Telugu tips for glowing skin – మిల మిల మేరిసే సహజ చర్మ సౌందర్యం కోసం 5 చిట్కాలు

ఎన్నో ఏళ్ళుగా మనకు వినిపిస్తున్న మాట “అందంగా ఉండడం అంటే మరింత అందమైన చర్మం కలిగి ఉండడమె” అప్పట్లో స్త్రీలు మాత్రమే వారి అందం గురించి ఆలోచించేవారు, చర్మం, జుట్టూ, ఇలా ప్రతీది వారికెంతో గొప్పవి. ప్రస్తుత సమాజంలో స్త్రీలతో పాటు మగవారు కూడా వారికి వారు అందంగా ఉండాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ప్రతీ విషయంలోను, అందంగా, సమర్దవంతంగా, ఉండేలా చూసుకుంటున్నారు.

మీ అందాన్ని కాపాడే విధానంలో, మీకోసం మేము మీకు అందించే చిట్కాలు.

మంచినీరు ఎక్కువగా తాగండి

ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ఉపయోగిస్తున్న ఒకే ఒక చిట్కా ఏమిటి అంటే. నిస్సందేహంగా

రోజుకి 8-10 గ్లాసులు నీళ్ళు తాగడమే అని చెప్పవచ్చు.అంతే కాకుండా అన్ని చిట్కాల కన్నా ఎంతో  చౌకైన చిట్కా ఇది.నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరానికి,  వ్యాధి సోకడానికి క్రిములు పుట్టించే విషము బయటకు పోయి,మీ శరీరాన్ని కాపాడుతుంది.

కలబంద తీసుకుని, దానిని ముఖానికి పట్టించాలి, ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే దగ్గర్లో ఉన్న మందుల షాపులో దొరికే కలబంద జల్ లేదా జూస్ ని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇవి సహజమైన కలబంద లాగానే ఉపయోగపడతాయి,వీటితో పాటు ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లి తీసుకోండి,పరిశోధకులు ప్రకారం వెల్లుల్లి  మన చర్మంలోని కణాల కాలాన్ని పెంచి, చర్మాన్ని ఎంతో తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.

నిమ్మరసం, తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది,2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెంటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోవాలి, ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు.

రోజు లేత కొబ్బరి కాయ నీరు తాగితే మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది.

రోజు నారింజ రసం తాగడం ఎంతో మంచిది,వీటిలో “C” విటమిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల, అవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా, మరియు యవ్వనంగా ఉంచుతాయి.

పైన సూచించిన వాటితో మరికొన్ని జతచేద్దామా:

రోజూ మీ ముఖాన్ని 2-3 సార్లు ఒక మంచి ” ఫేస్ వాష్” తో శుబ్రం చేసుకోండి, ఎక్కువగా చేసుకోవడం మంచిది కాదు.

సహజమైన స్క్రబ్స్  ఉపయోగించి మీ చర్మాన్ని వారానికి 2-3 సార్లు ” Exfoliate ” చేయండి. దాని వల్ల చనిపొయిన చర్మ కణాలు తొలగిపొయి, కొత్త కణాలు వస్తాయి.

వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు, దాని వల్ల చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ.

ఎక్కువగా మీ ముఖమును, చేతులతో తాకవద్దు, ఎందుకంటే మీ చేతులకు ఉన్న మురికి వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.

సాద్యమైనంతవరకు సహజంగానే ఉండండి, “కాస్మటిక్స్” వాడకం తగ్గించడం ఎంతో అవసరం.

మీ చర్మము జిడ్డుగల చర్మం అయితే ఎక్కువగా పౌడర్ రాయడం మంచిది.

కాలనికి అనుగుణంగా మీ క్రీంలు, సబ్బులు మర్చడం ఎంతో అవసరం.

ఈ పై చెప్పినవన్నీ పాటిస్తే మీ చర్మము అందంగా, యవ్వనంతో కాంతివంతంగా ఉంటుంది అనడంలో సందేహంలేదు.