Posted on

Telugu tips for vaginal yeast infection – యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ను తొలగించేందుకు గృహ నివారణలు

అనేక రకాలైన సంక్రమణ వ్యాధులు ఎవరికైనా రావచ్చు. అటువంటి సంక్రమణంను నివారించడానికి ఉత్తమమైన మార్గం పరిశుభ్రంగా ఉండటం. ఈస్ట్ అనేది ఒక రకమైన ఫంగస్. ఈ ఫంగస్ మాములుగా యోనిలో చాలా తక్కువ మొత్తాలో ఉంటుంది. ఇది ఎక్కువ అయినప్పుడు ఈస్ట్ సంక్రమణ వ్యాధి స్త్రీలలో చాలా సాధారణంగా వస్తుంది. ఈ సంక్రమణం తీవ్రమైన వ్యాధి కాదు, అయినప్పటికీ చాలా చిరాకు కలిగిస్తుంది. యోనిలో ఈ ఇన్ఫెక్షన్ను కలిగించే ఫంగస్ పేరు కాండిడాఅల్బికాన్స్‘.

ప్రతి స్త్రీలోని పునరుత్పత్తి అవయవం చాలా సున్నితమైనది. ఎలాంటి సంక్రమణం అయినా ఈ అవయవానికి హాని కలిగించవచ్చు. యోని సంక్రమణం వలన దురద, వాపు మరియు చిరాకు లాంటి వివిధ రకాలైన సమస్యలు ఎదురవుతాయి.

ఎక్కువగా యోనిలో ఏర్పడే ఈ ఈస్ట్ సంక్రమణం, దంతాలు, గోరుల చుట్టూ, చర్మం మడతలలో, ఉదరం మరియు రొమ్ము కింద బాగాలలో కూడా రావచ్చు. ఇటువంటి పరిస్థితి ప్రధానంగా ఒత్తిడి, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి, గర్భధారణ, డయాబెటిస్ వలన ఏర్పడవచ్చు. లేదా యాంటీ-బయోటిక్స్, స్టెరాయిడ్స్ మరియు గర్భనిరోధక మాత్రలు వాడటం వలన కూడా సంభవిస్తుంది.

యోని ఈస్ట్ సంక్రమణానికి కారణాలు

ఒక ఆరోగ్యకరమైన యోనిలో ఎక్కువ బాక్టీరియా కణాలు మరియు తక్కువ ఈస్ట్ కణాలు ఉంటాయి.లాక్టోబాసిల్లస్అసిడోఫైలస్ అనే బాక్టీరియా ఈస్ట్ సంఖ్యను తగ్గించటానికి సహాయపడుతుంది. కొన్ని సార్లు యాంటీ-బయోటిక్స్ తీసుకోవటం వలన వీటి సంఖ్యలు మారవచ్చు. తద్వారా ఈస్ట్ కణాల సంఖ్య పెరుగుతుంది. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయుల వలన కూడా ఈస్ట్ కణాలు అధికం కావచ్చు. మరి కొన్ని కారణాలు: హార్మోన్ పునఃస్థాపన చికిత్స లేదా HIV.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థప్రతి వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి ఒకేలా ఉండదు. కొందరిలో బలహీనంగా మరి కొందరిలో బలంగా ఉంటుంది. బలహీనమైన నిరోధక శక్తిని కలిగిన వ్యక్తులు సంక్రమణంను ఎదుర్కోలేరు. ఫలితంగా వారు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు.

హార్మోన్ల అసమతుల్యతమీ శరీరంలో హార్మోన్ స్రావం సరిగ్గా లేకపోతే, మీకు యోని ఈస్ట్ సంక్రమణ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిద్ర లేకపోవడంఈ ఇన్ఫెక్షన్ కు మరొక కారణం నిద్ర లేకపోవడం. 8 గంటల సరైన నిద్ర ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. దాని యొక్క అంతరాయం మీ శరీరంలో అసమతుల్యతకు దారి తీస్తుంది. కాబట్టి నిద్ర లేకపోవడం కూడా యోని ఈస్ట్ సంక్రమణంకు ఒక కారణం అవుతుంది.

మీకు ఈ సంక్రమణం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఒక వైద్యుడిని సంప్రదించండి.

ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ యొక్క లక్షణాలు

 • యోనిలో దురద లేదా నొప్పిగా ఉండటం.
 • మూత్ర విసర్జన లేదా లైంగిక సంభోగం సమయంలో నొప్పి లేదా మంటగా ఉండటం.
 • మీ ఋతుచక్రంకు ఒక వారం ముందు మందమైన మరియు వాసన లేని తెలుపు ఉత్సర్గం అవ్వటం.
 • యోని పై భాగం ఎర్రగా ఉండటం.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సలు

ఈ ఇన్ఫెక్షన్ తగ్గటానికి యాంటీఫంగల్ క్రీమ్స్ లేదా యాంటీఫంగల్ మాత్రలను వాడవచ్చు. సంక్రమణం చాలా తక్కువగా ఉన్నట్లయితే అది స్వయంచాలకంగా తగ్గిపోతుంది. గర్భధారణ సమయంలో ఒక వైద్యుడిని సంప్రదించి సూచించిన మందులను వాడండి. మీరు యాంటీఫంగల్ క్రీమ్‌ను వాడుతున్నట్లయితే

గర్భ నియంత్రణ కోసం కండెమ్ లేదా డయాఫ్రేం మీద ఆధార పడవద్దు. ఎందుకంటే మీరు ఉపయోగించే క్రీమ్ లో వీటిని బలహీనపరచగల కొన్ని మందులు ఉండవచ్చు. కొంత మంది స్త్రీలకు ఈ సంక్రమణం మల్లీ మల్లీ వస్తూనే ఉంటుంది, అలాంటప్పుడు వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ముందు జాగ్రత్తలు

 • యోనిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
 • తేలిక పాటు సువాసన రహిత సబ్బులను మరియు నీటిని వాడండి.
 • మరుగు దొడ్డిని ఉపయోగించిన తరువాత పాయువు నుండి యోనికి బాక్టీరియా లేదా ఈస్ట్ వ్యాపించకుండా ఉండటానికి ముందునుండి వెనక్కు తుడవండి.
 • పత్తితో తయారు చేసిన లో దుస్తులను వాడండి.
 • బిగువైన జీన్స్ ను వేసుకోవద్దు. వీటిని తరచుగా వేసుకోవటం వలన జననేంద్రియ ప్రాంతంలో తేమ మరియు వేడిని పెంచుతుంది.
 • మీ సానిటరీ నాప్‌కిన్‌లను తరచుగా మార్చండి.
 • మీ యోని పై స్ప్రేలు, పౌడర్లు లేదా పెర్ఫ్యూమ్లను ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇవి బాక్టీరియా మరియు ఫంగస్ యొక్క సంతులనంలో మార్పులు కలిగించవచ్చు.
 • మీరు చాలా సేపు తడి దుస్తులను ధరించినట్లయితే, మీ జననేంద్రియాలు తేమగా ఉంటాయి, ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్లను పెంచుతుంది, కాబట్టి వీలైనంత త్వరగా మీ తడి గుడ్డలను మార్చుకోండి.

యోని సంక్రమణంను తొలగించేందుకు గృహ నివారణలు

క్రాన్బెర్రీస్

ఇందులో యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ బెర్రీలు మూత్ర నాళం మరియు మూత్రాశయం ద్వారా వచ్చే అంటురోగాలను కూడా నివారిస్తాయి. రోజూ తాజా క్రాన్బెర్రీ ఫల రసాన్ని త్రాగండి. లేదా 2-3 క్రాన్బెర్రీ మాత్రలు తీసుకోండి. ఇవి చాలా త్వరగా ఇన్ఫెక్షన్లను తొలగించగలదు.

పెరుగు

ఇది సులభంగా లభించే ఒక ఇంటి నివారణి. ఇందులోని లాక్టోబాసిల్లస్ ఆసిడోఫిలస్అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. పెరుగును ఇన్ఫెక్షన్ ఉన్న చోటుపై రాసి గంట సేపు తరువాత కడగండి. లేదా వట్టి పెరుగును తినటం వలన కూడా సంక్రమణం తగ్గుతుంది.

టీ ట్రీ నూనె

ఇందులోని యాంటీ-ఫంగల్ లక్షణాలు ఈస్ట్ ఇన్ఫెక్షన్ వలన కలిగే సమస్యలను తొలగిస్తుంది. కొద్దిగా టీ ట్రీ నూనెని నీటిలో లేదా బాదాం నూనెలో లేదా ఆలివ్ నూనెలో కలుపుకొని ఇన్ఫెక్షన్ ఉన్న చోటులలో రాయండి. రోజుకు అనేక సార్లు రాయాలి. మీ యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఒక టాంపూన్ పై టీ ట్రీ నూనెని రాసి దీనిని మీ యోని లోపల 2-3 గంటలు ఉంచండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.

గమనిక: టీ ట్రీ నూనెని గర్భిణీ స్త్రీలు వాడకూడదు. ఎందుకంటే ఇది శిశువును బాధించగలదు.

వినిగర్/ఆపిల్ సీడర్ వినిగర్

వినిగర్‌లోని విలక్షణమైన లక్షణాలు ఇన్ఫెక్షన్లకు కారణం అయిన ఫంగస్ ఎక్కువ కాకుండా ఆపుతుంది. మీరు స్నానం చేసే వేడి నీటి తొట్టిలో కొన్ని చుక్కల వినిగర్‌ని బాగా కలిపి అందులో అరగంట సేపు మీ శరీరాన్ని నానపెట్టండి. లేదా వినిగర్‌ని నీటిలో కలిపి ఇన్ఫెక్షన్ ఉన్న చోటులపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి. ఇది ఇన్ఫెక్షన్ వలన కలిగే దురద మరియు మంటల్ని తొలగిస్తుంది.

బోరిక్ యాసిడ్

బోరిక్ యాసిడ్‌ను గుళికలుగా తీసుకోవటం లేదా డైల్యూట్ చేసిన (నీటితో కలిపి పలుచగా చేసిన) బోరిక్ యాసిడ్‌ను ఇన్ఫెక్షన్లపై రాయటం వలన ఈస్ట్ సంక్రమణ తగ్గుతుంది. ఇందులో క్రిమినాశక, యాంటీ-వైరల్ మరియు యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉన్నందున వేగంగా ఇన్ఫెక్షన్ను తొలగిస్తుంది.

గమనిక: బోరిక్ యాసిడ్ విషపూరితమైన స్వభావం కలిగినది. దీనిని దీర్ఘకాలం ఉపయోగించకూడదు. మరియు గర్భిణి స్త్రీలు ఉపయోగించకూడదు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో సంక్రమణంను తొలగించే లక్షణాలు ఉన్నాయి, ఇందువలన కడుపులో ఎలాంటి సంక్రమణాన్నైనా తొలగించేందుకు ఉపయోగిస్తారు. రెండు వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా చేసుకొని ఒక శుభ్రమైన చిన్న వస్త్రంలో ఉంచి మీ యోనిపై రాత్రంతా ఉంచండి.

తాజా ఫల రసం

ఎలాంటి సంక్రమణాన్నైనా తొలగించేందుకు మనం తినే ఆహారాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. యోని సంక్రమణంతో భాధ పడుతున్న స్త్రీలు తాజా ఫల రసాన్ని త్రాగటం మంచిదని వైద్యులు కూడా సూచిస్తారు. నిమ్మపండు, నారింజపండు, ఆపిల్ లాంటి ఫలాలలో విటమిన్లు మరియు యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నందున ఇవి శరీరం లోని ఈస్ట్‌ను తొలగిస్తుంది. మాములుగా ఇలాంటి సంక్రమణ వ్యాధులకు వైద్యులు మల్టీ విటమిన్ గుళికలను సూచిస్తారు, కానీ వాటికన్నా తాజా ఫల రసాలు ప్రాకృతికమైన నివారిణి.

ఉప్పు

యోని సంక్రమణాన్ని తొలగించేందుకు వెచ్చని నీటిలో ఉప్పుని కలుపుకొని ఈ నీటితో యోనిని కడగండి. ఇది సంక్రమణం వలన కలిగే చిరాకు మరియు దురదను వెంటనే తొలగిస్తుంది.

ఆలివ్ ఆకులు

ఆలివ్ ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి. తరువాత కొద్దిగా ఉప్పుని కలిపి ఈ నీటితో మీ యోనిని బాగా కడగండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వలన ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనాన్ని పొందుతారు.

ద్రాక్ష పండు

ద్రాక్ష పండు ఫల రసాన్ని తరచుగా త్రాగటం వలన, ఇది సంక్రమణం వల్ల కలిగే నొప్పిని మరియు దురదను తొలగిస్తుంది. ఈస్ట్ సంక్రమణం నుండి తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది.

తేనె

తేనె అనేక చర్మ వ్యాధులను గుణ పరుస్తుందని అందరికీ తేలిసిన విషయమే. ఇది యోని సంక్రమణాన్ని కూడా తొలగించగలదు. తేనెని మీ యోని పై చర్మపు భాగాలలో రాయండి. 15 నిమిషాలు ఉంచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి.

మజ్జిగ

మజ్జిగను ఉపయోగించి కూడా సంక్రమణంను తొలగించవచ్చు. మజ్జిగను మీ రోజూ ఆహారాలతో పాటు త్రాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ యోనిని ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మజ్జిగను ఏ వయసు వారైనా త్రాగవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి మరియు చర్మానికి చాలా మంచిది.

మౌత్ వాష్

మీరు మీ నోటి నుండి ఇన్ఫెక్షన్లను మరియు ఫలకములను తొలగించడానికి మౌత్ వాష్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు, ఇది మీ యోని ఈస్ట్ సంక్రమణమును తొలగించేందుకు కూడా ఉపయోగ పడుతుంది. మౌత్ వాష్‌ని ఒక కప్పు నీటిలో కరిగించి యోనిని ఈ నీటితో శుభ్రం చేయండి.

వేపాకు నీరు

కొద్దిగా వేపాకులను నీటిలో వేసి 10 నిముషాల పాటు ఉడికించండి. నీళ్లు పచ్చని రంగుకి మారేంతవరకు ఉడికించండి. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత, యోనిని ఈ నీటితో బాగా శుభ్రం చేయండి.