Posted on

Telugu tips for leg pains & cramps – కాళ్లు, కీళ్ల నొప్పులు మరియు కాళ్ల తిమ్మిరిని వదిలించుకోవటం ఎలా?

వివిధ కారణాల వలన చాలా బాధాకరమైన కాళ్ల నొప్పి మరియు తిమ్మిరి వస్తుంది. ఇటువంటి ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స అవసరం. కొందరు ఔషధాల ద్వారా చికిత్స చేయాలని అనుకుంటారు కానీ రోజూ మందులను వేసుకోవటం మంచిది కాదు. దుష్ప్రభావాలను ఇచ్చే మందులకన్నా ప్రాకృతిక నివారణ చాలా మంచిది.

వివిధ రకాల కాళ్ల నొప్పులను చాలా మందిలో చూడవచ్చు. నొప్పియొక్క కారణాలు మరియు లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి తేడాగా ఉంటుంది. చిన్న నొప్పులకు చికిత్స అవసరం ఉండదు. అన్ని రకాల కాళ్ల నొప్పులను పరిష్కరించడానికి ఇంటి నివారణ పద్దతులను పాటించటమే ఉత్తమం.

కాళ్ల నొప్పికి సహజ నివారణలు

  • మంచు గడ్డలను నొప్పిగా ఉన్న చోటుపై కొద్ది సేపు ఉంచండి. ఇది చర్మం యొక్క స్పర్శ గుణాన్ని తగ్గించడం వలన నొప్పి తగ్గుతుంది.
  • ఎక్కువగా నీళ్లు త్రాగండి , పోషక ఆహారాలు, కాల్షియం మరియు పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తినండి.
  • కాళ్లను విస్తరించే వ్యాయామాలను చేయండి, ఇది మీ రక్త ప్రసరణను మెరుగు చేసి కాళ్ల నొప్పి నుండి ఉపశమనాన్నీ ఇస్తుంది.
  • పసుపు పొడి, నిమ్మరసం మరియు ఉప్పుని కలిపి ఒక ముద్దలా చేసుకొని నొప్పిగా ఉన్న కాళ్ల భాగాలపై రాయండి.
  • ఎక్కువగా హీల్స్ ఉండే చెప్పులను వేయకూడదు, వాటివలన నొప్పి ఎక్కువ అవుతుంది.
  • పచ్చ కాయకూరలు, క్యారెట్, చెరుకు, అరటి పండు లాంటి సమతుల్యమైన ఆహారాలని భుజించండి.

కాళ్లలో తిమ్మిరి మరియు నొప్పులు తగ్గించటానికి గృహ నివారణలు

సరైన బూట్లు వేసుకోవటం

నిరంతరం కాళ్ల నొప్పితో బాధపడుతున్నారా? అయితే మీరు మీ బూట్లను ఒకసారి పరీక్ష చేయండి. మీ కాళ్లకు సరిపడని బూట్లు లేదా హీనమైన గుడ్డలతో చేసిన బూట్లు మీ కాళ్లకు నొప్పిని పెంచుతాయి. అందువలన మీ బూట్లను మార్చి సరైనవి వాడండి.

ఈత (స్విమ్మింగ్)

సాధారణంగా నీళ్లలో ఈతకొట్టేటప్పుడు మన శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. కనుక ఇది మీ కాళ్లకు మరియు కీళ్లకు నొప్పి లేకుండా ప్రభావితమైన వ్యాయామంగా ఉంటుంది. ఈతలో మీ జాయింట్లకు ప్రయోజనకరమైన వివిధ భంగిమలను ప్రయత్నించండి.

యోగ

వ్యాయామ శాలకు (జిం)  వెళ్లి వ్యాయామాలను చేయటమే కాకుండా యోగాలను కూడా చేయటానికి ప్రయత్నించండి. ఇది మీ కాళ్లు మరియు జాయింట్ల (కీళ్లు) నొప్పిని తగ్గించడమే కాకుండా మీలోని ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. వ్యాయామాలు చేసేటప్పుడు మీ కాళ్ల పై తక్కువ ప్రభావం ఉండేలా చేయండి.

నడవడం

కాళ్లు నొప్పిగా ఉన్నాయని నడవడం మానకూడదు. ఎక్కువ దూరం నడవ లేక పోయినా వీలైనంతవరకు నడవాలి. దీని వలన కాళ్లలోని కండరాలకు విశ్రాంతిగా ఉంటుంది. నడిచిన తరువాత కొద్దిగా మర్దన (మసాజ్) చేయండి.

మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తినాలి

గర్భిణి స్త్రీలకు, మరి కొందరికి నిద్రలో కాళ్ల నరాలు లాగటం వలన క్రామ్ప్స్( తిమ్మిరి) వస్తుంది. అలాంటి వాళ్ళు మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం మంచిది. ఉదాహరణకు గింజలు మరియు విత్తనాలు.

పసుపు

పసుపులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. ఇది కాళ్ల నొప్పి మరియు క్రామ్ప్స్ ను కూడా తగ్గించగలదు. పసుపులో యాంటీ -ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించుతుంది. వెచ్చని నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్ లా చేసి కాళ్లపై రాసి అరగంట మర్దన చేయండి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎప్సోమ్ ఉప్పు

ఇది చాలా సులభమైన నివారణ పద్దతి. ఒక బౌల్ వెచ్చని నీటిలో ఒక చెంచా ఎప్సోమ్ ఉప్పుని వేసుకొని మీ కాళ్లను అందులో 10 నిమిషాలపాటు నానపెట్టండి.

పుల్లని చెర్రీ ఫలరసం

కొంతమంది రోజంతా శారీరక పనులు చేయవలసి ఉంటుంది. దీని వలన మీ కాళ్లు బాగా నొప్పిగా ఉంటాయి. అలాంటప్పుడు రోజూ ½ కప్పు పుల్లని చెర్రీ పండ్లను తినాలి లేదా 1 కప్పు ఫల రసంను రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్స్ మరియు మంటని తగ్గించే (యాంటీ- ఇంఫ్లమేటరీ) లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రామ్ప్స్ మరియు నొప్పిని తగ్గిస్తుంది.

నిమ్మరసం

ఇందులో యాంటీ-ఆక్సిడెంట్స్ మరియు మంటని తగ్గించే గుణాలు (యాంటీ ఇంఫ్లమేటరీ) ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవటం వలన ఒంటిలోని PH స్థాయి సమతుల్యత పొందుతుంది. ఒక గ్లాస్ వెచ్చని నీటిలో అర నిమ్మపండు రసాన్ని కలిపి రోజూ త్రాగండి. లేదా ఆముదం మరియు నిమ్మరసం సమంగా కలిపి నొప్పిగా వున్న చోటులపై పూసి మర్దన చేయండి.

వేడి నీళ్లు మరియు చల్లని నీళ్లు

ఒక టవల్‌ను వేడి నీటిలో తడిపి నొప్పిగా ఉన్న కాళ్లపై రాయండి, తరువాత అదే టవల్‌ని వెంటనే చల్లని నీటిలో తడిపి రాయండి, మళ్ళీ వేడి నీటిలో ముంచి, నొప్పిగా ఉన్న చోటుపై రాయండి. ఇలా వేడి నీళ్లను చల్ల నీళ్లను ఒక దాని తరువాత ఒకదాని రాయటం వలన మీ కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. వేడి నీళ్లకి బదులుగా ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడ్‌ని వాడవచ్చు. దీనికి బదులుగా మీరు వేడి నీటితో స్నానం చేసి తరువాత మంచు ముక్కలను కాళ్లపై తడవడం వలన కూడా నివారణ పొందుతారు.

కండరాలను స్ట్రెచ్ చేయడం (సాగదీయడం)

మీరు దినసరి పనులను ప్రారంభించే ముందు మీ శరీరంలోని కండరాలను స్ట్రెచ్ చేయండి. ఇలా చేయడం వలన క్రామ్ప్స్(తిమ్మిరి) రాకుండా ఉంటుంది.

పొటాషియం

శరీరంలో పొటాషియం లోపించడం వలన కూడా కాళ్ల నొప్పి రావచ్చు. పొటాషియం నాడి వ్యవస్థ మరియు కండరాల బలానికి అత్యంత అవసరమయిన పౌష్టిక ఆహారం. అలాగే డీహైడ్రేషన్ను(శరీరంలో నీరు తక్కువగా ఉండటం) తగ్గిస్తుంది.  పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు, ఉదాహరణకు బంగాళదుంప, అరటి పండ్లు, రేగు పండ్లు మరియు టమోటా జ్యూస్ వంటివి రోజూ తీసుకోవాలి.

సోడియం

మీరు ఇంట్లోనే సోడియం ఎక్కువగా ఉండేల ఒక టానిక్ ని తయారు చేసుకోవచ్చు. రెండు చెంచా తేనె మరియు ఒక చెంచా పసుపు ఆవాలను పొడి చేసి ఒక గ్లాసు నీటిలో కలిపి త్రాగండి.  ఇది మీ కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

వింటర్గ్రీన్ నూనె

మీ కాళ్ల నొప్పి తగ్గటానికి ఒక అద్భుతమైన నూనెని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక చెంచా వింటర్గ్రీన్ నూనె మరియు 4 స్పూన్లు వెజిటేబుల్ నూనెని కలిపి నొప్పిగా ఉన్న కాళ్లపై మర్దన చేయండి. వింటర్గ్రీన్ నూనెలో ‘మిథైల్ సాల్సిలేట్ ’ ఉన్నందున మరియు రక్త ప్రసరణను మెరుగు చేయటం వలన ఇది నొప్పినుంచి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది మీరు రోజుకు ఎన్ని సారులైనా వాడవచ్చు. దీనిని వాడటం వలన మీకు దీర్ఘకాల ఉపశమనం కలుగుతుంది.