Posted on

Raw banana chips in Telugu – బనానా చిప్స్ రెసిపీ

బనానా చిప్స్ కేరళలో ఎంతో ఫేమస్. దీనిని నేంత్ర-కాయ ఓపెరి లేదా ఉప్పరీ అని పిలుస్తారు. కేరళలో వీటిని కొబ్బరి నూనెలో వేయించి తయారు చేస్తారు. అరటి పండు మరియు అరటి కాయ రెండింటినీ ఈ రకమైన చిప్స్ తయారీకి ఉపయోగిస్తారు. వీటితో సాల్ట్, మసాలా చిప్స్ లేదా బెల్లం చిప్స్ అని అనేక రకాలుగా చేస్తారు. మరి ఇప్పుడు సాల్ట్ బనానా చిప్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • పసుపు పొడి – 1/2 టేబుల్ స్పూన్
  • అరటి కాయలు
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారీ విధానం

  • ముందుగా అరటి కాయలను మరియు ఒక బౌల్ లో 1 కప్పు నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఆ నీటిలో 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత అరటి కాయల తోలును తీసి, చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసి ఆ నీటిలో వేసుకోవాలి.
  • అరటి కాయ స్లైసెస్ నీటిలో 10 నిమిషాలు నానిన తరువాత నీటిని వడగట్టి, ఒక క్లాత్ పై వేసి ఆరనివ్వాలి.
  • బాగా ఆరిన తరువాత స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి, డీప్ ఫ్రై కి కావల్సినంత నూనెని పోసుకొని, నూనె వేడెక్కిన తరువాత అరటి కాయ స్లైసెస్ ని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • గోల్డెన్‌ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫేవరెట్ బనానా చిప్స్ రెడీ!