Posted on

How to make potato tawa in Telugu – పొటాటో తవా / ఆలూ కే నాన్ రెసిపీ

బంగాళదుంపలతో ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇంకా డిన్నర్, ఏ సమయంలోనైనా బంగాళదుంపలతో ఎన్నో రుచికరమైన వంటలను చేసుకోవచ్చు. సడన్ గా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, లేదా మీ కొరకు తొందరగా ఏదైనా స్నాక్స్ ని చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఈజీ అండ్ క్విక్ పొటాటో తవా రెసిపీ ని ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 2
  • నిమ్మరసం – 1 టేబుల్స్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • అల్లం వెలుల్లి పేస్ట్ – 1 టేబుల్స్ స్పూన్
  • నూనె
  • పసుపు పొడి – 1 టేబుల్స్ స్పూన్

తయారీ విధానం

  • ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి తోలు తీసి, చిన్న చిన్న రౌండ్ స్లైసస్ గా కట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
  • నీళ్లు బాగా ఉడుకుతుండగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తరువాత నీటిని వడగట్టి బంగాళదుంపలను ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెలుల్లి పేస్ట్ వేసి అన్ని స్లైసస్ పై సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్లు కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక తవా ఉంచి 4 స్పూన్ల నూనెని రాసి బంగాళదుంప స్లైసస్ ని రెండు వైపులా రోస్ట్ చేసుకుంటే, ఎంతో రుచికరమైన పొటాటో తవా రెడీ!