Posted on

Best Smartphones / Mobiles in Rs.10000/- in Telugu

Mobiles Below 10000 in Telugu

ఇండియా మార్కెట్లో వారం వారం ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే విడుదలైన ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే లోపు మరో కొత్త ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కొనుగోలు దారులు కొంచెం గందరగోళానికి గురవుతున్నారు.

అయితే ఎన్ని ఫోన్లు విడుదలయినా ఫోన్ కొనుగోలుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే వెచ్చిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాల మందిలో ఉంటుంది.. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఫోన్లు కొంటే అవి డ్యామేజి అయినా, లేక మిస్సింగ్ అయినా అయ్యో అనాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో మార్కెట్లో మంచి ఫీచర్లతో ఈ మధ్య విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 10,000లోపు ధ‌ర‌లో ఉన్న బెస్ట్ ఫోన్స్ ఇవి … త‌క్కువ బ‌డ్జెట్.. ఇదీ మొబైల్ కొనాల‌నుకునే వారికి ముఖ్యమయిన ప్రాధాన్యం. అందుకు త‌గ్గ‌ట్టుగానే బ‌డ్జెట్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ల‌పై అనేక ఆఫర్లు మరియు ప్రచారాలు జోరుగా సాగుతూనే ఉంటాయి….

అయితే తక్కువ ధర ఇంకా మంచి ఫీచర్స్ తో  లభించే స్మార్ట్ ఫోన్ లు కొనాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఒక్కసారి చూసి తీరాల్సిందే అంటున్నారు స్మార్ట్ ఫోన్ లవర్స్.రూ.10,000లోపు టాప్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు …మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు  ఎప్పటికప్పుడు పోటీపడుతూ మరీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.

వీటిల్లో ఎక్కువ బడ్జెట్ కేటగిరికి సంబంధించినవి. వాటిలో రూ.10,000 విభాగం చాలా కీలకమైనది. ఎందుకంటే భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా కేవలం ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారు కూడా ఈ విభాగంలో ఫోన్ల వైపే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఏ ఫోన్ ఎంచుకోవాలి అనే గందరగోళం కూడా ఉంటుంది.

స్మార్ట్ ఫోన్.. ఇది లేకుండా  ప్రస్తుతం మనుషులు లేరిప్పుడు.. ప్రతి అవసరానికి సెల్ ఫోన్ ముడిపడి ఉంది. ప్రస్తుత తరుణంలో.. అందుకే వీలైనంత స్మార్ట్ గా ఉండే ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా  చాలా ఉత్సాహం చూపిస్తున్నారు.

కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగానే మంచి ఫీచర్లతో సెల్ ఫోన్ కంపెనీలు ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019లో ఎక్కువ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. బిగ్ బిలియన్ డేస్, అమేజాన్ ఇండియన్ సేల్స్ లాంటి సేల్స్ ద్వారా ఫోన్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.

ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువమంది రూ.10,000 లోపు కొన్న ఫోన్ ఏమిటో తెలుసుకుందామా..ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేలలోపు  ఫోన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

అందుకే రూ.10 వేల లోపు అదిరిపోయే ఫీచర్లున్న ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాం..శాంసంగ్, షావోమి, రియల్‌మి కంపెనీలు ఇటీవల కాలంలో అందరికి అందుబాటు ధరలో చాలా  స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

కానీ మంచి ఫీచర్స్ మరియు 10,000లోపు బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్లు బెటరో  ఇప్పుడు చూద్దాం..

షియోమీ రెడ్ మీ 7

దీని ధర రూ. 7,499గా ఉంది. షియోమీ రెడ్ మీ నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5
మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్ టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్ బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

రెడ్ మీ నోట్ 8

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమి తాజాగా లాంచ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొబైళ్లలో ధరకు తగిన విలువను అందించే మొబైల్స్ లో ఈ ఫోన్ కూడా కచ్చితంగా ఉంటుంది. ఇందులో 6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను ఇందులో అందించారు.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు నాలుగు కెమెరాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో కెమెరాను, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించారు. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది 28W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

రియల్ మీ 5

ఈ స్మార్ట్ ఫోన్  ప్రారంభ ధర రూ.9,990గా ఉంది. ఈ ఫోన్ లో 6.5 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఇప్పుడు వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇందులో కూడా వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 13 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

వివో యూ10

ఈ ఫోన్ ధర రూ.8,990 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.35 అంగుళాల హాలో ఫుల్ వ్యూ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు.

వెనకవైపు కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

రియల్ మీ 3 ప్రో

ఈ ఫోన్ ధర ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 AIE ప్రాసెసర్ ను ఇందులో అందించారు. వెనకవైపు 16 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,045 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 20W VOOC 3.0 ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

మోటోరోలా వన్ మాక్రో

ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.2 అంగుళాల హెచ్ డీ+ మ్యాక్స్ విజన్ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. హీలియో పీ70 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు మూడు కెమెరా సెటప్ ఇందులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

రెడ్ మీ 8

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. రెడ్ మీ 8లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆరా మిర్రర్ డిజైన్ ను ఇందులో అందించారు. 6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను ఈ ఫోన్ లో అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇందులో డ్యూయల్ కెమెరా ఫీచర్ ఉంది. 12 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను వెనకవైపు అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ రెడ్ మీ 8లో ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం30

ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. ఎక్సోనిస్ 7904 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు మూడు కెమెరా సెటప్ ఇందులో ఉంది.

ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది.

ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.మన అవసరానికి మరియు మన ఇష్టానికి తగట్టు ఎంచు కొనేందుకు ప్రస్తుతం పలు ఫోన్లు మరియు వాటి ఫీచర్స్ అన్ని తెలిపారు ఆయా సంస్థ వారు.కాబ్బటి ఎవరికీ ఇటువంటివి నచ్చుతాయో చూసుకొని,ఎంచుకునేందుకు మరింత సులభంగా వివరణ ఇచ్చారు.కేవలం పదివేలు పెడితే చాలు, బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్  ఫోన్స్ మీ సొంతం.

Posted on

Samsung Galaxy a70 review in Telugu

Samsung Galaxy A70 in Telugu

శుక్రవారం నాడు మార్కెట్లోకి  కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ అమ్మకాలు సెప్టెంబర్28  నుండి  ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సైట్లు మరియు  ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్  అందరికి అందుబాటులోకి రానుంది. మరి దీని ధర ఎంత.. దీనిపై ఉన్న ఆఫర్లేంటి?  ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ అంటే ..చాలానే ఉన్నాయని చెప్పచు.

ప్రముఖ ఫోన్ దిగజాలలో ఒక్కటయిన శాంసంగ్ నుంచి  మరో కొత్త మొబైల్ శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ ఇప్పుడు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఫోన్ కి సంబంధించిన అమ్మకాలు శనివారం నుంచి మొదలు కానున్నాయి.

ఈ ఫోన్ శుక్రవారం నాడు లాంచ్ అయింది. ఈ సంవత్సరమే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ70కి తర్వాత అడ్వాన్స్డ్  వెర్షన్ గా ఈ ఫోన్ ను శాంసంగ్ తీసుకువచ్చింది.ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ధరను రూ.28,999గా నిర్ణయించారు.

ఇందులోనే మరో వేరియంట్  8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.30,999గా ఉంది. ఈ రెండు వేరియంట్లూ అన్ని ప్రముఖ వెబ్ సైట్లు, శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్, శాంసంగ్ ఒపేరా హౌస్ ల్లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్స్ ప్రిసమ్ క్రష్ రెడ్, ప్రిసమ్ క్రష్ బ్లాక్,మరియు  ప్రిసమ్ క్రష్ వైట్ రంగుల్లో  లభించనుంది అని తెలిపారు శాంసంగ్ సంస్థ వారు.

వీటితో పటు పలు ఆఫర్లు కూడా వారు ప్రకటించారు.శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ మొబైల్ ను కొన్న జియో సబ్ స్క్రైబర్లు రూ.198, రూ.299 రీచార్జ్ లపై రెట్టింపు డేటాను పొందుతారు. అత్యధికంగా 12 రీచార్జిల వరకు ఈ  రెట్టింపు డేటా వస్తుంది. అలాగే ఎయిర్ టెల్ సబ్ స్క్రైబర్లు  అయితే రూ.249, రూ.349 రీచార్జ్ లపై రెట్టింపు డేటా పొందుతారు.

వీరికి కూడా 12 రీచార్జిల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వొడాఫోన్, ఐడియా సబ్ స్క్రైబర్లకు రెట్టింపు డేటా లభించదు,కానీ మై వొడాఫోన్, మై ఐడియా యాప్ ల ద్వారా రూ.255 రీచార్జ్ చేస్తే రూ.75 క్యాష్ బ్యాక్ వస్తుంది. అత్యధికంగా 50 రీచార్జ్ ల వరకు ఈ ఆఫర్ లభించనుంది.

ఈ ఫోన్  అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా తయారు చేసారు  శాంసంగ్ సంస్థ వారు.6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అంటే 1080×2400 పిక్సెల్స్ కలిగి ఉంటుంది. సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ ను వీటికి అందించారు. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు.

ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దాని అపెర్చర్ f/1.8గా ఉంది. 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా 32 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరా ఇచ్చారు. దీని అపెర్చర్ f/2.0గా ఉంది.మంచి కెమెరా ఫీచర్స్ కలిగి ఉన్న ఈ వేరియంట్ ఫోన్స్ ముఖ్యంగా కెమెరా ప్రియులుని ఆకట్టుకొనున్నాయి.

ఇక అతి ముఖ్యమయిన బ్యాటరీ విషయం లోకి వస్తే,ఇందులో 4,500 mAh సామర్థ్యమున్న బ్యాటరీని అమర్చారు.ఇది 25W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో అందించిన ఇంటర్నల్ స్టోరేజే కాకుండా మైక్రో ఎస్ డీ కార్డు స్లట్ ద్వారా అదనంగా 512 జీబీ వరకు స్టోరేజ్ ని పెంచుకోవచ్చు.

అంతేకాకుండా ఈ ఫోన్ లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 Pie ఆధారిత వన్ యూజర్ ఇంటర్ ఫేస్ పై పనిచేయనుంది. తాజా లాంచ్ కాబట్టి త్వరలో దీనికి కూడా ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ లభించే అవకాశాలున్నాయి.

ఈ ఫోన్ లో 1.8 గిగాహెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ ను అందించారు. 12 జీబీ ర్యామ్ కాగా, 512 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. ప్రత్యేకంగా మెమొరీ కార్డు వేసుకోవడానికి మైక్రో ఎస్ డీ స్లాట్ ను అందించలేదు. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జీ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ కార్డు సౌకర్యం కూడా ఇందులో ఉంది.

ఇంకా ఈ ఫోన్లో  మరిన్ని ఫీచర్స్ కలిగి ఉన్నాయి.యాక్సెలరో మీటర్,యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, కంపాస్ మీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.

ఈ ఫోన్ 15.44 సెంటీమీటర్ల పొడవు, 7.23 సెంటీమీటర్ల వెడల్పు,ఇంకా 1.04 సెంటీమీటర్ల మందం ఉండనుంది. బరువు 241 గ్రాములుగా ఉండి చాలా స్టైలిష్ గా కనువిందు చేయనుంది

Posted on

Telugu tips for Sugar / Diabetes

Diabetes in Telugu

షుగర్ వస్తే పోదు. మనం ఆహారంలో మార్పులు – చేర్పులూ చేయడం ద్వారా షుగర్‌ను కంట్రోల్ చెయ్యగలం. మరింత ఎక్కువ అవ్వకుండా చెయ్యగలం. అదెలాగో తెలుసుకుందాం.

ప్రపంచ దేశాలన్నీ… షుగర్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నాయి. మనం ఏం తిన్నా… దాని లోని షుగర్ (గ్లూకోజ్ లేదా పిండిపదార్థం)… బ్లడ్ లో కలుస్తుంది. ఐతే… బ్లడ్ లో షుగర్ ఎక్కువ అయితే … ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ అనేది మన బాడీని, బ్లడ్‌నీ కంట్రోల్ చేస్తుంది.

సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే… బీపీ వచ్చి… హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓవరాల్‌గా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చేసుకోవడం, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవ్వకుండా చూసుకోవడం… షుగర్ ఉన్నవారి టార్గెట్ అనుకోవచ్చు.

కొన్ని రకాల ఆహారాలు… బ్లడ్ లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యగలవు. అలాగే కొన్ని ఇంటి చిట్కాలు కూడా షుగర్‌ను అదుపులో ఉంచుతాయి. దానివల్ల అవేంటో తెలుసుకుందాం.

పసుపు, కాకరకాయ, ఉసిరి : ఇవి మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యగలవు. బర్ బెర్రీస్, పసుపు బాగా పనిచేస్తాయి. పసుపు, ఉసిరి, కాకర కాయ… వీటిని వేటితో కలిపి తీసుకున్నా… షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. సింపుల్‌గా ఇలా చెయ్యండి.

ఓ ఉసిరికాయ గుజ్జు, చిటికెడు పసుపును ముద్దగా చేసి మింగేయండి. ఇది చక్కగా పనిచేస్తుందని డాక్టర్ నిషా మణికాంతన్ తెలిపారు.

మామిడి ఆకులు (Mango Leaves) : ఇవి కూడా బాగా పనిచేస్తాయి. మామిడి ఆకుల రసానికి… ఆల్ఫా గ్లోకోసిడేస్ అనే ఎంజైమ్‌ని నిరోధించే శక్తి ఉంది. దానివల్ల మామిడి ఆకుల రసం తాగితే… బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇందుకు సంబంధించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

దాల్చిన చెక్క (Cinnamon) : పసుపు తర్వాత దాదాపు అదే స్థాయిలో పనిచేసే సుగంధ ద్రవ్యం దాల్చిన చెక్క. షుగర్ పేషెంట్లలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దాల్చిన చెక్కకు ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసే శక్తి ఉంది. అంటే తక్కువ ఇన్సులిన్ ఉంటే… దాన్ని పెరిగేలా చెయ్యగలదు.

ఎక్కువ ఉంటే తగ్గించగలదు. దాల్చిన చెక్కను ఏ మోతాదులో తీసుకోవాలో నిర్ణయించుకునేందుకు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిదే.

అవిసె గింజలు (Flaxseeds) : ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైన అవిసె గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దానివల్ల ఇవి షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి.

మెంతులు (Fenugreek) : మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యడంలో సహాయ పడతాయి. దీని మీద జరిగిన పరిశోధనల్లో ఈ సంగతి తెలిసింది .

షుగర్ ఉన్నవారు… పంచదారతో చేసిన తీపి జోలికి వెళ్లకపోవడం మేలు. ఒకవేళ తీపి పదార్థ్దాలు తినాలని ఉంటే … పండ్లతో చేసినవే తినడం మంచిది. అది కూడా కొద్దికొద్దిగానే. కాఫీ, టీ పంచదార బదులు హనీ వేసుకోవచ్చు. హనీ షుగర్ ఉన్నవారికి హాని చెయ్యదు.

పండ్లు తినవచ్చా : షుగర్ ఉన్నవారికి కొన్ని రకాల పళ్ళు మంచి చేస్తాయి. బెర్రీస్, దానిమ్మలు, ఉసిరి వంటివి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తాయి. రోజుకో యాపిల్ పండు తినవచ్చు.

ఫ్రూట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ (జి . ఐ) తక్కువగా ఉండేవి షుగర్ పేషెంట్లకు హాని చెయ్యవు. ఏం తినాలి, ఏం తినకూడదు… అని పదే పదే ఆలోచించుకుంటూ ఉంటే… అదో రకమైన ఒత్తిడిగా మారుతుంది. దానివల్ల షుగర్ పేషెంట్లు తీపిగా ఉండేవి ఏవి తిన్నా… చిన్న మొత్తంలో తింటే పర్వాలేదంటున్నారు వైద్యులు.

కాకరకాయ రసం, నేరేడు పండు రసం కలిపి తాగొచ్చు. ఇలాంటి ప్రయోగాల వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండటమే కాకుండా… ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు వీలవుతుందంటున్నారు డాక్టర్లు.

Posted on

ఇలా చేస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం – Telugu tips for Teeth Pain

పళ్ళు మరియు దవడల చుట్టూ ఉన్న నొప్పిని పంటి నొప్పి అంటారు. దంతక్షయం, ఇన్ఫెక్షన్, దంతాలు వదులుగా మారడం, విరగడం లేదా చిగుళ్ళవాపు పంటినొప్పికి గల ప్రధాన కారణాలు. 2 రోజులకు మించి పంటినొప్పితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టర్ ని కలవాల్సిందే ..

మన ఇంట్లో ఉన్న వస్తువులతో సహజంగానే ఈ పంటినొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ :

కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ దంత నొప్పిని తగ్గిస్తుందని చెప్తారు . ముఖ్యంగా పంటి నొప్పి, ఏదైనా గాయం, చిగుర్ల వాపు ఉన్నపుడు ఈ టిప్ బాగా పనిచేస్తుంది.

ఐస్ ప్యాక్ లేదా ఫ్రిజ్‌లో చల్లబరిచిన బఠానీల ప్యాక్ ని వాడి కోల్డ్ కంప్రెస్ ట్రై చెయ్యొచ్చు . చెక్కిళ్ళకు బయట భాగాన పన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో కొంత సమయం అలా అదిమి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ఈ చికిత్సను ప్రయత్నించటం ద్వారా, ఇది రక్త నాళాలను నిర్బంధిస్తుంది, నెమ్మదిగా ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా నొప్పిని , వాపుని మరియు మంటని తగ్గించడానికి సహాయం చేస్తుంది .

2. సాల్ట్ వాటర్ తో పుక్కిలించడం (మౌత్ వాష్) :

వేడి సాల్ట్ వాటర్ తో నోరు శుభ్రం చేసుకోవటం ద్వారా, దంతాల మధ్య పేరుకొన్న అవశేషాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది . సాల్ట్ వాటర్ వాపును తగ్గించడమే కాక, వైద్యాన్ని సులభతరం చేస్తుంది. సాల్ట్ వాటర్ టిప్ గొంతు నొప్పి నుండి కూడా రిలీఫ్ కలిగిస్తుందని మనకు తెలుసు.

1 టీస్పూన్ సాల్ట్ ని 1 గ్లాసు వెచ్చని నీటిలో కరిగించి , ఉమ్మటానికి ముందు 1 నిమిషం పాటు నోటిలోనే ఉంచి పుక్కిలించండి. ఈ ప్రక్రియను అవసరమైనంతమేర పునరావృతం చేయండి.

3. నొప్పి నివారణ మందులు :

ఎసిటమినోఫెన్ మరియు ఇబుప్రోఫెన్ వంటి మందులు పంటి నొప్పికి తాత్కాలిక నొప్పి నివారణను అందిస్తాయి. అయితే, 16 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. అదేవిధంగా వైద్యుని సూచనల మేరకే అనుసరించడం ఉత్తమం.

4. గార్లిక్ / వెల్లుల్లి / చిన్నుల్లి :

వెల్లుల్లి ఔషధ ప్రయోజనాల దృష్ట్యా తరతరాలుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న అద్భుతమైన వంటింటి పదార్ధం. వెల్లుల్లి, అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ అల్లిసిన్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.

మొదటగా, తాజా గార్లిక్ రెబ్బలను చూర్ణం చేసి, ఆపై కొద్దిగా సాల్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. కాసేపటికే మీరు కొంత ఉపశమనం పొందగలుగుతారు .

5. పుదీనా Tea :

లవంగాల లాగానే, పుదీనాకు కూడా పంటి బాధ నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. పుదీనా సువాసనను ఇచ్చే మెంతోల్, ప్రధానంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

ఒక టీస్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచి, కాస్త చల్లబడిన తరువాత, వాటితో పుక్కిలించొచ్చు. లేదా టీ లా తాగేసేయొచ్చు. తడి టీ-బ్యాగ్ ను కూడా నొప్పి తగ్గే వరకూ నొప్పి ఉన్న భాగంలో అదిమిపెట్టుకోవచ్చు..

ఒక కాటన్-బాల్ మీద కొన్ని చుక్కల పిప్పరమెంట్ నూనె వేసి, తాత్కాలిక నివారణిగా ప్రభావిత పంటిమీద ఉంచాలి. ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది.

6. థైమ్ :

థైమ్ దాని ఔషధ ప్రయోజనాల పరంగా ప్రసిద్ది చెందిన మొక్కగా అందరికీ సుపరిచితం. అంతేకాకుండా కోరింతదగ్గు, ధనుర్వాతం వంటి ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన నివారణగా చెప్పబడుతుంది కూడా. ఈ థైమ్ ఎసెన్షియల్ నూనెలో ప్రధానంగా ఉండే థైమోల్, క్రిమినాశక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఒక చుక్క థైమ్ ఎసెన్షియల్ నూనెను ఒక గ్లాసు నీటిలో కలిపి మౌత్ వాష్ చేయడానికి వినియోగించవచ్చు.

మరో పద్ధతి ఏమిటంటే, కొన్ని చుక్కల థైమ్ ఎసెన్షియల్ నూనె, మరియు నీళ్ళను ఒక కాటన్-బాల్ పై చల్లుకుని, నొప్పిగా ఉన్న పంటి అపసవ్య దిశలో అదిమినట్లుగా ఉంచండి. తక్కువ సమయంలోనే మంచి ఉపశమనం ఉంటుంది.

7. అలోవెరా :

అలోవెరా గుజ్జు(జెల్ వంటి పదార్ధం), కాలిన గాయాలు మరియు చిన్న చిన్న కోతలను నయం చేస్తుంది. కొంతమంది చిగుళ్ళను శుభ్రం చేయడానికి మరియు బాధ నుంచి ఉపశమనం పొందడానికి కూడా అలోవెరా జెల్‌ని వాడతారు.

అలోవెరాలో ఉండే సహజ సిద్దమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, దంత క్షయం కలిగించే బాక్టీరియాను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

అలోవెరా జెల్‌తో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి.

8. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో శుభ్రం చేయడం :

సమర్థవంతమైన యాంటీ బాక్టీరియల్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో పుక్కిలించడం (మౌత్ వాష్) ఎంతో ఉత్తమం. ముఖ్యంగా పంటి నొప్పి ఇన్ఫెక్షన్ కారణంగా వస్తే ఆ సమస్య మొత్తం తీరిపోతుంది. అయితే, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని మింగకూడదు. దీని వల్ల నష్టాలుంటాయి. కాబట్టి, పుక్కిలించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్  తీసుకుని, దీనికి సమానంగా నీటిని కలిపి 30 సెకన్ల పాటు నోటిలో ఉంచి పుక్కిలించాలి. దాన్ని ఉమ్మిన తరువాత, నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.  చిన్నపిల్లలకు మాత్రం ముఖ్యంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిట్కా వాడొద్దు.

9. లవంగాలు :

లవంగాలు ఇండోనేషియాలోని మలుకు దీవులకు చెందిన మసాలా దినుసులు. వాటిలో సహజసిద్దమైన మత్తు మందుగా పనిచేసే యూజీనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది.

లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దంతాలు మరియు చిగుళ్ళ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అత్యుత్తమంగా సహాయపడతాయి.

లవంగాల నూనెలో ఒక చిన్న కాటన్- బాల్ ని నానబెట్టి, ప్రభావితమైన దంతాల భాగంలో ఉంచడం ద్వారా ఉపశమనం పొందొచ్చు.

లవంగాలను నొప్పి ఉన్న భాగంలో పెట్టి.. ఆ రసాన్ని మింగుతూ ఉండండి.. ఇలా రోజూ 30 నిమిషాలు చేయండి..

దంతవైద్యుడిని ఎప్పుడు సంప్రదించవలసి ఉంటుంది :

ఈ గృహ చిట్కాలు తాత్కాలిక ఉపశమనానికి మాత్రమేనని గుర్తుంచుకోండి. పంటి నొప్పి ఒకటి లేదా రెండు రోజులకు మించి ఉంటే డెంటల్ డాక్టర్‌ని కవలవడం తప్పనిసరి.

పంటి నొప్పికి త్వరితగతిన చికిత్స చేయని ఎడల, ఇది చిగుళ్ళ వ్యాధి, కణితి లేదా వాపు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. దంతాల దగ్గర కణితిగా ఏర్పడితే, అది బాక్టీరియాతో కూడిన చీమును కలిగి ఉంటుంది.

జాగ్రత్తలు :

పంటి నొప్పి మరియు దంతాల వద్ద కణుతులు లేదా గడ్డలను నివారించడానికి ఉత్తమ మార్గం, పళ్ళు మరియు చిగుళ్ళను వీలైనంత ఆరోగ్యంగా ఉంచడం. క్రమంగా కింది దశలను అనుసరించడం ద్వారా, అది సాధ్యపడుతుంది :

• ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు, కనీసం 2 నిమిషాలపాటు పళ్ళు తోముకోవడం
• చక్కెర ఆహారాలు, పానీయాలను తగ్గించడం
• దంతాల మధ్య మరియు “గమ్ లైన్” కింద శుభ్రం చేయడానికి క్రమం తప్పకుండా “ఇంటర్‌డెంటల్” బ్రష్‌ను ఉపయోగించడం
• ధూమపానం ఆరోగ్యానికే కాదు దంతాలకు కూడా హానికరం, ఎందుకంటే ఇది దంత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది
• క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం.

ముందుగా చెప్పినట్లుగా, రెండు రోజుల కన్నా ఎక్కువ కాలం పంటి నొప్పి ఉంటే, వారు ఖచ్చితంగా సలహా, చికిత్స కోసం వారి డెంటల్ డాక్టర్‌ని సంప్రదించాలి.

Posted on

How to make raagi roti recipe in Telugu – రాగి రొట్టె రెసిపీ

ప్రస్తుత జనరేషన్ వారి హెల్త్ మరియు ఫిసికల్ అపియరెన్స్ పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందంతో పాటు వారి ఆరోగ్యానికి కూడా మంచిదనిపించే పదార్థాలను మాత్రమే తింటున్నారు. మన తాతల నాటి కాలంలో ఎంతో ప్రసిద్ధంగా ఉన్న రాగి మిల్లెట్ మళ్ళీ ఈ కాలపు యువకుల ద్వారా మన మధ్యలో ప్రసిద్ధి చెందింది.

రాగి వలన మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎముకలను బలపరుస్తుంది, బరువుని తగ్గిస్తుంది, చర్మపు తేజస్సుని పెంచుతుంది ఇంకా మరెన్నో. మరి ఇంత ఆరోగ్యకరమైన రాగి తో చేసే రాగి రొట్టె యొక్క తయారీ విధానాన్ని చూద్దామా!

కావలసిన పదార్థాలు

 • గోధుమ పిండి – 250 గ్రాములు
 • రాగి పిండి – 100 గ్రాములు
 • ఉప్పు
 • నూనె – 2 టేబుల్ స్పూన్

తయారీ విధానం

 • ఒక బౌల్ లో 250 గ్రాముల గోధుమ పిండి, 100 గ్రాముల రాగి పిండి, కొద్దిగా ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసుకొని కొద్దికొద్దిగా నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.
 • ఆ పిండిపై ఒక శుభ్రమైన క్లాత్ ని వేసి 30 నిమిషాల పాటు ఊరనివ్వాలి.
 • ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని గోధుమ పిండిని అద్దుకుంటూ చపాతీలా తిక్కుకోవాలి.
 • స్టవ్ పై ప్యాన్ ని ఉంచి నూనె రాసి, ప్యాన్ వేడెక్కిన తరువాత రొట్టెలను వేసి రెండు వైపులా బాగా కుక్ అయ్యే వరకు వేడి చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన ‘రాగి రొట్టెలు’ తయారు!
Posted on

How to make Madatha kaja sweet in Telugu – మడత కాజా స్వీట్ రెసిపీ

తెలుగు వారి సాంప్రదాయక తీపి వంటకం ‘మడత కాజా’. ఈ స్వీట్ ని ప్రత్యేకంగా దీపావళి లాంటి పండుగ సమయాలలో తయారు చేసుకుంటారు. క్రిస్పీ మరియు జూసీ టేస్ట్ ఈ స్వీట్ యొక్క ప్రత్యేకత. మరి ఎంతో టేస్టీ స్వీట్ ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

 • మైదా – 1 కప్పు
 • చక్కెర – 1 కప్పు
 • బట్టర్ – 2 టేబుల్ స్పూన్లు
 • యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
 • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారీ విధానం

 • ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ కరిగించిన బట్టర్ వేసి గెడ్డలు లేకుండా పొడిగా కలుపుకోవాలి.
 • తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
 • ఆ పిండిని 5 నిమిషాల పాటు పక్కకు పెట్టి, ఆ తరువాత చిన్న బాల్స్ లా చేసి, చపాతీ రోలర్ తో పల్చగా చపాతీలా తిక్కుకోవాలి.
 • రెండు చపాతీలు తీసుకొని ఒకదాని మీద మరొకటి వేసి మడత కాజాకు కావలసిన వెడల్పుతో చపాతీని రోల్ చేసుకోవాలి.
 • ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాజాలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
 • స్టవ్ పై ప్యాన్ లో డీప్ ఫ్రై కి కావలసినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తరువాత కాజాలను ఫ్రై చేసుకోవాలి.
 • బాగా ఫ్రై అయిన తరువాత వాటిని తీసి ఒక ప్లేట్ లో పక్కకు పెట్టుకోవాలి.
 • ఇప్పుడు, చక్కెర పాగు తయారు చేసేందుకు ఒక ప్యాన్ లో 1 కప్పు నీళ్లు, 1 కప్పు పంచదార వేసి చక్కెర బాగా కరిగే దాకా కలుపుతూ వేడి చేయాలి.
 • అందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి పాకం చిక్కబడేదాకా వేడి చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
 • ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాజాలను ఆ పాకంలో వేసి కాసేపు నాననిస్తే ఎంతో తియ్యని జూసీ మడత కాజాలు రెడీ!
Posted on

Easy veg sandwich recipe in Telugu – బ్రెడ్ సాండ్విచ్ రెసిపీ

ఎప్పుడూ ఒకే లాంటి బ్రేక్ ఫాస్ట్ తిని బోర్ కొట్టేసిందా! మరి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటి బ్రేక్ ఫాస్ట్ ని తయారు చేయాలనుకుంటున్నారా! అయితే తప్పక ఈ సాండ్విచ్ ని ట్రై చేసి ఎంతో తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ని తయారు చేసుకోండి.

కావలసిన పదార్థాలు

 • బట్టర్ – 2 టేబుల్ స్పూన్
 • బ్రెడ్ ముక్కలు – 3
 • ఉల్లిపాయలు
 • టమోటా
 • క్యారట్
 • క్యాప్సికం
 • టమోటా కెచ్అప్
 • సోయా సాస్
 • రెడ్ చిల్లీ సాస్
 • ఉప్పు
 • రెడ్ చిల్లీ పౌడర్
 • పెప్పర్ పౌడర్
 • మ్యాంగో పౌడర్
 • కొత్తిమీర
 • మోజెరెల్ల చీస్
 • పసుపు పొడి

తయారీ విధానం

 • స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ల బట్టర్ ని వేసుకొని బట్టర్ ని కరిగించుకోవాలి.
 • బట్టర్ కరిగిన తరువాత అందులో 2 తురిమిన ఉల్లిపాయలు, 2 తురిమిన క్యాప్సికం, 1 తురిమిన క్యారట్, చిన్నగా తరిగిన 2 పచ్చి మిర్చీలు వేసి 5 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
 • వేసుకున్న కూరగాయలు బాగా ఫ్రై అయిన తరువాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మ్యాంగో పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
 • ఆ తరువాత 2 తరిగిన టమోటాలు వేసి 2 నిమిషాలు కుక్ చేయాలి.
 • టమోటాలు బాగా ఉడికిన తరువాత అందులో 1 టీ స్పూన్ టమోటా కెచ్అప్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
 • చివరిగా అందులో రెడ్ చిల్లీ పౌడర్, కొంత కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 4 క్యూబ్స్ మోజెరెల్ల చీస్ ని వేసి చీస్ కరిగే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
 • దానిపై కొత్తిమీరతో గార్నిష్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
 • ఇప్పుడు బ్రెడ్ ముక్కల యొక్క సైడ్స్ ని ట్రిమ్ చేసి, తయారు చేసుకున్న స్టఫ్ ని రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి.
 • ఇప్పుడు ఒక ప్యాన్ పై బట్టర్ రాసి సాండ్విచ్ యొక్క రెండు వైపులూ ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి బ్రెడ్ సాండ్విచ్ రెడీ!
Posted on

Paneer handi recipe in Telugu – పన్నీర్ హండి రెసిపీ

ఎన్ని రకాలుగా వండుకున్నా ఏ ఒక్కరూ విసుగుచెందని ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్. ఎంతో రుచి, ఎంతో ఆరోగ్యం! మరి డిన్నర్ కి చపాతీ, ఫుల్కా, నాన్ లేదా రోటీలకు సైడ్ డిష్  అయిన పన్నీర్ యొక్క మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ – ‘పన్నీర్ హండి’ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

 • పెరుగు – 1 కప్పు
 • ధనియాల పొడి – 2 టీ స్పూన్లు
 • పసుపు పొడి – 1 టీ స్పూన్
 • నూనె – 1 కప్పు
 • పన్నీర్ క్యూబ్స్ – 1 కప్పు
 • తరిగిన ఉల్లిపాయలు – 2
 • తరిగిన టమోటాలు -3
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు
 • ఫ్రెష్ క్రీమ్ – 4 టీ స్పూన్లు
 • కొత్తిమీర

తయారీ విధానం

 • 1 కప్పు పెరుగులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
 • స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1 కప్పు నూనె పోసి, 1 కప్పు పన్నీర్ క్యూబ్స్ ని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
 • ఆ తరువాత పన్నీర్ ను పక్కకు తీసి పెట్టుకొని అదే నూనెలో తరిగిన 2 ఉల్లిపాయలను వేసి డీప్ ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి.
 • అదే నూనెలో తరిగిన 3 టమోటాలను వేసి ఫ్రై చేసుకోవాలి, అందులో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి 4 నిమిషాలు వేయించుకోవాలి.
 • టమోటా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా తయారు చేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని అందులో వేసి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేయాలి.
 • ఆ తరువాత అందులో ఫ్రై చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి.
 • ఇప్పుడు అందులో 4 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి.
 • ముందే ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ని కూడా అందులో వేసి 2 నిమిషాలు కుక్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ‘పన్నీర్ హండి’ తయారు!
Posted on

Bobbatlu sweet recipe in Telugu – నేతి బొబ్బట్లు / ఓళిగలు రెసిపీ

మన రాష్ట్రాలలో ముఖ్యంగా రాయలసీమలో బొబ్బట్లు ఎంతో ప్రసిద్ధమైన తీపి పదార్థం. ఉగాది వంటి పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఎంతో ఇష్టంగా చేసుకొని నెయ్యి లేదా పాలతో తింటారు. వీటిని ఓళిగలు అని కూడా అంటారు.

ఇటీవలే వచ్చిన వార్తల్లో అనంతపురం జిల్లాలో ఓళిగలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారట. ఓళిగలలో ఎన్నో రకాలు ఉన్నాయి. పిండి ఓళిగలు, కొబ్బరి ఓళిగలు, కోవా ఓళిగలు ఇంకా మరెన్నో. మరి ఎంతో సులువైన పిండి ఓళిగలను ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

 • మైదా – 1 కప్పు
 • శనగ పిండి – 1 కప్పు
 • బెల్లం తురుము – 1 కప్పు
 • బాదాం మరియు జీడి పప్పు పొడి – 1 కప్పు
 • ఉప్పు – 1 స్పూన్
 • యాలుకల పొడి – 1 స్పూన్
 • నూనె / నెయ్యి – 2 స్పూన్లు

తయారీ విధానం

 • ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ నెయ్యి మరియు కొంత నీళ్లు పోసుకొని గెడ్డలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి.
 • ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు శనగ పప్పులు వేసి తగినంత నీళ్లు పోసి, మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
 • ఉడికిన శనగ పప్పుని స్ట్రెయినర్ లో వేసి నీళ్లన్నీ పోయాక మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 • ఒక బౌల్ లో ఈ గ్రైండ్ చేసిన శనగ పప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు బాదాం జీడీ పప్పు పొడి, 1 టీ స్పూన్ యాలుకల పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి.
 • ఇప్పుడొక చపాతీ చెక్కపై పాలిథిన్ కవర్ పై నెయ్యి రాసి ముందే సిద్ధం చేసి పెట్టుకున్న మైదా పిండిని కొద్దిగా తీసుకొని కవర్ మధ్యలో ఉంచి పల్చగా వొత్తి, అందులో స్టఫింగ్ పెట్టి, అన్ని వైపులా  పిండి కవర్ చేసి బాల్ లా చేసుకోవాలి.
 • దానికి నెయ్యి రాసి పాలిథిన్ కవర్ మధ్యలో పెట్టి చపాతీ షేప్ వచ్చేలా చేతితో పల్చగా ఒత్తుకోవాలి.
 • ఇప్పుడొక తవా పై నెయ్యి రాసి, సిద్ధం చేసుకున్న బొబ్బట్టుని వేసి రెండు వైపులా నెయ్యితో ఎర్రగా కాల్చుకోవాలి.
 • ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు రెడీ!
Posted on

Paneer bhurji recipe in Telugu – పన్నీర్ బుర్జీ డ్రై సబ్జీ రెసిపీ

ఎంతో న్యూట్రిషన్స్ తో కూడిన ఒక ఆహార పదార్థం పన్నీర్. దీనిని కాటేజ్ చీస్ అని కూడా అంటారు. పన్నీర్ తో అనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. పులావ్, బిరియాని, లిక్విడ్ మరియు డ్రై సబ్జీలు ఇంకా ఎన్నో. పిల్లలు ఎంతో ఇష్టపడే పన్నీర్ తో డ్రై ‘పన్నీర్ బుర్జీ’ ని చేయడానికి కావలసిన పదార్థాలు మరియు చేసే విధానాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

 • నూనె
 • జీలకర్ర  – 1 టేబుల్ స్పూన్
 • తరిగిన ఉల్లిపాయలు – 2
 • పచ్చ బఠానీలు – 1/2 కప్పు
 • తరిగిన టమోటాలు – 2
 • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
 • ఉప్పు –  2 టేబుల్ స్పూన్
 • తురిమిన పన్నీర్ – 300 గ్రాములు
 • కొత్తిమీర

తయారీ విధానం

 • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తరువాత కొన్ని జీలకర్ర, 2 తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి.
 • ఆ తరువాత 1/2 బౌల్ పచ్చ బఠానీలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసి ఆ తరువాత మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేయాలి.
 • ఆ తరువాత అందులో 2 తరిగిన టమోటాలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
 • ఇప్పుడు అందులో 2 తరిగిన పచ్చి మిర్చులు వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేయాలి.
 • ఆ తరువాత అందులో 1/2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత వేసి ఉడికించాలి.
 • ఆ తరువాత పై మిశ్రమంలో తురిమి ఉంచుకున్న 300 గ్రాముల పన్నీర్ ను వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
 • బుర్జీ ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై సబ్జీ ‘పన్నీర్ బుర్జీ’ రెడీ!