Posted on

Telugu tips for piles – మూల శంఖ

మీరు పైల్స్ లేదా మూల వ్యాధితో బాధపడుతున్నప్పుడు మల ప్రాంతంలోను మరియు కండరాలకు కలిగిన నష్టానికి సంబంధించిన చికిత్సకు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లోపభూయిష్టముగా వ్యవహరించే ఎన్నో విషయాలలో మరింత ఉత్తమమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పైల్స్ యొక్క నొప్పి మరియు లక్షణాలు మీరు కలిగి ఉండి వాటిని నిర్ధారించుకున్నట్లయితే మీ జీవనశైలి, ఆహారం మరియు టాయిలెట్ అలవాట్లలో క్రింద పేర్కొన్న మార్పులను అమలు చేయడంలో ఖచ్చితంగా ఉండండి.

మీరు చేసుకున్న ఈ చిన్న మార్పులు సహజ విధానంలో మీ శరీర వ్యవస్థను సరిచేయడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ విధానాలు ప్రస్తుత పరిస్థితి యొక్క క్షీనతని నిలుపుదల చేసి త్వరగా నయం చేయటానికి దోహదపడుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపర్చబడి స్వయంగా ఆరోగ్య శుద్దీకరణకు సిద్ధమవుతుంది. తద్వారా మీ శరీరం మరింత సులభంగా మూలా వ్యాధిని నయం చేసుకునే అవకాశం కలుగుతుంది. అందులో ముఖ్యమైనవి కొన్ని మీకు అందిస్తున్నాం.

వేడి నీటి చికిత్స

పైల్స్తో బాధపడుతున్న రోగులు వాపు కండరాలకు ఉపశమనం కలిగించడానికి 15 నిముషాల పాటు వెచ్చని నీటిలో కూర్చుని ఉండాలి. ఇది నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ప్రేగు కదలిక తరువాత ప్రత్యేకంగా చేయాలి.

కలబంద

కలబంద నొప్పిని తగ్గించే గుణంతో పాటుగా శోథ నిరోధకతను కలిగి ఉంది. మీరు పైల్స్ మీద స్వచ్ఛమైన ముడి రూపంలో ఉన్న కలబందను రాయడం వలన ఆ ప్రాంతం యొక్క నొప్పి మరియు వాపు నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.

ఎప్సమ్ ఉప్పుతో గ్లిజరిన్

చేరొక టేబుల్ స్పూనుచొప్పున గ్లిజరిన్ మరియు ఎప్సమ్ ఉప్పులను కలిపి ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. 20 నిముషాలు దానిని వదిలేయండి. నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ప్రతీ ఆరు గంటలకొకసారి ఇలా చేస్తూ ఉండండి.

శీతల వత్తిడి

ఒక మృదువైన పత్తి వస్త్రంలో కొన్ని ఐస్ ముక్కలను వేసి, పాయువులోని ఎర్రబడిన కండరాలకు వద్ద నొప్పి నుండి ఉపశమనం కొరకు సున్నితంగా రాయండి. ఈ శీతల వత్తిడి చికిత్స అనేది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ఉపశమనం కలిగించడంలో సహాయకారిగా ఉంటుంది. నొప్పి మరియు వాపు రెండింటినీ తగ్గించడానికి సహాయం ఈ పద్దతి సహాయం చేస్తుంది. మరింత మంచి ఫలితాలను పొందడానికి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ విధానాన్ని పునరావృతం చేయండి. కానీ ఐస్ ముక్కలని నేరుగా చర్మంపై వాడకూడదని గుర్తుంచుకోండి.

పైల్స్ఉపశమనానికి ఆహారపు నియమాలు

ఆహారం జీర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలం పాటు సరైన ఆహారం తీసుకోవడం అనేది పైల్స్ నయం చేయడానికి ఉత్తమ మార్గం. మూలవ్యాధి యొక్క మరింత తీవ్రతని నిరోధించడం మరియు సహజమైన పద్దతిలో నివారించడానికి పేర్కొన్న సరైన ఆహారం గురించి వివరాలను చూడండి.

మీ ఆహారంలో మరిన్ని కూరగాయలు మరియు పండ్లు చేర్చండి

పళ్ళు మరియు కూరగాయలు ప్రేగుల నిర్మాణం మరియు ప్రేగు కదలికకు సహాయపడే పీచు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. మీ జీర్ణవ్యవస్థ మొక్కల ఉత్పత్తులను, ముఖ్యంగా కూరగాయలు మరియు పండ్లను తీసుకోవడం వలన మరింత మెరుగ్గా పని చేస్తుంది. అందువల్ల ఈ విషయంలో శ్రద్ధ కనబర్చడం వలన మీ జీర్ణవ్యవస్థ చాలా సులభంగా అభివృద్ధి చెందుతుంది. అందువలన మలబద్ధకం నయమవుతుంది తద్వారా పైల్స్తీవ్రత నిలుపుదల చేయబడుతుంది.

కొన్ని రోజులు మాంస ప్రోటీన్లకు గుడ్ బై చెప్పండి

చికెన్, మటన్, చివరికి గుడ్లు లాంటి మాంస ఉత్పత్తులు కూడా మీ జీర్ణవ్యవస్థని మరింత గజిబిజిలో పడేస్తాయి. కాబట్టి మీరు మూల వ్యాధితో బాధపడుతున్నప్పుడు జంతు మాంసపు ప్రోటీన్ల నుండి విరామం తీసుకోవడం చాల మంచిది. అదే విదంగా ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు మరియు పీచు పదార్ధాలతో వచ్చే ప్రణాళిక ఆధారిత ఆహార పదార్ధాలపై మరింత ఇష్టాన్ని కలిగి ఉండడం మంచిది.

అధిక మసాలా ఆహారముల నుండి దూరంగా ఉండండి

మీరు మూలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు కారం మరియు మసాలాలు ఖచ్చితంగా మీకు మంచివి కాదు. ఈ ఆహారం మీ శరీర జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది. అంతే కాకుండా పైల్స్ ను కూడా తీవ్రతరం చేస్తుంది. కాబట్టి మీరు ఈ పరిస్థితితో బాధపడుతున్నప్పుడు, తక్కువ మసాలా మరియు నూనె కలిగిన ఒక తేలికపాటి ఆహారం తీసుకునేలా మిమ్మల్ని మార్చుకోవడం ఉత్తమం.

ఎక్కువ నీరు త్రాగండి

మూలవ్యాధిని తీవ్రతరం కాకుండా నిరోధించడానికి ఉన్న ప్రభావవంతమైన మార్గాల్లో నీళ్లు త్రాగడం ముఖ్యమైనది. దీనివల్ల మీ శరీరం వాటిని కాలక్రమేణా నయం చేయబడుతూ ఉంటుంది. ఎక్కువ నీరు త్రాగుట జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే సులభంగా మలాన్ని జారీ చేయడంలో సహకరిస్తుంది.

మూల వ్యాధి చికిత్సకు మీరు మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు

సరైన మల విసర్జన అలవాట్లు మూల వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా నిలుపుదల చేయడానికి పటిష్టంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు అనుసరించాల్సిన కొన్ని విధానాలు మలబద్ధకం మరియు మూల వ్యాధి నుండి ఉపశమనం పొందడానికి ఇవ్వబడ్డాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

రోజూవారి వ్యాయామం మలబద్ధకం మరియు కఠిన మలాన్ని నివారంచడంలో అత్యంత ఉపయోగపడుతుంది. క్రమబద్ధమైన వ్యాయామం మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది అంతేకాక మీ సాధారణ ఆరోగ్యాన్ని మరింత మెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. మీరు అధిక వ్యాయామం చేయలేకపోతే మీరు ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు చురుకైన నడకను ప్రారంభించండి.

టాయిలెట్ లో గంటల కొద్దీ గడపవద్దు

మీరు టాయిలెట్ లో గంటల కొద్దీ గడపటం వలన మరియు బలంగా కండరాలను బిగిసి పట్టడం వలన మలాశయ కండరాలు వాపుకు గురి అయ్యి మరింత నొప్పి మరియు బాధను కలిగించే అవకాసం ఉంది. కనుక మీరు టాయిలెట్ లో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకుండా చూసుకోండి. మల ద్వారా కండరాలను ఒత్తిడి కలిగించకుండా జాగ్రత్త పడండి. రోజూవారిగా ఒక నిర్ధిష్ట సమయాన్ని ఏర్పరుచుకుని ప్రయత్నించండి. ఫలితాలు వెంటనే కనిపించకపోయినా క్రమేపీ మెరుగుదల కనిపిస్తుంది.

మలాన్ని నిర్భందించకండి

మీకు టాయిలెట్ కు వెళ్ళాలనిపించినప్పుడు వెంటనే వెళ్ళండి. దానిని నిర్భందించడం లేదా ఆపుకోవడం వంటివి తర్వత వత్తిడి కలిగించే విధంగా దారితీస్తాయి. కాబట్టి మీకు టాయిలెట్ కు వెళ్ళాలనిపించినప్పుడు మంచి ప్రదేశం లేదా సమయం కోసం ఎదురు చూస్తూ ఉండకండి.

ఒత్తిడితో పోరాడండి

ఒత్తిడి శరీరంలోని సహజ హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరమని తెలుసుకోండి. మానసిక విశ్రాంతి మీ జీర్ణాసాయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అందువలన ఒత్తిడి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

ఆకు కూరలు మీకు సహాయపడగలవు

ఆకు కూరలలో ఉండే పీచు పదార్ధాలు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల చికిత్స కోసం సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆకుకూరలు పీచు పదార్ధాలతో పాటుగా విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మంచి జీర్ణశక్తి మరియు శోషణలో సహాయం చేస్తుంది. తోట కూర, మెంతుకూర, పొన్నగంటి కూర, పాలకూర వంటి కొన్ని అకుకురాలను మీరు మీ ఆహారంలో ఎక్కువగా చేర్చాలి.

ఆకు కూరలతో పాటుగా టమాటో, దోశకాయ, ఉల్లిపాయలు, గుమ్మడికాయ, బ్రకోలి వంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు.