Posted on

Symptoms of baby boy during pregnancy in Telugu – మగ బిడ్డ అయితే గర్భవతి లక్షణాలు

అవును ఈ టైటిల్ చదువుతుంటే చాలా ఉత్తేజంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు మీ కడుపులో మోస్తున్న మీ ఆనందాల మూటకు  సంబంధించిన ఎన్నో మధుర అనుభూతులు మిమ్మల్ని ఎంతగానో మైమరపిస్తున్నాయా? అయితే ఈ శీర్షిక మీ ఆనందాలను రెట్టింపు చేస్తూ మీ ఇంట్లో తప్పటడుగులు వేయబోయే మీ ముద్దుల శిశువు రాకకు సంభందించిన కొన్ని ముఖ్యమైన సంకేతాలను మీకు అందిస్తుంది.  

తల్లి కాబోయే ప్రతీ ఒక్క స్త్రీ రాబోయే తమ వారసుల కొరకు ఎంతో ఉత్తేజకరమైన సందర్భాలను తలచుకుంటూ మనసులో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతారు. దానికి  కారణం మరేదో కాదు. రాబోయే తన ముద్దుల బిడ్డ యువరాజు అయి ఉంటాడా లేదా యువరాణి అయి ఉంటుందా అని తెలుసుకోవాలని చిన్న కుతూహలం చాలా సాధారణ విషయం. అయితే దీనిని దగ్గరగా అంచనా వేయడానికి ఇక్కడ మేము మగ శిశువుకి కాబోయే తల్లికి గల కొన్ని లక్షణాలను పొందిపరిచాము. ఇవన్నీ కొందరి విషయంలో మాత్రమే పని చేసే కొన్ని నమ్మకాలు మాత్రమే, ఇవి అందరికీ పనిచేయకపోవచ్చు. కాబట్టి కేవలం వీటిని మాత్రమే పరిగణలోనికి తీసుకోవద్దని అభ్యర్ధన. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని సంతోషంగా మీ కుటుంబం లోనికి మరింత ఆరోగ్యవంతులయిన యువరాణి లేదా యువరాజును హృదయపూర్వకంగా ఆహ్వానించండి.

అధికంగా విశ్వసించే కొన్ని నమ్మకాల వైపు ఇప్పుడు పయనిద్దాం.

గర్భంలో శిశువు స్థానం

తల్లి తన శిశువుని గర్భంలో మోసే స్థితి కూడా శిశువు యొక్క లింగం కొరకు నిర్ధారణ చేస్తుంది. కాబట్టి తల్లి ఒకవేళ గర్భస్థ శిశువుని దిగువ ఉదర స్థానముగా కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ  శిశువు మగ శిశువు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఉదయకాల అనారోగ్యం

గర్భిణీ స్త్రీ ఉదయకాలాలలో ఎటువంటి తరుచు అనారోగ్యాలు లేకుండా ఉన్నట్లయితే పండంటి మగ బిడ్డకి జన్మనిస్తుందని చెబుతూ ఉంటారు. ఇది ఎక్కువగా గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పులవల్ల సంభవిస్తుంది. ఇది మహిళకి మహిళకి మధ్య వేరుగా ఉంటుంది.

గర్భం దాల్చిన సమాయంతో వయస్సు లెక్కింపు

మీ వయస్సుని మీరు గర్భం దాల్చిన నెల సంఖ్యకు జత చేస్తే ఫలితంగా వచ్చే సంఖ్య సరి సంఖ్య అయినట్లయితే  పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ .

ఆహార కోరికలు

మీకు తీపి పదార్ధాలకు బదులుగా ఇంపైన కారంగా ఉండే పదార్ధాలపై ప్రీతి కలిగి ఉన్నట్లయితే ఈ లక్షణాలు మగ బిడ్డకు ఆస్కారం కల్పిస్తున్నాయి.

శిశువు యొక్క హృదయ స్పందన వేగం

మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు, మీ శిశువు యొక్క హృదయ స్పందన నిమిషానికి 140 సార్లు కంటే తక్కువగా ఉన్నట్లయితే  మీరు ఒక మగ శిశువుని పొందబోతున్నట్లు భావించబడుతుంది.

వాంతులు

మీకు  మొదటి 5 నెలలు భారీగా వాంతులు అవుతూ ఉంటే ఇది కూడా మగ శిశువుని కలిగిన తల్లి యొక్క లక్షణంగా పేర్కొంటారు.  

ముఖంలో కాంతి

మీ ముఖంలో కాంతి తగ్గినట్లు అనిపిస్తే మీరు మగ  బిడ్డకి జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మూత్రం రంగు

స్పష్టంగా హార్మోన్ల ప్రభావం కారణంగా గర్భధారణ సమయంలో మూత్రం యొక్క రంగు మార్పు చెందుతుంది. కానీ ఒకవేళ అది ముదురు పసుపు రంగు ఉంటే అప్పుడు మీ  జూనియర్ మాష్టర్ కు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండండి.

రొమ్ము పరిమాణం

సాధారణంగా ఎడమ వైపు రొమ్ము యొక్క పరిమాణం ఎప్పుడూ కుడి వైపు కంటే పెద్దదిగా ఉంటుంది. కానీ మీ గర్భధారణ సమయంలో ఎడమ వైపు కంటే కుడి వైపు రొమ్ము పెద్దదిగా ఉన్నట్లయితే ఒక మగ పిల్లవాడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి!

చల్లటి పాదాలు

మీ పాదాలు చాలా చల్లగా ఉన్నట్లు భావిస్తే  అది మీరు ఒక మగ పిల్లవాడిని పొందే లక్షణం కలిగి ఉన్నారని మన పెద్దవాళ్ళు అంచనా వేస్తారు.

పొడి చేతులు

ఇది వినడానికి కొత్తగా ఉంది కదూ! కానీ అవును,  మీరు చల్లని పాదాలతో పాటు మీ చేతులు పొడిగా ఉన్నట్లయితే, అది ఒక మగ శిశువు అని భావించబడుతుంది.

బరువు పెరగడం

మీ కడుపు చుట్టూ మాత్రమే బరువు పెరుగుతున్నట్లయితే, మీరు ఒక బోసినవ్వుల మగ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దపడుతున్నారని తెలియజేస్తుంది.

ఇవన్నీ చాలా మంది స్త్రీలు ఎక్కువగా నమ్ముతున్న విశ్వాశాలు. అయితే పైన పేర్కొన్న మార్పులు గర్భాధారణ సమయంలో చాలా సాధారంగా ప్రతీ మహిళకూ కనిపించే లక్షణాలు. అది వారి శరీర తత్వం మరియు హార్మోనుల మార్పుల కారణంగా సంభవిస్తూ ఉంటాయి. ఇది ఒక్కో స్త్రీ విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. కాబట్టి ఈ అంచనాలు అన్ని వేలలా పని చేయకపోవచ్చు. కాబట్టి అందమైన తల్లులంతా ఊహిస్తూనే ఉండండి. మీ ఊహలు నిజమయ్యేవరకు వేచియుండండి. వేచి ఉండటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి. మీ బిడ్డ వచ్చే క్షణాలకోసం నిరీక్షణకు ప్రతిఫలంగా ఆ రోజు త్వరలోనే వస్తుంది. స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి.