
తెలుగు వారి సాంప్రదాయక తీపి వంటకం ‘మడత కాజా’. ఈ స్వీట్ ని ప్రత్యేకంగా దీపావళి లాంటి పండుగ సమయాలలో తయారు చేసుకుంటారు. క్రిస్పీ మరియు జూసీ టేస్ట్ ఈ స్వీట్ యొక్క ప్రత్యేకత. మరి ఎంతో టేస్టీ స్వీట్ ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు
- మైదా – 1 కప్పు
- చక్కెర – 1 కప్పు
- బట్టర్ – 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
- నూనె – డీప్ ఫ్రై కి తగినంత
తయారీ విధానం
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ కరిగించిన బట్టర్ వేసి గెడ్డలు లేకుండా పొడిగా కలుపుకోవాలి.
- తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- ఆ పిండిని 5 నిమిషాల పాటు పక్కకు పెట్టి, ఆ తరువాత చిన్న బాల్స్ లా చేసి, చపాతీ రోలర్ తో పల్చగా చపాతీలా తిక్కుకోవాలి.
- రెండు చపాతీలు తీసుకొని ఒకదాని మీద మరొకటి వేసి మడత కాజాకు కావలసిన వెడల్పుతో చపాతీని రోల్ చేసుకోవాలి.
- ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాజాలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- స్టవ్ పై ప్యాన్ లో డీప్ ఫ్రై కి కావలసినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తరువాత కాజాలను ఫ్రై చేసుకోవాలి.
- బాగా ఫ్రై అయిన తరువాత వాటిని తీసి ఒక ప్లేట్ లో పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు, చక్కెర పాగు తయారు చేసేందుకు ఒక ప్యాన్ లో 1 కప్పు నీళ్లు, 1 కప్పు పంచదార వేసి చక్కెర బాగా కరిగే దాకా కలుపుతూ వేడి చేయాలి.
- అందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి పాకం చిక్కబడేదాకా వేడి చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
- ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాజాలను ఆ పాకంలో వేసి కాసేపు నాననిస్తే ఎంతో తియ్యని జూసీ మడత కాజాలు రెడీ!