Posted on

Telugu fairness tips for men – పురుషులకు ఫెయిర్‌నెస్ టిప్స్

వినడానికి వింతగా అనిపించినా కొన్ని నిజాలు నమ్మక తప్పదు, అందరు మనల్ని, కళ్ళు ఆర్పకుండా చూస్తూ,మనం ఎంతో గొప్ప వాళ్ళం అని మన అందాన్ని ఆధారంగా  చేసుకునే నిర్ణయించుకుంటారు.

మనం ఎంత ధనవంతులమైన, గొప్పవారిమైన అందంగా లేకపొతే దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే ప్రమాదం ఉంది.ఎంతోమంది అనుకుంటారు అందం, దాని సం రక్షణ, కేవలం ఆడవారికే అని, అది చాల తప్పు, మగవారు కూడ అందంగా ఉండాలి, అప్పుడే ఎదుటివారు గౌరవిస్తారు.

మీ అందం గురించి దాని రక్షణ గురించి తెలుసుకునే ముందు అసలు మీ చర్మం ఏ రకం,జిడ్డుగల చర్మమా, పొడి గల చర్మమా, లేదా సాదారణ చర్మమా,సుర్యకాంతి వల్ల ఇబ్బంది కలిగే రకమా, ఇలా ముందుగా మీ చర్మం యొక్క రకాన్ని తెలుసుకుని దానికి తగిన పద్దతులలో,అందంగా చేసుకోవాలి.

మిమ్మల్ని అందంగా చేసి,అందరూ కళ్ళు ఆర్పకుండా చుసేలా ఏమి చేయాలో  తెలుసుకుందామా:

ముఖాన్ని శుబ్రపరుచుకోవాలి:

మీరు బాగా బద్దకం కలిగి ఉండి, చర్మ సౌందర్యం కోసం అంతగా ఆలోచించని వారైననూ, రోజూ మీ ముఖాన్ని “ఫేస్ వాష్” తో కాని, ఏదైన “క్రీం” తో కాని శుబ్రం చేసుకోవడం ఎంతోఅవసరం.ముందుగా మీ చర్మం యొక్క తత్వాన్న్ని తెలుసుకుని, తగిన క్రీం ని మాత్రమే ఉపయోగించాలి.సబ్బుని వాడకపోవడం ఎంతో మంచిది, ఎందుకంటే ఒక ఫ్రాన్స్ రచయిత్రి రచించిన “బ్యూటీ” అనే పుస్తకంలో సబ్బు గురించి ఇలా వర్ణించారు,”సబ్బు యొక్క ప్రభావం మెడ కింది బాగం లో ఉన్న చర్మానికే ఉపయోగ పడుతుంది” అని,

అందుకే సబ్బు కన్నా  రోజూ మీ ముఖాన్ని “ఫేస్ వాష్” తో కాని, ఏదైన “క్రీం” తో కాని శుబ్రం చేసుకోవడం ఎంతోఅవసరం.

చర్మంలోని మార్పు ఎంతో అవసరం:

మన చర్మంలోని కణాలు ఎప్పటికప్పుడు మారుతూ, చనిపొయిన చర్మ కణాలను తొలగిస్తూ ఉండాలి.దీని వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.

ఇటీవల ఒక అధ్యయనంలో ఆడవారి కన్నా మగవారు అధిక శాతం యవ్వనంగా కనిపిస్తారు, ఎందుకంటే దానికి కారణం మగవారు షేవ్ చేసుకునే ప్రతీసారి వారి చర్మంలోని కణాలలో మార్పు వస్తూ, కొత్త కణాలు పుడతాయి.

సన్ స్క్రీన్

ప్రముఖ చర్మ సం రక్షణ నిపుణులు, చర్మ రోగ నిపుణులతో ” Oprah Winfrey’s publication ‘O’” వారు ఒక ప్రముఖ టాక్ షో నిర్వహించారు.అందులో ప్రతీ ఒక్కరు మన చర్మానికి సన్ స్క్రీన్ ఎంతో ఉపయోగకరం అని సూచించారు.

అయితే మనం బయటకు వెళ్ళే 30 నిమిషాల ముందు “సన్ స్క్రీన్ SPF 15” ఉపయోగించుట అవసరం, చాలా జగ్రత్తగా వాడాలి.

ఎక్కువసేపు బయట ఉండేవారు  SPF 30 ఉపయోగించుట మంచిది.

షేవ్ లేదా కత్తిరించండి

మగవారిలో జుట్టు పెరుగుదల సాధారణంగా ఉంటుంది, ఎక్కువగా షేవ్ చేసుకోవలసిన అవసరం లేదు, కాని మీరు చేసుకునే అప్పుడు మాత్రం ఒక్కసారి అన్నీ సరిచూసుకోండి. మంచి “రేజర్”, క్రిములను నాశనం చేసి మృదువుగా చేసే జల్ కాని క్రీం కాని ఉపయోగించండి. ఆల్కహాల్ లక్షణాలు ఉన్న వాటిని దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇవి మన చర్మంలో ఉన్న సహజ నూనెలను కరిగించేసి మన ముఖాన్ని పొడిగా,నిర్జీవంగా, అందవికారంగా తయారు చేస్తాయి.

మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచండి

సాధారణంగా మగవారి చర్మం స్త్రీల కన్నా ఎక్కువ జిడ్డు కలిగి ఉంటుంది, అందువల్ల ఎక్కువ శాతం ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. మన చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచే “మాయిశ్చరైజర్ లేదా క్రీమ్” ని వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. షేవింగ్ మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే, షేవ్ చేసుకున్న తరువాత, లేదా పడుకునే ముందు మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ ఉపయోగిస్తే ఎంతో మంచిది. మనం పైన అనుకున్న విదంగా చేయడం కోసం,ఖరీదైనవి వాడవల్సిన పని లేదు, మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం అనేదే, మంచిదే,అలోచించి, ఆచరించండి.