Posted on

పొత్తికడుపుపై వెంట్రుకలు పోవాలంటే చిట్కాలు – Telugu tips to remove abdominal hair

పొత్తి కడుపుపై వెంట్రుకలు ఆడవారికీ, మగవారికీ సాధారణమైన సమస్య. మగవారిలో ఈ వృధ్ధి ఎక్కువ శాతంలో ఉంటుంది. అయితే ఈ సమస్యని మగవారు అంతగా పట్టించుకోరు. కానీ ఆడవారులోనూ ఈ పెరుగుదల ఎక్కువగనే ఉన్నా, ఆడవారు మాత్రం దీని నుంచీ బయటపడాలనుకుంటారు. కానీ కొందరు ఆడవారు మగవారిలా వీటిని తీసెయ్యకుండా అలాగే వదిలేస్తారు. దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు. ఆడవారిలో పొత్తికడుపై ఈ వెంట్రుకలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రత్యేకంగా వారు స్విం సూట్స్, బికినీలు వేసుకోవాలంటే అప్పుడు పొత్తికడుపు కనపడుతుంది కాబట్టి అప్పుడు ఈ వెంట్రుకలు కనిపించే అవకాశం ఉంది.
ఇది సాధారణమైనది కాదు., అయితే ఈ సమస్యను పూర్థిగా నివారించటానికి కొన్ని శాశ్వతమైన మార్గాలు, లేదా వీటి వృధ్ధి ఎక్కువ జరగకుండా కొన్ని మార్గాలు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి. ఈ సమస్య కొన్ని తాత్కాలికమైన మార్గాల ద్వారా తీరవచ్చు. షేవింగ్, వాక్సింగ్ మరియు బ్లీచింగ్. ఈ మార్గాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కొన్ని సహజసిధ్ధ మార్గాల ద్వారా వీటిని తొలగించటం వల్ల మీ చర్మానికి హాని కలగకుండా ఉండటమే కాక ఆడవారి నడుము పాడవకుండా ఉంటుంది.
ఈ ఫాస్ట్ లైఫ్లో లేసర్ థెరపీ మరియు ఎలెక్ట్రోలసిస్ ఉన్నాయి. అయితే ఈ రెండు చాలా ఎక్కువ ఖర్చుతో కూడి ఉన్నవి. అంతేకాక చాలా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయి.
ఈ పొత్తికడుపు పై వెంట్రుకలు అటు ఆడవారికీ, మగవారికీ ఇద్దరికీ పెద్ద చిక్కు వీడని సమస్య. అయితే మగవారు సున్నితంగా ఈ సమస్య నుంచీ తొలగిపోతే ఆడవారు మాత్రం చాలా ఇబ్బందిగానూ, ఎంతో న్యూన్యతా భావంతోనూ కుమిలిపోతుంటారు. మంచి ఆకర్షణీయమైన చీర తొడిగినప్పుడు ఈ వెంట్రుకలు కనపడుతుంటే ఎంతో అవమానకరంగా ఫీల్ అవుతారు. ఈ సమస్య రోజువారీ జీవితంలో సహజం. అయితే రోజూ బ్యూటీ పార్లర్ కి లేదా స్పాకి వెళ్ళాలంటే అది రోజూ సాధ్యం కాని పని. కాబట్టి సహజసిధ్ధమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవటం ఉత్తమం. మరి ఖర్చుతో కూడిన చికిత్సలు చర్మానికే కాదు శరీరం పై కూడా ప్రభావం చూపుతాయి. ఇక్కడ కొన్ని చర్మ సంబంధితమైన టిప్స్ ని మీకందిస్తున్నాం ప్రత్యేకంగా తెలుగు టిప్స్ ద్వారా మీకోసం

క్షవరం చేసుకోవటం

చాలావరకూ పొత్తికడుపు భాగంలో వెంట్రుకలు చాలా దలసరిగా ఉంటాయి. వీటిని తీయటం చాలా కష్టమే. కాబట్టి వీటిని షేవెర్ తో తొలగించటం మేలు. ఇలా చేయటం వల్ల వెంట్రుకలు చాలా గట్టిగా అవుతాయని కొందరు అంటారు. ఇలాగే చేస్తు ఉంటే చివరికి చర్మం కూడా చాలా గట్టి పడిపోతుందని చెబుతారు. కానీ ఇదే రోజూ చెయాల్సిన పరిస్తితి వస్తే అది మాత్రం చాలా ఇబ్బందికర విషయమే. కానీ ఇలా రోజూ చెయాల్సిన పరిస్తితి వస్తే అది మాత్రం చాలా ఇబ్బందికర విషయమే. కానీ మీ చర్మం షేవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రదేశంలో కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మెత్తగా ఉండటమే కాకుండా మరలా వెంట్రుకలు పెరిగేందుకు సమయం పడుతుంది.

బ్లీచింగ్

కొందరు స్త్రీలలో పొత్తికడుపు కింద అంతగా వెంట్రుకలు ఉండవు. వీళ్ళు ఒకరకంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అలాంటి తక్కువ వెంట్రుకలు ఉండే స్త్రిలు బ్లీచ్ వాడి తొలగించుకోవచ్చు. మీరు మంచి సున్నితమైన బ్లీచ్ లు వాడటం ఎంతో మంచిది.

వెంట్రుకలు వదిలించే క్రీముల్ని వాడండి

మీ చర్మాన్నే కాకుండా మీ సమయాన్ని అలాగే మీకు ఇబ్బందిని కలిగించని వాటిల్ని వాడండి. మీరు మీ వెంట్రుకల్ని తొలగించుకునేందుకు మార్కెట్లో చాల రకాలైన క్రీములు ఉన్నాయి. గతంలో అంటే 10 సంవత్సరాల క్రితం ఈ క్రీములు కాస్త హానిని కలిగించేవి. అయితే ప్రస్తుతం ఉన్న క్రీములు అంతగా హాని కలిగించేవి కాదు. వీటిని వాడటం మంచిదే. కాకపోతే మీరె మీ చర్మానికి ఎలర్జీ రాకుండా అంటే మీ చర్మానికి పడే క్రీముని మీరే ఎంచుకోవాలి.

వ్యాక్స్

మీకు అవసరమైన ప్రతిసారీ మీరు వ్యాక్స్ కోసం పార్లర్ కి వెళ్ళల్సిన అవసరం లేదు. మీకు ప్రస్తుతం మార్కెట్లో వ్యాక్స్ న్యారో పీసులు బయట దొరుకుతున్నాయి. కాబట్టి మీరు వాటిని వాడవచ్చు. వాటిని సున్నితంగా చింపండి తర్వాత వాటిని వేడి చేయండి. తర్వాత . ఈ విధానం మీ పొత్తికడుపు ప్రాంతానికైతే అది సున్నితంగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ చేతులకు, కాళ్ళకూ చేసుకోరాదు.

ట్వీజింగ్

దీనినే తెలుగులో చిమటా అని అంటారు. కొన్ని చోట్ల అంటే శరీరంలో కొన్ని భాగాలో మిగతా భాగాల కంటే తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. అటువంటి చోట సున్నితంగా చిమటా వేసుకుంటే చాలు. దీనివల్ల తక్కువగా ఉన్న చోట చిమటా వేసుకుంటే చాలు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ అందం కోసం దీనిని వాడవచ్చు.

సహజసిధ్ధమైన మార్గాలు

మీకు రసాయన క్రీముల్ని వాడటం ఇష్టం లేకపోతే మీరు కొన్ని సహజసిధ్ధమైన మార్గాల్ని మీ కిచెన్ లొని పదార్ధ్ధల్నే వాడవచ్చు.
కొంచేం పసుపు తీసుకుని దానికి కొంచెం శనగపిండిని కేవలం ఒక టేబుల్ స్పూన్స్ మాత్రమే రెండిటినీ వేసి కలుపుకోవాలి. మీరు ఈ మిశ్రమాన్ని పాలతోను లేక నీటితోను కలుపుకోవచ్చు.. తర్వాత మీ పొత్తికడుపు పై ఉన్న వెంట్రుకలకు రాసి తర్వాత అవి పోయేలా తీసేయ్యాలి. ఈ సహజసిధ్ధమైన టిప్స్ మీకు ఇబ్బంది లేకుండా తొలగిస్తాయి.
శనగపిండిని, పసుపును మిక్స్ చేసుకోండి. తర్వాత దీనికి పాలు లేదా నీటిని కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి,శరీరానికీ రాసుకోండి. తర్వాత అది ఆరిపోయిన తర్వాత రబ్ చేయండి మీ ముఖం పై, మీ శరీరం పై ఉన్న వెంట్రుకలు తొలగుతాయి.
అగ్ని శిల ను రోజూ స్ననానికి ముందు రాసుకోండి. అది ఒక స్క్రబ్ లా పని చేసి మీ శరీరంపై ఉన్న అవాంచిత రోమాల్ని తొలగిస్తుంది.
రోజూ మంచి ఆహారాన్ని తీసుకోండి. మీ శరీర బరువు తక్కువగా ఉన్న లేక కొవ్వు ఎక్కువగా ఉన్నా మీ శరీరం పై అవాంచిత రోమాలు వస్తాయి. కాబట్టి సమతుల ఆహారాన్ని తీసుకోండి. పాలు, కూరగాయలు, ఆరోగ్యకరమైన ఫ్యాటీ ఆహారపదార్ధ్ధాలు కూడా తినటం మంచిది.

అవాంచిత రోమాలు తొలగించుకునేందుకు గృహ చిట్కాలు

బొప్పాయి

బొప్పాయి అవాంచిత రోమాల పెరుగుదలను నివారించటమే కాక వీటిని తొలగిస్తుంది. బొప్పాయిను ఉపయోగించి శాశ్వతంగా అవాంచిత రోమాల్ని తొలగించుకోవచ్చు.
బొప్పయిను పేస్ట్ చేసుకుని దానికి శనగపిండి, పసుపు, అలొవేరా జెల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీనిని రాసుకుని 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.
బొప్పయి పేస్ట్గా చేసుకుని దానికి శనగపిండి, పసుపు, అలోవేరా జెల్, ఆవాల నూనె పేస్ట్ చేసుకుని రాసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని వాష్ చేసుకోవాలి.

పసుపు

అవాంచిత రోమాలను ఇది ఒక తేలికైన మార్గం. పసుపు తీసుకుని దానిలో పాలు కలుపుకోవాలి. తర్వాత దీనిని పొత్తికడుపు పై రాసుకోవాలి. కాసేపు ఆరిపోయేంత వరకు ఉంచుకుని తర్వాత వేడినీటితో కడుగుకోవాలి. ఒకవేళ వెంట్రుకలు ఎక్కువగా ఉంటే దీనికి శనగపిండిని కలుపుకోవాలి.

సుగర్-నిమ్మ మిశ్రమం

పంచదార, నిమ్మ కలుపుకుని రాసుకుంటే చక్కగా పనిచేస్తాయి. నిమ్మ ఒక బ్లీచ్ గా పని చేస్తుంది. పంచదార, నిమ్మ రసం, వాటర్ ను కలిపి పొత్తికడుపు పై రాసుకోవాలి. ఇందులో గమనించాల్సిన విషయమేమంటే వెంట్రుకలు పెరిగే దిశకు రాసుకోవాలి. 15 నిముషాలపాటు ఉంచుకుని తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సుగర్, నిమ్మ, తేనె మిశ్రమం

ఇది ఒక సహజసిధ్ధమైన బ్లీచ్. అన్నీ సహజసిధ్ధమైనవి కావటంతో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తేనె ను వేడి చేసుకుని దానికి సుగర్, నిమ్మను కలిపి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత పొత్తికడుపుపై మొక్కజొన్న గంజి పవ్డర్ ను రాసుకోవాలి. ఈ వెచ్చటి మిశ్రమాన్ని పొట్ట భాగంపై వెంట్రుకలు అభివృధ్ధి కి వ్యతిరేక దిశగా చాకు సాయంతో లేక గరిటిలాంటి దానితో రాసుకోవాలి. వెంటనే దానిపై గుడ్డను కప్పాలి. తర్వాత వాక్సింగ్ చేసే విధంగా చూసుకోవాలి. తర్వాత వెంట్రుకలు అభివృధ్ధి అయ్యే దిశకు వ్యతిరేక దిశలో ఆ గుడ్డను బలంగా లాగాలి. కస్త నొప్పిగా ఉన్న ఓర్చుకుంటే ఆ వెంట్రుకలన్నీ శుభ్రం అవుతాయి.

గుడ్డు మాస్క్

గుడ్డు లోని తెల్ల సొన అలాగే దానికి సుగర్, మొక్కజొన్న గంజి పిండిని కలిపి మిశ్రమం గా చేసుకోవాలి. తర్వాత దానిని అప్లై చేసుకోవాలి. మెల్లగా ఆ మాస్క్ ని తీసివేయాలి. ఈ మాస్క్ కి ఆ వెంట్రుకలు వచ్చేస్తాయి.

బంగాళదుంప, పప్పు

బంగాళదుంప ఒక సహజసిధ్ధమైన బ్లీచ్. దీనితో పాటు పెసరపప్పు కలుపుకోవాలి. పప్పు ను కలుపుకోవటం వల్ల మీ వెంట్రుకలు తొలగించబడతాయి. ఈ పేస్ట్ చేసుకోవాలంటే రాత్రి అంతా పెసరపప్పుని నానపెట్టుకుని ఉదయాన్నే పేస్ట్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేస్తుకోవాలి. దీనికి తేనె, నిమ్మరసాన్ని కలుపుకోవాలి. తర్వాత దీనిని అబ్డోమినల్ పై రాసుకోవాలి. తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత వేళ్ళతో రబ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరచుకోవాలి.

అరటి, ఓట్మీల్

అరటిపండు డ్రై స్కిన్ పై వెంట్రుకల్ని తొలగించేందుకు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అరటి పండు ,ఓట్మీల్ ను కలిపి రాసుకుంటే తేలికగా వెంట్రుకలు తొలగిపోతాయి.

సుగర్, మొల్లాసెస్

సుగర్, నిమ్మ, మొల్లాసెస్ అవాంచిత రోమాల చికిత్సకు సరియైన చికిత్సా విధానం. ఇవి చక్కగా పనిచేస్తాయి. ముందుగా మైక్రోవేవ్ లో వేడి చేసుకోవాలి. దానిలో మొల్లాసెస్ ను కలిపి, తర్వాత సుగర్ బాగా కరిగిపోయాక దానిలో నిమ్మరసాన్ని వేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. తర్వాత పొత్తి కడుపుపై అప్ప్లై చేసుకుని, వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశగా తీసివేయాలి. ఇలా అవాంచిత రోమాలు తొలగిపోతాయి.