Posted on

Remedies for white hair in Telugu – మీకు జుట్టు తెల్లపడుతోందా?

చాలా మందిలో ఇప్పుడు నెలకొని ఉన్న ప్రధాన సమస్య జుట్టు తెల్ల పడటం. ఒకటి తెల్లబడితే చాలు ఏదో కోల్పోయినట్టుగా బాధపడతారు. అయ్యో..! నా వయసు చిన్నదేనే అప్పుడే తెల్ల పడిందేంటి అని తెగ సతమతమవుతారు. అయితే మారుతున్న అహార అలవాట్లు, విశ్రాంతి, అలోచనలు ఇవన్ని మీ జుట్టుపై ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..20లు దాటకుండానే ఈ సమస్యకు అందరూ దగ్గరపడుతున్నారు.చిన్న వయసు వారే బ్యూటి స్పాల చుట్టూ తిరుగుతున్నారు. జుట్టు ఎందుకు తెల్లబడుతుందో మనం ఈ శీర్షికలో తెలుసుకుందామా..

అయితే వయసుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజమే. కాని చిన్నవయసులోనే తల నెరిసిపోవడం అసహజం. ఏ వయసులో అయినా సరే జుట్టు పండిపోవడానికి కారణం వయసుతో పాటు వర్ణకారక పదార్థాన్ని సరఫరా చేసే పొర బలహీనమై చర్యాశీలత తగ్గడమేనని వైద్యుల చెబుతున్నారు..

వెంట్రుకలు త్వరగా నెరిసి పోవడానికి అనేక కారణాలున్నయి.

వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు

1. మనం తినే ఆహారపు అలవాట్లూ, మన చేసే అశ్రద్ధ వల్ల లోపాలు, వ్యాధులు ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధుల తాకిడి వల్లే తల తొందరగా తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.

2. వంశపారంపర్యంగా వచ్చే ఆల్బిజం వంటి వ్యాధుల వలన ఈ సమస్య రవచ్చు.

3. కొన్ని రకాల విషజ్వరాలతో బాధ పడేటప్పుడు కూడా తల నెరిసిపోవచ్చు.

4. శరీరంలోని పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోనులను ఉత్పత్తి చేయకపోతే చిన్నప్పుడే వెంట్రుకలు తెల్లబడతాయి.

5. ఇంకా సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.

6. ఇలాకాక సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.

జుట్టు తెల్లబడడం అంటూ ఒకసారి మొదలయిందంటే ఇక అది అలాగే ఉండిపోతుంది. వ్యాధి వల్ల జుట్టు నెరవడం జరిగితే సకాలంలో వ్యాధికి చికిత్స పొందిన సందర్భాల్లో మాత్రమే జుట్టు కొద్దిగా అయినా నల్లబడే అవకాశాలుంటాయి.

వెంట్రుకలు తెల్లబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • రోజూ తీసుకునే తిండిలో మల్టీ విటమినులు, బి కాంప్లెక్స్ విటమినులు తీసుకునే ఆహారం లో ఉండేట్టు చూసుకోవాలి.
  • తెల్లబడిన తల తిరిగి నల్లబడటానికి తగిన మందులు, చికిత్సా పద్ధతులు ప్రస్తుతానికి లేవు. మిగతా వెంట్రుకలు కూడా తెల్లబడకుండా ఉండాలంటే తినే తిండి విషయమై జాగ్రత్త తీసుకోవాలి.

3. ఆఫ్ఫీస్ నుంచీ రాగానేనో, తల బాగా నొప్పిగా ఉందనో ఉపశమనం కోసం సెలూన్లకు వెళ్ళో, స్పాలకు వెల్లో మర్దన పేరిట తల వెంట్రుకల కుదుళ్లను మరింత బలహీనం చేయడమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. రకరకాల తైలాలు వాడటం, ఏ చిట్కాలను ఆశ్రయించినా ఆశించినంత ఫలితం రాకపోగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.

ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పాల తయారీలు, మాంసం, గ్రుడ్లు ఎక్కువగా వాడాలి. ఆకుకూరలను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.ఆరోగ్యమే మహా భాగ్యం అన్నరు పెద్దలు. ఆ ఆరోగ్యమే బాగుంటే తల నెరవటం జరుగదు, జుట్టు ఊడే పరిస్తితి మీకు రాదు. అరోగ్య సమతుల్యత సాధించాలంటే పోషకాహారాన్ని చక్కగా తినాలి. ఆలోచనలకు స్వస్తి పలకండి. ఎందుకంతే ఆలోచనలెక్కువ ఉన్నవారికి అందోళన కూడా సహజంగా ఉంటుంది.కాబట్టి ఆందోళనలకు టాటా చెప్పండి. నిగనిగలాడే జుట్టును