Posted on

Oily skin care tips in Telugu – చర్మం మీద జిడ్డును తొలగించడానికి చిట్కాలు

జిడ్డు చర్మం కలవారికి వేసవి కాలంలో చెమటకు స్రవించే అదనపు జిడ్డు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొందరు వారి అరచేతులు చెమట పట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. నేటి కార్పోరేట్ ప్రపంచంలో ఏ సమయంలోనైనా తమ చేతులను వేరొకరితో కలపాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఈ విధమైన సమస్య మీకు ఎంతో ఇబ్బంది కలిగించవచ్చు. ఈ విషయంలో చెమటతో నిండిన చేతులు ఎదుట వ్యక్తికి కూడా ఇబ్బందిని కలిగించవచ్చు. ముఖ్యంగా ముఖంలో జిడ్డు వలన మీ రూపం ఎంతో నిరాసని కలిగిస్తుంది. మీరు మీ అందానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ సమస్య ఉన్నట్లయితే అవన్నీ వృధా అన్న భావన మీకు కలుగుతుంది. కాని ఇప్పుడు మీరు కొన్ని సరళమైన సహజ ఉపాయాలతో  జిడ్డు చర్మం నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

జిడ్డు చర్మం నుండి ఉపశమనానికి ముఖానికి సంబంధించిన ప్యాక్‌లు

జిడ్డు చర్మం చూడటానికి నిస్తేజంగా మరియు ఆకర్షణ లేమితో ఉండి ప్రత్యేక పోషణ మరియు శ్రద్ధ అవసరాన్ని కలిగి ఉంటుంది. జిడ్డు చర్మానికి సరిపడే సరియైన చర్మ సంరక్షనలను పాటించండి. జిడ్డు చర్మం పరిసరాలలోని దుమ్ము, ధూళిని సులభంగా ఆకర్షిస్తుంది. ఇది చర్మాన్ని నిస్తేజంగా మరియు జీవరహితంగా తయారుచేస్తుంది.  

కలబంద

జిడ్డు చర్మం అదనపు కొవ్వులను చర్మ ఉపరితలం మీద కలిగి ఉండటం వలన మొటిమలు, కురుపులు వంటి చర్మ హానికర సమస్యలకు కారణం అవుతుంది. ఈ అదనపు జిడ్డు సమస్య నుండి ఉపశమనం పొందడానికి కలబందని లేదా కలబంద గుజ్జుని ఉపయోగించి నిలిచి ఉన్న జిడ్డును చికిత్స చేయడం ద్వారా మొటిమలు, కురుపులు, మచ్చలు వంటి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. కలబంద ఆకుల నుండి జాగ్రత్తగా గుజ్జుని సేకరించి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం ద్వారా జిడ్డు చర్మ సమస్యలకు ఒక ప్రభావవంతమైన గృహ ఔషదం మీ దగ్గర ఉన్నట్లే.     

టమాటో

కీలకమైన విటమిన్లు, పోషణలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన టమాటో రసం యొక్క ఆవశ్యకతను, చర్మం మీద దాని అద్భుతమైన ప్రభావాన్ని చాలా మంది అవగాహన చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా ఈ విధమైన సమస్యని ఎదుర్కొంటున్నట్లు అయితే ఇంకేమీ ఆలోచించకుండా బాగా పండిన ఒక టమాటో చక్రాన్ని తీసుకుని మీ ముఖం మరియు మెడ భాగ చర్మం పీల్చుకునే వరకు దాని రసంతో రుద్దండి. ఇప్పుడు దానిని 15-20 నిముషాల పాటు వదిలేసి కడిగేసుకోండి. కాంతివంతమైన మీ ముఖాన్ని గమనించండి

పెరుగు, తేనె మరియు ఓట్స్

ఈ ఆశ్చర్యకరమైన చిక్కని సమ్మేళనం చర్మానికి ఒక మెరుపు వలె పనిచేస్తుంది. పెరుగు యొక్క మంచి ప్రభావం మీ చర్మం పొరలలో జిడ్డుపై మాత్రమే కాకుండా సమస్యపై కూడా మరింత పోరాడుతుంది. మరోవైపు తేనె మీ చర్మాన్ని బిగుతుగా చేసి తదుపరిగా మొటిమలు మరియు పగుళ్లు రాకుండా రక్షణ కల్పిస్తుంది. దీని యొక్క యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ ధర్మాలు ప్రభావం లోనికి వస్తాయి. మీరు దీనికోసం ముడి తేనె ఉండేలా చూసుకోండి. ఓట్స్ మీ చర్మ ఛాయకు వెలుతురు కలిగించి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.   

ఆపిల్ ముక్కలు

రోజుకు ఒక ఆపిల్ అయినా తినాలని డాక్టర్లు ఎందుకు సిఫార్సు చేస్తారో తెలుసా? ఎందుకంటే ఆపిల్స్ వలన కొన్ని టన్నుల ప్రయోజనాలు మనకి లభిస్తున్నాయి. ఆపిల్స్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆపిల్స్ యొక్క ధర్మాలు జిడ్డు చర్మం కలిగిన వారికి మంచి ఫలితాలను ఇస్తాయి.  మీరు ఆపిల్ ను చక్రాలుగా కట్ చేసి వాటితో మీ చర్మం మీద జిడ్డు పోయేంత వరకు రుద్దండి. వారంలో దీనిని తరుచుగా చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

మజ్జిగ

ఈ జాబితాలో దీనిని చూసి ఆశ్చర్యపోయారా? అయితే మజ్జిగ మీ చర్మానికి చేసే మేలుని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మజ్జిగ చర్మంలోని అంతర్గత పొరలను ఎంతో అనుకూల ప్రభావితం చేస్తున్నట్లు రికార్డు చేయబడింది. మజ్జిగ చర్మం మీద జిడ్డుని తొలగించడం మాత్రమే కాదు, అది చర్మానికి సహజమైన కాంతిని కుడా అందిస్తుంది.     ఇది మొదట్లో జిడ్డుగా అనిపించవచ్చు, కానీ దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్ట్యా చూస్తే అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది.

అరటిపండు ఫేస్ ప్యాక్

ఒక బాగా పండిన అరటి పండుని తీసుకోండి. దానిని గుజ్జుగా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మరియు మెడకు పట్టించి 20 నిముషాల పాటు వదిలేసి గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన జిడ్డు చర్మం తొలగిపోయి మొటిమలను కుడా నివారించవచ్చు.  

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీస్ కూడా జిడ్డు చర్మాన్ని బాగా చికిత్స చేస్తాయి. కొన్ని స్ట్రాబెర్రీస్ తీసుకుని గుజ్జు లాగా చేయండి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఇది జిడ్డు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా వయస్సు మల్లుతున్న వారిలో సంబంధిత లక్షణాలను ముఖంలో రాకుండా చాలా వరకు నిరోధిస్తుంది.   

నారింజ ఫేస్ ప్యాక్

నారింజలో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. అది చర్మం యొక్క వృద్ధ లక్షణాలని పోరాడి తొలగించడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా చర్మ కణాలను అభివృద్ధి కూడా చేస్తుంది. నారింజలు తేజోవంతమైన యవ్వనపు చర్మాన్ని ప్రసాదిస్తాయి. నారింజ రసాన్ని నేరుగా మీ చర్మానికి పట్టించవచ్చు లేదా ఇతర సహజ పదార్ధాలని కలిపి కూడా ఉపయోగించవచ్చు.

నిమ్మ ఫేస్ ప్యాక్

నిమ్మ ఒక సహజమైన బ్లీచింగ్ ఉపకరణము. దీనిని ఫేస్ ప్యాకులలో ప్రధాన పదార్ధంగా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మలోని సిట్రస్ ధర్మాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరచి జిడ్డు స్రావాలను తగ్గిస్తాయి. నిమ్మరసానికి పసుపు లేదా ఇతర సహజ పదార్ధాలను కలిపి ఉపయోగించడం వలన చనిపోయిన కణాలు తొలగించబడి చర్మం నూతన తేజస్సుతో మెరిసిపోతుంది.

దోసకాయ ఫేస్ ప్యాక్

కీరదోస జిడ్డుని తొలగించడంతో పాటుగా మొటిమలు, మచ్చలు మరియు నల్ల మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మానికి మెరిసే కాంతిని అందిస్తుంది. కీరదోసని గ్రైండ్ చేసి రసం తీసి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. కావాలనుకుంటే చిటికెడు పసుపు కూడా అందులో కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ చర్మానికి పట్టించి ఆరనివ్వండి. తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి.   

ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టి జిడ్డు చర్మం కొరకు ఖచ్చితంగా సరిపడే ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. ఇది మొటిమల చేత పీడించబడే చర్మానికి మంచి ఉపశమనకరిణిగా పనిచేస్తుంది. సరిపడా రోజ్ వాటర్ కలపడం ద్వారా ముల్తానీ మట్టిని పేస్టు లాగా సిద్ధపరచుకోండి. దీనికి ఒక చిటికెడు పసుపు కూడా కావాలంటే జోడించవచ్చు. ఈ ద్రావణాన్ని చర్మానికి రాసుకుని ఆరిపోయే వరకు ఉంచి తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి.

జిడ్డు చర్మానికి కారణాలు మరియు చికిత్సకు చిట్కాలు  

జిడ్డు చర్మానికి కింది సహజ చిట్కాలను పాటించండి. దానితో పాటుగా మృదువైన చర్మాన్ని పొందండి.

  • రోజుకు కనీసం రెండుసార్లు మీ ముఖ చర్మాన్ని మంచి ఫేస్ వాష్ చేత జిడ్డును తొలగించుకోవడానికి  శుభ్రపరుచుకోండి. ఇలా చేయడం వలన మీ చర్మపు రంద్రాలు తెరుచుకుని చర్మం మృదువుగా ఉంటుంది.
  • నిద్రపోయే ముందు అన్ని మేకప్ క్రీములను తొలగించుకోండి.
  • రోజూవారి ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి.
  • ఆకు కూరలు మరియు పండ్లు మీ రోజూవారి ఆహారంలో భాగమయ్యేలా చూసుకోండి.
  • పంచదార మరియు కొవ్వులను తగ్గించుకోండి.
  • చాక్లెట్లు, బాగా వేపిన ఆహారాలు, మత్తు పదార్ధాలపై మక్కువను తగ్గించుకోండి.
  • వంశపారంపర్య కారణాల వలన కూడా జిడ్డు చర్మం ఉండవచ్చు. జిడ్డు చర్మం వలన చర్మ రంద్రాలు మూసుకుపోయి పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది.
  • వాతావరణ మార్పులు – వేసవిలో వేడి మరియు తేమ పెరగడం వలన చర్మంలో జిడ్డుల స్రావం పెరుగుతూ ఉంటుంది. శీతాకాలంలో చర్మం పొడిగా మారినప్పుడు డీహైడ్రేషన్ వలన సమతుల్యత కొరకు అదనపు జిడ్డు స్రవించబడుతుంది.
  • హార్మోనుల మార్పులు – మహిళల గర్భధారణ సమయంలో మొదటి లేదా తర్వాతి మోనోపాజ్ దశలు సెబాసియాస్ గ్రంధులను ప్రేరేపించడం వలన జిడ్డు అదనంగా కనిపించవచ్చు.