Posted on

Early signs of miscarriage in Telugu – గర్భస్రావానికి ప్రారంభ సంకేతాలు

మీకు గర్భస్రావం జరిగి ఉండవచ్చు అని తెలుసుకునే సంకేతాల మీద అవగాహన చాలా అవసరం. గర్భస్రావానికి కారణాలు, గర్భస్రావం వలన శారీరకంగా మీలోజరిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం అనన్యమైనది.  ఒక స్త్రీ ఈ ప్రపంచంలోకి ఒక కొత్త శిశువును ఎంతో ప్రేమ మరియు సంరక్షణలతో స్వాగతిస్తుంది. అది ఎంతో ప్రశంసనీయమైనది. కానీ, ప్రమాదాలు ఎప్పుడూ మీ తలుపు తట్టి రావు ఒక్కోసారి తలక్రిందులౌతాయి. గర్భినిగా ఉన్న కొన్ని నెలలలోపే బిడ్డను కోల్పోకుండా ఉండేందుకు రాబోయే సంకేతాల  మీద అవగాహన కలిగి శరీర ధర్మాలను తెలుసుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భస్రావం అంటే ఏమిటి?

మీరు సంకేతాల కోసం చూసే ముందు, గర్భస్రావం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీ కడుపులోని పిండము స్వతంత్రంగా మనుగడ సాగటానికి ముందుకు సాగలేకపోతే దానిని గర్భస్రావం అని పిలుస్తారు. ఇది ఒక మహిళ గర్భంతో ఉన్నప్పుడు మొదటి ఇరవై వారాలలోపు ఎక్కువగా గర్భ స్రావం  సంభవిస్తుంది.

అధిక శాతం గర్భిణీ స్త్రీలు తన గర్భస్థ శిశువును కోల్పోయే మొదటి త్రైమాసికంలో, రక్తము గడ్డకట్టిన రూపంలో లేదా కణజాలం రూపంలో యోని నుండి బయటకు ప్రవహిస్తుంది.

గర్భస్రావం జరగరడానికి గల దానికి గల కారణాలు

గర్భిణీ స్త్రీలలో ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల గర్భస్థ శిశువు తరచుగా గర్భాధారణకాలంలో జీవించడంలో విఫలమౌతుంది. అటువంటి కొన్ని ముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం.

  • మీరు ధూమపానం లేదా మద్యపానం చేస్తూ ఉన్నా, లేదా గర్భిణి స్త్రీ ధూమపాన పొగ ప్రభావానికి గురయినా గర్భస్రావం జరగవచ్చు.
  • మీ వయస్సు వలన కూడా కావచ్చు. తల్లిదండ్రుల వయస్సు 35 సంవత్సరాల వయస్సు కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆమె గర్భస్రావంను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి.
  • మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు మరియు అధిక బరువు వంటి వైద్య పరిస్థితులు కూడా కారణం కావచ్చు.
  • అసాధారణతలు. క్రోమోజోముల అసాధారణతలు పిండాన్ని బలహీనం చేయవచ్చు.
  • యోని ప్రాంతంలో అంటువ్యాధులు ప్రభావితం చేస్తే అది గర్భస్రావంనకు దారితీస్తుంది.
  • కొందరు మహిళలు యాంటీఫస్ఫోలిపిడ్ ప్రతిరక్షక సిండ్రోమ్ కారణంగా గర్భస్రావంతో బాధపడుతున్నారు.
  • స్త్రీ గర్భాశయ గోడలలో సమస్య ఉన్నప్పుడు అది గర్భస్రావం సమస్యకు దారితీయవచ్చు.

గర్భాధారణ సమయంలో కొన్ని ప్రమాదకర సంకేతాలు

మీరు భూమిపైకి మరో ప్రాణాన్ని తీసుకువచ్చే సామర్ధ్యంతో మీరు సిద్దంగా ఉంటే ఈ  ప్రపంచంలోనే అది ఉత్తమమైన అనుభూతి. ఆ జీవితం మీకు మీ భాగస్వామికి మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. కానీ, తరచూ కొన్ని కుటుంబాలు ఇంత అందమైన భావోద్వేగాన్ని కోల్పోతారు. ఎందువల్ల? ఎందుకంటే ప్రారంభ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే జరుగుతుంది. మీరు గర్భానికి నష్టం కలిగించే సంకేతాలు మీరు తప్పక తెలుసుకోవాలి.

నొప్పి

మీకు మీ వెనుక నరాల రాపిడి వలన నొప్పి రావచ్చు. మీరు అనుకుంటున్నట్లు ఇది సాధారణం కాదు.

రక్తం

మీ యోని నుండి  రక్తము స్రవించడం  మంచి సంకేతం కాదు. దీని వలన రక్తం భారీగా స్రవించడం  లేదా కొన్ని చుక్కలుగా స్రవించడం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. అలాంటి సంఘటనల తరువాత కూడా మహిళలకు ఆరోగ్యకరమైన గర్భం ఉండవచ్చు.  కానీ మీరు దానిని నిర్లక్ష్యం చేయకూడదు.

తిమ్మిరి

మీకు పీరియడ్ సమయంలో పొట్ట భాగంలో తిమ్మిరిలు ఉన్నట్లయితే  అప్పుడు మీరు గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి. గర్భం ప్రారంభంలో లేదా చివరి నెలలలో ఈ విధమైన నొప్పిని కలిగి ఉండటం ఆరోగ్యకరమైనది కాదు.

రంగు

మీ విసర్జన రంగు కూడా మీ గర్భానికి సంభందించిన సంకేతాలను సూచిస్తుంది. అది ముదురు ఎరుపు రంగులో, గులాబీ లేదా గోధుమ రంగులో ఉన్నట్లయితే సమస్యాత్మకమైనది.

కుదుపులు

మీకు గర్భధారణ ప్రారంభ దశలలో కుదుపులు అంతగా గమనించలేరు. కుదుపులు సంభవించిన తర్వాత ఆ సమయాన్ని గమనించడానికి ప్రయత్నించండి. మీకు ప్రతి అయిదు నుండి ఇరవై నిమిషాల తరువాత కుదుపులు ఉండి, ఏదైనా పనిచేసినప్పుడు బాధాకరంగా ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

కణజాలు

బూడిద రంగులో వున్న కణజాలం యోని నుండి బయటకు వెళ్లిపోతుంది? ఇది చాలా ప్రమాదకరం.

బరువు

గర్భధారణ సమయంలో మీరు బరువును కోల్పోకూడదు. మీరు అలాంటి విషయాన్ని ఎదుర్కొంటుంటే, మీ డాక్టర్ కు కాల్ చేసి, అపాయింట్మెంట్ ను తీసుకోండి.

శ్లేష్మం

శ్లేష్మం మీ మొదటి త్రైమాసికంలో ఉండటం మంచిది కాదు. ఇది కొంచెం పింక్ రంగులో ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.

భావన

అవును, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఆ  భావన మీకు సహజంగా ఉంటుంది. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ మీరు గర్భిణీ అన్న భావన మీలో లోపిస్తూ ఉన్నట్లయితే, ఇది చిన్న విషయం కాదు. మీ గైనకాలజిస్ట్ను సంప్రదించండి మరియు మీరు మీ ప్రతి ఆందోళన గురించి అతనికి / ఆమెకు చెప్పండి.

మీరు మీ గర్భం గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో మంచి సమయాలు మొదలవుతాయి. మీరు భావోద్వేగాలు మరియు భావాలకు అత్యున్నత స్థానంలో ఉంటారు. మీకంటూ మీ స్వంత కుటుంబాన్ని ప్రారంభించే ఆలోచన, మీ శిశువు ఒక అద్భుతమైన వ్యక్తిగా పెరగాలని కోరుకుంటారు. కాబట్టి, మీకు మీరు ఏ విధమైన ప్రమాదాలు లేకుండా మీరు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.