Posted on

Migraine tips in Telugu – మైగ్రేన్ లక్షణాలు, కారణాలు, నివారణా మార్గాలు

పల్లెల్లో ఒంటి చెంపపోటు అనే మాట వింటుంటాం, దానినే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటాం. ఇది తలలో తీవ్రమైన నొప్పిని కలిగించి అనేక ఇతర లక్షణాలను చూపుతుంది. ఇంగ్లీష్లో మైగ్రేన్ అని పిలువబడే ఈ పార్శ్వపు తలనొప్పి మనకు కొత్త కాదు. ఈ సమస్య ప్రతి నలుగురు ఆడవారిలో ఒకరికి, మరియు 12 మంది పురుషులలో ఒకరికి కలుగుతుంది. ఈ తలనొప్పి యొక్క కారణాలు మరియు నివారణ పద్ధతుల గురించి వివరంగా చూద్దాం.

మైగ్రేన్ అంటే ఎమిటి? వాటి లక్షణాలు

రక్తనాళాలు, నరాలు మరియు మెదడుకు చెందిన జీవరసాయన పదార్థాల్లో మార్పుల వలన మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఇది దీర్ఘకాలిక నరాల వ్యాధి, ఇది తరచూ తలనొప్పికి దారితీస్తుంది. ఈ తలనొప్పి 2 గంటల నుండి 72 గంటల వరకు ఉంటుంది. కొందరిలో మైగ్రేన్ సమస్య బాల్యంనుండే ఏర్పడవచ్చు, మరి కొందరిలో వయోజనంలో ఏర్పడవచ్చు. మైగ్రెయిన్ రెండు రకాలు :

 • కామన్ మైగ్రేన్
 • క్లాసిక్ మైగ్రేన్

కామన్ మైగ్రేన్ లో, తలనొప్పి ఒక వైపున మొదలవుతుంది మరియు మొత్తం తలంతా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు, ఇది రెండు వైపులా మొదలవుతుంది. వికారం, వాంతులు, అనారోగ్యం మొదలైన ఇతర లక్షణాలను చూపుతుంది. అధిక శాతం ప్రజలు కామన్ మైగ్రేన్‌తో బాధపడుతుంటారు.

క్లాసిక్ పార్శ్వపు నొప్పి ప్రతి నలుగురిలో ఒకరికి కలుగుతుంది. ఈ మైగ్రెయిన్ దృశ్య సౌరభం కలిగిస్తుంది. పై చెప్పిన క్లాసిక్ పార్శ్వపు తలనొప్పి లానే ఇతర లక్షణాలను కూడా చూపుతుంది.

మైగ్రేన్ లక్షణాలు

 • సాధారణంగా మైగ్రేన్ వలన ప్రాణహానీ ఉండదు, అయినప్పటికీ ఇది రావటం వలన కాంతి మరియు శబ్ద సున్నితత్వం పెరుగటం, కడుపులో వికారంగా ఉండటం, వాంతులు అవటం మరియు ఆకలి లేకపోవటం లాంటి ఇబ్బందులు కలగచ్చు.
 • నొప్పి యొక్క వ్యవధి 2 నుండి 3 రోజులు వరకు ఉంటుంది.
 • తలనొప్పి యొక్క ఒత్తిడి తేలికపాటి నుండి మాడరేట్ మరియు తీవ్రంగా పెరుగుతుంది.

మైగ్రేన్ యొక్క కారణాలు?

మైగ్రేన్ సమస్యకు దారితీసే కారణాలు అనేకం ఉంటాయి. ఇవి వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. కొన్ని సహజ కారణాలను చూద్దాం.

 • ఆహారపు అలవాట్లలో మార్పులు , నిద్ర సమస్యలు మైగ్రేన్ కు ప్రధాన కారణాలు.
 • ఎండలో తిరగడం కూడా మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. అదే కాకుండా, భారోమెట్రిక్ ప్రెజర్, అధిక ఉష్ణోగ్రత మరియు ఇతర వాతావరణ మార్పులు కూడా ఈ తలనొప్పికి దారితీస్తుంది.
 • మహిళల్లో హార్మోన్ల మార్పుల వలన వారి ఋతు చక్రం సమయంలో మైగ్రెయిన్ తలనొప్పి వస్తుంది.
 • ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేయడం వలన కలిగే ఒత్తిడి, ఆందోళన, షాక్ మరియు ఉద్రిక్తత పార్శ్వపు తలనొప్పిని ప్రేరేపించడానికి ప్రధాన కారణాలు.
 • సరైన నిద్ర లేకపోవడం లేదా రోజులో తొమ్మిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.
 • నిర్జలీకరణం, మద్యం సేవించటం వలన కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.
 • ధూమపానం, బిగ్గరగా శబ్దాలు, శబ్దంతో కూడిన వాతావరణం, బలమైన వాసనలు, కొన్ని పర్యావరణ కారణాలు మైగ్రెయిన్ను ప్రేరేపించవచ్చు.
 • ఎక్కువ కెఫిన్ తీసుకోవటం వలన కూడా కొందరిలో మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుందని నమ్మకం. కెఫిన్ తీసుకొన్న కొన్ని గంటల తర్వాత మైగ్రేన్ తలనొప్పి సంభవించవచ్చు.
 • ఎక్కువ సౌండు పెట్టుకొని హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వినడం వలన దీర్ఘకాలంలో ఇది మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.
 • పాస్తా వంటి ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.
 • రక్తంలో చక్కెర పెరుగుదల మరియు తగ్గుట కారణంగా తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది
 • కొన్ని గంటల వరకూ ఏమీ తినపోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పి రావచ్చు. బ్రేక్ ఫాస్ట్‌ను తినకపోవడం ఒక చెడు అలవాటు. ఎక్కువ మంది ప్రజలు ఈ కారణం వలనే అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు.

డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి?

క్రింద చెప్పిన తలనొప్పి లక్షణాలు కనపడిన వెంటనే మీరు వైద్య సహాయం పొందాలి.

తీవ్రమైన తలనొప్పితో పాటు:

 • బలహీనత, మైకము లేదా కళ్ళు తిరిగి పడిపోవడం, తిమ్మిరి లేదా జలదరించటం, లేదా మీ శరీరాన్ని కదిలించలేక పోవటం
 • మాట్లాడలేక పోవటం, గందరగోళంగా ఉండటం, వ్యక్తిత్వ మార్పులు, లేదా ప్రవర్తనలో మార్పులు
 • మసక చూపు, డబుల్ విజన్ లేదా బ్లైండ్ స్పాట్స్
 • ఫీవర్, శ్వాస తగ్గిపోవటం, మెడ గట్టిగా కావటం లేదా దద్దుర్లు రావటం
 • రాత్రిలో నిద్ర లేపేటువంటి తలనొప్పి
 • వికారం మరియు వాంతులు
 • ఆక్సిడెంట్ లేదా హెడ్ ఇంజురీ తరువాత కలిగే తలనొప్పి

మైగ్రేన్ సమస్యను తొలగించేందుకు హోమ్ రెమెడీస్

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు కొన్ని ఇంటి నివారణ పద్దతులను చూద్దాం.

లెవెండర్ నూనె

లెవెండర్ యొక్క వాసన చాలా బాగుంటుంది, అంతే కాదు ఇది మైగ్రేన్ తలనొప్పిని కూడా తొలగిస్తుంది. మీరు ఈ నూనెని తలపై రాయవచ్చు లేదా రెండు లేదా మూడు చుక్కల లెవెండర్ నూనెని ఒక బౌల్ వేడి నీటిలో వేసుకొని ఆవిరిని పీల్చండి.

ఆపిల్ సీడర్ వినిగర్

వినిగర్లో శరీరంలోని విషపదార్థాలను తొలగించటం, రక్తపోటును నియంత్రించటం, రక్తంలోని చక్కెర స్థాయులను కంట్రోల్ చేయటం, బరువు తగ్గించటం, ఎముకల నొప్పిని తగ్గించటం మరియు మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగించటం లాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా ఇది మైగ్రేన్ తల నొప్పిని కూడా తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్‌ని మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజూ త్రాగండి.

కైయేన్ పెప్పర్

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ఇది చాలా గొప్ప ఇంటి నివారిణి. ఇది మీ రక్త ప్రసరణను ప్రేరేపించి మెరుగుపరుస్తుంది. ఇందులోని క్యాప్సైసిన్సహజంగా నొప్పిని తగ్గిస్తుంది. ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ కైయేన్ పెప్పర్‌ని కలుపుకొని ఇందులో కొద్దిగా తేనె మరియు నిమ్మరసాన్ని చేర్చి త్రాగండి.

చమోమిలే టీ

చేమంతిలో యాంటీ-పాస్మోడిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మరియు సూతింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు తోడ్పడుతుంది. మీరు జర్మన్ చమోమిలే టీని ఉపయోగించినట్లైతే వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు. మీకు ఎప్పుడు తల నొప్పిగా అనిపించినా ఒక కప్పు చమోమిలే టీని త్రాగండి.

అల్లం

అల్లంలోని ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనం ఇన్ఫ్లమేషన్ను తగ్గించి హార్మోనులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది కండరాలను సంకోచ పరిచి మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. అనేక నాన్ స్టెరాయిడ్ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇలాగే పనిచేస్తాయి. మైగ్రేన్ తలనొప్పినుండి నివారణ పొందేందుకు పచ్చి అల్లం రసాన్ని లేదా అల్లం టీ త్రాగండి.

ఫివర్ ఫ్యూ

ఫివర్ ఫ్యూ అనే మొక్కలో పార్థేనాలిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తొలగించి, మంటను తొలగించటమే కాకుండా ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లను న్యూట్రలైజ్ చేసి నొప్పిని తొలగిస్తుంది. ఒక స్పూన్ ఫివర్ ఫ్యూ ఆకులను మరియు ఒక స్పూన్ పుదీనా ఆకులను ఒక కప్పు నీటిలో వేసి అరగంట తరువాత వడగట్టి ఈ నీటిని రోజంతా త్రాగండి.

ఆపిల్

మీకు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఆపిల్ తినటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. పచ్చ ఆపిల్ యొక్క వాసన పీల్చడం వలన కూడా నొప్పి యొక్క ప్రభావం తగ్గుతుంది.

కాఫీ

కాఫీ త్రాగటం వలన మీ మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఇందులోని కెఫిన్ నొప్పిని కలిగించే రిసెప్టర్లను నిరోధించి రక్తనాళాలను నియంత్రిస్తుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోని త్రాగితే ఇంకా ప్రభావితంగా ఉంటుంది.

అవిసె గింజలు

మైగ్రేన్ తలనొప్పి ఇన్ఫ్లమేషన్ వలన కలుగుతుంది. ఒమేగా-3 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వలన ఈ నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ చికిత్సకు అవిసె గింజలను తినవచ్చు లేదా వీటి నూనెని ఉపయోగించవచ్చు.

బక్వీట్

ఇందులోని ఫైటోకెమికల్స్ లో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది మైగ్రేన్ హెడ్ఏక్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది.

బాదాం

మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు మందులకు బదులుగా బాదాం తినండి. ఎందుకంటే తలనొప్పిని తగ్గించేందుకు మందులలో వాడే సాలిసిన్ అనే రసాయనం బాదాం లో ప్రాకృతికంగా లభిస్తుంది. ఇది నొప్పిని తగ్గించి మైగ్రేన్ రాకుండా నిరోధిస్తుంది.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్‌ని తీసుకోవటం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గటమే కాదు, మీ రక్తపోటును తగ్గిస్తుంది, మీ హృదయం యొక్క లయలను స్థిర పరుస్తుంది. ఈ చర్యలు చివరికి మైగ్రేన్ తలనొప్పిని నిరోధించడానికి సహాయపడుతుంది.

బట్టర్ బర్

మాములు తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పులను తొలగించేందుకు అమెరికాలో బట్టర్ బర్ అనేది సాంప్రదాయంగా ఉపయోగించే ఒక ఔషధం. ఈ ఆధునిక కాలంలో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది నొప్పిని తగ్గించటమే కాదు, శరీరంలో ఈ నొప్పికి కారణం అయిన కొన్ని రసాయనాలను కూడా తగ్గిస్తుంది. దీనిని కేవలం సప్లిమెంట్ రూపంలోనే తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇతర రూపంలో విషపూరితం.

మెగ్నీషియం

పరిశోధకులను బట్టి తరచుగా మైగ్రేన్ హెడ్ఏక్ తో బాధపడే వారు మెగ్నీషియం టాబ్లెట్స్ ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు వారి మెదడులో తక్కువ స్థాయి మెగ్నీషియం ఉంటుంది. కొందరిలో మామూలుగానే తక్కువ స్థాయి మెగ్నీషియం ఉండే అవకాశం ఉంటాయి.

చల్లని లేదా వేడి ఒత్తిడి

చల్లని మంచు ముక్కలను గుడ్డలో చుట్టి తలపై ఒత్తండి, లేదా హాట్ బాగ్ ఉపయోగించండి. చాలా మందికి తెలియక పోయినప్పటికీ ఇది మైగ్రేన్ ని తొలగించేందుకు మంచి నివారణ పద్దతి.

5-HTP

శరీరం 5-HTPని ఉత్పత్తి చేయడానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైగ్రేన్ తలనొప్పి తరచూ రాకుండా మరియు దాని యొక్క తీవ్రతను తక్కువ చేస్తుంది.5-HTP ‘సెరోటోనిన్స్థాయులను సంతులనం చేయడం ద్వారా ఈ తలనొప్పిని తొలగిస్తుంది. అయినప్పటికీ, మీరు 5-HTP తీసుకోవడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.

కోఎంజైమ్ Q10

ఇది ఒక యాంటీఆక్సిడెంట్. శరీరంలో దీని యొక్క స్థాయిని బట్టి రక్తనాళాల యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఆక్సిడేషన్ వలన కలిగే నష్టాలనుండి రక్త కణాలను కాపాడుతుంది, రక్తంలో చక్కెర స్థాయులను స్థిరీకరిస్తుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్ చాలా ఆహార పదార్థాలలో లభిస్తుంది. మీరు మాత్రల రూపంలో తీసుకోవాలని అనుకుంటే, ముందుగా మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది.

విల్లో బెరడు

ఇందులోని సాలిసిన్ఒక నొప్పి నివారణ సమ్మేళనం. మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ఇది ఒక ఉత్తమ సహజ నివారిణి.

ద్రాక్ష

ద్రాక్ష ఫల రసం మైగ్రేన్ నొప్పి తొలగించేందుకు సమర్థవంతమైన నివారిణి. మీరు మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందాలనుకుంటే, ప్రతి రోజూ కనీసం రెండు సార్లు ద్రాక్ష ఫల రసాన్ని త్రాగాలి. దీనిని రుచికరంగా చేయాలనుకుంటే అందులో నీరు లేదా తేనె చేర్చవచ్చు.

క్యాబేజ్ ఆకులు

క్యాబేజీ ఆకులు మైగ్రేన్ తలనొప్పికి ఒక మంచి గృహ నివారిణి. మీరు కొన్ని క్యాబేజీ ఆకులను బాగా దంచి వాటిని ఒక వస్త్రంలో ఉంచాలి. పడుకునేముందు మీ తల చుట్టూ ఈ వస్త్రాన్ని కట్టుకోండి. తల నొప్పి నుండి పూర్తి ఉపశమనం పొందే వరకూ ఇలా చేయాలి.

ప్రింరోజ్ ఆయిల్

దీని యొక్క యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వలన ఇది మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ప్రభావితమైన నివారిణి. ఇది మెదడులో బిగువుగా ఉండే కణాలనుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఈ నూనెని మీరు ఇంట్లోనే తయారుచేయవచ్చు లేదా దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ నూనెని నుదిటిపై రాయవచ్చు లేదా నీళ్ళు మరియు తేనెతో కలిపి త్రాగవచ్చు.

గంధపు చెక్క పేస్ట్

మీరు రోజూ రాత్రి పడుకునే ముందు గంధపు చెక్క పేస్ట్‌ని తలపై రాయండి. మీ నొప్పి తగ్గిన తరువాతే దీనిని కడగవచ్చు.

గోరింటాకు పేస్ట్

మీకు ఎప్పుడు తలనొప్పిగా అనిపించినా గోరింటాకు చెట్టు పువ్వులను వినిగర్తో కలిపి ఒక పేస్ట్‌లా చేసుకొని రాత్రి పడుకునేముందు తలపై రాసుకోండి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం వలన, ఇది మైగ్రేన్ తలనొప్పికి మంచి నివారిణి. మీరు వెల్లుల్లి పేస్ట్‌ను సిద్ధం చేసి తలపై రాయండి లేదా కొన్ని వెల్లుల్లిని నమలండి. నిరంతరం మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వలన మైగ్రేన్ తలనొప్పిని నివారించవచ్చు.

ఆవాల నూనె

తలలో నొప్పి ఉన్న వైపు ఈ నూనెని రాయండి. ఇది మీ మైగ్రేన్ తలనొప్పిని తక్షణమే తొలగిస్తుంది. ఒక వారం పాటు రెండు నుండి మూడు సార్లు ఈ విధానాన్ని అనుసరించండి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ తో స్నానం

కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వెచ్చని నీటిలో కలుపుకొని స్నానం చేయండి లేదా స్పాంజుతో శరీరంపై రాయండి. ఇది తక్షణమే మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.

రాస్ప్బెర్రీ లీఫ్ టీ

ఋతు స్రావం సమయంలో మహిళలకు ఇది ఒక ఉత్తమమైన మందు. ఎరుపు రాస్ప్బెర్రీ లీఫ్ టీ త్రాగితే మీ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటమే కాదు ఇతర రోగ లక్షణాలను కూడా తొలగిస్తుంది.

తులసి

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు తులసి యొక్క వాసన లేదా తులసి నూనె యొక్క వాసన మాత్రమే చాలు. ఇది శరీరం యొక్క కండరాలను శాంతి పరచటమే కాదు ఒంటి నొప్పులను కూడా తొలగిస్తుంది. మీకు ఎప్పుడు తలనొప్పిగా ఉన్నా తులసి ఆకులను నమలండి లేదా తులసి నూనెని తలపై రాయండి.

పుదీనా

పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ మైగ్రేన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను రుబ్బి రసం తీయాలి. ఈ రసాన్ని మీ నుదురుపై పూసుకోవాలి. అలాగే ఒక కప్పు వేడి బ్లాక్ టీ లో కొన్ని పుదీనా ఆకులను వేసి 10 నిముషాలు నానబెట్టిన తర్వాత త్రాగితే మీకు మైగ్రేన్ నుంచి విముక్తి లభిస్తుంది మరియు త్వరిత ఉపశమనం పొందొచ్చు. పుదీనా ఆకులలో ఉండే వాసన రక్త నాళాలకు ప్రశాంతంతను చేకూరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వాటర్ లేదా బాదం నూనెలో మూడు టేబుల్ స్పూన్ల పిప్పర్ మింట్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో అప్‌లై చేయండి. అలాగే పుదీనా ఆకులతో నేరుగా కూడా మర్దన చేసుకోవచ్చు. దీంతో తక్షణ ఉపశమనం కలుగుతుంది.

వలేరియన్

ఇది మీ శరీరానికి ఉపశమనాన్ని అందించి, మైగ్రేన్ తలనొప్పి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

ధనియాలు

వేడి నీటిలో ధనియాలను వేసి బాగా ఉడికించి ఈ నీటి ఆవిరిని పీల్చండి. ఇది మైగ్రేన్ నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. లేదా వట్టి ధనియాలను నోటిలో వేసుకొని నమలండి లేదా వంటలో ఎక్కువగా వాడండి.

మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారం

మెగ్నీషియం అధిక స్థాయిలో ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అన్ని రకాల పార్శ్వపు నొప్పులూ తగ్గిపోతాయి. అలాగే రుతుక్రమం సరిగ్గా లేకపోవడంతో వచ్చే మైగ్రేన్ కూడా ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తగ్గిపోతుంది. పాలకూర, చిలకడదుంపకు, క్వినోవా, పొద్దుతిరుగుడు విత్తనాలు, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు వంటి వాటిలో మెగ్నిషియం అధికస్థాయిలో ఉంటుంది.

విటమిన్ బీ2

విటమిన్ బీ2 కలిగి వున్న ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మైగ్రేన్ను ఈజీగా తగ్గించుకోవచ్చు. మీరు రోజుకు 400 మిగ్రా విటమిన్ B2 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయితే ఇది మైగ్రేన్ వచ్చినప్పుడు తీసుకుంటే ఫలితం కొంత వరకే ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ మరియు విటమిన్ ఆహారాలను దీర్ఘకాలం తీసుకోవాలి. మీరు కనీసం మూడు నెలల పాటు విటమిన్ బీ2 ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉంటే మీకు మైగ్రేన్ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది.

బటర్బర్గ్ హెర్బ్

బటర్బర్గ్ దీర్ఘకాలంగా మైగ్రెన్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. బటర్ ఆకులు మైగ్రేన్ తగ్గించడంలో ఎంతో ప్రభావితంగా పని చేస్తాయి.

గ్లూటెన్ ఫ్రీ డైట్

గ్లూటెన్ ఫ్రీ ఆహారాలను తినటం వల్ల మైగ్రేన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. గోధుమ, బార్లీ, వోట్స్, జొన్న వంటి ఆహారాలు ఈ కోవకు చెందినవి. అందువల్ల వీలైనంత వరకు గ్లూటెన్ ఫ్రీ ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి.

హైడ్రేటెడ్ గా ఉండండి

డీహైడ్రేషన్ అనేది మైగ్రేన్ రావడానికి ఒక ముఖ్య కారణం. శరీర వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే నీరు చాలా అవసరం. అందువల్ల మీరు వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగండి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. దీంతో మీరు మైగ్రేన్కు దూరంగా ఉండొచ్చు.

డిటాక్స్ బాత్

డిటాక్స్ అంటే నిర్విషీకరణ (విషాలను తొలగించటం లేదా విషాలకు గురికాకుండా చేయటం). డిటాక్స్ బాత్ మీరు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఆయిల్స్ కలుపు కోవడం వల్ల ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఆపిల్ సీడర్ వినిగర్‌ను మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ఆయిల్స్ ను కూడా స్నానం చేసే వాటర్ లో కలుపు కోవటం వలన మంచి ఫలితాలుంటాయి.

డోంగ్ క్వాయ్

వీటి యొక్క వేర్లు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. మీరు చేయవలసిందల్లా మీ నుదుటిపై డాంగ్ క్వాయ్ కలిగి ఉన్న క్రీమ్‌ను రాయండి. లేదా వేర్లను నీటిలో వేసి బాగా ఉడికించి ఈ నీటిని వడి గట్టి కొద్దిగా తేనెని కలిపి త్రాగండి.

ఐస్ ప్యాక్

మైగ్రేన్ తగ్గించడంలో ఐస్ సహాయపడుతుంది. మీరు మీ మెడపై ఐస్ ప్యాక్ ఉంచుకోవడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే చల్లని ఐస్ నీటిలో గుడ్డను ముంచి, కొన్ని నిమిషాలపాటు మీ తలపై ఉంచుకోవాలి. మెడ, భుజాలు, నుదుటి మీద ఐస్ ప్యాక్ తో మసాజ్ చేసుకోవడం వల్ల మైగ్రేన్ ఈజీగా తగ్గుతుంది.

ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్ కూడా మందుల్లానే పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి కోసం మీరు చేసుకునే ఆక్యుపంక్చర్ వలన దీర్ఘ కాలపు దుష్ప్రభావాలు ఉండవు.

ధ్యానం

ధ్యానం ఒత్తిడిని తగ్గించే ఒక మార్గం మాత్రమే కాక, తలనొప్పిని ఎదుర్కోవటానికి ఒక ఉత్తమమైన పద్దతి. రోజూ ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి.

లోతైన శ్వాస తీసుకోండి

ప్రతీ ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా లోతైన శ్వాసలను తీసుకోవాలి. మీకు మైగ్రేన్ హెడ్ఏక్ రాబోతుందని అనిపిస్తే మెల్లగా లోతైన శ్వాసలను తీసుకోండి, ఇది మీకు ఉపసమానాన్ని ఇస్తుంది. అంతే కాదు కొన్నిసార్లు నొప్పి రాకుండా నివారించగలదు.

చీకటి గదిలో విశ్రాంతి తీసుకోండి

మైగ్రేన్ తలనొప్పి వచ్చిన సమయంలో ఒక ప్రశాంతమైన, చీకటి గదిలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. నిద్ర పోతే ఇంకా మేలు. దీంతో నొప్పి తగ్గుతుంది. కొంత మందికి కడుపులో వికారంగా అనిపించి వాంతి చేసుకుంటారు. అలా వాంతి అయిన తరువాత, వారి తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

పై చెప్పిన ఇంటి నివారణలు మీకు ఉపశమనాన్ని కలిగించకపోతే చిరోప్రాక్టర్ని సంప్రదించండి. వీరి సూచనలు మరియు వైద్యం ద్వారా నొప్పియొక్క ప్రభావాన్ని మరియు ఆవృతిని తగ్గించవచ్చు.

మైగ్రేన్ సమయంలో తినకూడని ఆహారాలు

ఒక వ్యాధిని నివారించాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవటంతో పాటు ఆ వ్యాధిని ప్రేరేపించే ఆహారాలు ఏమిటని తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం.

చాక్లెట్

చాక్లెట్ తినటం వలన కొందరిలో ఎటువంటి రియాక్షన్ చూపనప్పటికీ మరి కొందరిలో తలనోప్పిని అధికరిస్తుందని నమ్మకం. కనుక వీటిని నివారించటం మంచిది.

బీర్ మరియు రెడ్ వైన్

ఇవి ఆల్కహాల్ పదార్థాలు. దీనిని ఎక్కువగా తీసుకోవటం వలన కొన్ని గంటల తరువాత మీ తలనొప్పి ఇంకా తీవ్రమవుతుంది.

సలామీ

కాంటినెంటల్ వంటకాల్లో చేర్చబడి ఈ సలామీ వలన కొందరిలో తలనొప్పి పుట్టవచ్చు. ఇది ప్రతి ఒక్కరినీ బాధించినప్పటికీ కొందరిలో తీవ్రమైన నొప్పికి కారణం అవుతుంది. కనుక ఈ పదార్థాన్ని నివారించటం మంచిది.