Posted on

Telugu tips for weakness – బలహీనతకు/వీక్నెస్ ఉత్తమ హోమ్ రెమిడీస్

కొందరు ఎటువంటి కారణం లేకుండా నీరసంగా మరియు బలహీనంగా ఉంటారు. ఉదయాన్నే నిద్ర నుండి లేచినప్పుడు, శారీరక బలం లేకపోవటం వలన బలహీనంగా భావిస్తారు. ఇలా ఉండటంవలన రోజువారీ ఆక్టివిటీస్ లో ఉత్సాహంగా పాల్గొన లేరు. కొన్ని నిమిషాలు పని చేసిన వెంటనే చాలా మందంగా, నిదానమైన అలసటతో బాధపడతారు.

మీరు కొన్ని వైద్య పరిస్థితులు లేదా శస్త్రచికిత్స నుండి తిరిగి వచ్చి ఉంటే, బలహీనంగా అనిపించవచ్చు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ప్రజలు చాలా బలహీనంగా ఉంటారు. అటువంటి వీక్నెస్ నుండి మునుపటి జీవనశైలిని తిరిగి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. వైద్యులు ఇటువంటి అలసటను తొలగించి బలాన్ని పెంచటానికి టానిక్స్, విటమిన్స్ మరియు ఖనిజాల వివిధ రకాల మందులను సూచిస్తారు. కానీ, అటువంటి  ఔషధాలను వాడకూడదనుకుంటే మీ నీరసాన్ని తొలగించే మరి కొన్ని విధానాలు ఉన్నాయి. అవే మన హోమ్ రెమెడీస్. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ ఆర్టికల్ లో మన వీక్ నెస్ ను తొలగించే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి చూద్దాం రండి.

బలహీనతకు గృహ నివారణలు

వివిధ పండ్లు మరియు కూరగాయలలోని అవసరమైన పోషకాల ద్వారా మీ శరీరానికి కావలసిన శక్తిని అందించవచ్చు. ఈ క్రింద చెప్పినవి కొన్ని గృహ నివారణలు :

జిన్సెంగ్

సాంప్రదాయ ఔషధం లో జిన్సెంగ్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి మరియు బలహీనంగా ఉన్నప్పుడు శక్తి స్థాయులను పెంచేందుకు సహాయపడుతుంది. ఈ హెర్బ్ యొక్క కామింగ్ మరియు సూతింగ్ లక్షణాలవలన ఇది మీ నరాలలో కూడా ప్రశాంతతను నింపేందుకు సహాయపడుతుంది, అంటే మీ నరాలను రిలాక్స్ చేస్తుంది.

జిన్సెంగ్ను ఉపయోగించడానికి, ముందుగా వీటి వేర్లను సన్నటి ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత సన్నటి మంటలో 3 కప్పుల నీటిలో ఈ వేర్ల యొక్క 8-10 ముక్కలను వేసి 15 నిముషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత వడగట్టి కొంత తేనెని కలుపుకోండి. వేడి చల్లారిన తరువాత త్రాగండి. ఇలా రోజుకు 1 లేదా 3 కప్పుల టీ త్రాగితే కావలసిన బలాన్ని పొందుతారు.

గమనిక: మీకు అధిక రక్తపోటు అనగా బీపీ ( బ్లడ్ ప్రెషర్ ) ఉన్నట్లయితే ఈ రెమెడీని వాడవద్దు. దయచేసి వేరే మార్గాలను ప్రయత్నించండి.

మ్యాంగోస్

మామిడి పండు చాలా తియ్యగా మరియు జ్యుసీగా ఉంటుంది. ఇది ఒక ఉష్ణ మండల పండు. ఇందులో ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కావలసిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ లు మరియు ఖనిజాలు చాలా ఉన్నాయి. ఇవి మెగ్నీషియం, కాపర్, పొటాషియం మరియు ఆహార ఫైబర్ యొక్క మంచి మూలం. శరీరంలోని ఆర్ బిసి స్థాయిని పెంచడం ద్వారా రక్తహీనత వంటి వ్యాధులను ఎదుర్కోవడంలో మామిడి లోని ఐరన్ కంటెంట్ సహాయపడుతుంది. ఇందులో స్టార్చ్ కూడా ఉంటుంది, ఇది చక్కెరగా మారి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు శక్తిని పెంచడానికి ఒక గ్లాస్ మామిడి మిల్క్ షేక్‌ను త్రాగండి. మీరు మామిడి పండుని ముడిగా కూడా తినవచ్చు లేదా కొంత తేనె, సాఫ్రాన్ మరియు ఏలకుల పొడిని జోడించి తీసుకోవచ్చు.

కాఫీ

కాఫీ ఒక ఎనర్జిటిక్ డ్రింక్ గా ఉపయోగించబడుతోంది మరియు మెదడును ఉత్సాహ పరిచేందుకు సహాయపడుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మోడరేట్ గా ఈ పానీయం తాగటం వలన ఎటువంటి హానీ లేదు. కాఫీ శరీరంలోని జీవక్రియను మెరుగుపరచడానికి మరియు ఓర్పు, దృష్టి మరియు నొప్పిని తట్టుకునే శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

గమనిక : రోజుకు రెండు కప్పులకన్నా ఎక్కువ కాఫీ ని త్రాగకూడదు. ఎందుకంటే అధిక కాఫీ త్రాగటం వలన నిద్ర లేమి మరియు ఆతురత యొక్క రిస్క్ పెరుగుతుంది.

బాదాం

విటమిన్ ఇ అధికంగా ఉండే నట్స్ లో బాదాం ప్రధానమైనది. దీన్ని తీసుకోవటం వలన సుదీర్ఘకాలం శక్తివంతంగా ఉండొచ్చు. శరీరంలోని కొవ్వు,  కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్‌లను కన్వర్ట్ చేయడంలో సహాయపడే మెగ్నీషియం కూడా బాదాం లో అధిక మోతాదులలో ఉంటుంది. మెగ్నీషియం యొక్క తేలికపాటి లోపం కూడా నిస్సత్తువకు కారణం అవుతుంది. ఆల్మండ్ లో మెగ్నీషియం అధికంగా ఉన్నందున ఇది  సహజంగా మీ బలహీనతను నిర్మూలిస్తుంది.

కొన్ని బాదాంలను నీటిలో వేసి రాత్రంతా నానపెట్టి ఉదయం వట్టి కడుపుతో తినండి. మీరు సుదూర ప్రయాణానికి వెళ్తునట్లయితే కావలసిన బలాన్ని మైంటైన్ చేసేందుకు దోరగా వేయించిన కొన్ని బాదాంలను ప్యాక్ చేసి తీసుకుని వెళ్ళండి. వీటిని అపుడప్పుడు తినండి.

భారతీయ గూస్బెర్రీ

భారతీయ గూస్బెర్రీ అనగా ఉసిరికాయలు. ఇది ఒక అద్భుతమైన సహజ పదార్ధం. ఇది మీ చర్మానికి మరియు జుట్టుకు చాలా మంచిది. ఎన్నో సంవత్సరాలుగా చర్మం మరియు వెంట్రుకలను ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచుకునేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, ఐరన్, ఫాస్ఫరస్ మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నందున, మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను సులభంగా బలపరుస్తాయి మరియు ఇందుమూలంగా మీరు బలహీనత నుండి విముక్తి పొందవచ్చు. మీరు తాజా భారతీయ గూస్బెర్రీ రసంను త్రాగండి, ఇది చాలా పుల్లగా ఉన్నట్లనిపిస్తే ఒక స్పూన్ తేనెని జోడించవచ్చు. రోజుకు రెండు నుండి మూడు సార్లు ఈ జ్యూస్ ని త్రాగితే మీరు సులభంగా శక్తిని పొందుతారు.

లికోరైస్

ప్రకృతి నుండి మరొక అద్భుతమైన మూలిక సారం లికోరైస్. ఇది మీ శరీర బలహీనత యొక్క వివిధ లక్షణాలతో పోరాడుతుందని నిరూపించబడింది. ఈ మూలికను తీసుకున్న వెంటనే మీ శరీరంలోని అడ్రినల్ హార్మోన్లను పెంపొందిస్తుంది మరియు మీ జీవక్రియను ప్రేరేపిస్తుంది.

ఒక టీ స్పూన్ పొడిచేసిన లికోరైస్ ను ఒక గ్లాస్ వెచ్చని పాలలో కలపండి. రెండు టేబుల్ స్పూన్ తేనెని కూడా కలిపి త్రాగండి. రోజుకు రెండుసార్లు ఈ మిశ్రమాన్ని త్రాగితే మీ శరీరానికి కావలసిన శక్తిని పొందుతారు.

పాలు

పాలు ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో సమాన మోతాదులలో శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయి. రాత్రి వేళలో మీకు ఆహారం తినాలని అనిపించకపోతే ఒక గ్లాస్ పలు త్రాగితే చాలు. మీ శరీరంలో భారీ బ్లడ్ లాస్ లేదా కట్స్ ఉన్నట్లయితే పాలను త్రాగమని సలహా ఇస్తారు ఎందుకంటే ఇది బ్లడ్ ను రీప్లేస్ చేసి శక్తిని పెంచుతుంది. పాలలో ఉండే విటమిన్ బి కండరాలు మరియు ఎముకలను ఎల్లప్పుడూ బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొంత మందికి పాల యొక్క బలమైన వాసన నచ్చదు. అటువంటి వారు, వారికి నచ్చిన ఫ్లేవర్ పొడిని పాలలో కలుపుకొని త్రాగవచ్చు. లేకపోతే ఒక చిటికె పసుపు మరియు ఒక స్పూన్ తేనె కలుపుకొని త్రాగండి. మీరు మీ శరీరంలో అధిక బ్లడ్ లాస్ తో బాధపడుతున్న సమయంలో ఇది ప్రభావితంగా పనిచేస్తుంది.

అరటి పండు

శరీరంలోని బలహీనతను తగ్గించడంలో చక్కెర సహాయపడుతుంది. అరటి పండులో సహజ గ్లూకోజ్ మరియు చక్కెర ఉన్నందున, ఇది మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. అరటి పండులో మన శరీరానికి కావలసిన శక్తిని అందించే పొటాషియం కూడా ఉంది. ప్రతి రోజు అరటిని తినటం వలన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపొందుతుంది.

నారింజ రసం

బలహీనత నుండి దూరంగా ఉండేందుకు సహాయ పడటంలో పండ్ల రసాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరెంజ్ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉన్నందున ఇది మన శరీరానికి కావలసిన బలాన్ని అందిస్తుంది. బలహీనతను నివారించేందుకు రెగ్యులర్గా నారింజ రసంను త్రాగండి.

స్ట్రాబెర్రీలు

ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచడానికి తక్కువ క్యాలరీలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇది ఒకటి. కణజాలంను రిపేర్ చేయడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. మీరు క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలను తినడం వలన మీ శరీరం ఫ్రీ రాడికల్స్ దాడి నుండి రక్షింపబడుతుంది. ఇందులో మీరు ఆరోగ్యంగా ఉండటానికి సరైన మోతాదులలో మాంగనీస్ మరియు ఫైబర్ ఉంటుంది. మీరు బలహీనంగా ఉన్నట్లు భావించినప్పుడు స్ట్రాబెర్రీ ఫల రసాన్ని త్రాగవచ్చు.

గుడ్లు

ఈ రోజుల్లో అందరి ఇంటిలో గుడ్లు స్టోర్ చేసుకొని ఉంటారు. గుడ్డలో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన సులభంగా జీర్ణం అవుతుంది. వీటిని ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. మీరు నీరసంగా ఉన్నట్లు భావించినప్పుడు గుడ్డు తినటం వలన ఫిట్ మరియు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. మీ బలాన్ని తిరిగి పొందేందుకు ప్రతిరోజు మీరు ఉడికించిన గుడ్డును తినవచ్చు.

వార్మ్ అప్ వ్యాయామం

కొన్నిసార్లు మీ శరీరంలోని అన్ని చోట్లలో తగిన ఎనర్జీ ఉండదు, ముఖ్యంగా భుజాలు, చేతులు, కాళ్లు మొదలైన చోట్లు. సరైన ఫిసికల్ వర్క్స్ చేయకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. కనుక బలాన్ని తిరిగి పొందేందుకు కొన్ని సులభమైన మరియు వార్మ్ అప్ వ్యాయామాలను చేయండి. ఇది మీ స్టామినాని కూడా పెంచుతుంది.

తులసి

తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా అధికంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పు తులసి టీ తాగడం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతం చేయడంతో బలహీనత నుండి ఉపశమనం పొందవచ్చు.

ఒక కప్పు నీటిలో తులసి ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి త్రాగండి. కావాలంటే కొంత తేనె కూడా చేర్చుకోవచ్చు. వట్టి తులసిని ప్రతి రోజూ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

కొబ్బరి నూనె

వంటలో మామూలు నూనెలకు బదులుగా కొబ్బరి నూనెని ఉపయోగించటం వలన ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఎఫెక్టివ్ గా శరీర బరువును తగ్గిస్తుంది మరియు ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఇది వీక్ నెస్ ను కూడా చాలా ఎఫెక్టివ్ గా తగ్గించి శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. కొబ్బరి నూనెని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది మరియు ఎనర్జీ లెవల్స్ పెరగడంతో వీక్ నెస్ తగ్గుతుంది.