Posted on

శీఘ్ర స్కలన సమస్యతో బాధపడుతున్నారా? – Premature ejaculation tips in Telugu

భాగస్వామి అసంతృప్తపు చూపులు..ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి..ఓవైపు బాధ..మరోవైపు ఈ సమస్య నుంచీ అధిగమించటం ఎలా? అన్న సంధిగ్ధ స్థితి..సెక్స్ లో పాల్గోనే సమయంలో హఠాత్తుగా స్కలనమైపోతుంది..ఏంటీ ఈ సమస్య అని తలపై చెయ్యి పెట్టి బాధతో నిస్సహాయస్థితి..ఈ సమస్య పేరే శీఘ్ర స్కలనం..
ఈ సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడిన మగవారిలో ప్రారంభమవుతుంది. ఈ సమస్య వల్ల వివాహ జీవితం, కుటుంబ జీవితం నాశనం అవుతాయి. ఈ సమస్య తో బాధపడే మగవారు విపరీతమైన విసుగుదల, వారిపై వారికి కోపం, విరక్తితో జీవిస్తుంటారు. చాలా మంది ఈ సమస్య వల్ల ఆత్మ హత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అలాగే చాలా ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్య ఏ ఒక్కరికోదో కాదు. చాలా మందిలో ఈ సమస్య నెలకొని ఉంది. దీనికి పూర్తిగా మీరు కారణం కాదు. కానీ కొన్ని రకాల విధానాలు అంటే టెక్నిక్స్ ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడే వెంటనే ఈ సమస్య నుంచీ బయటపడలేరు. కొన్ని విధానాల్ని పాటిస్తే మీరు చక్కటి సెక్స్ జీవితాన్ని అనుభవించవచ్చు. కాకపోతే ఈ విధానాలను పాటించే క్రమంలో మీకు ఈ సమస్య కొన్ని వారాలలో లేదా కొన్ని నెలల వ్యవధిలోసరి అవ్వవచ్చు. కానీ, ఈ సమస్యను అధిగమించాలంటే మీ భాగస్వామి సహాయసహకారాలు ఎంతో అవసరం. మీ సమస్య గురించి మీ భాగస్వామికి అర్ధం అయ్యేలా వివరించాల్సిన బాధ్యత మీదే. మీ భాగస్వామి మిమ్మల్ని అర్ధం చేసుకుని సెక్స్ లో మీకు సహకరిస్తే మెల్ల మెల్లగా మీకు ఈ శీఘ్ర స్కలన సమస్య తీరిపోతుంది. లేదా మీ సెక్స్ జీవితం పూర్తిగా దుర్భరమైపోతుంది.
సాధారణంగా భాగస్వామి సెక్స్ లో మంచి ఒత్తిడి తో కూడిన సెక్స్ ని అలాగే సంభోగంలో పూర్తి సంతృప్తిని ఆశిస్తుంది. కానీ ఎవరైతే వారి భాగస్వామి సంతృప్తిని అంటే దీనినే భావప్రాప్తి అంటారు పొందరో వారు ఎంతో అసహనంగా ఉంటారు. అంతేకాక ఆడవారికి భావప్రాప్తి జరుగకుండా మగవారు శీఘ్ర స్కలనం చేసుకుంటారో వారి భాగస్వామికి సంతృప్తి ఉండదు. ఇటువంటి సమస్య ఉన్నపుడు మీ సెక్స్ సమస్యల్ని వైద్యునితో చెప్పేందుకు వెనుకాడరాదు. ఈ శీఘ్ర స్కలన సమస్య వృధ్ధులలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఫాస్ట్ జనరేషన్ లో కూడా అలవాట్లు, ఆహారవిధానాల వల్ల ఇప్పుడు ఇది తక్కువ వయస్సులోను తలెత్తుతోంది. కానీ నిరుత్సాహపడవద్దు. కొన్ని మార్గాల ద్వారా మీరు ఈ సమస్య నుంచీ బయటపడవచ్చు. ఆ చికిత్సా విధానాలు మీ ఇంటనే ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా మీకోసం తెలుగు టిప్స్ అందిస్తోంది. అవెంటో చూద్దామా..
శీఘ్ర స్ఖలన సమస్యకు అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే పురుషులు శీఘ్ర స్కలనం సమస్యను అధిగమించి, తన మహిళా భాగస్వామికి తగిన సంతృప్తిని అందించే విధంగా రతిక్రీడను కొనసాగించగలరు. కామోద్రేకానికి భంగం కలగకుండా శీఘ్ర స్కలనం జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఆక్యుపంచర్

దీనినే సూది చికిత్సా అని తెలుగులో అంటారు. అంటే సమస్యను విస్లేషించి దాని మూలాల వరకూ పరిష్కారం దొరికేలా చికిత్స అందించటం అన్నమాట. ఈ చికిత్స శీఘ్ర స్కలన సమస్య నుంచి అధిగమించటానికి చాలా మంచిది. కాకపోతే ఈ చికిత్స తీసుకునేందుకు కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి. అవేంటో  తెలుసుకుందాం:
1. నిల్వ ఉంచిన పదార్ధాలను తినకూడదు. అలాగే చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినకూడదు.
2. మధ్యపానానికి స్వస్తి పలకండి.
3. పొగ త్రాగటం, డ్రగ్స్ తీసుకోవటం పూర్తిగా మాని వేయాలి.
4. కెఫైన్ పదార్ధాలను దూరంగా ఉంచండి. ప్రత్యేకంగా కాఫీ.
5. మీరు రోజూ రకరకాల పండ్లను అలాగే కూరగాయని తినాలి.
6. శీఘ్ర స్కలన సమస్య పోవాలంటే మినరల్స్ ప్రధాన పాత్రని పోషిస్తాయి. కాబట్టి మినరల్స్ ఉన్న ఫుడ్ మీరు తీసుకోవాలి. చేపలలో మినరల్స్ బాగ ఉంటాయి కాబట్టి చేపలు ఎక్కువగా తినాలి.

శీఘ్ర స్కలన సమస్యకు కొన్ని గృహ చిట్కాలు (Telugu remedies for premature ejaculation)

1.ఆకుపచ్చ ఉల్లిపాయల విత్తనాలు: ఆకుపచ్చ ఉల్లిపాయల విత్తనాలు మీ శీఘ్ర స్కలన సమస్యను తొలగిస్తాయి. వీటిని మీరు బాగా గుజ్జుగా చేసి నీటిలో కలుపుకుని తాగితే చక్కగా ఈ సమస్య నయం అవుతుంది. అంతేకాదు మీరు తెల్ల ఉల్లిపాయల్ని, రోజూ వాడే ఉల్లిపాయని కూడా వాడవచ్చు.
2.అశ్వగంధ: అశ్వగంధ శీఘ్రస్కలన సమస్యకు మంచి మందు. ఇది ఆయుర్వేదం లో చాలా విశిష్టమైన గుణాలు ఉన్న మందు. కానీ దీనిని వాడేముందు వైద్యుని సలహా ఎంతో అవసరం. వైద్యుని సలహా మేరకే దీనిని వాడాలి. ఈ హెర్బ్ మీ సామర్ధ్యాన్ని బాగా పెంచుతుంది. అలాగే ఆర్గాన్లను పెంచుతుంది.
3. అల్లం, తేనె: అల్లం మరియు తేనె మీ శీఘ్ర స్కలన సమస్యను నివారించగలవు. అల్లం రక్త ప్రసరణను సరిచేస్తుంది. అలాగే తేనె ఒక మంచి నిరోధకంగా పనిచేస్తుంది. రోజూ 1/2 టేబుల్ స్పూన్ అల్లం అలాగే తేనె పడుకునే ముందు తాగి పడుకుంటే మీ సెక్స్ జీవితం ఎంతో మెరుగుపడుతుంది. ఇవి వెంటనే ఫలితాల్ని ఇవ్వవు కానీ మెల్లగా వీటి పని తీరు గమనించవచ్చు.
4. వెల్లుల్లి: మరో సహజసిధ్ధమైన మందు వెల్లుల్లి. ఇది మీ రక్త ప్రసరణను చక్కగా జరిగేలా చేస్తుంది. అంతేకాక మీ శరీరానికి వేడిమి కలిగిస్తుంది. రోజూ 3-4 వెల్లుల్లి రెబ్బల్నితీసుకుని వాటిని ఆవు పాలతో వేసి వేడి చేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ లోనికి వచ్చాక వీటిని తీసుకుని మీరు నమలాలి. ఇలా రోజూ చేస్తే ఎంతో మంచిది.
5.మీరు ఒక హాఫ్ బోయిల్డ్ గుడ్డు ను తీసుకుని దానికి క్యారెట్ ముక్కల్ని కలిపి దానికి తేనె 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఈ మిశ్రమాన్ని రోజూ తాగాలి. ఇలా 3 నెలల పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. తర్వాత మెల్లగా గుడ్డును దీనిలో వాడటం తగ్గించేయాలి.
6.శీఘ్ర స్కలన సమస్యకు అస్పారగస్(asparagus) చక్కగా నిరోధకంగా పనిచేయగలదు. మీరు రోజూ ఈ అస్పారగస్ వేర్లను తీసుకుని వాటిని పాలల్లో వేసి కలుపుని తాగాలి. లేదా వీటి పవ్డర్(powder) వేసుకుని తాగాలి. లేదా పాలల్లో ఈ అస్పారగస్ వేళ్ళను బాగా ఉడికించుకుని ఆ మిశ్రమా రసాన్ని వేసుకున్న తర్వాత వేర్లను పారేసి తాగాలి. ఈ పాలను రోజుకి రెండు సార్లు తాగాలి.
ఈ ఆక్యుపంచర్ విధానం చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ విధానం అనుసారం ఎక్కడైతే సమస్య ప్రారంభానికి మూలాలు ఉన్నాయో వాటిని తీసివేస్తే చాలు. కానీ కొన్ని హార్మోన్ల లోపం, అలాగే అంగ స్థంభన సమస్యలు కూడా కారణం కావచ్చు.

బెండకాయ

బెండకాయ రోజు వారీ వంటల్లో సాధారణంగా ఉండే కాయగూర. అయితే ఇది శీఘ్ర స్కలన సమస్యను కూడా దూరం చేస్తుందనేది నిజం. మార్కెట్లో బెండకాయల powder సాధారణంగా దొరుకుతుంది. ఈ పవ్డర్ ను రోజూ వాడితే ఎంతో మంచిది. దీనిని వేడి నీటిలో లేదా సుగర్ తో కలిపి రోజూ తాగటం ఎంతో మంచిది. అయితే దీన్ని తీసుకోవటం వల్ల మీకు ఏరకమైన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. లేదా రోజువారీ ఆహారంలో తీసుకున్నా మంచిదే.

క్యారెట్స్

క్యారెట్స్ శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. క్యారెట్ ఒక్క ఈ సమస్యకే కాదు, మరేన్నో సమస్యలను దూరం చేసేదిగా ఉంది. చాలామంది వారి శరీర చర్మ సౌందర్యం కోసం వీటిని వాడుతుంటారు. అంతేకాక ఈ క్యారెట్స్ సగం ఉడికిన అంటే హాఫ్ బాయిల్డ్ గుడ్డుతో కలిపి 3 టేబుల్ స్పూన్స్ తేనె కలిపి తాగితే ఈ సమస్య చక్కగా పరిష్కారమవుతుంది.

శీఘ్ర స్కలనాన్ని నివారించేందుకు వాడకూడని పదార్ధాలు

పైన తెలిపిన డైట్స్ ఒక్క ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ కే పరిమితం కాదు అలాగే ఇంకో రకంగా మీ శీఘ్ర స్కలన సమస్య నుంచి బయటపడేందుకు కూడా ఉపయోగపడతాయి. మీ శరీరానికి మినరల్స్ కాకుండా అలాగే విటమిన్స్, జింక్, క్యాల్షియం, సెలీనియం, ఐరన్ కూడా మీ శరీరంలో ఎక్కువగా ఉండాలి. అలాగే ఫోలిక్ యాసిడ్స్ మీ రక్త ప్రసరణను పెంచుతాయి. కానీ ఇవి ఎక్కువ ఉండే పదార్ధాలను మోతాదుకు మించి తీసుకోవటం కూడా మంచిది కాదు. ఎందుకంటే డయేరియా వచ్చే అవకాశం కూడా ఉండి.

శీఘ్ర స్కలన సమస్యను నివారించేందుకు చేయాల్సిన వ్యాయామం (Telugu exercises to treat quick discharge)

ఇంకో ప్రధానమైన విషయమేమంటే మీరు శీఘ్ర స్కలన సమస్య నుంచీ బయటపడాలంటే మీ శరీరం ఎప్పుడూ దృఢంగా ఆరోగ్యంగా ఉంటే ఈ సమస్య తలెత్తదు. అందుచేత రోజూ వ్యాయామం మీ శరీరానికి ఎంతో అవసరం. మీ బాగస్వామి మీకు వీర్య స్కలనం త్వరగా అయిపోతే సంతృప్తి చెందదు. ఎవరైన తమ సెక్స్ జీవితం నిర్జీవంగా నాశనం అవ్వటం కోరుకోరు. దీనికోసం శరీరం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఇందుకోసం కొన్ని వ్యాయామాలు చేయటం మంచిది. అవేంటో చూద్దామా..!

బలంగా శ్వాస తీసుకోవటం

ఈ విధానం సహజసిధ్ధంగా శీఘ్రంగా స్కలనమవ్వకుండా ఉండేలా చేస్తుంది. అయితే ఇది టెన్షన్ ను పోగొట్టి నెమ్మదితన్నాన్ని అలవరుస్తుంది. హార్ట్ బీట్ ను కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల సెక్స్ సమయంలో టెన్షన్ లేకుండా ఉంటుంది. బలంగా శ్వాసించటం చేసేప్పుడు బలంగా శ్వాస తీసుకుని 5 సెకనుల పాటు ఆపాలి. ఇలా చేయటం దాదాపు 5 నిముషాలపాటు చేస్తే చక్కని ఫలితాలుంటాయి. ఈ విధానం మీరు సంభోగ సమయంలో చాలా ఉపయోగపడుతుంది.

స్క్వీజ్ మెథడ్

ఈ విధానం సంభోగ సమయం ఇరువురు చేయాలి. మీ భాగస్వామి అంగాన్నీ స్క్వీజ్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు స్కలన స్థాయికి చేరుకున్న వెంటనే ఆగి మరలా సెక్స్ చేసే అవకాశం ఉంది. ఈ విధానాన్ని మీరు ఒక్కరే అయినా చేసుకోవచ్చు. లేదా మీ భాగస్వామి అయిన చేయవచ్చు. ఈ విధానం వల్ల ఇరువురూ ఆనందించవచ్చు.

హస్తప్రయోగ విధానం

మీరు ఈ విధానాన్ని ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎందుకంటే మీపై మీకే నిగ్రహ శక్తి ఎంతో అవసరం. ఈ విధానంలో మీరు హస్తప్రయోగం చేసుకునే సమయంలో మధ్య..మధ్యలో..హస్త ప్రయోగం ఆపి అలాగే మరలా హస్తప్రయోగం చేసుకుంటూ ఇలా స్కలన స్థాయికి చేరుకున్న ప్రతిసారి ఇలా చేస్తే చక్కగా  మీరు సెక్స్ లో కూడా ఎక్కువ సేపు సెక్స్ చేస్తూ కాసేపు ఆగి అలాగే మరలా సెక్స్ చేసే కంట్రోల్ ను పొందుతారు. ఇలా చేస్తే మీకు మీపైన ఒక గ్రిప్ వస్తుంది.

కేగల్ ఎక్సెర్సైజెస్

ఈ కేగల్ ఎక్సెర్సైజెస్ లో భాగంగా ఉండే ఆపి మరలా చేసే విధానం ఒక్క మగవారికే కాదు ఆడవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మగవారిలో పెల్విక్ రీజన్ అంటే తెలుగులో కటి ప్రాంతాన్ని మెరుగు పరిస్తే ఆడవారిలో పబోకోకీజియస్(pubococcygeus) కండరాలను మెరుగుపరుస్తుంది. అలాగే శీఘ్ర స్కలన సమస్యను అధిగమించాలంటే ఈ కెగల్ ఎక్సర్సైజెస్ ఎంతగానో సహాయపడతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఈ స్కలనం ఒక నరంలో నుంచీ జరుగుతుంది. అయితే మీకు ఆ నరం ఏదో తెలియకపోతే మీరు యూరిన్ కు వెళ్ళినప్పుడు యూరిన్ మధ్య మధ్యలో ఆపి ఆపి చేసినట్ట్లయితే మీకు తెలుస్తుంది. పబోకోకీజియస్ నరం ఈ ప్రక్రియను చేస్తుంది. ఈ విధానాన్ని చేసేప్పుడు ఆ వ్యక్తి తన తొడలను, పొత్తికడుపును, పిరుదలనూ వాడరాదు. ఈ నియంత్రణా విధానాన్ని రోజూ చేస్తూ ఉండాలి. ఈ విధానాన్ని రోజుకు మూడు సెట్స్ గా చేయాలి. అంటే 10 సెకనులు గ్యాప్ సెట్ కి ఒకసారి తీసుకోవాలి.

తాంత్రిక విధానాలు

ఈ తాంత్రిక విధానాలు శీఘ్ర స్కలన సమస్యను నివారించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాక ఇవి మత పరంగా వివరిచబడినవే. అంతేకాక వీటిని అవలంబించటం వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. సెక్స్ సంభోగం జరిపే సమయంలో భాగస్వామితో స్కలానికి చేరువైనప్పుడు ఆ సమయం లో వెంటనే అంగాన్ని బయటకు తీసివేయాలి. అలా తీసిన వెన్టనే ఆ వ్యక్తి గడ్డాన్ని చెస్ట్ భాగంలో ఉంచుకోవాలి. అప్పుడు వెంటనే బలమైన శ్వాస తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల సెక్స్ సంభోగంలో రతి క్రీడ పై పట్టు వచినట్లే.

ప్రోమిసెంట్

ఇది నూతనంగా, అత్యాధునికంగా వచ్చిన మెడిసిన్. దీనిని ఈ మధ్యే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఆమోదించింది. ఇది శీఘ్ర స్కలను సమస్యను నుంచీ దూరం చేస్తుంది. సంభోగానికి 10 నిముషాల ముందు ఈ మందు అంగానికి రాసుకోవాలి. ఇది చర్మంలోనికి కలిసిపోతుంది. దీనివల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉండవు. సెక్స్ చేసే సమయమూ పెరిగే అవకాశం ఉంది. ఈ మందులు కేవలం శీఘ్ర స్కలన సమస్యను తీర్చేవే కానీ వీటి వాడకం మాత్రం కేవలం డాక్టరు సలహా మేరకే వాడాలి.

వివిధ రకాలైన మందులు

చాలామంది శీఘ్ర స్కలన సమస్యతో బాధపడకపోయినప్పటికీ కొన్ని ఒత్తిడుల వల్ల కూడా సెక్స్ లైఫ్ లో ఇబ్బందులెదుర్కొంటారు. కానీ ఇలాంటి సమయాల్లో మీకు కొన్ని రకాల మందులు ఉన్నాయి. అవేంటంటే జోలోఫ్ట్, ప్రొజాక్ మందులు వాడవచ్చు. ఇవి వాడేముందు మాత్రం డాక్టరు సలహా తీసుకోవాలి. ఈ మందుల్ని పడుకునే ముందు కొన్ని గంటల ముందు వేసుకుంటే చాలు. ఇవి శీఘ్ర స్కలన సమస్యను తీర్చటమే కాదు సెక్స్ పై కూడా చక్కగా పనిచేస్తాయి.

బెంజొకైన్ కూడిన కండోంలు

ఈ కండోంలు శీఘ్ర స్కలనాన్ని నియంత్రించే అంటే క్లైమేక్స్ కంట్రోల్ కండోంలు అంటారు. ఈ కండోం ప్రత్యేకత ఏన్టంటే మీ సెక్స్ యాక్టివిటీని పెంచుతుంది. దాదాపు మీరు సెక్స్ చేసేపుడు ఎప్పుడైతే మీరు క్లైమ్యాక్స్ చేరుకుంటారో అక్కడి నుంచి మరలా ఒక 5 నిముషాల వ్యవధిని ఈ కండోం పెంచుతుంది. దీనిలో ఉన్న బెంజొకైన్ అంగంపై పనిచేయటం వల్ల ఈ శీఘ్ర స్కలన సమస్యను తీరుస్తుంది. అంతేకాక మీరు సెక్స్ చేయకపోయినా మీరు హస్తప్రయోగం చేసుకునేప్పుడు ఈ కండోమ్ను ధరించి ప్రయత్నిస్తే శీఘ్ర స్కలన సమస్య నుంచీ మీరు మిమ్మల్ని బయటపదేందుకు మీకై మీరు ప్రాక్టీస్ చేయవచ్చు.

వ్యూహాత్మక ఒత్తిడి కలిగించటం

అవును..సెక్స్ లో పాల్గొనేప్పుడు ఈ వ్యూహాన్ని అనుసరించటం ఎంతో మంచిది. సెక్స్ సమయంలో మీరు ఈ విధానాన్ని అవలంబిస్తే చాలా ఉత్తమం. దీనిలో మొదటిది సెక్స్ చేసే సమయంలో పెరీనియం అనే అంగాన్ని ప్రెస్ చేస్తూ సెక్స్ చేయాలి. ఈ అంగాన్నే తెలుగులో మూలాధారము – ఉప స్థేంద్రియమునకు గుద ద్వారమునకు మధ్య గల ప్రదేశము అని అంటారు. ఇది ప్రోస్టేజ్ గ్రంధి వరకూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు శీఘ్ర స్కలనం కాకుండా ఉంటుంది.

ఆతృతను తగ్గించుకోవటం

సెక్స్ అనగానే చాలా మందిలో ఎంతో ఆతృత పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ యాక్టివిటీని చక్కగా అనుభవించాలని ఉంటుంది. కానీ ఈ ఆతృతే చాలావరకూ ఈ శీఘ్ర స్కలన సమస్య కు గురి అయ్యేలా చేస్తుంది. ఏదో చేయాలన్న తొందరలో చివరకు ఏమీ చెయ్యలేదన్న బాధ వేధిస్తుంది. కాబట్టి చక్కగా సెక్స్ ని వ్యూహాత్మకంగా, మీ భాగస్వామిపై ప్రేమతో చేయండి.

భిన్నంగా ఆలోచించటం

సెక్స్ చేసేందుకు భిన్నంగా ఆలోచించండి. ఎందుకంటే ఆతృత తో కూడిన ఆలోచనలు శీఘ్ర స్కలనానికి దగ్గర చేస్తే భిన్నంగా అలోచిస్తే మీ సెక్స్ లైఫ్ బాగుంటుంది.

బ్రేకులు ఇవ్వడం

తొందరగా స్కలనం జరిగిపోతే స్త్రీలకు కూడా అసంతృప్తి కలుగుతుంది. దాన్ని నియంత్రించాలంటే సంభోగ వేగంపై దానిపై నియంత్రణ సాధించాలి. క్లైమాక్స్ చేరుకోవడంపై నియంత్రణ అవసరం. సంయోగ క్రియ జరుపుతున్నప్పుడు స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు కాసేపు ఆగండి. అంటే, కాస్తా బ్రేకులు వేయాలన్న మాట.

ఫోర్‌ప్లే

స్త్రీపురుషులు ఇద్దరు ఫోర్‌ప్లే ఇష్టపడుతారు. ఈ చర్య మహిళలను ఉద్రేకంలోకి తీసుకుని పోతుంది. సంయోగం కోసం తహతహలాడేట్లు చేస్తుంది. పురుషుడికి అంగస్తంభన కోసం నిమిషం కూడా పట్టదు. వెంటనే సంభోగ క్రియను ప్రారంభించి కొద్ది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు లేదంటే, గంట వరకు కూడా సాగించవచ్చు. స్త్రీలకు భావప్రాప్తి ఆలస్యంగా జరుగుతుంది. ప్రతి రోజూ ఎక్కువ సేపు ఫోర్‌ప్లే చేస్తే లైంగిక క్రియ ఆనందాన్నిస్తుంది. ముఖరతికి కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

లైంగిక క్రియను నియంత్రించడం

పైన ఉండి సెక్స్ చేసే వ్యక్తికి సంయోగ క్రియను నియంత్రించడానికి వీలవుతుంది. సంభోగం సందర్భంగా స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి లేదా కాసేపు ఆపండి. ఇది అత్యంత సౌకర్యమైంది కూడా. కొద్ది రతిక్రీడ వేగాన్ని పెంచి, ఆ తర్వాత తగ్గించవచ్చు. ఇది గమ్మత్తుగా ఉంటుంది కూడా. మీకే కాకుండా మీ మహిళా భాగస్వామికి కూడా ఇది హాయిగా ఉంటుంది.

భాగస్వామి అంగీకారంతో మాత్రమే

ఇద్దరి అంగీకారం మేరకు, అంటే ఇద్దరికి భావప్రాప్తి కలిగిందని అనుకున్నప్పుడు రతిక్రీడను విరమించడానికి స్కలనం జరిగేలా చూసుకోవాలి. రతిక్రీడ జరుపుతూనే ఆమెను మాటల్లోకి దించి ఎలా చేయాలి, ఎంత సేపు కావాలి, ఇంకా కావాలా అంటూ అడుగుతూ వెళ్లండి. ఆమె సమాధానాలను బట్టి రతిక్రీడను మీ నియంత్రణలో ఉంచుకోండి. దీనివల్ల ఇరువురు ఒకేసారి భావప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది.

వివిధ భంగిమలను ప్రయత్నించండి

మీరు సెక్స్ లో పాల్గొనేప్పుడు సాధారణంగా మగవారే పైన ఉండి సెక్స్ చేస్తారు. దీని వల్ల ఈకువ ఉద్రేకానికి కూడా మీరే గురి అవుతారు. రతి క్రీడ జరిగే సమయంలో మీ పెన్నిస్ ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఒత్తిడి కి గురి అయితే మీ గ్లాండ్స్ కి బాగా ఒత్తిడి కలిగి త్వరగా స్కలనం అయిపోతుంది. కాబట్టి మీరు దీనిని తొలగించుకునేందుకు మీరు పొజీషన్స్ మారుస్తూ ఉండాలి. దీని వల్ల సెక్స్ ఎక్కువసేపు చేయగలుగుతారు. మీ పర్ట్నర్ కూడా అనందించగలరు. రతిక్రీడలో మీరు కింద ఉండి..మీ పార్ట్నర్ పైన ఉంటే అప్పుడు మీరు ఒక కొత్త అనుభూతిని అలాగే ఒత్తిడి లేని సెక్స్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ పొజీషన్ ఎంత బాగుంటుందో మీరే అనుభవించవచ్చు. ఈ పొజీషన్ అన్ని భంగిమల కంటే టాప్ అని ఎప్పటికీ కూడా చెప్పవచ్చు. ఒకసారి ప్రయతించి చూడండి. ఈ పోజీషన్లో మీ భాగస్వామి ఎక్కువ ఎంజాయ్ చేయగలరు. అంతేకాక ఈ భంగిమలో సెక్స్ చేసేప్పుడు వక్షోజాలను మీరు ఒత్తిడికి గురిచేస్తే ఎంతో బాగుంటుంది. ఇరువురూ ఆనందించగలరు. అంతేకాక పక్క పక్కనే పడుకునే పొజీషన్ లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు యాంత్రికమైన, ప్రమాదకరమైన భంగిమల్ని ప్రయత్నించవద్దు. ఎందుకంటే అవి మీ అంగాన్ని దెబ్బ తీయవచ్చు.

మెల్లగా రతి క్రీడ జరుపటం

ఆలస్యం అమృతం విషం అనే సామెతను కాక నిదానమే ప్రధానం అనే సామెతను మీరు ఇక్కడ పాటించాలి. ఎంతసేపటిలో త్వరగా పూర్తి చేద్దామా.. అన్న అలోచనకు స్వస్తి పలకండి. మెల్లగా సెక్స్ మొదలు పెట్టి అధరామృతాన్ని గ్రోలుతూ, వక్షోజాలను చూషిస్తూ, ఒకరినొకరు ఉద్రేకపరచుకుంటూ, చుంబనాలతో ఆనదించండి. అంతేకాక ఫోర్ప్లే కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి. ఓరల్ సెక్స్ చేస్తే చాలా వరకూ ఇరువురూ ఆనందించవచ్చు. అయితే ఇరువురూ సమ్మతము ఇక్కడ అవసరం. రతిక్రీడలో ఎంతో ఓపన్ గా ఉంటే అంతగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకరినొకరు సహకరించుకుంటూ సెక్స్ ని ఎంజాయ్ చేయండి.

ట్రైనింగ్ మరియు ఎక్సర్సైజెస్

పబోకొసిజియస్ గ్రంధిని బలోపేతం అయ్యేలా అలాగే నియంత్రించుకునేలా ప్రయత్నించండి. సెక్స్ లో ఈ గ్రంధి చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇందుకు మీరు ఎప్పుడూ కేగల్ ఎక్సర్సీజెస్ ను చేయాలి. కేగల్ ఎక్సెర్సైజెస్ లో భాగం ఉండే ఆపి మరలా చేసే విధానం ఒక్క మగవారికే కాదు ఆడవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మగవారిలో పెల్విక్ రీజన్ అంటే తెలుగులో కటి ప్రాంతాన్ని మెరుగు పరిస్తే ఆడవారిలో పబోకోకీజియస్ కండరాలను మెరుగుపరుస్తుంది. అలాగే శీఘ్ర స్కలన సమస్యను అధిగమించాలంటే ఈ కెగల్ ఎక్సర్సైజెస్ ఎంతగానో సహాయపడతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి చిట్కాలను పాటించటం వల్ల మీకు శీఘ్ర స్కలన సమస్య దూరం అవుతుంది. అలాగే సెక్స్ లైఫ్ ను బాగా ఆనందించగలరు. మీరే కాదు మీ భాగస్వామి కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.