Posted on

Aloo methi paratha recipe in Telugu – ఆలూ మేతి పరాతా రెసిపీ

ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫన్ లేదా డిన్నర్ సమయంలోనైనా సరే ఎంతో సులువుగా తొందరగా ఆకలిని తీర్చే ఒక ఆహారం ‘ఆలూ మేతి పరాతా’. ఎంతో రుచికరమైన ఈ న్యుట్రీషియస్ పరాతాను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • గోధుమ పిండి- 1 కప్పు
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • నూనె
  • బంగాళదుంపలు – 3
  • తరిగిన పచ్చి మిర్చులు – 2
  • కసూరి మేతి – 1 టీ స్పూన్
  • చాట్ మసాలా – 1 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • జీరా – 1 టీ స్పూన్
  • మెంతి ఆకులు – 1 కప్పు
  • అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా -1 టీ స్పూన్
  • బట్టర్ – 2 టీ స్పూన్లు

తయారీ విధానం

  • ఒక బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • పరాతా యొక్క స్టఫింగ్ ని తయారుచేయడానికి ముందుగా 3 బంగాళదుంపలను కుక్కర్లో ఉడకబెట్టి తోలు తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి.
  • ఆ తరువాత అందులో చిన్నగా తరిగిన 2 పచ్చి మిర్చులు, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి.
  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె పోసుకొని 1 టీ స్పూన్ జీరా, 1 కప్పు మేతి ఆకులు, వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి.
  • పై మిశ్రమంలో మ్యాష్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని దోరగా వేయించి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు తయారు చేసి ఉంచుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీ కర్రతో చిన్నగా తిక్కి మధ్యలో బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అన్ని వైపులా పిండితో కవర్ చేసి పరాతా లా తిక్కుకోవాలి.
  • స్టవ్ పై ప్యాన్ ఉంచి బట్టర్ రాసి ప్యాన్ వేడెక్కిన తరువాత పరాతాను రెండు వైపులా బాగా ఎర్రగా అయ్యేలా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ మేతి పరాతా రెడీ!