
మనం మాములుగా తినే చెక్కర లేదా పిండి పదార్థాలు పళ్ళపై ఉండిపోయినప్పుడు ఇవి బాక్టీరియా రావటానికి కారణం అవుతాయి, దీని వలన కావిటీస్ ఏర్పడతాయి. ఈ కావిటీస్ వలనే పంటి నొప్పి వస్తుంది. ఈ బాక్టీరియాలు ఆమ్లాలను(ఆసిడ్స్) ఉత్పత్తి చేస్తాయి, ఇది పంటికి చాలా హానికరం. ఈ ఆసిడ్స్ నరాలను చేరుకున్నప్పుడు నొప్పి ప్రారంభమవుతుంది.
నోటిలోని చిగుళ్లు ముడుచుకుపోయినప్పుడు పంటి దంతి క్రింద ఉన్న ధాతువు బయటకి రావటం వలన పళ్ళు చాలా సున్నితం అవుతాయి. వేడీ లేదా చల్లని పదార్థాలను తినేటప్పుడు సున్నితమైన పళ్ళలో నొప్పి పుడుతుంది.
పంటి చిగురు గట్టిగా లేనప్పుడు లేదా పంటిపై చీలికలు ఏర్పడినప్పుడు కూడా పంటి నొప్పి రావచ్చు. ఏ ఒక్క సంక్రమణమైన పంటి చిగురు వరకూ వెళ్లినప్పుడు నొప్పి ఏర్పడుతుంది. ఒక దంత వైద్యుడు మాత్రమే నొప్పి యొక్క అసలైన కారణం కనిపెట్టగలరు. అయినప్పటికీ, కొన్ని గృహ నివారణ పద్ధతుల ద్వారా నొప్పిని తగ్గించడం ఎలా గని తెలుసుకుందాం.
నిద్రలేచిన వెంటనే పంటి నొప్పి రావటం చాలా చిరాకు పుట్టిస్తుంది. కొంత మందికి తక్కువ నొప్పి ఉండొచ్చు మరి కొంత మందికి తీవ్రమైన నొప్పి కలగొచ్చు. ఎటువంటి నొప్పి అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టండి.
పంటి నరాలు నుదుటి నరాలకు జత పడి ఉన్నందున కొన్ని సార్లు పంటి నొప్పి ఎక్కువ అయినప్పుడు మీ నుదురు కూడా నొప్పిగా ఉంటుంది. ఒక నియమం ప్రకారం పంటి వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది.
పంటినొప్పిని తగ్గించటానికి గృహ చిట్కాలు
- అన్నం తిన్న తరువాత లేదా పొద్దున, రాత్రి పళ్ళు తోమిన తరువాత వెచ్చని నీళ్లతో లేదా ఉప్పుని కలిపిన వెచ్చని నీళ్లతో పుక్కిలించండి.
- మద్యం లేదా లవంగం నూనె లేదా జాజికాయ నూనెని గాయపడిన పంటిపై రాయండి.
- మీకు అపారమైన నొప్పి ఏర్పడినప్పుడు మంచు గడ్డలను దంతాలు మరియు బుగ్గలు మధ్య 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజుకు నాలుగు సార్లు చేయండి.
- పాలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తినండి, వీటిలో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. చెక్కర మరియు చల్లని ఆహార పదార్థాలను తినడం మానుకోండి, వాటివలన పళ్ళు కుళ్లిపోతాయి.
- నొప్పిగా ఉన్నప్పుడు వేడిని తగలనివ్వద్దు , ఇది నొప్పిని ఇంకా పెంచుతుంది.
సాధారణంగా పంటి నొప్పి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది, ఆస్పిరిన్ లాంటి మందులు లేదా నొప్పిని తగ్గించే జెల్‌ని పూయటం వలన మరియు క్రింద చెప్పిన ప్రాకృతిక నివారణలను అనుసరించటం వలన కూడా నొప్పి తగ్గుతుంది.
ప్రాకృతిక నివారణలు
- లవంగ నూనె – లవంగ నూనెలో బాక్టీరియాను చంపే లక్షణాలు ఉన్నాయి. ఇది పళ్లకు మత్తు కలిగించుతుంది. ఇది చాలా ప్రాచీనమైన నివారణ పద్దతి. ఈ నూనెని నొప్పిగా ఉన్న పంటిపై పూసుకోవడంవలన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- లవంగం – కొన్ని లవంగాలను నోటిలో వేసుకొని మెత్తగా అయిన తరువాత నమలండి. నొప్పిగా ఉన్న పళ్ళపై పెట్టి నొక్కండి. ఇలా ఒక అరగంట చేయటం వలన నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి, పళ్ళ సంక్రమణం లేదా పంటి గడ్డలను నివారించటానికి లవంగం ఉపయోగపడుతుంది.
- అల్లం మరియు ఎరుపు మిరియాలు – అల్లం పొడి మరియు మిరియాల పొడిని నీటిలో కలిపి ఒక పేస్ట్ లాగా చేసి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి.
- సాంబ్రాణి – సాంబ్రాణి మంటని తగ్గించి బాక్టీరియాలను చంపుతుంది. ఒక చెంచా సాంబ్రాణి పొడిని రెండు కప్పుల నీటిలో వేసి 30 నిమిషాల పాటు తక్కువ మంటపై పెట్టి వేడి చేయాలి. ఆరిన తరువాత వడగట్టి రోజుకు 4 లేదా 6 సార్లు ఈ నీటితో నోటిని పుక్కిలించండి.
- మిరియాలు – ఇందులో మంచి సువాసన మరియు మత్తు కలిగించే గుణాలు ఉన్నాయి. మిరియాల ఆకులను వేడి నీటిలో వేసి 20 నిమిషాల పాటు నానపెట్టండి. ఆ తరువాత ఆ నీటితో నోటిని పుక్కిలించండి.
- ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి, 30 సెకండ్ల పాటు పుక్కిలించండి.
- వెల్లుల్లి – చూర్ణం చేసిన వెల్లుల్లి లేదా వెల్లుల్లి పొడిని నొప్పిగా ఉన్న పంటిపై రాయండి. ఇది చాలా ప్రాచీనమైన నివారణ పద్దతి.
- మంచు గడ్డలు – మంచు గడ్డలు నరాలకు మత్తు కలిగిస్తుంది. నొప్పిగా ఉన్న నరాల పై 15 నిమిషాల పాటు ఉంచండి. వీటికి బదులుగా మంచు పాక్‌లను బుగ్గలపై ఉంచవచ్చు.
- బ్లాక్ టీ – ఇందులో రక్తస్రావాన్ని నివారించే గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించి తాత్కాలిక నివారణని ఇస్తుంది.
- జిగురు కణజాలంను సంరక్షించడానికి, మరింత ముడుచుకొని పోకుండా ఉండటానికి మృదువైన బ్రష్‌లు ఉపయోగించాలి.
- పంటి నొప్పిని తగ్గించటానికి పసుపును వాడవచ్చు. దీనికి నొప్పిని తగ్గించే సామర్థ్యం కలదు. బాక్టీరియా మరియు క్రిమి నాసిక లక్షణాలు ఉన్నాయి. పసుపును నీటిలో కలిపి ముద్దగా చేసి దూదితో నొప్పిగా ఉన్న చోటులో రాయండి.
- హైడ్రోజన్ పెరాక్సైడ్ – పంటి నొప్పిని తగ్గించేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా మందికి ఉపయోగ పడింది. అర చెంచా 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ని నోటిలో కొన్ని నిమిషాలు ఉంచాలి లేదా ఒక దూదిని ఈ ద్రవంలో తడిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచండి.
- జాజికాయ నూనె – ఒక దూదిని ఈ నూనెలో తడిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి.
- అరటి ఆకులు, జామ ఆకులు మరియు తోటకూర ఆకులు – ఇవన్నీ పంటినొప్పిని తగ్గించే ప్రాకృతిక పదార్థాలు. ఈ ఆకులను నోటిలో వేసుకొని నమలచ్చు, లేదా వీటిని నలిపి నొప్పిగా ఉన్న చోట్లో పూయండి. జామ ఆకులను నీళ్లలో ఉడకబెట్టి ఉప్పుని కలిపి ఈ నీటితో పుక్కిలించవచ్చు.
- దోసకాయ – తాజా దోసకాయ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై కొంచం సేపు ఉంచండి. చల్లని దోసకాయ ముక్క భరించలేని నొప్పినుంచి కూడా వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఇది సున్నితమైన పళ్ళపై వాడకూడదు, దానికి బదులుగా దోసకాయను బాగా దంచి అందులో ఉప్పు కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయవచ్చు.
- బేకింగ్ సోడా – బేకింగ్ సోడా ను నీటిలో కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి. లేదా వెచ్చని నీటిలో బేకింగ్ సోడాని కలిపి పుక్కిలించటం వలన కూడా నొప్పి తగ్గుతుంది.
పంటినొప్పి ఉపశమనం కోసం ప్రాకృతిక గృహ చిట్కాలు
ఉప్పు మరియు మిరియాలు
ఉప్పు మరియు మిరియాలు మీ వంటింట్లో చాల కావలసిన పదార్థాలు. ఈ పదార్థాలను వాడి మీ పంటినొప్పిని కూడా తగ్గించవచ్చు. వీటి రెండింటి లోను బాక్టీరియా మరియు వేడిని తగ్గించే గుణాలు ఉన్నాయి. నీటిలో అర చెంచా ఉప్పు మరియు అర చెంచా మిరియాల పొడిని కలిపి ముద్దలా చేసుకొని నొప్పిగా ఉన్న పళ్ళపై రాయండి.
ఉల్లిపాయ
మీరు రోజు తినే ఆహారాలలో ఉల్లిపాయలను వాడుతారు . కానీ ఇది పల్ల సమస్యలను తొలగిస్తుందని కొంత మందికి తెలియక పోవచ్చు. ఇందులో మైక్రోబియల్ ( బాక్టీరియా)ని తొలగించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయలతో మీ పంటిలోని క్రిములను నిర్మూలించవచ్చు. పళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు పచ్చ ఉల్లిపాయలను నమలండి.
గోధుమ గడ్డి సారం
మీరు తరచూ గోధుమ గడ్డి యొక్క సారంతో నోటిని కడిగితే పంటి నొప్పి నుంచి గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. ఈ సారాన్ని మీరు క్రమం తప్పకుండా వాడాలి. ఇది మీ పళ్ళు మరియు దంతాలపై విష పదార్థాలను తొలగిస్తుంది. బాక్టీరియా మరియు ఎలాంటి సంక్రమణము జరగకుండా కాపాడుతుంది.