Posted on

Reasons for irregular periods in Telugu – ఋతుస్రావం క్రమం తప్పడానికి కారణాలు – పీరియ‌డ్స్ స‌రిగ్గా రాక‌పోవ‌డానికి లేదా మిస్ అవ్వటానికి కారణాలు

ఋతుస్రావం ఒక క్రమం ప్రకారం వస్తుంది. సాధారణంగా 28 రోజులకు ఒక సరి వస్తుంది, 2 లేదా 3 రోజులు ముందు వెనుక కావచ్చు. అంతకంటే ఆలస్యంగా లేదా త్వరగా వచ్చినట్లయితే మీకు ఋతుస్రావం సక్రమంగా లేనట్టు. 30 శాతం స్త్రీలకు గర్భవతులుగా ఉన్న సంవత్సరాలలో ఋతుచక్రము సక్రమంగా ఉండకపోవచ్చు, ఇది సాధారణంగా సమస్య కాదు, కానీ ఇది మీకు ఆరోగ్య సమస్యలని సూచిస్తుంది.

మీ ఋతుచక్రం ఎంతవరకు క్రమంగా ఉందో తెలుసా?

  • 21 రోజుల విరామము ముందు ఋతుస్రావం వచ్చినట్లయితే మీకు ఋతుచక్రం సక్రమంగా లేనట్టు.
  • 8 రోజులకంటే ఎక్కువ రోజులు ఉంటే క్రమంగా లేనట్టు.
  • ఒక నెల పీరియ‌డ్స్ రాకపోవడం, ముందుగా రావడం లేదా చాల రోజులు ఆలస్యంగా వచ్చినట్లయితే ఋతుచక్రం సక్రమంగా లేనట్టు.

మీ ఋతుచక్రం లెక్కించడానికి, మీరు మీ ముందు నెల ఋతుస్రావము కాలం యొక్క చివరి రోజు నుండి ఈ నెల ప్రారంభించిన మొదటి రోజు వరకు లెక్కపెట్టాలి. మీ క్రమాన్ని తెలుసుకునేందుకు కనీసం మూడు నెలలు లెక్కించాలి.

పీరియ‌డ్స్ తప్పడానికి మరియు క్రమరహితం కావడానికి కారణాలు

అండోత్సర్గం జరగక పోవడం (ఆన్- ఆవులేషన్) వలన ఋతుస్రావం రాక పోవచ్చు. ఇందుకు ముఖ్యకారణం తీవ్రమైన హార్మోన్ల అసమతుల్యత. కొన్నిసార్లు సూక్ష్మ అసమానతలవల్ల కూడా కావచ్చు. ఇలా జరగటానికి ఆరోగ్య పరిస్థితులు మరియు జీవన విధానం రెండూ కారణాలు. పీరియ‌డ్స్ క్రమంగా రానివ్వకుండా ప్రేరేపించే ప్రధాన కారణాలు కొన్ని:

అధిక వ్యాయామం / ఆహార నియంత్రణ

సాధారణంగా వ్యాయామం అలవాటు లేనివాళ్లు హఠాత్తుగా తీవ్రంగా ప్రారంభించినప్పుడు మీ ఋతుచక్రంపై ప్రభావం చూపిస్తుంది. అలవాట్లను కొనసాగించటం వలన క్రీడాకారులు తరచూ వారి ఋతుస్రావాన్ని కోల్పోతారు. తక్కువ బరువు ఉండటం వలన కానీ అదనపు ఆహార నియంత్రణ పాటించడం వలన కానీ ఆహారపు లోపాలు ఉండటం వలన కానీ ఈ పరిస్థితి రావచ్చు. ఇది మీ శరీర బలహీనతకు మరియు అనారోగ్యానికి దారితీస్తుంది.

ఒత్తిడి

మీ ఋతుచక్రాన్ని ప్రభావితం చేసే ఒక విషయం ఒత్తిడి కావచ్చు. మీకు దీర్ఘకాలిక ఒత్తిడి వున్నట్టయితే మీరు చాలా త్వరగా ఆత్రుత పొందుతారు దీని వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఋతుస్రావం క్రమాన్ని బాధిస్తుంది.

గర్భ నియంత్రణ మాత్రలు

గర్భ నియంత్రణ మాత్రలు తీసుకోవడం వలన ఋతుస్రావం క్రమం తప్పుతుంది. ఈ పరిస్థితి రెండు నెలలకన్నా ఎక్కువ కాలంపాటు సాగవచ్చు. సాధారణంగా వచ్చే పీరియ‌డ్స్ కాకుండా మీకు కొంతకాలం రక్తస్రావం ఉండవచ్చు లేదా దీర్ఘకాలం ఋతుస్రావం తప్పిపోవచ్చు, అయినప్పటికీ క్రమంగా సమతుల్యత పొందుతుంది.

పోలీసైస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)

ఈ ఆరోగ్య పరిస్థితి ఎవరికైనా రావచ్చు. సక్రమంగా జీవనశైలి లేని వారికీ మరియు లావుగా ఉన్న స్త్రీలకు ఈ పరిస్థితి సాధారణంగా ఏర్పడుతుంది. అండాశయాలపై చిన్న తిత్తులు ఏర్పడతాయి అవి సాధారణ అండోత్సర్గమునకు అంతరాయం కలిగించుతుంది. పూర్వం ఎప్పుడైనా ఋతుస్రావం క్రమంగా లేని వారికి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సంతాన లేమికి కూడా దారి తీస్తుంది. గుండె మరియు మధుమేహం(చక్కెర వ్యాధి) వ్యాధులను పెంచుతుంది.

వయసు

ఋతుస్రావం యొక్క ప్రారంభ సమయంలో సక్రమంగా లేకపోవచ్చు. శరీరం సమతుల్యత పొందటానికి మరియు నూతన మార్పులకు అలవాటుపడటానికి సమయం పడుతుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. మెనోపాజ్ సమయంలో కూడా ఋతుస్రావం క్రమం తప్పవచ్చు.

ఇతర అనారోగ్యాలు

  • థైరాయిడ్ హార్మోన్ల యొక్క రక్త స్థాయిలు చాలా ఎక్కువ లేదా తక్కువగా పోవడం వలన కూడా పీరియ‌డ్స్ క్రమరాహిత్యం కావచ్చు.
  • లైంగిక సంక్రమణ వ్యాధులవలన కూడా మీకు ఋతుస్రావం క్రమరాహిత్యం కావచ్చు.
  • సరైన ఆహార పద్ధతులు లేకపోవడం
  • డయాబెటిస్(చక్కెర వ్యాధి)
  • ఫైబ్రాయిడ్లు
  • ఎండోమెట్రీయాసిస్

మీకు పోలీసైస్టిక్ అండాశయం ఉన్నట్టు భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య ప్రక్రియల ద్వారా గుణపరచవచ్చు. ఒత్తిడి తగ్గించి ఒక పరిమితిలో వ్యాయామాలు అనుసరించటానికి ప్రయత్నించండి. ఇవన్నీ మీకు ఒక ఆరోగ్యకరమైన ఋతుచక్రం కలగడానికి సహాయం చేస్తుంది.

పీరియ‌డ్స్ తొందరగా రావాలంటే ఏమి చేయాలి?

గర్భనిరోధక మాత్రలు

ఈ మాత్రలు మీ ప్రస్తుత హార్మోన్లను సర్దుబాటు చేయడంవలన మీ గర్భాన్ని ఆపడమే కాకుండా ఋతుస్రావాన్ని త్వరగా వచ్చేలా చేస్తుంది.35 వయస్సు దాటిన ఆడవాళ్ళు ఈ మాత్రలు వాడే ముందు వైద్యులను సంప్రదించడం వలన మరిన్ని సమస్యలను నివారించవచ్చు.

విటమిన్ సి

ఇది శరీరంలోని ప్రొజెస్టెరాన్ స్థాయిలను తగ్గించడం వలన ఋతుస్రావాన్ని వేగవంతం చేస్తుంది. లేదా ప్రత్యామ్నాయంగా ప్రొజెస్టెరాన్ యొక్క ప్రవేశాన్ని రద్దుచేసి తీవ్రమైన ఆరోగ్య స్థితికి దారితీస్తుంది.

మూలికలు

అల్లం మరియు కొత్తిమీర మీ ఋతుస్రావాన్ని వేగవంతం చేయడానికి సహాయ పడుతుంది. ఇవి గర్భాశయాన్ని విస్తరింపచేసి ప్రవాహానికి దారితీస్తుంది. ఇది ఆలస్యంగా ఋతుశ్రావణం రావడానికి కారణం అయిన మీ హార్మోన్ల లోపాలను కూడా సమతుల్యం చేస్తుంది. టీ లో అల్లం లేదా కొత్తిమీరను కలుపుకొని ఉదయం మరియు రాత్రి త్రాగండి.

వ్యాయామం

మీరు క్రమమైన వ్యాయామం చేయకపోతే బరువు పెరగడం లేదా ఋతుస్రావం ఆలస్యంగా రావడం లాంటి శారీరక సమస్యలను ఎదుర్కుంటారు. మన శరీరాన్ని ధృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వ్యాయామాలు ప్రత్యేకంగా అనుసరించడం వలన ఋతుస్రావాన్ని ముందుగా వచ్చేలా చేస్తుంది. అలాంటి వ్యాయామాలను తెలుసుకొని అనుసరించండి.

ఒత్తిడిని తగ్గించండి

ఒత్తిడిని కలిగించే ఆందోళనలను తగ్గించుకోవాలి, లేకపోతే దీని వలన మీ శరీరంలో మార్పులు రావచ్చు. వీటిని పూర్తిగా నివారించలేక పోయినప్పటికీ కొన్ని పద్ధతులు పాటించడం వలన వీటికి దూరంగా ఉండొచ్చు. యోగా మరియు ధ్యానం సాధన చేయటానికి ప్రయత్నించండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

బరువు తగ్గడం

తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగటం వలన మీ ఋతుస్రావం ఆలస్యం కావచ్చు. ప్రస్తుత శరీర ఆకృతిని సంరక్షించుట చాలా అవసరం.