాలి. ఇది జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి మరొక సమర్థవంతమైన చిట్కాలలో ఒకటి.