Posted on

Smartphones Below Rs.15000/- in Telugu

Mobiles below 15000

రూ.15 వేలలోపు కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఏ స్మార్ట్ ఫోన్ కొనాలో అర్ధంకావడం లేదా? అయితే మీకు అందుబాటులో 5 అదిరిపోయే స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఫోన్ లవర్స్ కోసమే ఈ  స్పెషల్ ఆర్టికల్.

వివిధ రకాల మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ రూ.15 వేలలోపు ధరలో అదిరిపోయే మొబైల్ ఫోన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి.

గడిచిన నాలుగేళ్ల నుంచి మొబైల్ ఫోన్ మార్కెట్ మరింతగా పుంజుకోవడం తదనుగుణంగా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లను తీసుకురావడం జరుగుతూ వస్తోంది. మొబైల్ మార్కెట్లో పోటీ ఉండటంతో దిగ్గజ కంపెనీలు అన్నీ అత్యంత తక్కువ ధరల్లో బెస్ట్ ఫీచర్లు ఉన్న కంపెనీలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రూ.15 వేల బడ్జెట్లో విడుదలైన బెస్ట్ మొబైల్స్ వివరాలను మీకందిస్తున్నాం

మన దేశంలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకే డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే మనదేశంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. ఈ విభాగంలో నంబర్ వన్ గా నిలిచిన బ్రాండే దేశంలో నంబర్ వన్ మొబైల్ ఫోన్ అవుతుంది.

అందుకే అన్ని ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు ఈ విభాగంపై కన్నేశాయి. కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు కూడా ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ల వైపే చూస్తారు కాబట్టి ఈ విభాగంలో పోటీ చాలా ఎక్కువ. ప్రతి నెలా ఈ ధరల శ్రేణిలో ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతాయి. దీని కారణంగా కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త గందరగోళం తలెత్తడం సహజం. కాబట్టి ఈ విభాగంలో ఉన్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఏవో ఒకసారి చూద్దాం..

టాప్ జాబితాలో వివో, శాంసంగ్, హానర్, షావోమి, రియల్‌మి ఫోన్స్ ఉన్నాయి ప్రస్తుతం.భారీ బ్యాటరీ, పెద్ద స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు వీటి ప్రత్యేకతలు.

ఒప్పో కే1-ఈ ఫోన్ ధర రూ.10,990గా ఉంది. దీనిలో 6.41 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) స్క్రీన్ ను అందించారు. ఈ ధరల శ్రేణిలో ఉన్న మొబైల్స్ లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించిన మొదటి మొబైల్ ఇదే. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ను అందించారు.

కెమెరా విషయానికి వస్తే.. దీనిలో వెనుక 16 MP, 2 MP సామర్థ్యమున్న 2 కెమెరాలను అందించారు. దీనిలో సెల్ఫీ కెమెరాకు పెద్ద పీట వేశారు. 25 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న ఫ్రంట్ కెమెరాను దీనిలో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని బ్యాటరీ సామర్థ్యం 3600 ఎంఏహెచ్ గా ఉంది.

ఒప్పో ఏ9-ఈ స్మార్ట్ ఫోన్ ధర అమెజాన్ వెబ్ సైట్ లో రూ.14,649గా ఉంది. దీనిలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్ ను దీనిలో అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ మాత్రమే దీనిలో అందుబాటులో ఉంది.

కెమెరా విషయానికి వస్తే… దీనిలో వెనుకవైపు 16 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,020 ఎంఏహెచ్ కాగా దీంతో పాటు 10W చార్జర్ ను అందించారు.

మోటోరోలా వన్ విజన్-రూ.19,999 విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.14,999కే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. దీనిలో 6.3 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ప్రస్తుతం ఉన్న మొబైల్స్ కు భిన్నంగా దీనిలో పంచ్ హోల్ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది.

దీనిలో ఆక్టాకోర్ ఎక్సోనిస్ 9609 స్పీకర్ ను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను దీనిలో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుకవైపు 48 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్ గా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 3,500 ఎంఏహెచ్ గా ఉంది.

షావోమి ఎంఐ ఏ3-ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.12,899గా ఉంది. అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. దీనిలో 6.08 అంగుళాల హెచ్ డీ+ స్క్రీన్ ను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తో కూడిన డిస్ ప్లే దీనిలో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను దీనిలో అందించారు.

వెనుకవైపు 48 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలను అందించారు. సెల్పీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4030 ఎంఏహెచ్ గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది.

వివో జెడ్1 ప్రో-ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.12,990గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. దీనిలో 6.53 అంగుళాల స్క్రీన్ ను అందించారు. దీనిలో పంచ్ హోల్ డిస్ ఫ్లే ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ ను అందించారు. వివిధ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.

దీనిలో వెనుకవైపు 16 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలను అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది.
వివో జెడ్1 ప్రో: వివో కంపెనీ నుంచి వచ్చిన బడ్జెట్ మొబైల్ ఫోన్లలో ఇది ఒకటి. అదిరిపోయే డిజైన్, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ వంటివి దీని ప్రత్యేకత.

రియల్ మీ 5 ప్రో-ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.13,990గా ఉంది. దీనిలో 6.3 అంగుళాల స్క్రీన్ ను అందించారు. దీనిలో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 AIE ప్రాసెసర్ ను అందించారు.

వెనుకవైపు 48 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న నాలుగు కెమెరాలను దీనిలో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,035 ఎంఏహెచ్ గా ఉంది.

రియల్‌మి 3 ప్రో-ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.3 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4045 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ రియర్ కెమెరా (16 ఎంపీ+5 ఎంపీ), 25 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. దీని ధర రూ.13,999.

షావోమి రెడ్ మీ నోట్ 8 ప్రో-షావోమి నుంచి తాజాగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. దీనిలో 6.53 అంగుళాల డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ ను దీనిలో అందించారు. వివిధ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.

దీనిలో వెనుకవైపు 64 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న నాలుగు కెమెరాలను దీనిలో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 20 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉంది. షావోమి నుంచి తాజాగా లాంచ్ అయిన మొబైల్ కావడంతో దీనికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్-గతంలో ప్రీమియం సెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టిన శాంసంగ్ మెల్లగా మిడ్ రేంజ్ విభాగంపై కూడా తన రెక్కలు విస్తరించడం ప్రారంభించింది. అందులో భాగంగానే శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం దీని ధర రూ.13,999గా ఉంది.

దీనిలో 6.4 అంగుళాల డిస్ ప్లేను అందించారు. ప్రాసెసర్ విషయానికి వస్తే.. శాంసంగ్ ఎక్సోనిస్ 9611 ప్రాసెసర్ ను దీనిలో అందించారు. కెమెరాలు కూడా ముఖ్యమే కాబట్టి వెనుకవైపు 48 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలను దీనిలో అందించారు.

సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం భారీగా ఉంది. 6000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని దీనిలో అందించారు.

హానర్ 20ఐ-దీనిలో 6.21 అంగుళాల స్క్రీన్, కిరిన్ 710 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, ట్రిపుల్ రియర్ కెమెరా (24 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.14,999.

హానర్ 9 లైట్ -3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ వరుసగా రూ.14,590, రూ.17,500 ధరలకు వినియోగదారులకు లభ్యం అవుతోంది. హానర్ 9 లైట్ ఫీచర్లు 5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షావోమి రెడ్ మీ నోట్ 7 ప్రో-ఈ సంవత్సరం షావోమి నుంచి అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లలో రెడ్ మీ నోట్ 7 ప్రో కచ్చితంగా ముందంజలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.11,999గా ఉంది. దీనిలో 6.3 అంగుళాల డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. వెనుకవైపు 48 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను దీనిలో అందించారు. 13 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సెల్ఫీ కెమెరా కూడా దీనిలో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది.