Posted on

Sabudana dosa / Sago dosa recipe in Telugu – సాగో దోసె లేదా సాబుదానా దోసె రెసిపీ

బియ్యం, పోహా, గ్రీన్ మూంగ్ దాల్ లాంటి పదార్థాలను ఉపయోగించి దోసెలు చేయటం చూసే ఉంటాము. మరి సాబుదానా అని పిలవబడే సగ్గుబియ్యంతో దోసెలు చేయవచ్చని మీకు తెలుసా? వ్రతాలు మరియు ఉపవాసం చేసేవారు ఎక్కువగా సగ్గుబియ్యంతో దోసెను తయారు చేసుకుంటారు. అందుకే దీనిని ‘ఫరాలి దోసె’ లేదా ‘ఉప్వాస్ దోసె’ అని కూడా పిలుస్తారు. మరి ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం దోసెలను ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

 • నూనె – 4 టేబుల్ స్పూన్
 • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
 • బియ్యం – 1 కప్పు
 • సగ్గుబియ్యం – 1 టేబుల్ స్పూన్
 • మెంతి విత్తనాలు – 1 టేబుల్ స్పూన్
 • పెరుగు – 1 కప్పు

తయారు చేసే విధానం

 • ఒక బౌల్ లో 1 కప్పు బియ్యం మరియు 1 టీ స్పూన్ మెంతులను వేసి నీటితో బాగా కడగాలి.
 • అందులో 1 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండర్ లో బాగా రుబ్బుకోవాలి.
 • ఒక పెద్ద బౌల్ లో 1 స్పూన్ సగ్గుబియ్యం, 2 స్పూన్ నీళ్ళు, గ్రైండ్ చేసిన దోసె పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి.
 • ఈ పిండిని 12 గంటల వరకు కదల్చకుండా ఊరనివ్వాలి.
 • 12 గంటల తరువాత స్టవ్ పై దోసె తవా ఉంచి నూనె రాసి ఈ పిండిని దోసెలా పోసి రెండు వైపులా కుక్ చేస్తే వేడి వేడి సాబుదానా దోసెలు తయారు!