Paneer fried rice recipe in Telugu – పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

ఎంతో వేగవంతమైన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్ ‘ఫ్రైడ్ రైస్’. డిన్నర్ కి హోటల్ వెళ్లిన ప్రతి సారి పిల్లలు ఎంతో ఇష్టంగా కోరుకునే ‘పన్నీర్ ఫ్రైడ్ రైస్’ ని ఇంట్లోనే ఎంతో సులువుగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపి కి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానాన్ని చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్
  • టమోటా కెచప్ – 1 టేబుల్ స్పూన్
  • సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
  • మైదా – 1 కప్పు
  • కట్ చేసుకున్న పన్నీర్ – 1 కప్పు
  • తరిగిన గ్రీన్ కాప్సికం – 1 కప్పు
  • తరిగిన క్యారట్ – 1 కప్పు
  • వెల్లుల్లి ముక్కలు
  • నూనె
  • స్వీట్ కార్న్
  • గ్రీన్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్
  • వినిగర్ – 1 చిటికెడు
  • ఉడికించిన బియ్యం – 1 కప్పు
  • స్ప్రింగ్ ఆనియన్
  • తరిగిన బీన్స్ – 1 కప్పు

తయారీ విధానం

  • ఒక బౌల్ లో 1 టీ స్పూన్ టమోటా కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ సొయా సాస్, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అందులో పన్నీర్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె వేసుకొని, అందులో ఈ పన్నీర్ ముక్కలను ఫ్రై చేసి పక్కన పట్టుకోవాలి.
  • అదే ప్యాన్ లో మరో 2 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తరువాత 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
  • తరువాత అందులో 1 కప్పు తరిగిన గ్రీన్ కాప్సికం,  1 కప్పు తరిగిన క్యారట్, 1  కప్పు తరిగిన బీన్స్ వేసి దోరగా వేయించుకోవాలి.
  • వెజిటేబుల్స్ ని దోరగా వేయించిన తరువాత 2 టీ స్పూన్ స్వీట్ కార్న్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ సొయా సాస్ వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు కలుపుకొని వండిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  • అందులో 1 టీ స్పూన్ వినిగర్ కూడా వేసి కలుపుకోవాలి.
  • ఆ తరువాత ఇంతకు ముందు ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ని వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ!