Posted on

Control body odor tips in Telugu – శరీర దుర్వాసన నియంత్రణకు చిట్కాలు

శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు నుంచి తలెత్తు చెడు వాసన.ఈ దుర్వాసనను భరించడం ఎంతో కష్టం, ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర సమావేశాల నుంచి దూరం చేస్తుంది.మీరు ఎలాంటి కోవకు చెందిన వారైనను, ఈ చెడు వాసన మితో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి  గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

 • ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
 • ఈ దుర్వాసన మన శరీరంలో  “eccrine” మరియు “apocrine” అనే  గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.
 • మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.
 • మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి  తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.
 • Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ  ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

చెడు వాసనకు కారణం:

పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా  చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో  చిన్నవిగా అనిపించే ఇవి

మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు, మీకు “eczema” లేదా “psoriasis” అనే  అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం.

నివారణ మార్గములు :

ప్రతీ రోజు స్నానం లొ  క్రిమి సం హారిక సబ్బును ఉపయొగించాలి 

కాటన్ దుస్తులు ధరించాలి, ముఖ్యముగా  undergarments, ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.

ఎప్పటికప్పుడు 80% చెమట పట్టిన, మరియు దుర్వాసన కలిగించే ప్రదేశాలని సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.

నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీలను తీసుకోవద్దు 

రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి కారణం అయ్యే మద్యం కి దూరంగ ఉండటం ఎంతో అవసరం 

మీ రోజు వారి మందులు అనగా గర్భ మాత్రలు, స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి.

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

 • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే  ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది
 • మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్  పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
 • పొడి రూపంలో ఉన్న బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల అది రసాయనాలను గ్రహించి శరీర దుర్గందాన్ని తగ్గిస్తుంది
 • ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
 • సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది,
 • ముఖ్యముగా మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో  తీసుకొవడం ఎంతో అవసరం 
 • మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
 • ఒక టేబుల్ స్పూన్  సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
 • మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి  మన మానసిక స్తితిని పాడుచేస్తుంది  అందుకే
 • దుర్వాసన అనేది మి వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు

పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

Posted on

Tips for glowing skin in Telugu – అందమైన మరియు ప్రకాశించే కాంతివంతమైన చర్మం కోసం సహజమైన పద్ధతులు

మన రోజువారీ జీవితంలొ స్క్రబ్బింగ్  అనేది అలవాట్లలో ఒక భాగంగా మార్చుకొవాలి. ఏ దుమ్మ,ధూళి కణాలు లోపించిన, మరియు అధిక జిడ్డు లేని ముఖాన్ని ఎర్పరుచుకొవడం అనేది మన సౌందర్యం యొక్క రహస్యమె అని చెప్పుకోవాలి .  స్క్రబ్బింగ్  ను మీ  చర్మం యొక్క  రకాన్ని బట్టి వారానికి ఒకసారి తీసుకోవాలి. ఎన్నొ వివిధ రకముల కెమికల్స్ మార్కెట్ లో లభిస్తునాయి, వీటిలొ రసాయనాల అధిక కంటెంట్ లో ఉండడం వల్ల చర్మం మరియు మీ లుక్ హానికరం అయ్యె  అవకాశాలు ఉన్నాయి.

మీరు నిజంగా మీ చర్మం యొక్క నాణ్యత  కొరుకునేవారైతె, ఈ కెమికల్స్  కి దూరంగా   ఉంటూ  ఎంతో సహజ సిద్దమైన సహజ మార్గాలు ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండండి,

చర్మ రక్షణకై తక్షణ ఫలితాలు ఇచ్చే ఎన్నో వివిధ సహజ మార్గాలు ఉన్నాయి .

 

*నిమ్మ-తేనె మిశ్రమము :

నిమ్మ అనేది ప్రకృతి మనకు ఇచ్చిన వరం లాంటిది, ఇది ఆమ్ల మరియు ఒక గొప్ప సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా ఎంతో ఉపయోగ పడుతుంది.

నిమ్మను తేనెతొ కలిపి ముఖానికి పట్టిస్తే కాంతివంతమైన మరియు ఎంతొ అందమైన చర్మాని ఇస్తుంది అనడంలొ సందేహం లేదు, మరియు ఈ మిస్రమము మన చర్మం పై ఎంతొ ప్రభావాన్ని చూపిస్తుంది.

సహజ సౌందర్యం కొల్పొయిన మరియు, ఒడిలిపొయిన చర్మాన్ని మళ్ళీ కాంతివంతంగా మార్చాలంటే 2 టేబుల్ స్పూన్లు తేనెను, 1 టేబుల్ స్పూన్  నిమ్మరసంను,1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను మరియు ఒకటిన్నర  చక్కెరను కలిపి ముఖనికి రాసుకుని  కొంత సేపటి  తర్వాత నీటితొ శుభ్రం  చేసుకోవాలి .

 

*ఉప్పు, నిమ్మ మరియు చక్కెర మిశ్రమము:

మీరు మీ  చర్మం యొక్క ఛాయను పెంచుకోవాలన్నా,మీ చర్మాన్ని ఉత్తమ మార్గంలో ఉంచుకోవాలన్నా  ఈ పద్దతి ఎంతో శ్రేయస్కరం మరియు సులభం,

2 టేబుల్స్పూన్లు ఉప్పు,అరనిమ్మకాయ రసం,మరియు  చక్కెర కలిపి మీ ముఖానికి  పట్టిస్తే ఈ మిశ్రమం సహజ మార్గంలో స్క్రబ్బింగ్ తర్వాత చర్మం సరైన టోన్ పొందడానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

 

*జిడ్డుగల చర్మం కోసం అవెకాడో పండు మరియు ఓట్ మీల్(oatmeal):

ఆరోగ్యవంతమైన మరియు తేమ తో కూడిన చర్మం కొసం 2 టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్,  1 టీస్పూన్  తేనె, మరియు 1 టీస్పూన్ అవెకాడో పండు కలిపి ఒక గిన్నెలొ పేస్ట్ లాగా చేసుకుని  ముఖం పై రాసుకుని నీటితొ శుభ్రం చేసుకుంటె మంచి ఫలితాన్నిస్తుంది.

బేకింగ్ సోడా బ్లాక్  హెడ్ స్క్రబ్బింగ్   ఈ స్క్రబ్బింగ్ చర్మంలో  ఉన్న బాక్టీరియాను  తొలగించి నల్ల మచ్చలను దూరం చేసి  చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది.

1 టేబుల్ స్పూన్ చక్కెర పొడినీ, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడానీ, 2 టేబుల్ స్పూన్లు నీటిని, కలిపి చర్మం పై రాసి మసాజ్ చేయాలి, తరువాత వెచ్చని నీటితో కడగాలి .

 

* అరటి మరియు పంచదార మిశ్రమము :

అరటి పండు  వివిధ పోషకాలతొ నిండి ఉంది, మీ చర్మ సౌందర్యాన్ని కాపడుకోవాలంటె 1 పచ్చి  అరటి పండు  1\4 కప్పు పొడి చక్కెర , 1\4 కప్పు పొడి బెల్లము, వీటన్నింటిని ఒక గిన్నెలో పేస్ట్ గా  చేసి చర్మం పై రాసుకుని మసాజు చేయాలి.

10-15 నిమిషాలు అది ఉంచి వెచ్చని నీటితొ శుబ్రం చేసుకొవాలి

 

*నారింజ రసం మరియు తేనె మిశ్రమము:

ఆరొగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కొసం 3 కప్పుల నారింజ రసం మరియు 1\2 కప్పు వెచ్చని తేనె కలిపి ముఖం పై రాసుకుని అరగంట తరువాత వెచని నీటి తొ కడిగి వేయలి .

Posted on

Facial hair removal tips in Telugu – ముఖం పై అవాంఛిత రోమాలు తొలగించడానికి సహజ నివారణలు

ఎంతో మంది స్త్రీలు వారి సౌందర్యాన్ని గురించి మరెంతో దిగులు చెందుతారు. కాని వారి తాపత్రయం అంతా ముఖం పై ఉన్న అవాంఛిత రోమాలు గురించే. అవాంఛిత రోమాలు  అనేది సహించలేనిది మరియు ఎంతో అందమైన ముఖాన్ని అర్ద రహితంగా చేస్తుంది. ఇది వారి ముఖ రోమాలు తో మహిళల సాధారణ యుద్ధంగా అనిపిస్తుంది.

ముఖం పైన కొంత రోమాలు ఉన్నను అకస్మాత్తు గా పెరిగిపొయిన  అవాంచిత రోమాలు స్త్రీ  సౌందర్యం పై ఎంతో భాధని, భయాన్ని కలిగిస్తుంది. దీనిని ఆంగ్లములొ “హిర్సుతిసం” అని పిలుస్తారు అనగా “ఆతిరూమత్వము హార్మోన్ల అసమతుల్యత, శరీరం లో ఈస్ట్రోజెన్ స్థాయిలు దానిని కారణం ముఖ రోమాలు పెరుగుదల నిర్ణయిస్తుంది

ఈ అతి రోమత్వము దీర్ఘకాలిక సమస్య మరియు మీరు వాక్సింగ్, షేవింగ్ మరియు ఇతర చికిత్సలు వల్ల క్రమంగా మరింత పెరుగుతాయ. దీనికి  ఒక శాశ్వత పరిష్కారం అయితే లేదు, కానీ అనేక మార్గాల్లో లబ్ది చేకూర్చే కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.

మీరు ఈ విధంగా చేయవచ్చు………

1. పసుపు: మన ఇళ్లలో ఇది సాధారణంగా కనిపించేది, మరియు అందం అనే పదానికి ఒక మెడిసిన్ లా ఉపయోగిస్తారు. పసుపు తరచుగా తేజస్సు మరియు ఒక అందమైన ముఖం కోసం ఉపయోగిస్తారు.

ఇది యాంటీ బాక్టీరియల్, అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని నింపి అందంగా కనిపించెలా చేస్తుంది.

పసుపుని  సెనగపిండి తో కలిపి ఉపయోగిస్తే మరింత మంచి ఫలితాలు లభిస్తాయి, పసుపు రోమాలు పెరుగుదలను అదుపులో ఉంచుతుంది.

2. సెనగపిండి: ఇది సాంప్రదాయకంగా అనేక భారతీయ ఇళ్లలో  ముఖానికి మాస్క్ లా ఉపయోగిస్తారు.

మన చర్మం యొక్క మందబుద్ధి లక్షణమును  తొలగించుటలో ఎంతో ఉపయొగపడడంలో సహాయ పడుతుంది.

ఈ సెనగపిండిని పసుపు మరియు పెరుగుతో కలిపి ఉపయోగించినచో ముఖ చికిత్స కంటే ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు ఏ దుష్ప్రభావాలు ఇవ్వవు అనేది జగమెరిగిన సత్యము.

3. చక్కెర మిశ్రమం:

మిరు ఇళ్లలో  చేసుకునే వ్యాక్సింగ్ పద్దతి, అన్ని వ్యాక్సింగ్ పద్దతుల కన్న భిన్నంగా, తక్కువ మరియు అస్సలు నొప్పి లెకుండా మంచి ఫలితాలను అందిస్తుంది.

కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపిన ఈ మిశ్రమం ముఖం పై బ్లీచ్ లా పనిచేస్తుంది,

అయితే, ఈ ప్రక్రియ అత్యంత సమర్థవంతమైనది కానీ ఓ మొస్తరు భాధను కలిగిస్తుంది.

ఇది ఒక క్లాత్ స్ట్రిప్ చేత తొలగించి సాధారణ వ్యాక్సింగ్ పద్దతి అమలు చేయబడుతుంది.

4. ఎగ్ మాస్క్:

గుడ్డు యొక్క తెల్ల సొనను తీసి ఒక చెంచాడు పంచధార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి  పేస్ట్ లా తయారు చేసుకోవాలి, ఈ పేస్ట్  ని ముఖం పై రాసుకుని కొంత సమయం తర్వాత చూస్తే  ఒక మాస్క్ లా మారుతుంది. మెల్లగా మాస్క్ ని తిసి వేస్తే దానితో ఈ  అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతుంది. గుడ్డు, పంచధార, మొక్కజొన్న పిండి అన్నీ ఇంట్లో సులభంగా అందుబాటులో వుండేవే కనుక మంచి ఫలితాలను అందిస్తాయి.

5. ఆహారంలో ఫైటోఈస్త్రోజెన్లు చేర్చండి:

సరైన భోజనం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో  సహాయపడుతుంది.

సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖ రోమాలు పెరుగుతుంది, సరియైన భోజనం తీసుకొకపొవడం వలన ఇది అధికమయ్యే అవకాశాలు ఎక్కువ.

ముఖం పై ఉన్న రోమాలు తగ్గుతుంది అని ఫైటో ఈస్త్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని పరిశోధకులు సూచిస్తున్నారు  .

ఫైటో ఈస్త్రోజెన్లు అధికంగా అవిసె గింజలు, సోపు, అల్ఫాల్ఫా మరియు ఘొటు కళా (ఉత్తర భారతదేశం లో బ్రాహ్మి)లో ఉన్నాయి.

మీ ఆహార ప్రణాళికను  సరిగా ఎర్పరుచుకుంటె ఈ   అతి రోమత్వము ఎదుర్కోవడంలో మంచిగా తోడ్పడుతుంది