Posted on

Telugu tips to care pregnant women in first trimester – ప్రెగ్నెన్సీ యొక్క మొదటి త్రైమాసికంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రెగ్నెన్సీ ఒక అద్భుతమైన అనుభూతి. గర్భం యొక్క కాలం సుమారు 40 వారాల పాటు ఉంటుంది, ఇది మూడు త్రైమాసికంగా విభజించబడింది. గర్భం యొక్క మొదటి మూడు నేలలను, మొదటి త్రైమాసికం అని అంటారు. మొదటి త్రైమాసికంలో మీ శిశువు యొక్క మెరుగైన మరియు ఆరోగ్యకరమైన పెరుగుదల కొరకు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

అదనపు పోషకాలను తీసుకోండి

మీరు మాములుగా తీసుకునే పోషక ఆహారాలకు రెండు రేట్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే, మీ శిశువు యొక్క పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయటానికి ఎక్కువ పోషకాలు అవసరం అవుతాయి.

పాలు, గుడ్లు మరియు టూనా, సాల్మన్ లాంటి ఆహారాల నుండి లభించే విటమిన్ డి ని మీరు అవసరమైన మోతాదులలో పొందుతున్నారు అని నిర్ధారించుకోండి. కాల్షియమ్ మరియు ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను లేదా సప్లిమెంట్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ శిశువు పెరుగుదలకు కావలసిన ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్స్ ను అందిస్తుంది.

ఈ జాగ్రత్తలతో పాటు వైద్యుల వద్ద మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయండి.

ధూమపానం మానుకోండి

ధూమపానం ఆరోగ్యానికి హానికరం, కనుక మీకు ఈ అలవాటు ఉన్నట్లయితే మీ ఆరోగ్యం కొరకు మరియు మీ శిశువు యొక్క ఆరోగ్యం కొరకు ఈ అలవాటుని మానుకోండి. ప్రెగ్నెన్సీ సమయంలో ధూమపానం వలన మీ శిశువు యొక్క పెరుగుదలలో లోపం, డెలివరీ సమయంలో తక్కువ బరువు ఉండటం, రోగ నిరోధక శక్తి లేకపోవటం మరియు ఇతర అంటువ్యాధి లాంటి సమస్యలు ఎదురవుతాయి.

మద్యం సేవించకూడదు

ధూమపానం లాగా మద్యం సేవించటం కూడా మీ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు, మద్యం సేవించటం వలన శిశువు యొక్క పెరుగుదలలో సమస్యలు ఎదురవుతాయి. దీని వలన శిశువు అనేక ఆరోగ్య లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది.

మందులు

మీరు ఏదైనా ఆరోగ్య సమస్య కొరకు మందులను వాడుతున్నట్లయితే మీ గర్భధారణ సమయంలో శిశువుకు ఎలాంటి హానీ కలగకుండా ఉండేందుకు ఒక వైద్యుడిని సంప్రదించి మందులను సరిచూడండి.

మంచి అలవాట్లను పెంచుకోండి

మీ గర్భంలో సమస్యలను నివారించేందుకు మొదటి త్రైమాసికంలో కొన్ని మంచి అలవాట్లను పెంచుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.

మీ బరువును పరిశీలించండి

మీ మొదటి త్రైమాసికంలో ఎన్నో పదార్థాలను తినాలన్న కోరిక పుడుతుంది. వాటిని తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. మీ శరీరానికి కావలసిన కేలరీలను బట్టి ఆహారాలను తీసుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం మరియు శిశువు యొక్క ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

మీరు మామూలుగా తీసుకునే ఆహారంకన్న రోజుకు 300 కేలరీలు మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. మీ బరువుని క్రమం తప్పకుండా చెక్ చేయండి, మొత్తం గర్భధారణ సమయంలో 30 నుండి 35 పౌండ్ల బరువు మాత్రమే పెరగాలి. ఒక వేళ గర్భిణీ స్త్రీ అండర్ వెయిట్ అయితే 35 నుండి 45 పౌండ్లు పెరగచ్చు, ఓవర్ వెయిట్ అయితే 10 నుండి 20 పౌండ్ల వరకు పెరగచ్చు.

ఒత్తిడిని నిరోధించండి

ఒత్తిడి మరియు ఆందోళనను నివారించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఒత్తిడి వలన శిశువు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే శిశువు జన్మించటం మరియు ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడిని తొలగించేందుకు మీకు నచ్చిన పనులను లేదా కార్యకలాపాలను చేయండి. యోగా, ధ్యానం, బ్రీతింగ్ వ్యాయామాలను కూడా చేయవచ్చు.