Posted on

Importance of drinking water for health care in Telugu – నీరు – మీరూ..

నీటిని గంగా జలంతో పోలుస్తారు. అంతేకాక నీటిని ప్రాణ ధారగానూ భావిస్తారు. నీటి గురించి తెలియనివారే దానిని అశ్రధ్ధ చేస్తారేకానీ నీటి విలువ తెలిసిన వాళ్ళు అంటూ ఉంటే ఖచ్చితంగా దాని విలువ గుర్తించాల్సిందే! నీరు ఎక్కువా త్రాగితే ఎంతో ప్రయోజనం, అదే తక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే అనారోగ్యాలు అజీర్ణం, మలబద్దకం, తలనొప్పి, కిడ్నీలో రాళ్ళు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ప్రతి రోజూ తగుమోతాదులో నీరు సేవించాలి. అన్నింటి కి దివ్య ఔషధం నీరు. శరీరములో జరిగే మెటబాలిక్ చర్యల్కు నీరు అతిముఖ్యము. చాలా మందికి తెలియకునా నీరు, నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరి చేరవు.

శరీరము లొ రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది. మానవ శరీరములోని ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడంలో నీరు భూమిక వహిస్తుంది. నీటిలో క్లోరిన్‌, ఇయోడి్న్‌, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళ లో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యం గానే ఉంటాడు. నీరు త్రాగే వారు కోసం అనేక అభిప్రాయాలు మా దగ్గరున్నాయి. ఉదాహరణకు భోజనం సమయంలో నీరు త్రాగడం వల్ల అజీర్ణం సమస్య తొలగిపోతుంది. ఎక్కువ నీరును సేవించడం ఆరోగ్యానికి చాలా మేలు. ఇటువంటి అభిప్రాయాలు చాలానే ఉన్నాయి. నీరు నుండి పొందే ప్రయోజనాలు ఎంటో మనం తెలుసుకుందామా..!

1. మనిషికి రోజుకు 2.5-3.0 లీటర్ల నీరు అవసరము మరియు ఆరోగ్యము. కొంత నీరు మనము తినే ఘన పదార్డ ఆహారము నుండి లభిస్తుంది… మిగతాది త్రగావలసిందే. ఒక మనిషి రోజుకి ఎంత నీరు త్రాగాలి అంటే: సుమారుగా మనిషి బరువు కిలోగ్రాములలో/30= లీటర్లలో. ఉదా: మనిషి బరువు=60 కి.గ్రా. రోజూ త్రాగవలసిన నీరు= 60/30= 2.0 లీటర్లు). (సుమారు అటు.. ఇటు గా)

2. ఈ అభిప్రాయం చాలా రోజుల నుండి మన మధ్య ఉంది. అయితే అధి నిజం కాదు. భోజనం మధ్యలో కొద్దిగా నీరు త్రాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగి, జీర్ణ వ్యవస్థ యొక్క జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అంటే భోజనానికి ముందు నీళ్ళు తాగకూడదు. నీళ్ళు తాగితే జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. అలాగే భోజనానంతరం కడుపారా నీటిని సేవించడం వలన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.

3. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది, శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. అవి మంచి నీళ్లయితే అంతా మంచిదే! కానప్పుడు! కాలుష్య కారకాలతో నిండినవైనప్పుడు? అనారోగ్యాలు కమ్ముకొంటాయి. ప్రాణాంతక వ్యాధుల్లో అధిక శాతం అపరిశుభ్రమైన జలాల కారణంగానే వ్యాపిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. మరి ఈ సమస్యని నియంత్రణలో ఉంచడానికి మార్గమేదీ అంటే.. అత్యధిక మందికి అందుబాటులో ఉన్నవి నీటి శుద్ధి పరికరాలు (వాటర్‌ ప్యూరిఫైయర్లు). వీటి పనితీరుపై చక్కటి అవగాహన కలిగి, ఎంపికలో తగు జాగ్రత్తలు పాటిస్తే వందశాతం స్వచ్ఛమైన జలాన్ని స్వీకరించడం ఈ రోజుల్లో సాధ్యమనే చెప్పొచ్చు.

4. కొన్ని పరిశోధన ప్రకారం ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఆరోగ్యానికి అపాయమే అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ నీరు శరీరం గ్రహించడం వల్ల శరీరంలో ఉండే రక్తంలో ఉన్న సోడియం అంశాలను తక్కువ చేస్తుంది. కిడ్ని ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది.దాంతో అనారోగ్య బారీన పడాల్సి వస్తుంది. కాబట్టి అధిక నీరు అంటే పది గ్లాసుల కంటే ఎక్కువ నీరు త్రాగకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి.

5. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రకరకాల జబ్బులు చోటుచేసుకుంటాయి. నీరు తక్కువగా తీసుకోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి, శరీరంలో అనేక జీవక్రియలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలంటే శరీరానికి సరిపడా నీరు త్రాగాలి.

5. ఆకలిని చంపేయగల శక్తి నీటికి ఉంది. నీరు బాగా తాగితే భోజనం తక్కువగా తింటారు. ఫలితంగా లావెక్కే అవకాశం తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం రెండు గ్లాసులు నీరు తాగండి. అలాగే పడుకునే ముందు రాత్రి వేళ మరో మూడు నాలుగు గ్లాసుల నీరు తాగండి. శరీరం నుండి మలినాలు విసర్జించడంలోను నీరు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. శరీరం నీటిని చెమట, మూత్రాల రూపంలో నష్టపోతుంది. ఈ నష్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని త్రాగి భర్తీ చేయాలి.

6. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న పలురకాల విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి.

7. నీరు తాగడం అన్నది ఆరోగ్యానికే కాదు, అందానికీ కూడా అత్యవసరం. వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాత కూడా తప్పనిసరిగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

8. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే శరీరంలో నీటిశాతం సక్రమంగా ఉండాలి. మన శరీరంలో నీటిశాతం సరిగ్గా లేకపోతే.. చర్మం ముడతలు పడటం, చర్మ సమస్యలు, వంటివి ఏర్పడతాయి. అందుకే మన శరీరంలో 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. ఇందుకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు సేవించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

9. శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్త పోటు ను తగ్గించును.

10.గాయాలను మానే (హీలింగ్ ప్రొచెస్స్) పక్రియను ఉత్తేజ పరచును.