Posted on

Telugu tips to treat shingles – షింగిల్స్ / హెర్పెస్ సోస్టర్ చికిత్సకు హోమ్ రెమిడీస్

చికెన్ పాక్స్(Chickenpox) ని కలిగించే వైరస్(Virus) వరిసెల్ల-జోస్టర్ వలన ఏర్పడే మరొక వైరల్ సంక్రమణ షింగిల్స్(Shingles). శరీరంలో ఎక్కడైనా ఈ ఇన్ఫెక్షన్(Infection) కలగచ్చు, కానీ సాధారణంగా మొండెం మీద కనిపిస్తుంది. ఇది చికెన్ పాక్స్(Chickenpox) యొక్క రెండవ వెల్లడి అని కూడా చెప్తారు. ఈ ఇన్ఫెక్షన్ వలన ప్రాణహాని లేనప్పటికీ బ్లిస్టర్స్(Blisters) ని సరిగా చికిత్స చేయకపోతే తీవ్రంగా బాధిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి నివారణ పద్ధతుల ద్వారా షింగిల్స్(Shingles) ని నివారించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ యొక్క కారణాలు, సింప్టమ్స్ మరియు నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో చూద్దాం.

హెర్పెస్ సోస్టర్ యొక్క కారణాలు (Telugu causes for shingles / herpes zoster)

షింగిల్స్(Shingles) వరిసెల్లా-జొస్టెర్ వైరస్ వలన సంభవిస్తుంది – అదే వైరస్ చికెన్ పాక్స్రావటానికి కూడా కారణం. ఇంతకు ముందు చికెన్ పాక్స్(Chickenpox) కలిగి ఉన్న వారిలో షింగిల్స్ అభివృద్ధి చెందుతుంది. చికెన్ పాక్స్ నుండి మీరు గుణపడిన తరువాత కూడా ఆ వైరస్ మీ నాడీ వ్యవస్థలో చేరి కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి.

చివరికి, అది మీ నరాల మార్గాల్లో తిరిగి చర్మంపై చేరి షింగిల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. చికెన్ పాక్స్(Chickenpox) వచ్చిన ప్రతి ఒక్కరికీ షింగిల్స్ వస్తుందని కాదు. కొందరిలో మాత్రమే ఈ వైరస్ రీఆక్టివేట్ అవుతాయి.

షింగిల్స్ యొక్క కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ వయోధికులలో మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సంక్రమణం చాలా సాధారణంగా ఏర్పడుతుంది.

ఇది ఒక అంటు వ్యాధి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి షింగిల్స్ వైరస్(Shingles virus) వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ వ్యాపించిన వ్యక్తికి షింగిల్స్ బదులుగా చికెన్ పాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్లిస్టర్స్(Blisters) ని డైరెక్ట్ గా తాకడం వలనే ఈ వైరస్ వ్యాపిస్తుంది.

షింగిల్స్ యొక్క లక్షణాలు (Telugu symptoms for shingles)

సాధారణంగా షింగిల్స్(Shingles) యొక్క మొదటి లక్షణం నొప్పి. కొంత మందిలో బ్లిస్టర్ ఏర్పడిన స్థానాన్ని బట్టి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మరికొన్ని లక్షణాలు :

 • బర్నింగ్, తిమ్మిరి లేదా జలదరించటం
 • టచ్ చేయడానికి సున్నితత్వం
 • నొప్పి ప్రారంభించిన కొన్ని రోజులలో ఎరుపు దద్దుర్లు ఏర్పడతాయి
 • ఫ్లూయిడ్ తో కూడిన బ్లిస్టర్స్(Blisters)
 • దురద

కొంత మందికి కింది అనుభవం కలగచ్చు :

 • ఫీవర్
 • తలనొప్పి
 • కాంతికి సున్నితత్వం
 • అలసట

ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి (When to consult doctor for shingles)

షింగిల్స్(Shingles) తో పాటు ఈ కింది పరిస్థితులలో ఏవైనా ఏర్పడితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి :

 • కంటి దగ్గర నొప్పి మరియు దద్దుర్లు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సంక్రమణ కంటి చూపుని శాశ్వతంగా డామేజ్ చేస్తుంది.
 • మీ వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి, ఎందుకంటే మీ వయస్సు లో ఈ సమస్య తీవ్రం అయ్యే అవకాశాలు ఎక్కువ.
 • మీకు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నట్లయితే
 • దద్దుర్లు విస్తృతమైన మరియు బాధాకరమైనవిగా ఉన్నట్లయితే.

షింగిల్స్ చికిత్సకు ఇంటి నివారణ పద్ధతులు (Telugu remedies for shingles)

చల్ల నీటితో స్నానం

షింగిల్స్(Shingles)  వలన కలిగే దురద మరియు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు చల్లని నీరు ఎంతో సహాయపడుతుంది. నీరు కొంత వరకు మాత్రమే చల్లగా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే, ఎక్కువగా చల్లగా ఉండే నీరు కూడా నొప్పిని అధికరించవచ్చు. స్నానం చేసిన వెంటనే శరీరాన్ని పూర్తిగా డ్రై చేయాలి. తేమని అలాగే వదిలేస్తే అది బ్లిస్టర్స్ ని ఇంకా అధికరిస్తుంది. ఈ సమస్య కొరకే కాదు, సాధారణంగా మనం ప్రతి రోజు స్నానం చేసిన వెంటనే అంతర్గత భాగాలలో తడి లేకుండా చూసుకోవటం మంచిది.

బ్లిస్టర్స్ ఉన్నట్లయితే ప్రతి రోజు మీ టవల్ ని మార్చండి లేదా బాగా శుభ్రం చేసి ఉపయోగించండి. బ్లిస్టర్స్(Blisters) పై వాడిన టవల్ ని మిగిలిన ప్రాంతంపై వాడినట్లయితే వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలను తీసుకోండి.

కూల్ కంప్రెస్

ఇది కూడా చల్ల నీటి స్నానం వలే ఉపశమనాన్ని ఇస్తుంది. నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది. ఒక టవల్ ని చల్లని నీటిలో ముంచి, బాగా పిండి, దద్దుర్లపై ఉంచండి. స్మూత్ మరియు శుభ్రమైన టవల్ ని ఉపయోగించండి. ఈ ప్రక్రియకు ఐస్ పాక్స్ ని ఉపయోగించకూడదు. చల్లదనం చాలా ఎక్కువైనా ప్రమాదమే.

లోషన్

మైల్డ్ మరియు మొయిశ్చరైస్ చేసేటువంటి లోషన్స్ లను రాషెస్ పై రాయండి. సెంట్ మరియు పర్ఫుమ్ ఉన్న లోషన్స్ ను ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇవి దద్దుర్ల పై మంటను పెంచుతాయి. ఈ బ్లిస్టర్స్(Blisters) పై మీరు లోషన్ వాడిన వెంటనే మీ చేతులను బాగా కడగండి, లేకపోతే వైరస్ వ్యాపించగలదు.

బొబ్బల్ను గిల్ల కూడదు

షింగిల్స్(Shingles) వలన ఏర్పడే దద్దుర్లు చాలా దురదగా ఉంటాయి, మీకు వాటిని గిల్లాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకూడదు. వాటిని గిల్లటం వలన అది సెకండరీ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది మరియు క్యూర్ అవ్వటానికి చాలా ఆలస్యం అవుతుంది.

సరైన ఆహారాన్ని తీసుకోండి

ఈ సమస్యను కలిగించే హెర్ప్స్ కుటుంబానికి చెందిన వైరస్ ని ప్రేరేపించేటువంటి ఆహారాలను తీసుకోకూడదు. విటమిన్ ఎ, బి12, సి, ఇ మరియు అమినో ఆసిడ్ లైసిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మీట్, చికెన్, గుడ్లు, పచ్చని కూరగాయలు, ఆరంజ్ మరియు యెల్లో ఫ్రూట్స్, హోల్ గ్రైన్స్, చేపలను  మరియు పాల ఉత్పత్తులను తీసుకోండి. నట్స్, బెర్రీస్ మరియు చాక్లెట్లను నివారించండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చికెన్ పాక్స్ వలన కలిగే బొబ్బలపై చికాకును మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్లిస్టర్స్ ని డ్రై గా చేసి కొన్ని రోజులలో అవి రాలిపోటానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కలిపి చర్మంపై రాయండి. 10 నిమిషాల తరువాత నీటితో కడిగి చర్మంపై తడి లేకుండా బాగా తుడవండి. ఈ పద్ధతిని తరచూ ఉపయోగించవచ్చు కనీసం రోజుకు రెండు సార్లు ఇలా చేయండి. ఈ ప్రక్రియ తరువాత బాగా శుభ్రం చేసుకున్న బ్లిస్టర్స్(Blisters) పై ఏదైనా స్మూతింగ్ అండ్ మైల్డ్ క్రీమ్ ని రాయండి. మరో పద్దతి మీరు స్నానం చేసే నీటిలో అర కప్పు బేకింగ్ సోడాని మరియు అర కప్పు ఎప్సమ్ సాల్ట్ ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయవచ్చు.

టీ ట్రీ ఆయిల్

ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల పై అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల పుళ్ళు, బొబ్బలు, పాచెస్ ని నయం చేయడానికి ఈ నూనెని అరోమా థెరపీ లో వాడుతారు. మీరు షింగిల్స్ బ్లిస్టర్స్(Shingles blisters) తో బాధపడుతున్నట్లయితే కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని దద్దుర్ల పై రాసి వెంటనే ఉపశమనం పొందండి.

కలబంద

కలబంద లోని కూలింగ్ ఎఫెక్ట్ వలన బ్లిస్టర్స్(Blisters) నుండి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కొంత తాజా కలబంద జెల్ ని దద్దుర్ల పై రాసి మృదువుగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాల తరువాత కడిగి చర్మాన్ని బాగా డ్రై చేయండి.

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మంలోని PH లెవల్స్ ని బాలన్స్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసంలో 2 లేదా 3 స్పూన్ తేనెని కలుపుకొని పతితో బ్లిస్టర్స్(Blisters) పై రాయండి. కొంత సేపు తరువాత కడిగి నీటిని బాగా డ్రై చేయండి.

ఆపిల్ సీడర్ వినిగర్

దురద మరియు మంటను తగ్గించేందుకు ప్రసిద్ధి చెందిన ఉత్తమ పదార్ధాలలో ఆపిల్ సీడర్ వినిగర్ ఒకటి. ఇందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా, ఒక గ్లాసు నీటిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని కలుపుకొని ఒక పత్తి లేదా శుభ్రమైన వస్త్రాన్ని ముంచి చర్మంపై రాయాలి. లేదా వెచ్చని నీటిలో కలుపుకొని తేనెని జోడించి త్రాగవచ్చు.

వోట్మీల్

షింగిల్స్(Shingles) వలన ఏర్పడే చికాకుని తగ్గించడానికి వోట్మీల్ ఉపయోగపడుతుంది. 1 లేదా 2 కప్పుల వోట్మీల్ను పొడి చేసి, స్నానం చేసే నీటిలో కలపండి. మీ శరీరాన్ని ఈ నీటిలో 15-20 నిమిషాల వరకు నానపెట్టి ఆ తరువాత స్నానం చేయండి.

విచ్ హాజెల్

షింగిల్స్ వలన ఏర్పడే దద్దుర్లు, చికాకు, దురద మరియు మంటని తగ్గించేందుకు విచ్ హాజెల్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ విచ్ హాజెల్ మరియు రెండు స్పూన్ కాలెందుల పువ్వులను వేసి కవర్ చేసి రాత్రంతా ఉంచండి. ఉదయం దీనిని ఒక మృదువైన పేస్ట్‌లా రుబ్బి షింగిల్స్(Shingles) ప్రభావితం అయిన చర్మంపై రాయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు ఒక సరి చేసి మంచి ఫలితాలను పొందండి. విచ్ హాజెల్ క్రీమ్ కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి. అవి మీకు లభించినట్లయితే వాటిని దద్దుర్ల పై రాసి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.

ధూమపానం వదిలేయండి

ధూమపానం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు మరియు ఆరోగ్యానికి హానికరం. ధూమపానం మానివేయడం చాలా ముఖ్యం, ఇది క్యాన్సర్ మరియు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వృద్ధులలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.