Posted on

Aloo baingan / Eggplant curry recipe in Telugu – ఆలూ బైంగన్ రెసిపీ

ప్రత్యేకమైన రుచిని అందించే మిక్సెడ్ కూరగాయల రెసిపీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ ఆలూ బైగన్. ఏ సీజన్‌లోనైనా మనకు అందుబాటుల ఉండే కూరగాయలలో బంగాళదుంపలు ఒకటి. కనుకనే బంగాళదుంప వంటకాలు భారతదేశంలో చాలా ఎక్కువగా చేస్తుంటాము.

అటువంటి బంగాళదుంపను వంకాయతో కలిపి వండితే ఎంతో ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. మరి ఈ రెండు మెయిన్ ఇంగ్రిడియెంట్స్ తో తయారు చేసే ‘ఆలూ బైగన్’ రెసిపీని చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 4 టీ స్పూన్లు
  • జీరా – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 2 టీ చిటికెలు
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • పచ్చి మిర్చులు – 2
  • అల్లం – 1 టీ స్పూన్
  • బంగాళదుంపలు – 2
  • వంకాయలు – 2
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 2 టీ స్పూన్లు
  • మాంగో పౌడర్ – 2 టీ స్పూన్లు
  • నీళ్లు – 250 మిల్లీ లీటర్ల
  • గరం మసాలా పొడి – 1 టీ స్పూన్
  • కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి అందులో 4 టీ స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడిక్కిన తరువాత 1 టీ స్పూన్ జీరా, 2 చిటికెల పసుపు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిన్నగా తరిగిన 2 పచ్చి మిర్చులు, 1 టీ స్పూన్ తరిగిన అల్లం వేసి దోరగా వేయించుకోవాలి.
  • తరువాత అందులో తరిగిన బంగాళదుంపలు 2 వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో పెద్దగా తరిగిన 2 వంకాయలను వేసి కలుపుకోవాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.
  • ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ మాంగో పౌడర్, 250 మిల్లీ లీటర్ల నీళ్లు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుతూ వేయించాలి.
  • బంగాళదుంపలు మరియు వంకాయ ముక్కలు బాగా కుక్ అయిన తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ బైంగన్ రెడీ!