Posted on

Pregnancy stretch marks removal tips in Telugu – ఇంటి నివారణ పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ తొలగించటం ఎలా?

స్ట్రెచ్ మార్క్స్ అనేవి ప్రసవం తరువాత ప్రతి మహిళా ఎదుర్కునే సమస్య. గర్భంగా ఉన్నప్పుడు, మీ బరువు పెరగి చర్మం సాగడం వలన ఈ చారలు ఏర్పడతాయి. పొట్ట భాగంలో, తొడల మీద ఇలా చాలా సున్నితమైన ప్రదేశాలలో సాగిన చర్మపు గుర్తులు ఏర్పడతాయి.

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించడం ఎలా?

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు కొన్ని సర్జరీల గురించి మీరు వినే ఉంటారు. వాస్కులర్ లేజర్, టంమ్నీ టక్స్ మరియు ఫ్రాక్షనల్ లేజర్ చికిత్స లాంటివి. వీటి వలన అనేక ప్రమాదాలు కలగవచ్చు, కనుక గృహ నివారణలు వాడటమే మంచిది. ఈ మార్క్స్‌ను నిర్మూలించడానికి క్రింద చెప్పిన కొన్ని నివారణ పద్దతులను పాటించండి.

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు ప్రాకృతిక గృహ నివారణలు

కలబంద

కలబంద గుజ్జును చారల మీద పూసి మృదువుగా మర్దన చేయండి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజూ చేయడంవలన కొద్ది రోజుల్లోనే చారలు తొలగిపోయి అందమైన మరియు మృదువైన చర్మం పొందుతారు.

తేనె

ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు తోడ్పడతాయి. ఒక వస్త్రంపై తేనె రాసి, ఈ వస్త్రంను చారలపై ఉంచండి. తేనె ఆరిన తరువాత, వెచ్చని నీటితో కడగండి. దీనిని స్క్రబ్ లా కూడా ఉపయోగించవచ్చు. తేనె, ఉప్పు మరియు గ్లిసెరిన్ ను కలిపి చారలపై మృదువుగా మర్దన చేయండి. 5 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

షియా వెన్న (షీ బట్టర్)

మీరు షియా వెన్న కలిగి ఉన్న లోషన్‌లను చూసే ఉంటారు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. ఈ వెన్న నేచురల్ షెల్ నుండి తయారు చేయబడినందున అద్భుతమైన వైద్య లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లోషన్‌ను క్రమం తప్పకుండా వాడటం వలన చర్మంపై ఉన్న చారలను తొలగించి స్థితిస్థాపకతను పెంచుతుంది.

చక్కెర

చర్మపు చారలను తొలగించేందుకు చక్కెర ఒక ఉత్తమ సహజ నివారిణి. స్నానం చేసే ముందు ఒక చెంచా చక్కెరను కొద్దిగా బాదాం నూనె మరియు నిమ్మరసంలో కలుపుకొని, చారలపై రాసి కొన్ని నిమిషాలపాటు మర్దన చేయండి. ఇలా ఒక నెల రోజులు చేయటం వలన మీ స్ట్రెచ్ మార్క్స్ తగ్గడాన్ని గమనించవచ్చు.

నూనెలు

స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించేందుకు మీరు ఈ పద్దతిని అనుసరించండి. మీరు గర్భిణీ అయ్యే మూడు నెలల ముందు నుంచే నూనెలను మీ కడుపుపై, తొడలపై మరియు రొమ్ములపై రాసి కొద్ది సేపు మృదువుగా మర్దన చేయండి. ఇది మీ చర్మంపై చారలు రాకుండా ఆపుతుంది. మీరు అనేక రకమైన నూనెలను వాడవచ్చు. ఉదాహరణకు ఆముదము, బాదం నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, విటమిన్ ఇ నూనె మరియు సుగంధ నూనెలు.

నిమ్మరసం

నిమ్మరసం సహజమైన అసిడిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మీ చర్మ మొటిమలను, నల్లని మచ్చలను మరియు చారలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఒక నిమ్మపండును తీసుకొని సగంగా కోసి, చారలపై మృదువుగా వృత్తాకార కదలికలో రాయండి.10 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి. లేదా దోసకాయ రసం మరియు నిమ్మరసాన్ని సమాన మోతాదులలో కలిపి చారలపై పూయవచ్చు.

సుగంధపు నూనెలు

ఒక స్పూన్ జెర్మేనియం, లావెండర్, రోజ్, మైర్ లేదా హెలిచ్రిసం లాంటి ఏదైనా ఒక సుగంధ నూనెని బాదం లేదా కొబ్బరి నూనెలో కలుపుకొని సాగిన చర్మపు గుర్తులపై రాయండి. 30 నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన ఇది మీ చర్మ లోతుల్లోకి ప్రవేశించి చారలను పూర్తిగా తొలగిస్తాయి.

నీళ్లు

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు మరియు ఇతర చర్మపు సమస్యలను తొలగించేందుకు మనం చర్మాన్ని ఉత్తమ హైడ్రేషన్ స్థాయిలలో ఉంచుకోవాలి. రోజూ కొన్ని లీటర్ల నీటిని త్రాగటం వలన చర్మం నిర్జలీకరణ లేదా నిర్విషీకరణ కాకుండా ఉంటుంది. ఇది మీ చర్మంలోని స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది. రోజుకు 8-10 గ్లాసుల నీటిని త్రాగటం చాలా మంచిది. అంతే కాదు నీళ్లు మీ చర్మం మృదువుగా ఉండేందుకు తోడ్పడుతుంది. కాఫీ, టీ లేదా సోడా లాంటి పానీయాలను నివారించేందుకు ప్రయత్నించండి.

మాయిశ్చరైజర్

చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచేందుకు మాయిశ్చరైజర్ను వాడండి. మీ చర్మం యొక్క నిర్మాణాన్ని బట్టి మాయిశ్చరైజర్ను ఎంపిక చేసుకోండి. పొడి బారిన చర్మం అయితే కోకో గింజలతో చేసిన మాయిశ్చరైజర్ను వాడండి. జిడ్డు చర్మం అయితే కలబంద లేదా బంక మట్టితో చేసిన మాయిశ్చరైజర్ను వాడండి. మీరు సహజమైన మాయిశ్చరైజర్ను తయారు చేయాలనుకుంటే క్రింద చెప్పిన విధంగా చేయండి.

గోధుమ బీజ చమురు, కలబంద గుజ్జు మరియు ఆలివ్ నూనెలను సమాన మోతాదులలో కలుపుకోండి. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే ఇందులో బంక మట్టిని కూడా చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమంలో ఎలాంటి రసాయనాలు లేనందున భవిష్యతులో ఎలాంటి సమస్యలు రావు.

గ్లైకోలిక్ యాసిడ్

గ్లైకోలిక్ యాసిడ్ ఒక ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లా, ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచి సాగిన చర్మపు గుర్తులను తొలగిస్తుంది. ఔషధ దుకాణంలో గ్లైకోలిక్ యాసిడ్ గుళికలు లభిస్తాయి. వీటిని వాడే ముందు ఒక వైద్యుడిని సంప్రదించటం మంచిది.

విటమిన్ ఇ నూనె

చర్మపు చారలను తొలగించేందుకు ఒక అద్భుతమైన విటమిన్, విటమిన్ . విటమిన్ ఇ నూనెని ఏదైనా ఒక మాయిశ్చరైజర్ లో కలుపుకొని స్ట్రెచ్ మార్క్స్ పై రాయండి. దీనిని క్రమంగా వాడటం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

అప్రికోట్ (నేరేడు పండు)

మీరు నేరేడు పండు స్క్రబ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేరేడు పండు నుండి విత్తనాలను తీసివేసి, దీనిని బాగా చూర్ణం చేసి ఒక ముద్దలా చేసుకోవాలి. తరువాత చారలపై రాసి 15-20 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి.

కోడి గుడ్డు యొక్క తెల్లసొన

తెల్లసొనలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చారలను తొలగించి మీ చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. రోజుకు 1-3సార్లు మీ చర్యలపై తెల్లసొనను రాయండి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేసి చైతన్యం నింపుతుంది. క్రమంగా సాగిన చర్మపు గుర్తులను కూడా తొలగిస్తుంది.

బంగాళదుంప

మీ చర్మం యొక్క స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు బంగాళదుంప సమర్ధవంతంగా పని చేస్తుంది. దీనిపై ఉన్న చర్మాన్ని తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, చూర్ణం చేయండి. దీనిని ఒక గుజ్జులా చేసి మీ చర్మంపై పూయండి, లేదా దీని రసాన్ని పిండి చర్మంపై రాయండి. 5-10 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇందులో పాలీఫెనోల్స్, ఫైటోకెమికల్స్ మరియు కెరోటినాయిడ్లు ఉన్నందున దీనిని కొన్ని నెలలు వాడటం వలన చారలు తొలగిపోతాయి.

డైట్ పరిశీలన

గర్భిణిగా ఉండే సమయంలో సరైన పోషక ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వలన శిశువు యొక్క ఆరోగ్యం మెరుగు పరచటమే కాదు మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఆపవచ్చు. జింక్, ఐరన్, విటమిన్ కె మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి మీ చర్మాన్ని మృదువుగా ఉంచటం వలన చారలు రాకుండా నివారిస్తాయి. గింజలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను కూడా తినండి.

వ్యాయామాలు

మీరు గర్భిణిగా ఉండే సమయంలో అధిక వ్యాయామాలను చేయలేక పోవచ్చు, కానీ డెలివరీ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామాలను అనుసరించడం మంచిది. ఇది సాగిపోయిన మీ చర్మాన్ని ధృఢంగా చేసి, స్థితిస్థాపకతను పెంచేందుకు సహాయ పడుతుంది, ముందుగా మీ కడుపుపై ఉన్న స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించి తరువాత వీటిని వేర్ల నుండి పూర్తిగా తొలగిస్తుంది.

పసుపు మరియు గంధం

పసుపు మరియు గంధంను మన దేశంలో కొన్ని శతాబ్దాలుగా చర్మ సంరక్షణంకు వాడుతున్నాము. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని కొంత కాలం పాటు ఉపయోగించటం వలన చర్మపు చారలు కూడా తొలగిపోతాయి. ముందుగా గంధపు చెక్కను ఇసుక రాయిపై రుద్ది ఒక స్పూన్ పేస్ట్‌ను తయారు చేయండి. రెండు అంగుళాల పసుపు వేరును చూర్ణం చేసి,గంధపు ముద్దలో కలపండి. ఈ మిశ్రమాన్ని చర్యలపై రాసి, 60 శాతం ఎండిన తరువాత మర్దన చేయండి. ఇలా రోజుకు ఒక సారి 6 నెలల పాటు చేయటం వలన స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.

పాలు, చక్కెర మరియు పచ్చ కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లను క్రమంగా వాడితే చర్మంపై ఏ రకమైన మచ్చలైనా తొలగిపోతాయి. రెండు స్పూన్ల పచ్చి పాలలో కొన్ని చుక్కల దోసకాయ రసం, కొన్ని చుక్కల నిమ్మరసం మరియు 1/2 స్పూన్ చక్కెరను కలుపుకొని ఒక స్క్రబ్ ను తయారు చేసుకోండి. దీనిని చారలపై రాసి నెమ్మదిగా వృత్తాకారంలో కొద్ది సేపు మర్దన చేసి నీటితో కడగండి. ఈ స్క్రబ్ వారానికి 3 సార్లకన్నా ఎక్కువగా వాడకూడదు.

నీటితో కడిగిన తర్వాత, చర్మాన్ని ఆరపెట్టి తాజా పచ్చ కొబ్బరి నీళ్లను మీ చారలపై పూయండి. ఇది ఎండిన తరువాత కలబంద జెల్ లేదా షీ వెన్నను రాయండి. కొబ్బరి నీళ్లతో మీ చర్మ చారలను రోజుకు 2-3 సార్లు కడగవచ్చు. ఇది ఎలాంటి హాని కలిగించదు.