Telugu tips for oily skin – జిడ్డు చర్మానికి అద్భుతమైన చిట్కాలు

0
185

పొడి చర్మం ఉన్న వారికి ఎటువంటి సమస్యలు ఉంటాయో, అలానే జిడ్డు చర్మం ఉన్న వారు కూడా చాలా రకాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటువంటి జిడ్డు చర్మాన్ని ఉంచుకుని బయటకి జనాల మధ్యలో తిరగడం వలన అందరూ చూసి హేళన చేస్తారేమో అని భావన అందరిలోనూ ఉంటుంది. చర్మం నుండి అధిక జిడ్డు స్రవించడం వలన వివిధ రకాల దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా మనల్ని బాధపెట్టే సమస్య మొటిమలు అనే చెప్పవచ్చు.

ఇలా అధిక మొత్తంలో స్రవించే జిడ్డుని కాస్త తక్కువ స్థాయికి తగ్గించి సమతుల్యంగా ఉంచడానికి, ప్రజలు జిడ్డుని నియంత్రించే క్రీములను, మోయిస్చరైజర్‌లను మరియు ఇతర సౌందర్య క్రీములను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కానీ అటువంటి క్రీములను ఉపయోగించడం వలన మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు. కనుక ఎటువంటి దుష్ప్రభావాలు లేనటువంటి సహజ మార్గాలలో జిడ్డు వలన ఏర్పడే మొటిమలు వంటి సమస్యలను నిరోధించడం ఉత్తమం.

ఇంటి వద్ద సహజ చిట్కాలను ఉపయోగించి ఫలితాను పొందడానికి కాస్త సమయం పట్టవచ్చు, కానీ దానివల్ల చాలా ప్రయోజనాలను మనం పొందుతాము. ఇప్పుడు మనం జిడ్డు చర్మానికి కొన్ని సమర్ధవంతమైన గృహ నివారణలను చూద్దాం.   

జిడ్డు చర్మం నుండి ఉపశమనం పొందడానికి 10 అద్భుతమైన మార్గాలు

  1. జిడ్డు చర్మం నుండి ఉపశమనం పొందడానికి పండ్లతో పోల్చి చూస్తే ఏ ఇతర ఉత్పత్తులు సాటిరావు. యాపిల్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మ రసాన్ని కలిపి, ముఖానికి రాసుకోండి. అది ఆరిన తరువాత నీటితో కడిగేసుకోండి. ఇది మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
  2. జిడ్డు చర్మం సమస్య నుండి బయట పడటానికి పాలు మంచిగా పనిచేస్తాయి. ముఖాన్ని పాలతో కడగటం లేదా మెత్తని దూదితో చర్మం మీద రుద్దుకుని శుభ్రపరుచుకోవడం వలన ముఖం మీద ఉన్న అధిక జిడ్డు తొలగిపోతుంది.
  3. జిడ్డు చర్మాన్ని ఇంటి వద్దనే సులువైన మార్గంలో తేనె ని ఉపయోగించి నిర్మూలించవచ్చు. ముఖానికి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా తేనెని రాసుకుని, ఆరిన తరువాత కడిగేసుకుంటే చక్కని ఫలితాన్ని గమనించవచ్చు.
  4. పెరుగు లాక్టిక్ ఆసిడ్ ని కలిగి ఉంటుంది. ఇది కూడా పాలు లాగానే చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పెరుగు మన చర్మంలో ఉన్న సహజ జిడ్డుని తొలగించకుండా చర్మంలో ఉన్న అధిక జిడ్డుని నివారిస్తుంది.
  5. ఐస్ మనం చర్మంలో ఉన్న అధిక జిడ్డు సమస్యను పరిష్కరించగలదు. ఐస్ ముక్కని నేరుగా కాకుండా ఒక మెత్తటి కాటన్ వస్త్రంలో ఉంచి ముఖం మీద రుద్దడం వలన జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.
  6. గుడ్డు తెల్లసొన, ద్రాక్ష పండ్ల రసం మరియు నిమ్మరసం ని కలిపి ముఖానికి రాసుకోండి. 15 నుండి 20 నిముషాల వరకు ఉంచుకుని ఆరిన తరువాత శుభ్రపరుచుకోండి. ఇది రాయడం వలన మీ ముఖంలో కొత్త వెలుగుని మీరు గమనించవచ్చు. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరుస్తుంది, గుడ్డు తెల్లసొన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది, అలానే ద్రాక్ష పండ్ల రసం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇవన్నీ కలిపి ముఖాన్ని ఆకర్షనీయంగా మారుస్తాయి.  
  7. వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉన్న కొబ్బరి పాలను ముఖం మీద ఉపయోగించి చూడండి. కొబ్బరి పాలు మీ చర్మానికి మోయిస్చరైజర్ గా పనిచేసి మీ చర్మంలో ఉన్న జిడ్డుని తొలగిస్తుంది. తద్వారా మీ చర్మం జిడ్డుగా కనిపించదు.
  8. ముఖానికి వాడే ఖటినమైన మేకప్ వస్తువుల వలన కూడా చర్మం నుండి అధికంగా జిడ్డు స్రవిస్తుంది. ఇది మేకప్ కిట్ల ఉపయోగం ద్వారా కొత్తగా తలెత్తిన సమస్య.
  9. చాలా మంది వారి ముఖాన్ని ఎక్కువగా కడుగుతుంటారు. కానీ మూడు సార్లు కంటే ఎక్కువగా ముఖాన్ని కడగటం వలన మరొక కొత్త సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.  
  10. చివరిగా పోషకాలు ఉన్న పండ్లు మరియు కూరగాయలతో ఒక సాధారణ ఆహార ప్రణాళిక వేసుకుని జిడ్డు చర్మం ద్వారా తలెత్తిన సమస్యలను తొలగించడానికి ప్రయత్నించండి.

నిమ్మ రసం

నిమ్మకాయ సహజమైన సిట్రస్ ఆసిడ్ ను కలిగి ఉంటుంది, కనుక అది చర్మం యొక్క PH స్తాయులని ఒక మోస్తరుగా ఉండేలా చూస్తుంది. జిడ్డు నుండి స్రవించే కొవ్వును తొలగించడానికి నిమ్మకాయ ఒక మూల పదార్ధంగా ఉపయోగపడుతంది.

అందువలన నిమ్మ రసాన్ని చర్మానికి ఉపయోగించడం వలన అధిక జిడ్డుని సులువుగా తొలగిస్తుంది. ఇందుకోసం ఒక చెంచా నిమ్మ రసంలో అదే పరిమాణంతో పరిశుద్ధమైన నీటిని కలిపి ఒక కాటన్ బాల్ ని అందులో ముంచి మీ ముఖం మీద అప్లై చేసుకోండి. కానీ నిమ్మ రసం చర్మం మీద ఉండే అధిక జిడ్డుని తొలగిస్తుంది కాబట్టి ఇది ఉపయోగించిన తరువాత ఆయిల్ ఫ్రీ మోయిస్చరైజర్ ని చర్మానికి రాసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

టమాటాలు

ఈరోజుల్లో దాదాపుగా అందరూ వారి వంటకాల్లో మంచి రుచి కోసం టమాటాలను ఉపయోగిస్తున్నారు. ఈ టమాటాలు వంటల్లోనే కాదు సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు అని చాలా మందికి తెలుసు.

ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు ఒక టమాటాని కోసి ఆ రసాన్ని ముఖానికి రాసి అలా కాసేపు మసాజ్ చేయండి. ఇలా రుద్దిన తరువాత 15 నిముషాల పాటు ఉంచి ఆరిన తరువాత కడిగేసుకోండి. ఇది మీ ముఖంలో జిడ్డుని క్రమేపీ తొలగిస్తుంది, అలాగే మీ చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.

కీరదోసకాయ

సంవత్సరాలుగా కీరదోసలను ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఇది శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ఈ కీరదోసలో పొటాషియం, విటమిన్ ఎ అలాగే విటమిన్ ఈ అధికంగా ఉండటం వలన జిడ్డు చర్మం సమస్యతో బాధపడుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

దీనిని చాలా సులువుగా అప్లై చేసుకోవచ్చు. ఒక కీరదోసని తీసుకుని దానిని చక్రాలులా కోసి వాటితో ముఖ చర్మం మీద వలయాకారంలో కాసేపు రుద్దండి. లేదా కేరదోస గుజ్జుని తీసుకుని కాస్త నిమ్మ రసంతో కలిపి ముఖానికి ప్యాక్ లా రాసుకోండి. 20 నిముషాలు ఉంచి ఆరిన తరువాత నీటితో కడిగేసుకోండి. ఇది మీ చర్మంలో సహజ జిడ్డుని ఉంచి అధిక జిడ్డుని తొలగిస్తుంది.

వేప

వేప ఆకులు ముఖం మీద మొటిమలను చికిత్స చేయటానికి చాలా ప్రయోజనకారిగా పనిచేస్తాయి. ఇప్పుడు అన్ని కాస్మెటిక్ సంస్థలు వేప నుండి వచ్చే రసాయనాన్ని ఉపయోగించి సౌందర్య లేపనాలను తయారు చేస్తున్నాయి. కానీ ఇంటి వద్దనే తాజా వేప ఆకులను సహజ పద్ధతిలో ఉపయోగించి ముఖం మీద మొటిమలు మరియు జిడ్డుని తొలగించుకోవచ్చు.

ఇందుకోసం కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని నీటిలో వేసి మరగబెట్టండి. నీరు పచ్చ రంగు మారేంత వరకు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లార్చండి. ఇప్పుడు అందులో ఒక కాటన్ బాల్ ని ముంచి ముఖం అంతటా అప్లై చేసుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉండటం వలన మీ ముఖం మీద మొటిమలు మరియు జిడ్డు తొలగిపోతుంది.

ఉప్పుతో పిచికారీ

ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఉప్పు వేసుకుని ఆ ఉప్పు కరిగేంత వరకు కలపండి. ఇప్పుడు ఆ ఉప్పు నీటిని ఒక పిచికారీ చేసే బాటిల్ లో వేసి మీ ముఖం మీద ఆ నీటిని పిచికారీ చేసుకోండి. ఇలా చేసినప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోకండి లేదంటే ఆ ఉప్పు నీటికి కళ్ళు మంట పెట్టవచ్చు.

ఈ చికిత్సని అనుసరిస్తున్నవారు వారి చర్మం మీద మొటిమలు, జిడ్డు వంటివి తొలగిపోయి, గొప్ప మెరుగుదల కనిపిస్తున్నట్లు గమనించారు.

వెనిగర్ మరియు గులాబి

మార్కెట్ లో దొరికే హానికరమైన కెమికల్స్ కలిపిన క్లెన్సర్లను ఉపయోగించడం మానేసి ఇంటి వద్దనే అద్భుతంగా పనిచేసే సహజమైన టోనర్ ని తయారు చేసుకోండి. ఇందుకోసం రెండు చెంచాల వెనిగర్ ని రెండు చెంచాల రోజ్ వాటర్ లో కలిపి ఒక కాటన్ బాల్ ని ఉపయోగించి ముఖానికి రాసుకోండి.

ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి అలానే జిడ్డు సమస్య తగ్గుతుంది. మీ ముఖం నుండి ఎంత జిడ్డు స్రవిస్తుందో తెలుసుకోవాలని ఉంటే బ్లాటింగ్ పేపర్ ను ఉపయోగించి తెలుసుకోండి. అప్పుడు మీకే అర్ధమవుతుంది. ఒక సహజమైన టోనర్ ని తయారు చేసుకోవాలి అనుకుంటే గ్రీన్ టీ ని కూడా ఉపయోగించుకోవాచ్చు.